1. ప్రభువే నాకు కాపరి. ఇక ఏ కొదవయు లేదు.
2. ఆయన నన్ను పచ్చికపట్టులలో విశ్రమింప చేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్నునడిపించుకొనిపోవును.
3. నా ఆత్మను సేదదీర్చును. తన నామ గౌరవవార్ధము నన్ను ధర్మమార్గమున నడిపించును.
4. గాఢాంధకారపు లోయలో పయనించునపుడును, నేనెట్టి అపాయమునకు భయ పడను. ఎందుకన, నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతికఱ్ఱ నన్ను కాపాడుచుండును.
5. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది.
6. నేను జీవించినన్నాళ్లు నీ కరుణయును, ఉపకారమును నా వెంట వచ్చును. నేను కల కాలము ప్రభు మందిరమున వసింతును.