ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Psalms 77

1. నేను ప్రభువునకు బిగ్గరగా మొరపెట్టెదను, స్వరమెత్తి మొరపెట్టెదను, ఆయన నా వేడుకోలును ఆలించును. 2. నేను ఆపదలో చిక్కి ప్రభువునకు మనవి చేసితిని. రేయెల్ల చేతులెత్తి ఎడతెగక ప్రార్థన చేసితిని. అయినను ఉపశాంతిని బడయజాలనైతిని. 3. నేను దేవుని స్మరించుకొని నిట్టూర్పు విడుచుచున్నాను ఆయనను మననము చేయుచు నా ఆత్మ నీరసించిపోయినది. 4. ప్రభువు నా కంటికి కునుకు పట్టనీయలేదు. నేను వ్యాకులముచెంది మాట్లాడజాలనైతిని. 5. నేను పురాతన కాలమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. గతకాలము నాకు గుర్తునకు వచ్చెను. 6. రేయెల్ల ధ్యానముచేసి ఆలోచించి చూచితిని. ఆ మీదట నన్నునేను ఆత్మలో అన్వేషించుకొంటిని. 7. “ప్రభువు నన్ను సదా చేయి విడచునా? ఇక నన్ను ఎప్పటికిని ఆదరింపడా? 8. ఇక నన్ను ప్రేమతో చూడడా? ఆయన వాగ్దానములిక చెల్లవా? 9. దేవుడు తన కరుణను విస్మరించెనా? ఆయన కోపము ఆయన జాలిని అణచివేసెనా?” 10. అంతట నేనిట్లు భావించితిని. 'మహోన్నతుని కుడిహస్తము మారిపోయినది. ఈ విషయము నాకు మిగుల బాధకలిగించుచున్నది.' 11. ప్రభూ! నేను నీ మహాకార్యములను స్మరించుకొందును. పూర్వము నీవు చేసిన అద్భుతములను జ్ఞప్తికి తెచ్చుకొందును. 12. నీ చెయిదములను గూర్చి చింతిం

Psalms 76

1. ప్రభువు యూదాలో సుప్రసిద్ధుడు. యిస్రాయేలీయులలో ఆయన నామము ఘనమైనది. 2. షాలేమున అతని గుడారమున్నది. సియోనున అతని నివాసగృహమున్నది. 3. అచట ఆయన శత్రువుల మెరుపు బాణములు, డాళ్ళు, కత్తులు సకలాయుధములు విరుగగొట్టెను. 4. పర్వతముల సౌందర్యముకంటె నీవు మిక్కిలి తేజస్సు గలవాడవు. 5. అచట శూరులైన సైనికులు తమసొమ్ము కొల్లబోగా మరణనిద్ర నిద్రించుచున్నారు. వారి ఆయుధములు వారిని రక్షింపజాలవయ్యెను. 6. యాకోబు దేవా! నీవు గద్దింపగ రథములు, సారథులు దిఢీలున ఆగిపోయిరి. 7. దేవా నీవు భీకరుడవు. నీవు ఆగ్రహము చెందినపుడు నీయెదుట నిలువగల వాడెవడు? 8. నీవు ఆకసమునుండి నీ నిర్ణయములను తెలియచేసినపుడు, లోకములోని పీడితవర్గమును రక్షింపగోరి, 9. నీ న్యాయనిర్ణయములను వెల్లడిచేసినపుడు, భూమి భీతిల్లి నిశ్చలమయ్యెను. 10. నరులు కోపింతురేని వారు నీ ఖ్యాతినే పెంచుదురు. కోపావేశములను నీ నడుముపట్టీగా ధరించుకొందువు. 11. మీరు ప్రభువునకు చేసిన మ్రొక్కుబడులు చెల్లించుకొనుడు. " భీకరుడైన ప్రభువుచుట్టు ప్రోగయిన వారెల్ల ఆయనకు కానుకలు అర్పించుకొనుడు. 12. ఆయన అధిపతుల గర్వము అణచును. భూపతులకు భయము పుట్టించును.

Psalms 75

1. ప్రభూ! మేము నీకు కృతజ్ఞతలర్పింతుము. నీ సామీప్యతనుబట్టి నిన్ను స్తుతింతుము. నీ నామమును ఘనపరతుము. నీ మహా కార్యములను ప్రకటింతుము. 2. “నిర్ణీతదినము వచ్చినపుడు నేను తీర్పుతీర్చెదను. న్యాయయుక్తముగా తీర్పుచెప్పెదను. 3. భూమియు, భూమిమీద వసించువారును గతించినను, నేను భూమి పునాదులను  మాత్రము కదలనీయక స్థిరముగా నుంచెదను. 4. నేను గర్వితులతో , మీ ప్రగల్భములు కట్టిపెట్టుడంటిని. దుష్టులతో మీ అహంకారము అణచుకొనుడంటిని 5. మీ మిడిసిపాటును విడనాడుడు, పొగరుబోతుతనముతో మాటలాడకుడు అంటిని” అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 6. న్యాయనిర్ణయము తూర్పునుండిగాని, పడమటినుండిగాని రాదు. ఎడారినుండియైనను హెచ్చింపబడదు. 7. న్యాయము చెప్పువాడు దేవుడే. అతడు కొందరిని తగ్గించి, మరికొందరిని హెచ్చించును. 8. ప్రభువు చేతిలో పానపాత్రము ఉన్నది. దానిలోని ద్రాక్షారసము నురగలు క్రక్కుచున్నది. అది ఔషధ సమ్మిశ్రితమై ఉన్నది. ప్రభువు ఆ రసమును పోయగా దుష్టులెల్ల త్రాగుదురు. దానిని చివరిబొట్టువరకును పీల్చివేయుదురు. 9. నేను నిరంతరము యాకోబు దేవుడైన ప్రభువును స్తుతింతును. ఆయనపై కీర్తనలు పాడుదును. 10. ప్రభువు దుర్మార్గుల బలమును వమ్ముచేసి, సత్పురుషుల బలము

Psalms 74

1. దేవా! నీవు మమ్ము శాశ్వతముగా విడనాడనేల? నీవు మేపెడి గొఱ్ఱెలపై నీ కోపము రగుల్కోనేల? 2. నీవు ప్రాచీనకాలముననే ఎన్నుకొనిన నీ ప్రజలను, నీవు స్వయముగా విమోచించి, నీ జాతినిగా చేసికొనినవారిని, నీవు వసించిన ఈ సియోను కొండను జ్ఞప్తికి తెచ్చుకొనుము. 3. పూర్తిగా ధ్వంసమైన ఈ శిథిలములమీద నీ కాళ్ళు మోపి నడువుము. శత్రువులు దేవాలయములోని వస్తువులనెల్ల నాశనము చేసిరి. 4. నీ భక్తులు గుమిగూడిన చోటుననే విరోధులు విజయనాదము చేసిరి, తమ జెండాలను నెలకొల్పిరి. 5. వారు గొడ్డళ్ళతో చెట్లు నరకు వడ్రంగులవలె కనబడిరి. 6. గొడ్డళ్ళతోను, సమ్మెటలతోను బొమ్మలు చెక్కిన కొయ్యపలకలను ధ్వంసము చేసిరి. 7. నీ నామమందిరమును అపవిత్రము చేసిరి. దేవాలయమును తగులబెట్టిరి. 8. మమ్ము సర్వనాశనము చేయు తలంపుతో “దేశములోని పవిత్రమందిరములనెల్ల కూల్చివేసెదము” అనుకొనిరి. 9. నేడు సూచకక్రియలు కరువు అయినవి. - ప్రవక్తలు లేరైరి, ఈ విపత్తు ఎంతకాలము కొనసాగునో తెలియదు. 10. దేవా! మా విరోధులు మమ్మెంతకాలము గేలిచేయవలయును? వారు నీ దివ్యనామమును సదా దూషింపవలసినదేనా? 11. నీవు మమ్మాదుకొనెడి నీ చేతిని వెనుకకు ముడుచుకొంటివేల? నీ వక్షము మీది కుడిచేతిని చాపి పన వారిని నాశనము

Psalms 73

1. దేవుడు యిస్రాయేలీయులకు మేలు చేసెను. అతడు విశుద్ధ హృదయులకు మేలు చేసెను. 2-3. గర్వితులను గాంచి అసూయ చెందుటవలనను, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారని గ్రహించుటవలనను నేను ప్రలోభమున చిక్కుకొంటిని. నా పాదములు జారిపడిపోవుట కొంచెములో తప్పినది. 4. ఆ దుష్టులకు ఎట్టి బాధలును లేవయ్యెను. వారు ఆరోగ్యముతో పుష్టిగా నుండిరి. 5. ఇతర నరులవలె శ్రమలను అనుభవింపరైరి. ఇరుగుపొరుగు వారివలె ఇక్కట్టులకు గురికారైరి. 6. కావున వారు అహంకారమను హారమును ధరించిరి, హింస అను వస్త్రమును తాల్చిరి. 7. బలిసిపోయి వారి కన్నులు ఉబ్బిపోవగా హృదయమును కుతంత్రములతో నింపుకొనిరి.  8. ఇతరులను ఎగతాళిచేయుచు చెడుగా మాట్లాడిరి. అహంకారముతో అన్యులను పీడింపనెంచిరి. 9. ఆకాశమువైపు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. 10. కావున ప్రజలు ఆ దుర్మార్గుల వైపే తిరిగి వారిని పొగడుదురు. వారిలో ఏ దోషమును కనిపెట్టరైరి. 11. “దేవునికి మన సంగతులు ఎట్లు తెలియును? - మహోన్నతునికి జ్ఞానము ఎట్లు అలవడును?” అని ఆ దుష్టుల వాదము. 12. ఇదుగో! దుష్టులు ఇట్టివారు: , వారు సంపన్నులై యున్నారు. రోజురోజునకు ఇంకను సంపన్నులగుచున్నారు. 13. మరి నేను విశుద్దుడను

Psalms 72

1. దేవా! రాజునకు నీ న్యాయమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ నీతిని దయచేయుము. 2. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. పేదలను న్యాయసమ్మతముగా ఏలును. 3. పర్వతములు సమృద్ధిని కొండలు నీతిని ప్రజలకు కలుగజేయునుగాక! 4. రాజు పేదలను కాపాడునుగాక! అక్కరలోనున్నవారిని ఆదుకొనునుగాక! పీడకులను నాశనము చేయునుగాక! 5. " ఆకసమున సూర్యచంద్రులు ఉన్నంతకాలము అతను భయభక్తులు కలిగిఉండునుగాక! 6. గడ్డి బీడులపై వాన కురిసినట్లుగాను, పొలముపై జల్లు పడినట్లుగాను రాజు తేజరిల్లునుగాక! . 7. అతని జీవితకాలమున న్యాయము వర్ధిల్లునుగాక! చంద్రుడు వెలుగొందినవరకు దేశమున సమృద్దినెలకొనునుగాక! 8. సముద్రమునుండి సముద్రమువరకును, యూఫ్రటీసు నదినుండి నేల అంచులవరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక! 9. ఎడారివాసులు అతనికి తలవంచుదురు. అతని విరోధులు మన్నుగరతురు. 10. తర్షిషు రాజులు, ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు. 11. రాజులెల్లరు అతనికి శిరమువంతురు. జాతులెల్ల అతనికి ఊడిగము చేయును. 12. అతడు తనకు మొర పెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కుమొక్కులేని దీనులను కాపాడును. 13. దరిద్రులను, నిస్సహాయులను దయ

Psalms 71

1. ప్రభూ! నేను నిన్ను ఆశ్రయించితిని. నేను ఏనాడును అవమానము చెందకుందునుగాక! 2. నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొరవిని నన్ను కాపాడుము. 3. నీవు నాకు రక్షణదుర్గము అగుము. నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును రక్షణశైలమును నీవే. 4. దేవా! దుష్టులబారినుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడదనుండి , నన్ను రక్షింపుము. 5. దేవా! నీవే నాకు దిక్కు నా నమ్మిక. యవ్వనము నుండియు నేను నిన్నే ఆశ్రయించితిని 6. నేను పుట్టిన నాటి నుండియు నిన్నే నమ్ముకొంటిని. తల్లి గర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే. నేను నిన్ను సదా కీర్తింతును. 7. నా జీవితముపలువురికి వింతగా కన్పించుచున్నది కాని నీవు నాకు బలమైన ఆశ్రయము. 8. దినమెల్ల నేను నిన్ను నోరార వినుతింతును, నీ మహిమను ఉగ్గడింతును. 9. నా ముసలితనమున నీవు నన్ను పరిత్యజింపకుము. నా బలము ఉడిగిన తరుణమున నీవు నన్ను చేయి విడువకుము. 10. నా విరోధులు నన్ను గూర్చి చెప్పుకొనుచున్నారు. నా ప్రాణములు తీయగోరి కుట్రలు చేయుచున్నారు. 11. “దేవుడు అతనిని విడనాడెను గనుక అతనిని వెన్నంటి పట్టుకొనుడు. అతనిని రక్షించువాడు ఇక ఎవడును ల

Psalms 70

1. ప్రభూ! నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము. 2. నా ప్రాణములు తీయజూచువారెల్లరు అవమానమున మునిగి, అపజయము పొందుదురుగాక! నాకు కలిగిన కీడునుచూచి ఆనందించువారు సిగ్గుపడి, వెనుదిరుగుదురుగాక! 3. నన్ను ఎగతాళి చేయువారు తలవంపులు తెచ్చుకొని, భీతిల్లుదురుగాక! 4. కాని నిన్ను వెదకు వారందరును పరమానందము చెందుదురుగాక! నీ రక్షణను అభిలషించువారు అందరును “ప్రభువు మహాఘనుడు” అని ఎల్లవేళల వాకొందురుగాక! 5. దేవా! నేను దరిద్రుడను, దీనుడను. శీఘ్రమే నీవు నా చెంతకు రమ్ము. నాకు సహాయుడవును, రక్షకుడవును నీవే. కనుక ప్రభూ! జాగుచేయక నన్ను ఆదుకొనుము.

