Q ➤ 668. ఏ రాజు సమరియాలోని తన మేడపై వసారనుండి క్రిందపడి గాయపడెను?
Q ➤ 669. ఏ ప్రవక్త మింటినుండి నిప్పు దిగివచ్చి ఇద్దరు సైన్యాధిపతులను, వారి నూరుమంది బంటులను కాల్చివేయునట్లు చేసెను?
Q ➤ 670. ఏ ప్రవక్త సుడిగాలిలో స్వర్గమునకు కొనిపోబడెను?
Q ➤ 671. ఏలియా ఎచ్చట నుండి ఎలీషాతో కలసి ప్రయాణమును ప్రారంభించెను?
Q ➤ 672. ఏ ప్రవక్త ఏలియాను తనకుగల శక్తిలో రెండు వంతులు యివ్వమని అడిగెను?
Q ➤ 673. సజీవునిగా స్వర్గమునకు తీసుకుపోబడిన రెండవ వ్యక్తి ఎవరు?
Q ➤ 674. ఏలియా దుప్పటితో యోర్ధాన్ నదిని రెండు పాయలుగా చేసినదెవరు?
Q ➤ 675. సుందరమైన నగరము ఏది?
Q ➤ 676. ఏ ప్రవక్త ఉప్పు నీటిని త్రాగుటకు ఉపయోగపడే మంచినీరుగా మార్చెను?
Q ➤ 677. ఏ ప్రవక్తను చిన్న పిల్లలు “బట్టతలకాయా" అని ఎగతాళి చేసిరి?
Q ➤ 678. ఎలీషాను అపహాస్యం చేసినందుకు 42 మంది పిల్లలను ముక్కలు ముక్కలుగా చీల్చివేసినవి ఏవి?
Q ➤ 679. మోవాబురాజు మేషా లక్ష గొట్టె పిల్లలను, లక్షగొట్టెల ఉన్నిని ఏ ఇశ్రాయేలు రాజునకు పన్నుగా యిచ్చెను?
Q ➤ 680. ఏలీయాకు పరిచారకునిగా ఉన్న ప్రవక్త ఎవరు?
Q ➤ 681. ఏ ప్రవక్త సంగీతము వింటూ దైవశక్తి పొంది ప్రవచించెను?
Q ➤ 682. ఏదోము వైపు నుండి నీరు పొరలివచ్చి ఆ ప్రదేశమునంతటిని క్రమ్మివేయునట్లు చేసిన ప్రవక్త యెవరు?
Q ➤ 683. యుద్ధములో విజయము పొందుటకు ఏరాజు తన జేష్ట కుమారుని దహనబలిగా అర్పించెను?
Q ➤ 684. ఎవరు వితంతు స్త్రీ యింటిని ఓలీవు నూనెతో ఆశీర్వదించెను?
Q ➤ 685. ఎలీషా కొరకు తమ ఇంటి మీద ఒక చిన్న గదిని కట్టించినదెవరు?
Q ➤ 686. ఎలీషా సేవకుడెవరు?
Q ➤ 687. ప్రవక్తలు ఎవరిని చూచి "అయ్యా! ఈ పులుసుకు విషమెక్కినది” అని అరచిరి?
Q ➤ 688. సిరియారాజు సైన్యాధిపతి యెవరు?
Q ➤ 689. ఏలీషా నామానును ఏ నదిలో స్నానము చేయమనెను?
Q ➤ 690. దమస్కునందు మేలైన నదులు ఏవి?
Q ➤ 691. సిరియా రాజు దృష్టికి ఘనుడును, దయ పొందినవాడెవరు?
Q ➤ 692. రెండు కంచర గాడిదలు మోయు పాటిమన్ను నీదాసుడైన నాకు యిప్పించుము అని ఎవరు ప్రాధేయపడిరి?
Q ➤ 693. నామాను కుష్టురోగము ఎవరికి వచ్చెను?
Q ➤ 694. కలపను నరికి తెచ్చుటకు ప్రవక్త శిష్యులు ఎచ్చటకు వెళ్ళిరి?
