ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 20

1. ఆపద్దినమున ప్రభువు నీకు ప్రత్యుత్తరమిచ్చును గాక! యాకోబు దేవుడు నిన్ను కాపాడును గాక!
2. ఆయన తన దేవాలయము నుండి నీకు సహాయము చేయును గాక! సియోను కొండ మీది నుండి నిన్ను ఆదుకొనును గాక!
3. ఆయన నీ కానుకలను గుర్తించుకొని, నీ దహన బలుల వలన ప్రీతి చెందును గాక!
4. ఆయన నీ కోరికలు తీర్చి, నీ యత్నములనెల్ల సఫలము చేయును గాక !
5. నీ విజయమును గాంచి మేము హర్షధ్వానము చేయుదుము గాక! మన దేవుని కీర్తించుచు జెండాలు ఎగురవేయుదుము గాక! ప్రభువు నీ మనవులనెల్ల దయచేయును గాక !
6. ప్రభువు తన అభిషిక్తునికి విజయమును ఒసగునని ఇప్పుడు నాకు తెలియును. అతడు పవిత్రమైన స్వర్ణ పదము నుండి రాజునకు ప్రత్యుత్తరమిచ్చును. తన బలముతో అతనికి మహావిజయములు ప్రసాదించును.
7. కొందరు రథములను నమ్మదురు. మరికొందరు గుఱ్ఱములను నమ్మదురు. కాని మేము మాత్రము ప్రభువైన దేవుని నమ్ముదుము.
8. వారు కాలుజారి క్రిందబడుదురు. కాని మేము పైకిలేచి దృఢముగా నిలుము.
9. ప్రభూ! నీ రాజునకు విజయము ప్రసాదింపుము. మేము నీకు మొర పెట్టు చున్నాము గాన నీవు మాకు ప్రత్యుత్తర మిమ్ము.