ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెషయా గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Isaiah

Q ➤ 935. యెషయా తండ్రి ఎవరు?


Q ➤ 936. ఏ జంతువునకు తన యజమానుడు తెలియును?


Q ➤ 937. ఏ పెంపుడు జంతువునకు తన యజమాని తెలియును?


Q ➤ 938. “రండి! మన వివాదములు పరిష్కరించుకొందము అని ఇశ్రాయేలీయులను పిలిచినదెవరు?


Q ➤ 939. సియోను నివాసులు ఎలా రక్షింపబడుదురు?


Q ➤ 940. ఏ ప్రజలు బహిరంగంగా పాపము చేయుచున్నారు?


Q ➤ 941. ఇశ్రాయేలీయులు ఎందుకు ప్రవాసము పాలగుదురు?


Q ➤ 942. ఏ రాజు మరణించిన యేడు, ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై యుండుట యెషయా చూచెను?


Q ➤ 943. సెరాఫీలకు ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలుండెను?


Q ➤ 944. సైన్యముల కధిపతియగు యెహోవా "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" అని ఎవరు ప్రతిగానము చేయుచుండిరి?


Q ➤ 945. హా! చెడితినిగదా! నా నోటినుండి వెలువడునవి అన్నియు అపవిత్రమైన మాటలే అని ఏ ప్రవక్త చెప్పెను?


Q ➤ 946. "నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోవును" అని ఎవరు ఎవరితో అనిరి?


Q ➤ 947. ఆహాసు రాజు నెదుర్కొనుటకు యెషయాతో వచ్చినదెవరు?


Q ➤ 948. ఆహాసుకు వ్యతిరేకంగా ఎదుర్కొనుటకు సిరియా రాజు ఎవరిని పంపెను?


Q ➤ 949. “నీదేవుడైన యెహోవాను సూచన అడుగుము - అది పాతాళమంతలోతైననుసరే ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే” అని దేవుడు ఎవరికి చెప్పెను?


Q ➤ 950. "నేను ప్రభువును పరీక్షకు గురిచేయను, అని ఏ రాజు అనెను?


Q ➤ 951. యువతి గర్భవతియై ఉన్నది, ఆమె కుమారుని కనును, అతనికి యిమ్మానుయేలు అని పేరు పెట్టును, అను గుర్తును ప్రభువు ఎవరికిచ్చెను?


Q ➤ 952.క్రీస్తు జననము గురించి ఏ ప్రవక్త ప్రవచించెను?


Q ➤ 953 ఎవరు పెరుగు తేనెలు తిని బ్రతుకును?


Q ➤ 954. ప్రభువు ఈలవేసి ఎక్కడినుండి దోమలను యిస్రాయేలు పైకి రప్పించెను?


Q ➤ 955. ఎచ్చట నుండి యెహోవా కందిరీగలను ఈలవేసి రప్పించును?


Q ➤ 956. ప్రభువు దేనిని బాడుగకు తెచ్చుకొనెను?


Q ➤ 957. “నీవొక గొప్ప పలక తీసుకొనుము" అని ఏ ప్రవక్తతో అనెను?


Q ➤ 958. యెషయా పలకమీద ఏమివ్రాసెను?


Q ➤ 959. బైబిలు గ్రంథములోని పొడవైన పేరుమేది?


Q ➤ 960. ఏ చెట్లు నరకబడిన తరువాత వాని మొద్దులు చిగురించును?


Q ➤ 961. దండముగానున్న దేవుని కోపము ఏది?


Q ➤ 962. ఏ రాజు చేతులు అందరికంటే అధిక సంపదతో నిండెను?


Q ➤ 963. ఏ బండమీద మిద్యానీయులు చంపబడిరి?


Q ➤ 964. అస్సిరియారాజు ఎచ్చట వారి వస్తువులను నిల్వజేసిరి?


Q ➤ 965. ఏ రాజ్యములోని ప్రజలు పారిపోయిరి?


Q ➤ 966. ఎవరి మొద్దునుండి ఒక పిలకపుట్టును?


Q ➤ 967, ఎర్ర సముద్రమును యెషయా ఏమని పిలిచెను?


Q ➤ 968. రాజ్యములలోకెల్ల శ్రేష్టమైనది, కల్దీయులకు అలంకారము, గర్వకారణమైనది ఏది?


Q ➤ 969. మేఘ మండలము మీదికి ఎగసి మహోన్నతునికి సాటివాడనగుదును, అని భావించినది ఎవరు?