Psalms 69

1. దేవా! నన్ను రక్షింపుము. నీళ్ళు నా గొంతు వరకు వచ్చినవి. 2. నేను ఊబిగుంటలో దిగబడిపోవుచున్నాను. నా పాదములకు గట్టినేల తగులుటలేదు. నేను లోతైన నీళ్ళలోనికి దిగితిని. కెరటములు నన్ను ముంచివేయుచున్నవి. 3.  అరచి అరచి నేను అలసిపోతిని. నా గొంతు బొంగురు పోయినది. నీ సహాయము కొరకు చూచిచూచి కన్నులు వాచినవి. 4. నిష్కారణముగా నన్ను ద్వేషించువారు నా తలమీద వెంట్రుకలకంటె ఎక్కువగనేయున్నారు, నా విరోధులు నామీద కొండెములు చెప్పుచున్నారు. వారు బలవంతులు కనుక నన్ను చంపజూచుచున్నారు. నేను అపహరింపని వస్తువును తిరిగి, ఈయమనుచున్నారు. 5. దేవా! నేను చేసిన పిచ్చిపని నీకు తెలియును. నా తప్పిదములు నీవెరుగనివి కావు. 6. సర్వశక్తిమంతుడవైన ప్రభూ! నిన్ను నమ్మువారికి నా వలన తలవంపులు రాకుండునుగాక! యిస్రాయేలుదేవా! నిన్ను వెదకు వారికి నా వలన అవమానము కలుగకుండును గాక! 7. నీ కారణముననే నాకు అవమానము ప్రాప్తించినది. నీ వలననే నేను నిందను తెచ్చుకొంటిని. 8. నా సోదరులకు నేను పరాయివాడనైతిని. నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని. 9. నీ దేవాలయముపట్ల నాకుగల భక్తి నన్ను దహించివేయుచున్నది. నిన్ను నిందించువారి నిందలు నామీద పడినవి. 10. నేను ఉపవాసము చేసి

Psalms 68

1. దేవుడు లేచునుగాక! ఆయన శత్రువులు చెల్లాచెదరగుదురుగాక! ఆయనను ద్వేషించువారు పారిపోవుదురుగాక! 2. ఆయన వారిని పొగనువలె చెదరగొట్టునుగాక! నిప్పు ఎదుట మైనమువలె దేవుని ఎదుట దుష్టులు కరగిపోవుదురుగాక! 3. కాని నీతిమంతులు దేవునిగాంచి సంతసింతురు. వారు మహానందము చెందుదురుగాక! 4. ప్రభువు మీద పాటలు పాడుడు, ఆయన నామమును కీర్తింపుడు. మేఘములపై స్వారిచేయు దేవునికి మార్గము సిద్ధము చేయుడు. ఆయన పేరు ప్రభువు, ఆయనను జూచి సంతసింపుడు. 5. పవిత్రమందిరమున వసించుదేవుడు అనాథలకు తండ్రి, వితంతువులకు ఆదరువు. 6. దేవుడు ఒంటరివానికి ఇంటినొసగును. బందీలను చెరనుండి విడిపించి వృద్ధిలోనికి తెచ్చును. అతనిమీద తిరుగుబాటు చేయువారు మాత్రము మరుభూమిలో వసింపవలెను. 7. దేవా! నీవు నీ ప్రజలను నడిపించుచు ఎడారిగుండ కదలిపోయినపుడు 8. సీనాయి దేవుడవైన నిన్నుచూచి, యిస్రాయేలు దేవుడవైన నిన్నుగాంచి భూమి కంపించినది, ఆకసము వర్షించినది. 9. నీవు వానను మిక్కిలిగా కురియించి సొలసియున్న నీ వారసత్వపు భూమికి సత్తువను ఒసగితివి. 10. నీ ప్రజలు ఆ నేలమీద నివాసము ఏర్పరచుకొనిరి. ఉదారబుద్దితో నీవు పేదల అక్కరలు తీర్చితివి. 11-12. దేవుడు ఆజ్ఞ ఇచ్చెను. ‘రాజులు వారి సైన్య

Psalms 67

1. దేవా! మా మీద దయజూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. 2. అప్పుడు సకలజాతులు నీ మంచితనమును తెలిసికొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసికొనును. 3. దేవా! అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక! సకలజాతులు నిన్ను కొనియాడునుగాక! 4. అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక! నీవు జాతులకు న్యాయముతో తీర్పుతీర్తువు. భూమి మీది జాతులనెల్ల నడిపించునది నీవే. 5. దేవా! అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక! సకలజాతులు నిన్ను కొనియాడునుగాక! 6. పొలము పంట పండినది. దేవుడు, మన దేవుడు, మనలను దీవించెను. 7. దేవుడు మనలను ఆశీర్వదించెను. నేల నాలుగుచెరగుల వరకునుగల జనులెల్లరు అతనిని గౌరవింతురుగాక!

Psalms 66

1. సకల జనులారా! ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. 2. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు, 3. “నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. 4. లోకములోని ప్రజలెల్లరు నిన్ను పూజింతురు. నిన్ను కీర్తించి స్తుతింతురు. నీ దివ్యనామమును సన్నుతింతురు” అని మీరు ప్రభువుతో నుడువుడు. 5. రండు, ప్రభువు క్రియలను గమనింపుడు. నరులకొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు. 6. ఆయన సముద్రమును ఎండిననేలగా మార్చెను. మన ప్రజలు నది గుండ నడచిపోయిరి. ఆయన కార్యములకుగాను మనమచట ప్రమోదము చెందితిమి. 7. ఆయన సదా పరాక్రమముతో పరిపాలనము చేయును. జాతులనెల్ల ఒక కంట కనిపెట్టియుండును. తిరుగుబాటుదారులు ఎవరును. అతనిని ఎదిరింపకుందురుగాక! 8. అన్యజాతులారా! మీరు మా దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్లయెడల ప్రతిధ్వనించునుగాక! 9. ఆయన మనలను జీవముతో నింపెను. మనలను పడిపోకుండ కాపాడెను 10. దేవా! నీవు మమ్ము పరీక్షలకు గురిచేసితివి. వెండినివలె మమ్ము పుటమువేసి శుద్ధిచేసితివి. 11. నీవు మేము వలలో చిక్కుకొనునట్లు చేసితివి. మా వీపున పెద్ద బరువులు మోపితివి. 12. మా శత

Psalms 65

1. దేవా! ప్రజలు సియోనున నిన్ను స్తుతింపవలెను. జనులు తమ మ్రొక్కులను నీకు చెల్లించుకోవలెను. 2-3. నీవు నరుల ప్రార్థనలను ఆలింతువు. ప్రజలెల్లరును తమ పాపములతో నీ చెంతకు రావలసినదే. మా పాపములు మమ్ము క్రుంగదీయునపుడు, నీవు వానిని తుడిచివేయుదువు. 4. నీ దేవాలయమున వసించుటకుగాను నీవే ఎన్నుకొని ఆహ్వానించిన నరుడు ధన్యుడు. నీ వాసస్థలమైన పవిత్రమందిరమునందలి మేలివస్తువులతో మేము సంతృప్తి చెందుదుము. 5. మాకు రక్షకుడవైన దేవా! నీవు నా మొరను ఆలింతువు. నీ అద్భుతకార్యములతో మమ్ము రక్షింతువు. నేల నాలుగుచెరగుల వసించువారును, సాగరముల కావల జీవించువారును నిన్నే నమ్ముదురు. 6. నీవు శక్తితో పర్వతములను నెలకొల్పుదువు. బలమును నడికట్టుగా ధరింతువు. 7. నీవు కడలిహోరును అణచివేయుదువు. సాగరతరంగముల ఘోషను ఆపివేయుదువు. జాతుల తిరుగుబాటును అణగదొక్కుదువు. 8. నీ అద్భుతక్రియలను చూచి భూమిమీద నరులెల్లరును భీతిల్లుదురు. తూర్పునుండి పడమరవరకున్న జనులెల్లరు నీ క్రియలనుగాంచి సంతోషనాదము చేయుదురు. 9. నీవు భూమిని సందర్శించి దానిపై వాన కురియింతువు. దానిని మహా ఐశ్వర్యముతో నింపుదువు. నీ నది నీటితో నిండియుండును. అవి ధాన్యమును ఒసగును, నీవు చేసిన కార్యమిది

Psalms 64

1. దేవా! నేను ఆపదలో చిక్కి నీకు మొరపెట్టుకొనుచున్నాను, వినుము. శత్రుభయము నుండి నన్ను సంరక్షింపుము. 2. దుర్మార్గుల పన్నాగమునుండి నన్ను కాపాడుము. దుష్టబృందముల నుండి నన్ను రక్షింపుము. 3. వారు తమ వాక్కులకు కత్తులకు వలె పదును పెట్టుచున్నారు. క్రూరమైన పలుకులను, బాణములవలె గుప్పించుచున్నారు. 4. చాటున దాగియుండి, భయము ఏ మాత్రములేక, నిర్దోషులమీద దిడీలున అంబులు రువ్వుచున్నారు. 5. తమ దుష్కార్యములను గూర్చి ఒకరి నొకరు హెచ్చరించుకొనుచున్నారు. మోసపూరితమైన కుట్రలను ఎక్కడ పన్నుదమాయని తమలో తాము చర్చించుకొనుచున్నారు. “మనలను ఎవ్వరు చూచెదరు? 6. చెడు పన్నాగములు పన్ని మనము బాగుగా కుతంత్రములు పన్నితిమి” అని చెప్పుకొనుచున్నారు. మనిషి హృదయము మరియు మనస్సు చాలా లోతైనవికదా! 7. కాని దేవుడు వారిమీద తన బాణములు రువ్వును. వారు హఠాత్తుగా గాయపడుదురు. 8. వారి పలుకులకుగాను దేవుడు వారిని నాశనము చేయును. వారిని చూచువారెల్ల ఆశ్చర్యముతో తల ఊపుదురు. 9. అపుడు అందరు భయపడుదురు. దేవుని కార్యములను గూర్చి మాట్లాడుదురు. అతని కార్యములను తలపోయుదురు. 10. పుణ్యపురుషులు దేవుని తలంచుకొని ఆనందింతురు, అతనిని ఆశ్రయింతురు. సత్పురుషులు అతనిని స్తుత

Psalms 63

1. దేవా! నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాటపడుచున్నాను. నీ కొరకు ఆశగొనియున్నాను. నీళ్ళు లేక ఎండి మాడియున్న నేలవలె నా ప్రాణము నీ కొరకు దప్పికగొనుచున్నది. 2. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెననియు, నీ శక్తిని, తేజస్సును కన్నులార 'చూడవలెననియు నాకోరిక. 3. నీ అపారప్రేమ ప్రాణముకంటెను శ్రేష్ఠమైనది. కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. 4. నేను జీవించియున్నంత కాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్ధన చేసెదను. 5. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి, . నా ప్రాణము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు, నిన్ను వినుతింతును. 6. నా పడక మీద నిన్ను స్మరించుకొందును. రేయి నాలుగు జాములు నిన్ను ధ్యానింతును. 7. నీవు నాకు సహాయుడవుగా ఉంటివి కనుక నేను నీ రెక్కలనీడలో సంతసముతో పాటలుపాడెదను. 8. నేను నీకు అంటి పెట్టుకొని నడతును. నీ కుడిచేయి నన్ను ఆదుకొనును. 9. నా ప్రాణములు తీయగోరువారు పాతాళమునకు పోవుదురుగాక! 10. వారు కత్తివాత పడుదురుగాక! నక్కలు వారి శవములను పీక్కొని తినును గాక! 11. రాజు దేవునియందు ఆనందించును. దేవుని పేరుమీదుగా ప్రమాణము చేయు వారందరు సంతసింతురు. దేవుడు కల్లలాడ