Q ➤ 695, ఏ ప్రవక్త ఒక కొమ్మను నీటిలో పడవేసి, నీటిలోనుండి గొడ్డలిని బయటికి తీసెను?
Q ➤ 696. సిరియా రాజు ఎలీషాను వెదకిపట్టుకొనుటకు తన సైన్యమును ఎచటికి పంపెను?
Q ➤ 697. ఓ దేవా! అతని కనులు తెరిపించి చూచులాగున చేయుమని దేవుని ఎవరు ప్రార్థించిరి?
Q ➤ 698. ఎలీషా ప్రార్థించగా ఎవరు దృష్టిని కోల్పోయిరి?
Q ➤ 699. నేడు పట్టణమున విన్పింపదగిన శుభ సందేశము ఐనను, మనము నోరుకదపుటలేదు, అని ఎవరు తమలోతాము మధనపడిరి?
Q ➤ 700. ఎలీషా ఎవనిని చూచి కన్నీళ్ళు రాల్చెను?
Q ➤ 701. ఒకే సమయములో ఏ తండ్రి, కుమారుడు యూదా రాజ్యములో రాజులుగా పాలించిరి?
Q ➤ 702. ఎవరు తన రధముమీద కూలి చనిపోయెను?
Q ➤ 703. ఏ రాజు యెహోరాము చావును చూచి భయపడి బేతగ్గాను మార్గము పట్టి పారిపోయెను?
Q ➤ 704 ఏ రాణి తన హత్యకు ముందు కంటికి కాటుక పెట్టుకొని, కురులు చక్కదిద్దుకొనెను?
Q ➤ 705. ఏ రాణి శరీర అవశేషములు పొలమున పెంటవలే నుండెను?
Q ➤ 706. ఏ రాజు బాలు దేవళమును నాశనముచేసి దానిని మరుగు దొడ్డిగా చేసెను?
Q ➤ 707. ఏ స్త్రీ తన వస్త్రములను చింపుకొని రాజ ద్రోహము ద్రోహము అని కేకలు వేసెను?
Q ➤ 708. ఏడు సంవత్సరముల వయస్సులో యూదామండలమునకు ఎవరు రాజైరి?
Q ➤ 709. యూదా రాజ్యమును పాలించిన ఏకైక స్త్రీ యెవరు?
Q ➤ 710. ఏ రాజు మిల్లో కట్టిన తావున హత్య చేయబడెను?
Q ➤ 711. ఏ రాజు ప్రభుని అనుగ్రహమును కోరెను?
Q ➤ 712. ఏ ప్రవక్త మరణకరమైన తీవ్ర వ్యాధికి గురియై మరణించెను?
Q ➤ 713. ఏ రాజు మరణ పీడుతుడైన ఎలీషాను చూచి కన్నీరు కార్చెను?
Q ➤ 714. ఏ రాజు ఎలీషా మరణకరమైన వ్యాధితో మంచముపట్టియుండగా చూచుటకు వచ్చెను?
Q ➤ 715. “ఓ నా తండ్రీ! ఇశ్రాయేలు వారికి రధమును రౌతులును నీవే” అని ఎవరు ఎవరితో అనిరి?
Q ➤ 716. ప్రవక్త కిటికి గుండా బాణము విడువమనగా ఏ రాజు విడిచెను?
Q ➤ 717 బాణమును పట్టుకొని నేలకు కొట్టినదెవరు?
Q ➤ 718. ప్రేతము ఎవరి అస్థికలకు తగలగానే జీవముతో లేచి నిలుచుండెను?
Q ➤ 719. యెరూషలేము ప్రాకారములను పడగొట్టిన ఇశ్రాయేలు రాజు ఎవరు?
Q ➤ 720. యూదారాజైన అమస్యాను ఎచ్చట వధించెను?
Q ➤ 721. ప్రవక్తయైన యోనా ఏ రాజు కాలమున జీవించెను?