Q ➤ 970. ఎవరు ఆకాశము నుండి కూలినేలమీద పడెను?


Q ➤ 971. ఒక్కరాత్రిలోనే ధ్వంసమయిన రెండు మోవాబు పట్టణములు ఏవి?


Q ➤ 972 మోవాబు ప్రజలు ఏ నగరములను గూర్చి ప్రలాపించిరి?


Q ➤ 973. ఏ నదీజలములు ఎండిపోయినవి?


Q ➤ 974. ఏ నగరమువద్ద నదీ జలములు రక్తసిక్తములైనవి?


Q ➤ 975. గర్వము, అహంకార పూరితమైన దేశము ఏది?


Q ➤ 976. ఏ దేశమును వినాశనమను చీపురుతో ఊడ్చి వేయును?


Q ➤ 977. ఎవరు స్త్రీలవలె పిరికి వారగుదురు?


Q ➤ 978. దేవుడు ఎన్నుకొనిన దేశమేది?


Q ➤ 979. ఏ ప్రవక్త ప్రభువు ఆజ్ఞాపించినట్లు పాదరక్షలు విడిచి, దిగంబరుడుగా నడిచెను?


Q ➤ 980. ఏ ప్రవక్త ఐగుప్తు, ఇతియోపియా దేశములకు పట్టు దుర్గతికి గుర్తుగా, సూచనగా ఉన్నాడు?


Q ➤ 981. ఎక్కడి నుండి గొంతెత్తి పిలిచి, కావలివాడా, రేయి ఎప్పుడు ముగియును? అని అడిగెను?


Q ➤ 982. ఒక్క సంవత్సరములో పే దేని వైభవము అంతమగునని ప్రభువు చెప్పెను?


Q ➤ 983. రాజగృహ నిర్వాహకుడు, రాజ ప్రాసాదాధ్యక్షుడు అయిన ఎవరిని యెషయా గద్దించెను?


Q ➤ 984. ఏ ప్రవక్త ఎవరితో ప్రభువు నిన్ను మూటకట్టి గట్టిగా నొక్కిపట్టి, బంతివలె సువిశాల దేశములోనికి విసరివేయును అని చెప్పెను?


Q ➤ 985. యెరూషలేము పౌరులకు, యూదా నివాసులకు తండ్రివంటివాడు ఎవరు?


Q ➤ 986. ఏ నగరము డెబ్బది ఏండ్లపాటు విస్మరింపబడును?


Q ➤ 987. ఏది తాగినవానివలె అటునిటు తూలును?


Q ➤ 988. చువ్వలతో బాదుచు నూర్చునది ఏది?


Q ➤ 989. “రాజునీతితో పరిపాలించునని ఎవరు ప్రవచించిరి?


Q ➤ 990. ఏ పక్షిగూళ్ళు కట్టి, గుడ్లు పెట్టి,పిల్లలను చేసి పోషించి సంరక్షించుకొనును?


Q ➤ 991. ఏ గ్రంథములో ప్రతి ప్రాణి తన జంట ప్రాణితో కూడియుండును?


Q ➤ 992 ఏ జంతువులు నివసించుచోట తుంగలును,జమ్ములును ఎదుగును?


Q ➤ 993 ఎవరు గోడవైపు ముఖము పెట్టి ప్రార్థించుచు మిక్కిలి విలపించెను?


Q ➤ 994.జబ్బునుండి స్వస్థత పొందిన తరువాత ఏ రాజు స్తుతి గీతము రచించెను?


Q ➤ 995. ప్రభూ! నీవు నా దుఃఖమును, సంతోషముగా మార్చుదువు! అని ఎవరు చెప్పిరి?


Q ➤ 996. హిజ్కియా ప్రణముపై ఏమి పూసిరి?


Q ➤ 997 ప్రణముపై అత్తిపండ్ల గుజ్జు పూయమని ఎవరు చెప్పిరి?


Q ➤ 998. హిజ్కియా రోగియై బాగుపడెనని తెలిసి ఎవరు జాబును కానుకలను పంపెను?


Q ➤ 999. "నిజముగా ప్రజలు గడ్డివంటివారు" ఏ ప్రవక్త ప్రవచించెను?


Q ➤ 1000. ఎవరు నూతన బలము పొందుదురు?


Q ➤ 1001. ఏ పక్షి బలము పొంది రెక్కలు చాపి పైకెగురును?


Q ➤ 1002 “దేవుని స్నేహితుడు" అని అబ్రహామును గురించి ఏ ప్రవక్త పిలిచేవాడు?