Psalms 62

1. దేవుని యందు మాత్రమే నా ఆత్మ మౌనముగా నిరీక్షించుచున్నది. నాకు రక్షణను ఒసగువాడు ఆయనే. 2. ఆయన నాకు ఆశ్రయశిల, రక్షణకోట కాగా నేనే మాత్రము కలతజెందను. 3. మీరెల్లరు ఎంతకాలము నా ఒక్కని మీదికి దాడిచేయుదురు? ఒరిగియున్న గోడవలెను, వాలియున్న ప్రాకారమువలెను మీరు నన్ను కూలద్రోయజూతురా? 4. నన్ను పదవీభ్రష్టుని చేయవలెననియే మీ కోరిక, కల్లలాడుట మీకు ప్రీతి. మీరు బయటకి నన్ను ప్రేమించు వారివలె దీవించుచున్నారు. లోలోపల మాత్రము నన్ను శపించుచున్నారు. 5. నా ప్రాణము దేవునియందు మాత్రమే మౌనముగా నిరీక్షించుచున్నది. ఆయనయందే నా నమ్మకము. 6. ఆయన నాకు ఆశ్రయశిల, రక్షణకోట కాగా నేనెంత మాత్రము కలతచెందను. 7. నా రక్షణమును, గౌరవమును ప్రభువు మీదనే ఆధారపడియున్నవి. నాకు బలమైన కోటయు, ఆశ్రయుడును ఆయనే. 8. జనులారా! మీరెల్లవేళల ప్రభువును నమ్ముడు. మీ గోడులు ఆయనకు విన్నవించుకొనుడు. మనకు ఆశ్రయనీయుడు ఆయనే. 9. అల్పులైన నరులు, ఊదిన శ్వాసవంటివారు. ఉన్నతులైన మానవులందరు భ్రమవంటివారు. తక్కెడలో పెట్టి తూచినచోవారు పైకి తేలిపోయెదరు, ఊదిన శ్వాసము కంటె తేలికగా తూగెదరు. 10. దౌర్జన్య చర్యల వలన మీరేమియు పొందలేరు. దొంగతనము వలన ఏమియు సాధింపజాలరు. మీ సంపద

Psalms 61

1. ప్రభూ! నీవు నా ఆక్రందనమును వినుము. నా వేడుకోలును ఆలింపుము. 2. సొమ్మసిల్లిన యెదతో నేల అంచుల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేని ఉన్నత పర్వతము మీదికి నీవు నడిపింపుము. 3. నాకు ఆశ్రయదుర్గమవు నీవే. శత్రువుల నుండి నన్ను సంరక్షించు కోటవు నీవే. 4. నేను నీ మందిరమున సదా వసింతును. నీ రెక్కల మరుగున తలదాచుకొందును. 5. దేవా! నీవు నా ఋక్కులను అంగీకరించితివి. నీపట్ల భయభక్తులు చూపువారికి లభించు వారసత్వపు భూమిని నాకును దయచేసితివి. 6. నీవు రాజునకు దీర్ఘాయువు దయచేయుము. అతడు పెక్కుతరముల వరకు బ్రతుకునుగాక! 7. నీసన్నిధిలో కలకాలము రాజ్యము చేయునుగాక! నీ స్థిర ప్రేమ, విశ్వసనీయత అతడిని సంరక్షించునుగాక! 8. నేను నిన్ను సదా కీర్తించెదను. ప్రతిదినము నీకు నా మ్రొక్కులు చెల్లించుకొందును.

Psalms 60

1. దేవా! మమ్ము విడనాడితివి, మమ్ము ఓడించితివి, మాపై కోపించితివి. ఇపుడు మమ్ము తిరిగి ఉద్దరింపుము. 2. నీవు నేలను కంపింపజేసి ప్రకంపనలు కల్పించితివి. దాని పగుళ్ళను తిరిగి అతికించి సరిదిద్దుము. 3. నీ ప్రజలను ఘోరమైన కష్టములకు గురిచేసితివి. నీవు మాచే త్రాగించిన మద్యము వలన మేము తూలి పడిపోయితిమి. 4. నీ పట్ల భయభక్తులు కలవారిని నీ చెంతకు చేరదీసితివి. వారిని శత్రువుల విల్లుల బారినుండి కాపాడుటకుగాను నీ జెండాను పైకెత్తితివి.  5. నీ ప్రియ ప్రజలు విమోచింపబడునట్లుగా నీ కుడిచేతితో రక్షింపుము.మాకు జవాబునిమ్ము. 6. ప్రభువు తన దేవళమునుండి మనకిట్లు వాగ్దానము చేసెను; “నేను విజయమును సాధించి షెకెమును పంచి పెట్టెదను. సుక్కోతు లోయను విభజించి ఇచ్చెదను. 7. గిలాదు, మనప్పే మండలములు నావే, ఎఫ్రాయీము నాకు శిరస్త్రాణము, యూదా నాకు రాజదండము. 8. మోవాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము ఎదోము మీదికి నా పాదరక్షను విసరుదును. ఫిలిస్తీయాను ఓడించి అందం విజయనాదము చేయుదును”. 9. సురక్షితమైయున్న నగరములోనికి నన్నెవ్వరు కొనిపోగలరు? ఎదోములోనికి నన్నెవ్వరు తీసికొనిపోగలరు? 10. దేవా! నీవు మమ్ము నిజముగనే పరిత్యజించితివా? మా సైన్యముతో నీవిక యుద్ధ

Psalms 59

1. ప్రభూ! శత్రువుల బారినుండి నన్ను కాపాడుము. నా మీదికి దుమికి వచ్చు వారినుండి నన్ను రక్షింపుము. 2. దుష్టులనుండి నన్నాదుకొనుము. నరహంతలనుండి నన్ను సంరక్షింపుము. 3. వారు నా ప్రాణములు తీయుటకు పొంచియున్నారు. నేనెట్టి పాపముగాని, అపరాధముగాని చేయకున్నను నిష్కారణముగా బలాఢ్యులు ఏకమై నన్నెదిరించుచున్నారు. 4. నా వలన ఎట్టి తప్పు లేకున్నను, వారు నా మీదికి ఎత్తి వచ్చుటకు సంసిద్ధులగుచున్నారు. 5. సర్వశక్తిమంతుడవును, యిస్రాయేలు దేవుడవునైన ప్రభూ! నీవు మేలుకొని, నన్నాదుకొనుము, నా అగచాట్లు నీవే చూడుము. నీవు మేలుకొని అన్యజాతులను శిక్షింపుము. దుష్టులైన ద్రోహులను మన్నింపకుము. 6. వారు సాయంకాలము మరల వచ్చెదరు. కుక్కలవలె మొరుగుచు నగరమున తిరుగాడెదరు. 7. వారి పలుకులు వినుము. వారి నాలుకలు కత్తులవలెనున్నవి. వారు “మా మాటలెవరును వినరులే” అని తలంచుచున్నారు. 8. కాని ప్రభూ! నీవు వారిని చూచి నవ్వుదువు. నీవు అన్యజాతులనెల్ల అపహాసము చేయుదువు. 9. నాకు బలమును దయచేయు దేవా! నేను నిన్నే నమ్ముకొంటిని. నాకు రక్షణ దుర్గమవు నీవే. 10. నన్ను కృపతో చూచు దేవుడు నా చెంతకు వచ్చునుగాక! నేను నా శత్రువుల పతనమును కన్నులార చూతునుగాక! 11. ప్రభూ!

Psalms 58

1. న్యాయాధిపతులారా! మీరు న్యాయయుక్తముగా తీర్పు తీర్చుచున్నారా? తీర్పు చెప్పుచున్నారా? 2. లేదే, మీ యెదలో పరపీడనము గూర్చియే తలపోయుచున్నారు.  మీరు భూమిమీద దౌర్జన్యములు జరుపుచున్నారు. 3. ఈ దుర్మార్గులు పుట్టినప్పటినుండియు పెడత్రోవనే పట్టిరి. తాము జన్మించినప్పటి నుండియు అబద్దములే చెప్పిరి. 4-5. వారికి పామునకువలె విషముండును. పాములు పట్టువాని స్వరమును వినక, నేర్పరియైన మాంత్రికుని మంత్రములకు లొంగక,మొండిదైయుండు నాగుబామువలె వారును చెవులు మూసికొనిరి. 6. దేవా! నీవు వారి మూతిపండ్లు రాలగొట్టుము. ఆ సింగముల కోరలు ఊడబెరుకుము. 7. వారు కారిపోయెడి నీరువలె ఇంకిపోవుదురుగాక! కాలి క్రిందపడి నలిగిపోయెడు గడ్డివలె ఎండిపోవుదురుగాక! 8. తాను స్రవించిన జిగటద్రవంలో తానే కరిగిపోవు నత్తవలెను, గర్భస్రావము కాగా వెలుగునుగాంచజాలని పిండము వలెను నాశనమగుదురుగాక! 9. మీ కుండలు పచ్చివైనను, ఎండినవైనను, వాటికి ముండ్లకంప సెగ తగలకమునుపె, ప్రభువు వారిని పొట్టునువలె ఎగురగొట్టునుగాక! 10. దుర్మార్గులకు పడు శిక్షను జూచి సజ్జనులు సంతసింతురు. ఆ దుష్టుల నెత్తుటిలో తాము కాళ్ళు కడుగుకొందురు. 11. “పుణ్యపురుషులకు బహుమతి లభించుననియు, లోకములో న్య

Psalms 57

1. ప్రభూ! నా మీద దయజూపుము, నా మీద దయజూపుము. నేను నిన్నాశ్రయించితిని. అపాయములెల్ల తొలగిపోయిన దాక నేను నీ రెక్కలమాటున దాగుకొందును. 2. నా అక్కరలెల్ల తీర్చువాడును, . మహోన్నతుడునైన దేవునికి నేను మొరపెట్టెదను. 3. అతడు ఆకసమునుండి నా మొర విని నన్ను కాపాడునుగాక! నా మీదికి ఎత్తి వచ్చువారిని అడ్డగించునుగాక! తన కరుణను విశ్వసనీయతను నా చెంతకు పంపునుగాక! 4. నేను సింగముల నడుమ చిక్కుకొంటిని. అవి నన్ను మ్రింగుటకు కాచుకొనియున్నవి. వాటి కోరలు బాణములవలెను, బల్లెములవలెను ఉన్నవి. వాటి నాలుకలు వాడియైన కత్తులవలె ఉన్నవి. 5. దేవా! నీవు మింటికి పైగా ఎగయుము.ఈ భూమినంతటిని నీ తేజస్సుతో నింపుము. 6. విరోధులు నా పాదములకు ఉరులు పన్నిరి. నేను విచారమువలన క్రుంగిపోతిని. వారు నన్ను కూల్చుటకు గోతిని త్రవ్విరి. కాని తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి. 7. దేవా! నా హృదయము స్థిరముగా నున్నది, నా హృదయము దృఢముగా నున్నది. నేను నీపై పాటలు పాడి నిన్ను స్తుతింతును. 8. నా ప్రాణమా! మేలుకొనుము! వీణతంత్రీవాద్యము మేల్కొనునుగాక! నేను ఉషస్సును మేలుకొల్పెదను. 9. ప్రభూ! నేను వివిధజాతులనడుమ “నిన్ను వినుతించెదను. బహుజనులనడుమ నిన్ను స్తుతించెదను. 10