Q ➤ 722. యోనా ప్రవక్త జన్మస్థలము ఏది?
Q ➤ 723. ఏ రాజును యావే మొత్తినందున మరణ పర్యంతము వరకు కుష్టురోగముతో జీవించెను?
Q ➤ 724. ఎవరు గర్భిణుల గర్భములను చీల్చివేసెను?
Q ➤ 725. ఏ రాజు గొప్పవారినుండి ఏబదేసి తులముల వెండి నాణెములు వసూలు చేసెను?
Q ➤ 726. తన సొంత కుమారుని విగ్రహములకు బలిగా అర్పించిన యూదా రాజు ఎవరు?
Q ➤ 727, అస్సిరియా రాజు షల్మనే సెరుకు కప్పము కట్టుటకు అంగీకరించిన యిస్రాయేలు రాజు ఎవరు?
Q ➤ 728. ప్రభువు యిస్రాయేలీయులను ఎవరి నుండి వేరు చేసెను?
Q ➤ 729. ప్రభువును పూజింపనందుకు, ప్రభువు ఎవరిమీదికి సింహములను పంపగా అవి కొందరిని చంపెను?
Q ➤ 730. మోషే చేయించిన కంచు సర్పము పేరేమి?
Q ➤ 731. మోషే చేయించిన కంచు సర్పమును చిన్నాభిన్నములుగా చేసినదెవరు?
Q ➤ 732. తన బట్టలు చింపుకొని, గొనెపట్టకట్టుకొని దేవుని మందిరములోనికి వెళ్ళినరాజు ఎవరు?
Q ➤ 733. హిజ్కియా కాలములో నివసించిన ప్రవక్త ఎవరు?
Q ➤ 734. “ఈ దినము శ్రమయు, శిక్షయు దూషణముగల దినము" అని పలికినదెవరు?
Q ➤ 735. మందిరములో ప్రార్థన చేయుచుండగా చంపబడినరాజు ఎవరు?
Q ➤ 736, ఏ రాజు తన కుమారులచే చంపబడెను?
Q ➤ 737. ఏరాజుకు 15 సంవత్సరముల ఆయుష్షును దేవుడు పొడిగించెను?
Q ➤ 738. ఎవరి మెట్లపై సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు పోయెను?
Q ➤ 739. చెరువును, సొరంగమును త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీరు తెప్పించినదెవరు?
Q ➤ 740. ఇశ్రాయేలీయులను 55 ఏండ్లు పరిపాలించిన రాజు ఎవరు?
Q ➤ 741. ఏ రాజు అన్యదేవతలందరిని పూజించెను?
Q ➤ 742. ఇశ్రాయేలీయులను చెడు మార్గమున నడిపించినదెవరు?
Q ➤ 743. ఏ రాజును అతని సేవకులు కుట్రచేసి చంపిరి?
Q ➤ 744. రాజు ఎదుట ధర్మశాస్త్రపు గ్రంథమును చదివినదెవరు?
Q ➤ 745. ఏ రాజు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను దేవుని అంగీకరించి ఆరాధించెను?
Q ➤ 746. ఏలియా కిమ్ కు ఫరోరాజు పెట్టిన క్రొత్త పేరేమి?
Q ➤ 747. ఫరో ఆజ్ఞ ప్రకారము ప్రజలవద్ద నుండి వెండి బంగారములను పన్నుల రూపమున వసూలు చేసినదెవరు?
Q ➤ 748. ఏ రాజు కళ్ళెదుట అతని కుమారులు చంపబడిరి?
Q ➤ 749. ఏ రాజు కనుగ్రుడ్లు బాబిలోనియన్ రాజు సమక్షమున ఊడదీయించబడెను?
Q ➤ 750. దేవుని మందిరమును, యెరుషలేము పట్టణములోని ప్రముఖల ఇండ్లను తగుల బెట్టించినదెవరు?
Q ➤ 751. ఏ రాజు తన మరణ పర్యంతము వరకు బాబిలోనియన్ రాజు భోజనపుబల్లపై భుజించెను?