Q ➤ 1003 దేవుడు ఏ కాడను త్రుంచివేయడు?


Q ➤ 1004. ద్వీపములు దేనికొరకు ఎదురుచూచును?


Q ➤ 1005. ఇశ్రాయేలీయులకు మరియొక పేరేమి?


Q ➤ 1006. దేవుడు తప్పిదములను ఎలా ఎగురగొట్టును?


Q ➤ 1007. దేవుడు ఎవరిని గురించి, నీవు నేను నియమించిన కాపరివి, అని చెప్పెను?


Q ➤ 1008. దేవునిచేత అభిషేకించబడిన పారశీక రాజు ఎవరు?


Q ➤ 1009. జాతులను జయించుటకు, రాజుల అధికారమును అడ్డగించుటకు, దేవుడు ఎవరిని నియమించెను?


Q ➤ 1010. దేవుడు యిస్రాయేలుకు తోడ్పడు నిమిత్తము ఎవరిని పేరు పెట్టి పిలిచెను?


Q ➤ 1011 ఆకాశము విజయమును వర్షించినపుడు, భూమి దేనిని మొలకెత్తించును?


Q ➤ 1012 దీర్ఘ కాయులని పిలువబడినవారు ఎవరు?


Q ➤ 1013 దేవుడు ఇశ్రాయేలును ఏ కుంపటిలో వేసి పరీక్షించెను?


Q ➤ 1014. ఎలాంటి పాత్రను దేవుడు ఇశ్రాయేలీయులనుండి దూరము చేసెను?


Q ➤ 1015. పర్వతముల మీదుగా నడచివచ్చు ఎవరి పాదములు మనోహరమైనవి?


Q ➤ 1016. దైవ చిత్తమువలన ఎవరు ఎండిన నేలలో వేరుపాతుకొని లేతమొక్కవలె పెరిగెను?


Q ➤ 1017. పరిత్యక్తయైన భార్యకు దేవుడిచ్చు ఆశ్చర్యకర వాగ్దానమేమిటి?


Q ➤ 1018. ఏ నిబంధన శాశ్వతముగా నిలుచును?


Q ➤ 1019. ఎవరిని దొరుకునపుడే సమీపించి, చేరువలోనున్నపుడే ప్రార్థించాలి?


Q ➤ 1020.“నా తలంపులు మీ తలంపులవంటివికావు మీ త్రోవలు నాత్రోవలవంటివికావు” ఎవరు అన్నారీమాటలు?


Q ➤ 1021 ఏది నిష్ఫలముగ దేవుని వద్దకు తిరిగిరాక, ఆయన సంకల్పమును నెరవేర్చును?


Q ➤ 1022 నేటికంటె రేపు ఇంకా మెరుగుగానుండును, అని ఎవరు పలుకుదురు?


Q ➤ 1023 వినయము కలిగి నలిగినవారు, పశ్చాత్తాప మనస్కులు అయినవారికి దేవుడు ఏమి ఇచ్చును?


Q ➤ 1024 ఎపుడును శాంతిగా ఉండనిది ఏది?


Q ➤ 1025 ఎవరు సంక్షోభము చెందిన సముద్రము వంటివారు?


Q ➤ 1026. ఎవరు ఉధృతిగా పొరునదివలె విజయము చేయును?


Q ➤ 1027 దేవుని ప్రజలకు, గూళ్ళకు చేరు గువ్వలవలె ఎగురుచు వచ్చునవి ఏవి?


Q ➤ 1028 ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఎవరికి పేరిడుదురు?


Q ➤ 1029 దేవుడు యెరూషలేమునకు ఏ వస్త్రములను తొడిగించెను?


Q ➤ 1030. ఎల్ల జాతుల ఎదుట దేవుడు తన ప్రజలకు ఏమి మొలిపించును?


Q ➤ 1032. ధర్మమును ఆచరించనివారి క్రియలు ఎలాంటివి?


Q ➤ 1033. పశువులు విశ్రాంతి తీసుకొను లోయయేది?


Q ➤ 1034 దేవుని సింహాసనమేది?


Q ➤ 1035 నూరేండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడునది ఎవరికి?


Q ➤ 1036. ప్రభువుకు ఎదురు తిరిగినవారి శవములను తినివేయు పురుగులు ఎన్నటికి చావవు, వానిని కాల్చు నిప్పు ఎన్నటికి చల్లారదు, అని ఎవరు చెప్పిరి?