Psalms 56

1. దేవా! నా మీద దయజూపుము. శత్రువులు నా మీదికి వచ్చుచున్నారు. నిరంతరము నన్ను అణచివేయుచున్నారు. 2. దినమెల్లను విరోధులు నా మీదికి దాడి చేయుచున్నారు. నా మీద పోరాడువారు అనేకులున్నారు. 3. నాకు భయము కలిగినపుడెల్ల నేను నిన్నాశ్రయింతును. 4. నేను దేవుని విశ్వసించి ఆయన వాగ్దానములు నుతింతును. ఆయనను నమ్మి భయమును విడనాడెదను. మానవమాత్రులు నన్నేమి చేయగలరు? 5. నేను దినమెల్ల ఏ పనికి పూనుకొనినను నా విరోధులు నన్ను వేధించుచున్నారు. వారి ఆలోచనలన్నియు నాకు కీడు చేయవలయుననియే. 6. వారెల్లరును ఏకమై రహస్యముగా దాగియుండి నేను చేయుపనులెల్ల పొంచి చూచుచున్నారు. నా ప్రాణములు తీయవలయుననియే వారి కోరిక. 7. ఇట్టి దోషమునకుగాను వారు శిక్షను అనుభవింపవలదా? దేవా! నీ కోపముతో ఆ ప్రజలను నాశనము చేయుము. 8. నీవు నా వేదనలను గుర్తించితివి. నా అశ్రుబిందువులను నీ సీసాలో పోసియుంచితివి? వానిని నీ గ్రంథమున లిఖించలేదా? 9. నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు వెనుదిరిగి పారిపోవుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును. 10. నేను దేవుని విశ్వసించి అతని వాగ్దానమును వినుతింతును. ప్రభువు వాగ్దానమును కీర్తింతును. 11. ఆయనను నమ్మి భయమును విడనాడెద

Psalms 55

1. దేవా! నా మొర వినుము. నా విన్నపమును పెడచెవిని పెట్టకుము. 2. నా వేడుకోలును ఆలించి నాకు ప్రత్యుత్తరమిమ్ము నేను చింతలవలన మిక్కిలి అలసిపోతిని. శత్రువుల బెదరింపు కేకలకును దుష్టులపీడనకును నేను జంకెదను. 3. వారు నన్ను బాధపెట్టుచున్నారు. నా మీద ఆగ్రహము చెందుచున్నారు. 4. నా హృదయము లోలోపలనే వేదననొందుచున్నది. మృత్యుభయము నన్నావరించినది. 5. నేను భీతితో కంపించుచున్నాను. వెరపు నన్ను చుట్టుముట్టినది. 6. “పావురమునకువలె నాకును రెక్కలుండిన , ఎంత బాగుగానుండెడిది. నేనెగిరిపోయి విశ్రాంతినొందెడివాడనుకదా! 7. దూరముగా ఎగసిపోయి ఎడారిలో వసించెడి వాడనుకదా! 8. వడివడిగా దూసుకొనిపోయి పెనుగాలినుండియు, తుఫానునుండియు తప్పించుకొనెడివాడనుగదా!” అని నేను తలంచితిని. 9. ప్రభూ! నీవు శత్రువులను నాశనముచేసి వారి భాషను తారుమారు చేయుము. పట్టణమున హింసయు కొట్లాటలును కన్పించుచున్నవి. 10. విరోధులు దివారాత్రములు ప్రాకారములమీద నడచుచు, నగరము చుట్టును తిరుగాడుచున్నారు. పట్టణము నేరములతోను, దుష్కార్యములతోను నిండియున్నది. 11. పురము వినాశనమునకు నిలయమైనది. సంతవీధులు పీడనకును, వంచనకును ఆటపట్టులైనవి. 12. విరోధి ఎవడైన నన్ను అవమానించినచో నేను సహిం

Psalms 54

1. దేవా! నీ శక్తితో నన్ను రక్షింపుము. నీ బలముతో నాకు న్యాయము చేయుము. 2. దేవా! నా మొర వినుము, నా పలుకులాలింపుము. 3. గర్వితులు నా మీదికి వచ్చుచున్నారు. క్రూరులు నా ప్రాణములు తీయగోరుచున్నారు. వారు దేవుని లక్ష్యము చేయుటలేదు. 4. కాని దేవుడే నాకు సాయము చేయును. ప్రభువే నన్నాదుకొనును. 5. దేవుడు నా శత్రువుల దుష్టత్వమును వారి మీదికే త్రిప్పికొట్టునుగాక! ఆయన నమ్మదగినవాడు కనుక నా విరోధులను నాశనము చేయునుగాక! 6. ప్రభూ! నేను సంతసముతో నీకు బలినర్పింతును. శ్రేష్ఠమైన నీ నామమునకు గాను నీకు వందనములు అర్పింతును. 7. సకల ఆపదలనుండియు నీవు నన్ను కాపాడితివి. నేను నా శత్రువుల ఓటమిని గాంచితిని.

Psalms 53

1. మూర్ఖులు “దేవుడు లేడు” అని యెంతురు. వారెల్లరును దుష్టులై ఘోరకార్యములను చేసిరి. మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను. 2. జ్ఞానముకలిగి తనను వెదకువారు ఎవరైన ఉన్నారేమో చూతమని దేవుడు ఆకసమునుండి నరులవైపు పారజూచును. 3. కాని జనులెల్లరును తప్పుత్రోవ పట్టిరి, ఎల్లరును దుష్టులైరి. మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను. 4. నా ప్రజలను భోజనమువలె మ్రింగివేయుచు, దేవునికి ప్రార్థన ఏ మాత్రము చేయని దుష్టులకు జ్ఞానము ఇసుమంతయు లేదా? 5. దేవుడు ఆ భక్తిహీనుల ఎముకలను చిందరవందరచేయును. అచ్చోట ఆ దుష్టులు ఘోరమైన భయమువాత పడుదురు. దేవుడు వారిని నిరాకరింపగా వారు అవమానమున మునుగుదురు. 6. సియోనునుండి యిస్రాయేలును రక్షించు నాథుడెవడు? ప్రభువు తన ప్రజలకు అభ్యుదయము దయచేసినపుడు యాకోబు సంతతియెల్ల సంతసించును. యిస్రాయేలీయులెల్లరు ప్రమోదము చెందుదురు.

Psalms 52

1. వీరుడా! నీవు నీ చెడ్డ పనులను గూర్చి విఱ్ఱవీగనేల? ప్రభువు నిత్యము కృపజూపును. 2. నీవు దినమెల్లయు ఇతరులను నాశనము చేయుటకు పన్నాగములు పన్నుచున్నావు. నీ నాలుక క్షురకత్తివలె పదునైనది. నీవు ఇతరులకు ద్రోహము తలపెట్టితివి. 3. నీవు మంచికంటె చెడ్డనెక్కువగా అభిలషించితివి. సత్యముకంటె అసత్యమును ఎక్కువగా ఆదరించితివి. 4. మోసపు నాలుక కలవాడా! నీవు నీ పలుకులతో ఇతరులను నాశనము చేయుచున్నావు. 5. కనుక ప్రభువు నిన్ను నిత్య నాశనమునకు గురిచేయును. అతడు నీ ఇంటినుండి నిన్ను మెడబట్టి గెంటివేయును. జీవవంతుల లోకమునుండి నిన్ను పెరికివేయును. 6. ఈ ఉదంతమును జూచి న్యాయవంతులు భయభ్రాంతులగుదురు. వారు నిన్ను పరియాచకము చేయుచు ఇట్లందురు: 7. "ఇడుగో! దేవుని ఆశ్రయింపని నరుడు! ఇతడు తన బహుళ సంపదలను నమ్ముకొనెను. తన దుష్కార్యములే తనకు బలమొసగునని యెంచెను”. 8. నా మట్టుకు నేను దేవుని మందిరమున ఎదుగు ఓలివుచెట్టువలె ఉన్నాను. నేను ప్రభువు కృపను సదా నమ్మెదను. 9. దేవా! నీవు నాకు చేసిన మేలునకుగాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును. మంచితనముగల నీ నామమును భక్తసమాజమున ప్రకటింతును.

Psalms 51

1. ప్రభూ! నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. 2. నా దోషములనుండి నన్ను పూర్తిగా కడిగి వేయుము. నా పాపములనుండి నన్ను శుద్ధిచేయుము. 3. నా అపరాధములు నాకు తెలియును. నేనెల్లపుడు నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందును. 4. నీకే, కేవలము నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని. నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని. నీవు నాకు తీర్పుచెప్పుట న్యాయమే. నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. 5. నేను పుట్టినప్పటినుండియు పాపాత్ముడనే. మా అమ్మ కడుపున పడినప్పటి నుండియు కిల్బిషాత్ముడనే. 6. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. 7. హిస్సోపు కొమ్మతో నన్ను ప్రక్షాళింపుము. నేను శుద్దుడనగుదును. నన్ను కడుగుము, నేను మంచుకంటె తెల్లనగుదును. 8. నన్ను నీ సంతోషోల్లాసములతో నింపుము. అప్పుడు నీవు నలుగగొట్టిన ఎముకలు సంతసించును. 9. నా దోషముల నుండి నీ మోమును ప్రక్కకు త్రిప్పుకొనుము. నా పాతకములనెల్ల తుడిచివేయుము. 10. దేవా! నాలో నిర్మలహృదయమును సృజింపుము. నూతనమును, స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. 11. నన్ను నీ సన్నిధినుండి గెంటివేయకుము. నీ పరిశుద్దాత్మను నాల

Psalms 50

1. దేవాధిదేవుడైన ప్రభువు సంభాషించుచున్నాడు. ఆయన తూర్పునుండి పడమరవరకు గల విశ్వధాత్రిని పిలుచుచున్నాడు. 2. సౌందర్యనిధియైన సియోను పట్టణమునుండి ఆయన వెలుగు ప్రకాశించుచున్నది. 3. మన ప్రభువు విచ్చేయును. మౌనముగా నుండడు. ఆయన ముందట సర్వమును దహించు అగ్ని చూపట్టును. ఆయన చుట్టును పెనుతుఫాను వీచుచుండును. 4. ఆయన తన ప్రజలకు తీర్పుచెప్పును. ఆ తీర్పునకు భూమ్యాకాశములను సాక్షులుగా పిల్చును. 5. “బలి అర్పణపూర్వకముగా నాతో నిబంధనము చేసికొనిన నా పవిత్ర ప్రజను ప్రోగుచేయుడు” అని ఆయన ఆదేశించును. 6. ప్రభువు న్యాయవంతుడనియు , ఆయనే స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. 7. “నా ప్రజలారా! నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. యిస్రాయేలీయులారా! నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను మీ దేవుడనైన ప్రభుడను. 8. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహనబలులు అర్పించుచునే ఉన్నారు. 9. అయినను మీ కొట్టములనుండి ఎద్దులుగాని, మీ మందలనుండి మేకపోతులుగాని నాకు అక్కరలేదు. 10. వన్యమృగములు నావే. వేలకొలది కొండలమీది పశువులును నావే. 11. ఆకాశమున ఎగురుపక్షులన్నియు నావే. పొలమున తిరుగాడు జంతువులన్నియు నావే. 12.

Psalms 49

1. సకలజాతి ప్రజలారా! ఈ సంగతిని వినుడు. భూమి మీద వసించు సకల జనులారా! ఈ విషయమును ఆలింపుడు. 2. అధికులు, సామాన్యులు, ధనికులు, పేదలు ఎల్లరును వినుడు. 3. నేను విజ్ఞాన వాక్యములు పలికెదను. నా హృదయ భావములు వివేకము గలవి. 4. నేను సామెతను ఆలించిన మీదట పొడుపుకథను తంత్రీవాద్యముపై పాడి వివరింతును. 5-6. తమ కలిమిని నమ్ముకొని, తమ మహాసంపదలను గూర్చి గొప్పలు చెప్పుకొను దుష్టులైన శత్రువులు నన్ను చుట్టుముట్టగా నాకు వాటిల్లు ఆపదలను  గూర్చి నేనేమాత్రము భయపడను. 7. నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణములు నిలబెట్టుకోలేడు. దేవునికి సొమ్ము చెల్లించి అసువులు నిలుపుకోలేడు. 8. నరుడు తన ప్రాణములు నిలుపుకొనుటకు ఎంత మూల్యము చెల్లించినను చాలదు. 9. అతడు శాశ్వతముగా జీవించుటకును, సమాధిగోతిని తప్పించుకొనుటకును, ఎంత సొమ్ము చెల్లించినను చాలదు. 10. జ్ఞానులును గతింతురనియు, బుద్దిహీనులును, మూర్చులునుకూడ చత్తురనియు, ఎల్లరును తమ సొత్తును తమ అనుయాయులకు వదలి పోవలసినదే అనియు నరునికి తెలియును. 11. వారి సమాధులే వారికి శాశ్వత గృహములు. . వారు తమ గోరీలలోనే సదా వసింతురు. ఒకప్పుడు వారికి సొంత భూములున్నను ప్రయోజనము లేదు. 12. నరుని వైభవములు అతని ప్ర

Psalms 48

1. ప్రభువు ఘనుడు. మన దేవుని పట్టణమునను, ఆయన పవిత్ర పర్వతము మీదను ఆ ప్రభువును ఘనముగా కీర్తింపవలయును. 2. దైవనిలయమైన సియోను ఉన్నతమును, సుందరమునైన పర్వతము. విశ్వధాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అది ఉత్తర దిక్కునగల మహారాజు నగరము. 3. ఈ నగర దుర్గములందు ప్రభువు తన రక్షణను వెల్లడిచేసెను. 4. రాజులు ఏకమై సియోనుమీదికి దండెత్తి వచ్చిరి. 5. వారు ఆ పురమును జూచి విస్తుపోయిరి, భయపడి పారిపోయిరి. 6. ఆ పట్టణమును గాంచి గడగడ వణకిరి. ప్రసవవేదనము అనుభవించు స్త్రీవలె బాధ చెందిరి. 7. తర్షీషునకు పోవు నావలు తూర్పు గాలికి  కంపించునట్లు వారు కంపించిరి. 8. దేవుడు చేసిన కార్యమును మనము ముందే వినియుంటిమి. సైన్యములకు అధిపతియైన ప్రభుని పట్టణమున ఇప్పుడా సంఘటనను కన్నులారా చూచితిమి. దేవుడు ఆ నగరమును కలకాలము కాపాడును. 9. ప్రభూ! మేము నీ దేవాలయమున నీ ప్రేమను ధ్యానించుకొందుము. 10. నీ కీర్తివలె నీ నామము నేల అంచుల వరకు వ్యాపించును. నీ కుడిచేయి విజయముతో నిండియున్నది. 11. నీ తీర్పు, కట్టడలు ధర్మబద్దమైనవి కనుక సియోను పర్వతము, యూదా నగరములు హర్షించును. 12. సియోను చుట్టును తిరిగి దాని బురుజులను లెక్కపెట్టుడు. 13. దాని కోటగోడను గమనింపు

Psalms 47

1. నిఖిల జాతులారా! చప్పట్లు కొట్టుడు. జయజయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. 2. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు. అతడు విశ్వధాత్రిని పాలించుమహారాజు. 3. అతడు అన్యజాతులు మనకు లొంగిపోవునట్లు చేయును. వారిని మనకు పాదాక్రాంతులను చేయును. 4. మనకు భుక్తమైయున్న ఈ దేశమును అతడు మనకొరకు ఎన్నుకొనెను. ప్రభువునకు ప్రీతిపాత్రులైన యిస్రాయేలు ప్రజలు ఈ గడ్డను చూచి గర్వపడుదురు. 5. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. 6. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. మన రాజును కీర్తించి స్తుతింపుడు. 7. అతడు విశ్వధాత్రికిని రాజు. రమ్యముగా కీర్తనలుపాడి అతనిని వినుతింపుడు. 8. ప్రభువు తన పవిత్రసింహాసనమును అధిరోహించి అన్యజాతులను పరిపాలించును. 9. అన్యజాతుల నాయకులువచ్చి అబ్రహాము దేవుని కొలుచు ప్రజలతో కలసిపోవుచున్నారు. భూమి మీద రాజులెల్లరు ప్రభువునకు చెందినవారే. ఆయన మహోన్నతముగా ప్రస్తుతింపబడును.

Psalms 46

1. ప్రభువే మనకు ఆశ్రయము, బలమునైనవాడు ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. 2. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగరగర్భమున కూలినను, 3. సాగరజలములు రేగి ఘోషించి, నురగలు క్రక్కినను, సముద్రజలములు పొంగి కొండలు చలించినను మనము భయపడనక్కరలేదు.  4. మహోన్నతుని పవిత్ర మందిరమును, దేవుని నగరమును, తన పాయలతో ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. 5. దేవుడా పట్టణమున వసించును గనుక అది నాశనము కాదు. వేకువ జాముననే అతడు పురము నాదుకొనును. 6. అన్యజాతులు ఆర్భాటము చేసిరి, రాజ్యములు చలించెను. కాని ప్రభువు సింహనాదము చేయగా భూమి ద్రవించెను. 7. సైన్యములకు అధిపతియైన ప్రభువు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా నున్నాడు. 8. రండు, ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. 9. ఆయన నేల నాలుగు చెరగుల పోరులు రూపుమాపును. విల్లులను విరిచివేసి బల్లెములను విరుగగొట్టును. రథములను తగులబెట్టును. 10. “మీరు నిశ్చలముగానుండి, నేను దేవుడనని తెలిసికొనుడు. సకల జాతులలోను సర్వభూమి మీదను నేనే సార్వభౌముడను” అని అతడు వచించుచున్నాడు. 11. సైన్యములకు అధిపతియైన ప్రభువు మనకు అండగా నుండును. యాకోబు దేవుడు మ

Psalms 45

1. నా హృదయము రమ్యమైన , భావముతో పొంగిపొరలుచున్నది. నా ఈ గీతమును రాజుకు విన్పింతును. నా నాలుక నిపుణుడైన వ్రాతగాని లేఖినివలె పనిచేయును. 2. నీవు నరులలోకెల్ల సుందరరూపుడవు. సొగసైన వాక్చాతుర్యము కలవాడవు. ప్రభువు నిన్ను నిత్యము దీవించుచునే యుండును. 3. మహావీరుడవైన రాజా! ఖడ్గమును ధరింపుము! నీవు వైభవమును ఠీవియు గలవాడవు. 4. ప్రాభవముతో రథారూఢుడవై స్వారివెడలుము. సత్యమును, దయను, న్యాయమును నెలకొల్పుము. నీవు స్వీయబలము వలన మహావిజయములు సాధింతువు. 5. నీ వాడి బాణములు నీ శత్రువుల గుండెలలో గ్రుచ్చుకొనును. అన్యజాతి ప్రజలు నీ పాదముల మీద వాలుదురు. 6. దేవా! నీ సింహాసనము కలకాలము నిల్చును. నీవు న్యాయముతో నీ రాజదండమును త్రిప్పుదువు. 7. నీవు ధర్మమును అభిమానించి దౌష్ట్యమును ఏవగించుకొందువు. కనుకనే నీ దేవుడైన ప్రభువు నిన్ను ఎన్నుకొని, సాటి రాజుల కంటే నీకు ఎక్కువ ఆనందమును దయచేయు తైలముతో నిన్నభిషేకించెను. 8. నీ వస్త్రములు అగరు, లవంగపట్ట, గోపరసముల సువాసనలతో గుబాళించుచున్నవి. దంతముపొదిగిన , ప్రాసాదమున తంత్రీ వాద్యకారులు నీకు ప్రమోదము చేకూర్తురు. 9. రాజపుత్రికలు నీకు కొలువు చేయుదురు. రాణి ఓఫిరుదేశ మేలిమిబంగారు నగలతో అలంకరిం

Psalms 44

1. దేవా! నీవు పూర్వము మా పితరుల కాలమున చేసిన మహాకార్యములను గూర్చి మేము చెవులార వింటిమి. మా పితరులు వానిని మాకు విన్పించిరి. 2. నీవు అన్యజాతులను తరిమివేసి , వారి దేశమున నీ ప్రజలను నెలకొలిపితివి. అన్యులను శిక్షించి, నీ వారిని వృద్ధిలోనికి తీసికొని వచ్చితివి. 3. నాడు నీ జనులు ఖడ్గముతో ఈ గడ్డను గెలువలేదు. స్వీయబలముతో విజయమును సాధింపలేదు. నీ బలము వలన, నీ సామర్థ్యము వలన, నీ సాన్నిధ్య ప్రభావము వలన వారికి విజయము సిద్ధించినది. నీ జనులను నీవు కటాక్షించితివి. 4. నాకు రాజువును దేవుడవునైన ప్రభూ! యాకోబునకు విజయము నొసగినది నీవే. 5. నీ శక్తివలన మేము విరోధులను జయించితిమి. నీ నామమున మమ్మెదిరించిన వారిని ఓడించితిమి. 6. నేను నా వింటిని నమ్ముకొనలేదు. నా ఖడ్గము నాకు విజయము సాధించి పెట్టలేదు. 7. నీవే విరోధుల నుండి మమ్ము రక్షించితివి. మమ్ము ద్వేషించువారిని ఓడించితివి. 8. కనుక మేమెల్లవేళల నిన్ను తలంచుకొని గర్వింతుము. సదా నీకు స్తుతులర్పింతుము. 9. కాని నీవు మమ్మిపుడు చేయివిడచి అవమానమున ముంచితివి. "మా సైన్యములతో ఇపుడు పోరునకు పోవైతివి. 10. నీవు మేము మా వైరులకు వెన్నిచ్చి పారిపోవునట్లు చేసితివి. వారు మా సొత్

Psalms 43

1. దేవా! నేను నిర్దోషినని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి, భక్తిహీనులైన నరులనుండి నన్ను కాపాడుము. కొండెగాండ్రులను దుష్టులునయిన నరులనుండి నన్ను రక్షింపుము. 2. దేవా! నాకు ఆశ్రయదుర్గమవు నీవే. నీవు నన్నేల చేయి విడచితివి? నా శత్రువుల పీడనము వలన నేను నిరంతరము బాధలనను అనుభవింపనేల? 3. నీ వెలుగును, నీ సత్యమును ఇచటికి పంపుము. అవి నాకు దారిజూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాసస్థలమైన దేవళమునకును నన్ను తోడుకొని పోవునుగాక! 4. అప్పుడు దేవా! నేను నీ బలిపీఠము వద్దకు వత్తును. నాకు పరమానందమును ఒసగువాడవు నీవే. నా దేవుడవైన ప్రభూ! నేను తంత్రీవాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. 5. నా మనసా! ఇప్పుడింతగా విచారము చెందనేల? ఇంతగా నిట్టూర్పులు విడువనేల? ప్రభువుపై నమ్మకము పెట్టుకొనుము. నీ సహాయకుడు రక్షకుడైన దేవుని మరల స్తుతించుము.

Psalms 42

1. దేవా! సెలయేటి నీటికొ రకు దప్పిగొనిన దుప్పివలె నా హృదయము నీ కొరకు తపించుచున్నది. 2. సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. ఆ నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. 3. దివారాత్రములు నా కన్నీళ్ళే నాకు ఆహారమైనవి. నీ దేవుడేడీ అని నిరంతరము జనులు నన్నడుగుచున్నారు. 4. పూర్వపు సంఘటనములు జ్ఞప్తికి వచ్చినపుడు నా హృదయము ద్రవించిపోవుచున్నది. ఎ నేను భక్తబృందములతో కలిసి . దేవళమునకు వెళ్ళెడివాడను. వారు ఆనందనాదముతో స్తుతులు పాడుచు ప్రభువును కీర్తించుచు పోవుచుండగా, నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయెడివాడను. 5. నా మనసా! ఇప్పుడింతగా విచారము చెందనేల? ఇంతగా నిట్టూర్పులు విడువనేల? ప్రభువుపై నమ్మకము పెట్టుకొనుము. నీ సహాయకుడు రక్షకుడైన దేవుని మరల స్తుతించుము. 6. ప్రభూ! నేను మానసికవిచారమున మునిగియుండి నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. యోర్దాను సీమ నుండి, హెర్మోను పర్వత ప్రాంతము నుండి, మీసారు కొండ చేరువ నుండి ప్రభూ! నేను నిన్ను స్మరించుకొనుచున్నాను. జలపాతములు హోరుమని శబ్దించుచున్నవి. 7. అగాధ జలప్రవాహములు ఒకదానినొకటి పిలుచుకొనుచున్నట్లు ఉన్నవి. వాని కెరటములు నా మీదికి లేచి నన

Psalms 41

1. పేదల నాదరించువాడు ధన్యుడు. అతనికి ఆపదవాటిల్లినపుడు, ప్రభువు వానిని ఆదుకొనును. 2. ప్రభువతనిని కాపాడి అతని ప్రాణమును సంరక్షించును. అతడు తన దేశమున సుఖశాంతులతో అలరారునట్లు చేయును. అతడు తన విరోధుల చేతికి చిక్కకుండునట్లు చేయును. 3. అతడు రోగగ్రస్తుడై మంచము , పట్టినప్పుడు ప్రభువు అతనికి సాయము చేసి ఆరోగ్యమును ప్రసాదించును. 4. "ప్రభూ! నేను నీకు ద్రోహముగా పాపము చేసితిని. నీవు నన్ను కరుణించి, నా వ్యాధి నయము చేయుము” అని నేను పలికితిని. 5. నా విరోధులు నన్ను గూర్చి చెడ్డగా మాట్లాడుచున్నారు. “అతడెప్పుడు చనిపోవును, అతడి పేరెప్పుడు మాసిపోవును” అని కాచుకొని యున్నారు. 6. నన్ను సందర్శింప వచ్చువారు నా ముందు ముఖస్తుతి చేయుచున్నారు. వారు నన్ను గూర్చి చెడు సమాచారము సేకరించుకొనిపోయి వెలుపల అందరితోను చెప్పుచున్నారు. 7. నేననిన గిట్టని వారు తమలో తాము గుసగుసలాడుకొనుచు నాకు మహాదుర్గతి పట్టినదని ఎంచుచున్నారు. 8. “ఇతనికి మాయదారి రోగము పట్టుకొనినది. ఇక మంచముమీది నుండి లేవడు” అని చెప్పుకొనుచున్నారు. 9. నేను బాగుగా నమ్మిన ప్రాణ స్నేహితుడే, నా ఇంట భోజనము చేసినవాడే నా మీద తిరుగబడెను. 10. ప్రభూ! నీవు నన్ను కరుణించి

Psalms 40

1. నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుంటిని. ఎట్టకేలకు అతడు నా వైపు వంగి, నా వేడుకోలును ఆలించెను.   2. వినాశనకరమైన గోతినుండి, బురదగుంటలనుండి అతడు ఆయన నన్ను బయటికి లాగెను. నన్ను కొండకొమ్మున నిలిపి, నాకు భద్రత కల్పించెను. 3. అతడు నాకు కొత్త పాటను నేర్పెను. అది. ప్రభువును స్తుతించుపాట. ఈ ఉదంతమునెరిగి అనేకులు ప్రభువునకు భయపడుదురు. అతనిని విశ్వసింతురు. 4. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. దబ్బర దైవములను కొలుచు గర్వాత్ములతో చేతులు కలపని జనుడు భాగ్యవంతుడు. 5. నా దేవుడవైన ప్రభూ!  నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసితివి. మా మేలుకొరకు పెక్కుఆలోచనలు తలపోసితివి. నీ వంటివాడు మరొకడు లేడు. నేను నీ ఉపకారములను వివరింపబూనినచో అవి నేను వర్ణింపగలిగిన . దానికంటే ఎక్కువగా నుండును. 6. నీవు బలిని, సమర్పణమును కోరలేదు. దహనబలిని పాపపరిహారబలిని అభిలషింపలేదు. కాని నీ మాటలు ఆలకించుటకు నాకు చెవులొసగితివి. 7. అప్పుడంటిని: “లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చియున్నాను. 8. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము , నా యెదలో పదిలముగా నిలిచియున్నది.  9. భక్త సమాజము

Psalms 39

1. “నేను నా కార్యములనుగూర్చి జాగ్రత్తపడుదును. నా నాలుకతో పాపము కట్టుకొనకుండ ఉందును. -దుష్టులు చేరువలో ఉన్నపుడు నా నోరు కళ్ళెముతో మూసికొని ఉందును" అని చెప్పితిని. 2. నేను ఏమియు పలుకక మూగవలె మౌనముగానుంటిని. మంచిని గూర్చియైనను ఏమియు మాట్లాడనైతిని. అయినను నా బాధ ఇంకను అధికమయ్యెను. 3. " నా హృదయము వ్యధతో నిండిపోయెను. నేను ఆలోచించిన కొలది అని నా వేదన మిక్కుటమయ్యెను. కనుక నేనిట్లు నుడివితిని: 4. "ప్రభూ! నాజీవితమెపుడు ముగియునో,  నా జీవిత కొలమానిక ఏమిటో, నా జీవితమెంత క్షణికమైనదో నీవే నాకు ఎరిగింపుము. 5. నీవు నాకు క్షణభంగురమైన ఆయువును ఒసగితివి. నీ దృష్టిలో నా ఆయుస్సు అత్యల్పమైనది. భూమిమీద వసించు నరులెల్లరును ఊదిన శ్వాసము వంటివారు. 6. ప్రతి మనుజుడును నీడవంటివాడు. అతని ఆర్బాటములు నిరుపయోగమైనవి. అతడు కూడబెట్టిన సొత్తు ఎవని పాలగునో తెలియదు. 7. ప్రభూ! ఇట్టి పరిస్థితులలో నేనేమి ఆశింపగలను! నేను నిన్నే నమ్మితిని. 8. నా పాపములన్నిటినుండియు - నీవు నన్ను విమోచింపుము. మూర్ఖులు నన్ను గేలిచేయకుండునట్లు చేయుము. 9. నేను మూగవాడను మౌనము వహింతును. నన్ను ఈ అగచాట్లపాలు చేసినది నీవే. 10. నీ దెబ్బలను నాన

Psalms 38

1. ఓ ప్రభూ! నా మీద కినుకబూని . నన్ను చీవాట్లు పెట్టకుము. నా మీద ఆగ్రహము చెంది నన్ను శిక్షింపకుము. 2. నీవు రువ్విన బాణములు నా శరీరమున గ్రుచ్చుకొనినవి. నీ హస్తము నన్ను శిక్షించినది. 3. నీ కోపము వలన నేను రోగమువాత పడితిని. నా పాపమునుబట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 4. నా పాపములు అను వెల్లువ నన్ను ముంచివేసినది. ఈ నా దోషములు అను పెనుభారము నా మీదనిలిచి నన్ను క్రుంగదీసినది. 5. నా బుద్దిహీనత వలన నా గాయములు క్రుళ్ళి దుర్గంధమొలుకుచున్నవి. 6. నేను వంగిన దేహముతో క్రుంగి కృశించుచు, దినమంతయు విలపించుచున్నాను. 7. నేను జ్వరము వేడిమివలన మాడిపోవుచున్నాను. నా దేహమున ఆరోగ్యము ఏ మాత్రమును లేదు. 8. నేను పూర్తిగా క్రుంగిపోయి వినాశము వాతపడితిని. హృదయవేదనవలన మిగుల విలపించితిని. 10. నా గుండె దడదడకొట్టుకొనుచున్నది. నేను సత్తువ కోల్పోయితిని. నా కన్నులలోని కాంతి కూడ అంతరించినది. 9. ప్రభూ! నా కోరికలు నీకు తెలియనివి కావు. నా నిట్టూర్పులు నీ వెరుగనివికావు. 10. నా గుండె దడదడకొట్టుకొనుచున్నది. నేను సత్తువ కోల్పోయితిని. నా కన్నులలోని కాంతి కూడ అంతరించినది. 11. నా స్నేహితులు, ఇరుగుపొరుగు వారు నా గాయములను చూచి నా చెంతకు వచ్చ

Psalms 37

1. దుష్టులను చూచి నీవు వ్యవసపడవలదు. దుర్మార్గుల పనులను గాంచి అసూయ చెందవలదు. 2. వారు గడ్డివలె త్వరితముగా ఎండిపోవుదురు. పొలములోని మొక్కలవలె వాడిపోవుదురు. 3. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము. అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. 4. ప్రభువునొక్కనినే ఆనందప్రదునిగా భావింపుము. అతడు నీ కోర్కెలు తీర్చును. 5. ప్రభువు మీదనే భారము వేయుము. నీవతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. 6. అతడు నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపజేయును. నీధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యునివలె భాసిల్లజేయును. 7. దేవుని ముందట నెమ్మదిగా నిలిచియుండుము. అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచియుండుము. ఇతరులు సంపదలు ఆర్జించుటను గూర్చిగాని, కుతంత్రములు పన్నుటను గూర్చిగాని ఆందోళనము చెందకుము. 8. కోపమును విడనాడి ఆగ్రహావేశములను అణచుకొనుము. కోపము వలన కీడేకాని మేలు కలుగదు. 9. ప్రభువు దుష్టులను తరిమివేయును. ఆయన కొరకు వేచియుండువారు మాత్రము దేశమును స్వాధీనము చేసికొందురు. 10. కొంచెము కాలములోనే దుష్టులు అణగారిపోవుదురు. అటుపిమ్మట నీవు వారికొరకు గాలించినను వారు దొరకరు. 11. దీనులు దేశమును స్వాధీనము చేసికొందురు. మిక్కుటమైన శాంతిని అనుభవి

Psalms 36

1. దుష్టుని హృదయమున పాపము మంతనము చేయును. అతడికి దైవభీతి ఉండదు. 2. అతడు తనను తాను ఘనముగా ఎంచును. దేవుడు తన పాపమును గుర్తుపట్టడనియు, తన దోషమును ఖండింపడనియు తలంచును.  3. అతడి పలుకులు దుష్టత్వముతోను, అబద్దములతోను నిండియుండును. అతడు జ్ఞానమును విడనాడెను కనుక ఇక మంచిని చేయజాలడు." 4. అతడు పడకమీద పరుండి, చెడు పన్నాగమును పన్నును. దుష్ట మార్గమున నడచును, అధర్మమును అంగీకరించును. 5. ప్రభూ! నీ కృప ఆకాశమును అంటును. నీ నమ్మదగినతనము మబ్బులను తాకును. 6. నీ నీతి మహాపర్వతములవలె స్థిరమైనది. నీ ఆజ్ఞలు అగాధసముద్రములవలె లోతైనవి. నీవు నరులను, మృగములనుకూడ కాపాడుదువు. 7. నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరకును. 8. వారు నీ ఆలయమున సమృద్ధిగా లభించు భోజనమును ఆరగింతురు. నీ మంచితనము అను నదినుండి , పానీయమును సేవింతురు.  9. నీవు జీవపు చెలమవు. నీ వెలుగు వలననే మేము వెలుగును గాంతుము. 10. నిన్నెరిగిన భక్తులకు నీ కృపను దయచేయుచుండుము. సజ్జనులకు నీ నీతిని ప్రసాదించుచుండుము. 11. గర్వాత్ములు నన్ను అణగదొక్కకుందురుగాక! దుష్టులు నన్ను పారద్రోలకుందురుగాక! 12. దుష్టులు తాము పడిన చోటనే పడియుందురు. మరల పైకిల

Psalms 35

1. ప్రభూ! నన్నెదిరించు వారిని నీవు ఎదిరింపుము. నాతో పోరాడువారితో నీవు పోరాడుము. 2. నీ డాలును చేపట్టి నాకు సాయము చేయుటకు శీఘ్రమే రమ్ము. 3. నీ ఈటెను దూసి నన్ను వెన్నాడు వారిమీదికి రమ్ము. - “నేను నిన్ను రక్షింతును” అని అభయమిమ్ము. 4. నన్ను చంపజూచువారు అవమానమునకును అప్రతిష్ఠకును గురియగుదురుగాక! . నా మీద కుట్రలు పన్నువారు వెన్నిచ్చి పారిపోవుదురుగాక! సిగ్గుచెందుదురుగాక! 5. ప్రభువుదూత వారిని తరిమివేయునుగాక! వారు గాలికి ఎగిరిపోవు పొట్టువలె అగుదురుగాక! . 6. ప్రభువుదూత వారిని వెన్నాడగా, వారు చీకటిత్రోవనబడి పారిపోవుచు జారిపడుదురుగాక! 7. నేనెట్టి అపకారము చేయకున్నను ఒక వారు నాకు వలపన్నిరి. నన్ను కూలద్రోయుటకు గోతినిత్రవ్విరి. 8. కనుక తలవని తలంపుగా వారికి వినాశము దాపురించునుగాక! ఆ దుష్టులు తాము పన్నినవలలో తామే చిక్కుకొందురుగాక! తాము త్రవ్విన గోతిలో తామే కూలుదురుగాక! 9. అటుల జరిగినప్పుడు నేను ప్రభువును చూచి ఆనందింతును. అతడు నన్ను రక్షించుటనుచూచి సంతసింతును. 10. నా ఎముకలన్నియు ప్రభువుతో ఇట్లు పలుకును: “నీవంటివాడు మరొకడు లేడు. నీవు బలవంతుల బారినుండి దుర్భలుని రక్షింతువు. పీడకులనుండి బాధితుని, దీనుడైన నరు

Psalms 34

1. నేను ప్రభువునకు ఎల్లవేళల వందనములర్పింతును. నిరంతరము ఆయనను కీర్తింతును. 2. ప్రభువు నాకు చేసిన మేలులకుగాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక! 3. మీరును నాతోగూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలసి ఆయన దివ్యనామమును కీర్తింతము. 4. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొరవినెను. నా భయములెల్ల తొలగించెను. 5. ఆయన వైపు చూడుడు. మీ ముఖములు ప్రకాశింపనిండు. అపుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలుగదు. 6. దరిద్రుడు ప్రభువునకు మొర పెట్టగా ఆయన వినును. సకల క్లేశములనుండియు అతనిని కాపాడును. 7. ప్రభువునకు భయపడువారి చుట్టును ఆయనదూత శిబిరము పన్నును. సకల ఆపదలనుండి వారిని కాపాడును. 8. ప్రభువు ఎంత ఉత్తముడోయని రుచిచూసి తెలుసుకొనుడు. ఆయనను శరణువేడువాడు ధన్యుడు. 9. యావే భక్తులారా! మీరు ప్రభువునకు భయపడుడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. 10. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును. కాని ప్రభువును ఆశ్రయించువారికి ఎల్ల మేలులు సిద్ధించును. 11. పిల్లలారా రండు, నా ఉపదేశమును ఆలింపుడు! నేను మీకు దైవభీతిని నేర్పింతును. 12. మీరు బ్రతుకగోరినచో, దీర్ఘకాలము జీవించి శుభములు బడయగోరినచో 13. చెడ్డమాటలు

Psalms 33

1. నీతిమంతులారా! ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. ఋజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. 2. తంత్రీవాద్యముతో ప్రభువును నుతింపుడు. దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. 3. ప్రభువునకు నూతనగీతము పాడుడు. నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జేకొట్టుడు. 4. ప్రభువు పలుకులు సత్యమైనవి. ఆయన కార్యములు నమ్మదగినవి. 5. ఆయనకు నీతిన్యాయములనిన ఇష్టము. లోకమంతయు ఆయన అచంచల కృపతో నిండియున్నది. 6. ప్రభువు తనవాక్కుతో ఆకాశమును సృజించెను. తన పలుకుతో సూర్యచంద్ర నక్షత్రాదులను చేసెను. 7. ఆయన సముద్రజలములనెల్ల చర్మపుతిత్తులలో నిల్వచేయును. సాగరములను తన కొట్టులలో దాచియుంచును.  8. జగమంతయు ప్రభువును చూచి భయపడునుగాక! ప్రజలెల్లరు ఆయనను గాంచి భీతిల్లుదురుగాక! 9. ప్రభువు ఒక్క పలుకు పలుకగా లోకము పుట్టెను. ఆయన ఆజ్ఞ ఈయగా సమస్తమును కలిగెను. 10. ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నము చేయును. ప్రజల పన్నుగడలను వమ్ముచేయును. 11. కాని ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిల్చును. ఆయన సంకల్పములు కలకాలము చెల్లును. 12. ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది. ఆయన తనవారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. 13. ప్రభువు ఆకసమునుండి క్రిందికి పారజూచును.

Psalms 32

1. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. 2. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో, ఆ జనుడు భాగ్యవంతుడు. 3. నేను నా తప్పును ఒప్పుకొనక మౌనముగా ఉన్నపుడు, దినమంతయు నిట్టూర్పులు విడచుచు క్రుంగికృశించితిని. 4. ప్రభూ! రేయింబవళ్ళు నీవు నన్ను కఠినముగా దండించితివి. వేసవి వేడిమికి చెమ్మవలె నా సత్తువ ఎండిపోయెను, 5. అప్పుడు నేను నా పాపమును ఒప్పుకొంటిని. నా అపరాధమును దాచనైతిని. “నేను ప్రభువునెదుట నా తప్పిదమును ఒప్పుకొందును" అనుకొనగా నా దోషమును మన్నించితివి. 6. కనుక నీ భక్తులెల్లరు ఆపదలలో నీకు ప్రార్థన చేయవలయును. అప్పుడు జలప్రవాహములు పొంగివచ్చినను వారిని తాకజాలవు. 7. నేను తలదాచుకొనుచోటు నీవే. నన్నాపదనుండి కాపాడువాడవు నీవే. నీవు నన్ను రక్షింతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును.  8. నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడువవలసిన మార్గమును చూపింతును. నీ మీద దృష్టినిలిపి నీకు సలహానిత్తును. 9. నీవు జ్ఞానములేని గుఱ్ఱమువలెను, గాడిదవలెను ప్రవర్తింపవలదు. అవి పగ్గమును, కళ్ళెమును వేసిననేగాని అదుపులోనికి రావు. 10. దుష్టులు పెక్కు వేదనలను అనుభవింతుర

Psalms 31

1. ప్రభూ! నేను నిన్ను శరణువేడుచున్నాను. నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకుము. నీ న్యాయమునుబట్టి విముక్తుని చేయుము. 2. నీవు నా మనవినాలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్నాదుకొనుము. సురక్షితదుర్గమై నన్ను రక్షింపుము. 3. నాకు ఆశ్రయస్థానమును, నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. 4. శత్రువులు పన్నిన ఉరులనుండి నేను తప్పించుకొందునుగాక! నా దుర్గము నీవే. 5. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభూ! నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. 6. నిరర్ధకములైన విగ్రహములను కొలుచువారిని నీవు అసహ్యించుకొందువు, కాని నేను నిన్ను నమ్మితిని. 7. నీ స్థిరమైన కృపను తలంచుకొని నేను మిగుల సంతసింతును. నీవు నా వ్యధ గుర్తించితివి, నా బాధలను గ్రహించితివి. 8. నన్ను శత్రువుల చేతికి అప్పగింపలేదు. విశాలస్థలమున నా పాదములు నిలబెట్టితివి. 9. ప్రభూ! నన్ను కరుణింపుము, నేను విపత్తులలో చిక్కుకొంటిని. విచారము వలన నా నేత్రములు క్షీణించినవి. నేను పూర్తిగా క్రుంగిపోతిని. 10. నేను దుఃఖముతో బ్రతుకీడ్చుచున్నాను. నిట్టూర్పులతోనే నా యేండ్లు సాగిపోవుచున్నవి. ఆపదలవలన నేను సత్తువను కోల్ప

Psalms 30

1. ప్రభూ! నీవు నన్ను విపత్తునుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. 2. నా దేవుడైన ప్రభూ! నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి. 3. ప్రభూ! నీవు నన్ను పాతాళలోకమునుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఏగువారినుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. 4. ప్రభు భక్తులారా! ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములర్పింపుడు. 5. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము వాడట జీవితాంతముండును. ఆ మంత రేయి దుఃఖమువలన కన్నీళ్ళు కారును. కాని వేకువనే ఆనందము చేకూరును. 6. నేను సురక్షితముగా నున్నప్పుడు “నాకెన్నడు కీడు వాటిల్లదు" అని పలికితిని. 7. ప్రభూ! నీవు నన్ను కరుణతో అభేద్యమైన పర్వతదుర్గముగా మలచితివి. కాని నీవు నీ ముఖమును నా నుండి , దాచుకొనగనే నేను కలత చెందితిని. 8. ప్రభూ! నేను నీకు మనవి చేసితిని. నీ సహాయమును అర్ధించుచు 9. “నేను చనిపోయి పాతాళము చేరుకొనినయెడల నీకేమి లాభము కలుగును? మృతులు నిన్ను స్తుతింతురా? .ధూళి నిన్ను స్తుతించగలదా?  మేరలేని నీ మంచితనమును కీర్తించగలదా? 10. ప్రభూ! నీవు నా మొరనాల

Psalms 29

1. దైవతనయులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయన మహిమ ప్రతాపములను కీర్తింపుడు. 2. మహిమాన్వితమైన ఆయన దివ్యనామమును కొనియాడుడు. ప్రభువు పవిత్రమందిరమున ఆయనను ఆరాధింపుడు. 3. ప్రభువు స్వరము జలముల మీద విన్పించుచున్నది. మహిమాన్వితుడైన ప్రభువు ఉరుములతో గర్జించు చున్నాడు. ఆయన స్వరము సాగరము మీద విన్పించుచున్నది. 4. ప్రభువు స్వరము మహాబలమైనది. ఆయన స్వరము మహాప్రభావము కలది. 5. ప్రభువు స్వరము దేవదారులను పెల్లగించును. లెబానోను కొండల మీది దేవదారులను ముక్కచెక్కలు చేయును. 6. ఆయన లెబానోను కొండలను దూడలను వలె దూకించును. షిర్యోను కొండను కోడెదూడను వలె గంతులు వేయించును. 7. ప్రభువు స్వరము మిలమిల మెరయు నిప్పులను వెదజల్లును. 8. ఆయన స్వరము వలన ఎడారి తల్లడిల్లును,కాదేషు ఎడారి కంపించును. 9. ప్రభువు స్వరము సింధూరములను అల్ల ల్లాడించును. అడవిలోని మ్రాకులను మోడులు చేయును. కాని ఆయన మందిరమున ఎల్లరు ప్రభువునకు "మహిమ? అని నినాదము చేయుదురు. 10. ప్రభువు ప్రళయజలములమీద సింహాసనాసీనుడయ్యెను. ఆయన కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయును. 11. ఆయన తన ప్రజలకు బలమును దయచేయును. శాంతి సమాధానములతో వారిని దీవించును.

Psalms 28

1. నాకు రక్షణదుర్గమవైన ప్రభూ! నేను నీకు మొర పెట్టు కొనుచున్నాను. నీవు మౌనము వహింపవలదు. నీవు మౌనము వహింతువేని నాకును మృతలోకమునకేగువారి గతియే పట్టును. 2. నేను గొంతెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను.నీ సహాయమును అర్థించుచున్నాను.నీవు నా వేడుకోలును ఆలింపుము. నేను నీ పవిత్ర మందిరము వైపు చేతులెత్తుచున్నాను. 3. దుష్కార్యములు చేయు దుష్టులతోపాటు నన్ను గోనిపోకుము . వారు కుటిల మనస్కులై శాంతి కాముకులుగా నటింతురు. వారు బయటికి చెలిమి ఉట్టిపడునట్లు మాటలాడుదురు. 4. ప్రభూ! వారి చెయిదములకుగాను,వారు చేసిన దుష్కార్యములకుగాను,నీవు వారిని దండింపుము. వారు చేసినచెడ్డపనులన్నింటికిగాను వారికి ప్రతిఫలమిమ్ము. 5. వారు ప్రభువు చేసిన కార్యములను గుర్తింపరైరి. ఆయన చేసిన సృష్టిని గమనింపరైరి. కనుక ప్రభువు వారిని నిర్మూలనము చేయును. ఆయన వారిని మరల వృద్ధిలోనికి తీసికొనిరాడు. 6. ప్రభువునకు స్తుతికలుగునుగాక! ఎందుకన, ఆయన నా ప్రార్థన ఆలకించెను. 7. ప్రభువే నాకు బలము, నాకు డాలు. ఆయనయందే నా నమ్మకము. ఆయన నన్నాదుకొనెను కనుక నేను సంతసింతును.ఆయనను స్తుతించి కీర్తనలు పాడుదును. 8. ప్రభువు తన ప్రజలకు బలమును దయచేయును. ఆయనయే తన అభిషక్తునికి

Psalms 27

1. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట. ఇక నేనెవరికి భయపడవలెను? 2. దుష్టులు, విరోధులు నా మీదకెత్తి వచ్చి నన్ను కబళింప జూచినచో వారే కుప్పకూలి పోవుదురు. 3.సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. 4. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఇది ఒక్కటియే నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని, ఆయన అందమైన ముఖమును గాంచవలెనని, ఆయన సలహా అడుగుకొన వలెననియే నా కోరిక. 5. ఆపత్కాలమున అతడు నన్ను తన మందిరమున దాచియుంచును. తన దేవాలయమున నన్ను సురక్షితముగా మనుచును. నన్ను భద్రముగా కొండ కొమ్మున నిల్పును. 6. కనుక నన్ను చుట్టుముట్టిన శత్రువులను నేను ఓడింతును. సంతోష నాదముతో ప్రభు మందిరమున బలిని అర్పింతును. ఆయనను స్తుతించుచు కీర్తనలు పాడుదును. 7. ప్రభూ! నేను నీకు మొరపెట్టినపుడు,నీవు నా వేడికోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తర మిమ్ము. 8. నీవు నన్ను "నా సన్నిధిలోనికి రమ్ము” అని పిలిచితివి. "ప్రభూ! నేను నీ సన్నిధిని వెదకుచున్నాను" అని నా హృదయము నీకు ప్రత్యు

Psalms 26

1. ప్రభూ! నీవు నాకు తీర్పు చెప్పుము. నేను ధర్మమార్గమున నడచితిని. నిశ్చల మనస్సుతో నిన్ను నమ్మితిని. 2. ప్రభూ! నీవు నన్ను నిశితముగా పరిశీలింపుము. నా కోరికలను, ఆలోచనలను పరీక్షించి చూడుము. 3. నీ నిచితమైన ప్రేమ నాకు విధితము, నేను నీ పట్ల విశ్వాసపాత్రుడనుగా మెల గుచున్నాను. 4. నేను దుర్మార్గులతో కలిసి తిరుగనైతిని.వేషధారులతో సంచరింపనైతిని. 5. దుష్టబృందమనిన నాకు గిట్టదు. దుర్జనులతో నాకు పొత్తులేదు. 6. అమాయకత్వమునందు నా చేతులను కడుగుకొని, నీ బలిపీఠము చుట్టు ప్రదక్షిణము చేయుదును. 7. నీకు కృతజ్ఞత తెలియజేయుచు కీర్తనలు పాడెదను. నీ అద్భుత కార్యములెల్లరికి వెల్లడి చేయుదును. 8. నీవు వసించు మందిరమనిన, నీ తేజస్సు నెలకొని యున్న దేవాలయమనిన నాకు పరమ ప్రీతి. 9. పాపాత్ములతోపాటు నన్ను నాశము చేయకుము. నరహంతలకు పట్టుగతి నాకు పట్టనీయకుము. 10. వారు దుష్కార్యములు చేయు వారు, లంచములిచ్చుటకు సిద్ధముగా ఉండు వారు. 11. నా మటుకు నేను ధర్మమార్గమున నడచితిని. నీవు నన్ను రక్షింపుము, నన్ను కరుణతో చూడుము. 12. నేను అపాయము నుండి తప్పించుకొంటిని గాన, భక్తసమాజమున ప్రభుని కీర్తించెదను.

Psalms 25

1. ప్రభూ! నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. 2. నా దేవా! నేను నిన్నే నమ్మితిని. నా విరోధులు నా పతనము చూచి సంతసింపకుండునట్లు చేయుము. వారి వలన నేను అవహేళనకు గురికాకుండునట్లు చేయుము. 3. నిన్ను నమ్మినవారు ఎన్నడును అవమానమునకు గురికాకుందురు గాక! నీ మీద తిరుగుబాటుచేయు దుర్మార్గులకే తలవంపులు వచ్చును గాక! 4. ప్రభూ! నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకెరిగింపుము. 5. నన్ను నీ సత్యము నందు నడిపింపుము. నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు భోధింపుము. ఎల్లవేళల నీ కొరకై వేచియుందును. 6. ప్రభూ! చిరకాలము నుండి నీవు నాపట్ల చూపుచువచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. 7. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచి తనమును బట్టియు, నీవు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. 8. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. 9. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. 10. ప్రభువు నిబంధనలను, ఆజ్ఞలను పాటించువారికి ఆయన మార్గములు స్థిరమైనవి, నమ్మదగినవి. 11. ప్రభూ! నీ పేరునకు తగినట్లుగానా ఘోర పాపములను మన్నింపుము. 12. ప్రభునకు

Psalms 24

1. భూమియు దానిమీద నున్న సమస్త వస్తువులును ప్రభునివే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్ల ఆయనకు చెందినవే. 2. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను. అంతః ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. 3. ప్రభు పర్వతమును ఎక్కుటకు ఆర్హుడైవడు? ఆయన పవిత్ర స్థలమున అడుగిడుటకు యోగ్యుడెవడు? 4. నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రముల ను ఆరాధింపని వాడు, వ్యర్థ క్రియలపై మనస్సు పెట్టని వాడు, అబద్ద ప్రమాణములు చేయనివాడు ఎవడో, అతడే యోగ్యుడు. 5. అతడు ప్రభువు నుండి దీవెనలు పొందును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. 6. ప్రభువును వెదకుకొనుచు వచ్చెడివారు,యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చెడివారు, ఇట్టివారే. 7. మందిర ద్వారములారా! మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా! మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. 8. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు?ఆయన మహాబలవంతుడు, మహావీరుడునైన ప్రభువు, యుద్ధ రంగమున యోధాను యోధుడైన ప్రభువు. 9. మందిర ద్వారములారా! మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా! మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. 10. ఈ మహిమాన్వి

Psalms 23

1. ప్రభువే నాకు కాపరి. ఇక ఏ కొదవయు లేదు. 2. ఆయన నన్ను పచ్చికపట్టులలో విశ్రమింప చేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్నునడిపించుకొనిపోవును. 3. నా ఆత్మను సేదదీర్చును. తన నామ గౌరవవార్ధము నన్ను ధర్మమార్గమున నడిపించును. 4. గాఢాంధకారపు లోయలో పయనించునపుడును, నేనెట్టి అపాయమునకు భయ పడను. ఎందుకన, నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతికఱ్ఱ నన్ను కాపాడుచుండును. 5. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. 6. నేను జీవించినన్నాళ్లు నీ కరుణయును, ఉపకారమును నా వెంట వచ్చును. నేను కల కాలము ప్రభు మందిరమున వసింతును.

Psalms 22

1. నా దేవా! నా దేవా! నన్నేల చేయివిడిచితివి? నేను నీకు మొరపెట్టితిని గాని నీవు నన్నింకను ఆదుకోవైతివి. 2. ప్రభూ! నేను పగలెల్ల మొరపెట్టిన, నీవు ఆలింపవు. రేయెల్ల నీకు మనవి చేసిన, ఉపశాంతి లేదు. 3. నీవు పరమ పవిత్రుడవు. యిస్రాయేలీయుల స్తుతులనెడు సింహాసనము మీద ఆసీనుడవై ఉండు వాడవు. 4. మా పితరులు నిన్ను నమ్మిరి. నిన్ను నమ్మగా నీవు వారిని రక్షించితివి. 5. వారు నిన్ను శరణువేడి ఆపద నుండి తప్పించు కొనిరి. నిన్ను నమ్మి నిరాశ చెందరైరి. 6. నా మట్టుకు నేనిపుడు పురుగునుగాని నరుడను గాను. ఎల్లరును నన్ను చిన్నచూపు చూచి ఎగతాళి చేయుచున్నారు. 7. నావైపు చూచిన వారెల్ల నన్ను గేలి చేయుచున్నారు.నాలుక వెళ్లబెట్టి తల ఊపుచున్నారు. 8. "ఇతడు ప్రభువును నమ్మెను. ఆయన ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో ఆయన ఇతనిని కాపాడునేమో చూతము" అని అనుచున్నారు. 9. తల్లి కడుపు నుండి నన్ను సురక్షితముగాబయటికి కొనివచ్చినది నీవే. నేను మాతృ స్తన్యము గ్రోలి భద్రముగా మనునట్లు చేసినది నీవే. 10. మాతృ గర్భము నుండి వెలువడినప్పటి నుండి నేను నీ మీదనే ఆధారపడితిని. నేను జన్మించినప్పటి నుండి నీవే నాకు దేవుడవు. 11. నేను ఆపదలలో

Psalms 21

1. ప్రభూ! నీవు ప్రసాదించిన బలమునకుగాను రాజు సంతసించును. నీవు దయచేసిన విజయమునకుగాను, అతడు మిగుల హర్షించును. 2. నీవతని కోర్కెలు తీర్చితివి, అతని వేడుకోలును ఆలించితివి. 3. అతనికి మేలైన దీవెనలు కొనివచ్చితివి. అతని తలమీద బంగారు కిరీటమును పెట్టితివి. 4. రాజు ఆయుస్సునిమ్మని వేడగా నీవు దయచేసితివి. అతనికి దీర్గాయువును ఒసగితివి. 5. నీ సహాయము వలన రాజు మహా మహిమను బడసెను. నీవు అతనికి కీర్తిప్రాభవముల ను దయచేసితివి. 6. అతనికి శాశ్వతములైన దీవెనలను అను గ్రహించితివి. నీ సాన్నిధ్యము వలన అతడు ప్రమోదము చెందును. 7. రాజు ప్రభువును నమ్ముకొనెను. మహోన్నతుని కరుణవలన అతడు నిత్యము రాజ్యముచేయును. 8. నీ హస్తము నీ శత్రువులనెల్ల పట్టుకొనును.నీ కుడి చేయి నిన్ను ద్వేషించువారిని బంధించును. 9. అతడు తాను విజయము చేయు దినమున ఆ విరోధులనెల్ల అగ్ని గుండము వలే దహించి వేయును. ప్రభువు మహోగ్రుడై ఆ విరోధులను మ్రింగి వేయును. అగ్ని వారిని కబళించివేయును. 10. రాజు తన విరోధుల సంతానమును చంపును. వారి వంశజులనెల్ల మట్టుపెట్టును. 11. ఆ విరోధులు అతనికి కీడు తలపెట్టి అతని మీద కుట్రలు పన్నినను ఫలితము దక్కదు. 12. రాజు వారి మీద బాణములు రువ్వగా వార

Psalms 20

1. ఆపద్దినమున ప్రభువు నీకు ప్రత్యుత్తరమిచ్చును గాక! యాకోబు దేవుడు నిన్ను కాపాడును గాక! 2. ఆయన తన దేవాలయము నుండి నీకు సహాయము చేయును గాక! సియోను కొండ మీది నుండి నిన్ను ఆదుకొనును గాక! 3. ఆయన నీ కానుకలను గుర్తించుకొని, నీ దహన బలుల వలన ప్రీతి చెందును గాక! 4. ఆయన నీ కోరికలు తీర్చి, నీ యత్నములనెల్ల సఫలము చేయును గాక ! 5. నీ విజయమును గాంచి మేము హర్షధ్వానము చేయుదుము గాక! మన దేవుని కీర్తించుచు జెండాలు ఎగురవేయుదుము గాక! ప్రభువు నీ మనవులనెల్ల దయచేయును గాక ! 6. ప్రభువు తన అభిషిక్తునికి విజయమును ఒసగునని ఇప్పుడు నాకు తెలియును. అతడు పవిత్రమైన స్వర్ణ పదము నుండి రాజునకు ప్రత్యుత్తరమిచ్చును. తన బలముతో అతనికి మహావిజయములు ప్రసాదించును. 7. కొందరు రథములను నమ్మదురు. మరికొందరు గుఱ్ఱములను నమ్మదురు. కాని మేము మాత్రము ప్రభువైన దేవుని నమ్ముదుము. 8. వారు కాలుజారి క్రిందబడుదురు. కాని మేము పైకిలేచి దృఢముగా నిలుము. 9. ప్రభూ! నీ రాజునకు విజయము ప్రసాదింపుము. మేము నీకు మొర పెట్టు చున్నాము గాన నీవు మాకు ప్రత్యుత్తర మిమ్ము.

Psalms 19

1. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షము ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది. 2. ఒక పగలు మరియొక పగటికి ఈ సంగతిని బోధచేయుచున్నది. ఒక రేయి మరొక రేయికి జ్ఞానమును తెలియచేయుచున్నది. 3. ఆ రేయింబవళ్లకు భాషగాని, మాటలుగాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వని విన్పింపదు. 4. ఐనను వాని స్వరము భూమియందు అంతట వ్యాపించినది. వాని సందేశము నేల అంచులవరకు విన్పించుచున్నది. 5. ప్రభువు ఆకసమున సూర్యునికి ఒక గుడారమును నిర్మించెను. సూర్యబింబము పెండ్లి పందిరి నుండి వరునివలె వెలువడును. క్రీడాకారునివలె సంతసముతో పరుగునకు పూనుకొనును. 6. అది ఆకాశమున ఈ అంచు నుండి బయలుదేరి ఆ అంచు వరకును పయనించును. దాని వేడిమి నేదియు తప్పించుకోజాలదు. 7. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అది ఆత్మకు నూత్న జీవమును ఒసగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి. అవి తెలివి లేని వారికి జ్ఞానమును ఒసగును. 8. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి. అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి. అవి మనస్సునకు వివేచనము ఒసగును.  9. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము మనును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్ని ధర్మమైనవే. 10. అవి మేలిమి బంగారము కంటె

Psalms 18

1. ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నాను నాబలము నీవే. 2. ప్రభువు నాకు శైలము, కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు,రక్షణ సాధనము, ఆశ్రయ స్థానము. 3. నేను ప్రభువునకు మొరపెట్టగా, ఆయన నన్ను శత్రువుల నుండి కాపాడెను. ఆయన స్తుతింపదగిన వాడు. 4. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను.  5. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను.మృత్యుబంధములు నన్ను పెనవేసికోనెను . 6. నా ఆపదలో నేను ప్రభునకు మొరపెట్టితిని.నా దేవుని వేడుకొంటిని. ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలించెను. నా మొర ఆయన చెవిని పడెను. 7. అపుడు ప్రభువు కోపోద్రిక్తుడుకాగా భూమి కంపించి దద్దరిల్లెను, పర్వతముల పునాదులు వణకెను. 8. ఆయన నాసికారంధ్రముల నుండి పొగలు ఎగసెను. ఆయన నుండి సర్వమును దహించు జ్వాలలును, గనగన మండు నిప్పు కణికలును బయల్వెడలెను. 9. ప్రభువు ఆకాశమును తెరవలె తొలగించి క్రిందికి దిగివచ్చెను. ఆయన పాదముల క్రింద కారుమబ్బులు క్రమ్మియుండెను. 10. ఆయన కేరూబు మీద స్వారిచేయుచు వచ్చెను. వాయువు రెక్కలమీద ఎక్కి శీఘ్రముగా విచ్చేసెను. 11. అంధకారమును తన చుట్టు