Q ➤ 400. సమూవేలు అనగా అర్థము ఏమిటి?
Q ➤ 401. ఎల్కానా భార్యలిద్దరు ఎవరు?
Q ➤ 402. యావే దేవుని ఆరాధించుటకు ఎల్కానా ఏ నగరమునకు వెళ్ళుచుండెడివాడు?
Q ➤ 403. ఎవరు బలి అర్పించినపుడు తన భార్యకు, పిల్లలకు బాగములు ఇచ్చెడివాడు?
Q ➤ 404. ఎవరు హృదయవేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభుని ప్రార్ధించెను?
Q ➤ 405. నేను నీకు పదిమంది కొమారుల పెట్టుకాదా? అని ఎవరు ఎవరితో అనెను?
Q ➤ 406. అన్నా కన్నీటి ప్రార్ధనకు దేవుడిచ్చిన కొడుకు ఎవరు?
Q ➤ 407. ఎవరు పెరిగి పెద్దవాడై దేవుని దయకు, ప్రజల మన్ననకు పాత్రుడయ్యెను?
Q ➤ 408. ఎవరు దేవుని కంటె తన కుమారులను అధికముగా ప్రేమించెను?
Q ➤ 409. ఏ యాజకుడు కుర్చీమీదినుండి వెనుకకు వెల్లకిలపడి మెడవిరిగి చనిపోయెను?
Q ➤ 410. ఏ పుర ప్రజలకేకలు, అంగలార్పులు మిన్నుముట్టెను?
Q ➤ 411. ఫిలిస్తీయులు ప్రభు మందసమును ఏ దేవాలయమున నుంచిరి?
Q ➤ 412. ఎవరు మందసములోనికి చూడగా దేవుడు వారిలో డెబ్బది మందిని చంపివేసెను?
Q ➤ 413. ప్రభు మందసమును కొండపైనున్న ఎవరిఇంట జేర్చిరి?
Q ➤ 414. ఎవరిని అభిషేకించి దైవ మందసమును కాపాడుటకు నియమించిరి?
Q ➤ 415. సమూవేలు మిస్ఫాకు, షేనుకు మధ్యపాతినరాతికి ఏమని పేరు పెట్టెను?
Q ➤ 416. ఎవరు బ్రతకినంతకాలము యిస్రాయేలీయులకు తీర్పు తీర్చుచునే యుండెను?
Q ➤ 417. సమూవేలు ఇల్లు ఎక్కడ వున్నది?
Q ➤ 418. ఏ తండ్రి మరియు కుమారులు యిస్రాయేలీయులకు తీర్పులను చేసెను?
Q ➤ 419. యిస్రాయేలీయులకు చివరి న్యాయాధిపతి ఎవరు?
Q ➤ 420. ఏ న్యాయాధిపతులు కాసులకు దాసులై లంచము పుచ్చుకొని ధర్మము చెరచిరి?
Q ➤ 421. సౌలు ఏ గోత్రమువాడు?
Q ➤ 422. సౌలు ఎవరి కుమారుడు?
Q ➤ 423. యిస్రాయేలీయులలో అందమైనవాడు, మరియు ఇతరులు అతని భుజములవరకైనను రానివాడు ఎవరు?
Q ➤ 424. యిస్రాయేలీయుల గోత్రములన్నిటిలో అల్పమైన గోత్రమేది?
Q ➤ 425. యిస్రాయేలీయుల మొదటిరాజు ఎవరు?
Q ➤ 426. నీవు మాత్రము ఒక్క క్షణము నా యొద్ద నిలువుము. యావే ఆజ్ఞను నీకు తెలియజేసెదను అని ఎవరు ఎవరితో అనిరి?
Q ➤ 427. ఏ యాజకుడు సౌలును రాజుగా అభిషేకించెను?
Q ➤ 428. సమూవేలు సౌలును రాజుగా ఎక్కడ అభిషేకించెను?
Q ➤ 429. “నేను మీకుడికన్నులు పెరికి వేసెదను” అని యిస్రాయేలీయులతో అన్నది ఎవరు?
Q ➤ 430. ఎవరు కాడియెడ్లను కండ తుండెములుగా ఖండించి, ఆ ముక్కలను యిస్రాయేలుదేశము, నాలుగు మూలలకు పంపించెను?
Q ➤ 431. ఎవరు ప్రార్థింపగా ప్రభువు ఉరుములతో వానకురిపించెను?
Q ➤ 432. సౌలు కుమారుడు ఎవరు?
Q ➤ 433. సౌలు సమూవేలును విధేయింపక తానే దహనబలిని ఎక్కడ అర్పించెను?
Q ➤ 434. ఏ రాజు మిశ్రానులో దానిమ్మచెట్టు క్రింద విడిది చేసెను?
Q ➤ 435. కొంచెము తేనెనుగైకొని ఆరగించినందున ఎవరికి బడలికపోయి సత్తువకలిగెను?
Q ➤ 436. యిస్రాయేలీయులు ఏ రాజకుమారుని చావునుండి విడిపించిరి?
Q ➤ 437. సౌలు సైన్యాధిపతి ఎవరు?
Q ➤ 438. ఏ యాజకుడు రాత్రియంత ప్రభువుకు మొరపెట్టెను?
Q ➤ 439. ఏ పాపము సోదెచెప్పించుకొనుటవంటిది?
Q ➤ 440. యావే ప్రభువు ఎవరిని రాజుగా చేసినందుకు విచారించెను?
Q ➤ 441. దావీదు తండ్రి ఎవరు?
Q ➤ 442. దావీదు పేరుకు అర్థము ఏమిటి?
Q ➤ 443. ఎవరి ఆకృతి సుందరముగావుండి, కండ్లు మిలమిల మొరయుచుండెను?
Q ➤ 444. ఏ రాజు దుష్ట ఆత్మ పట్టి బాధింపబడెను?
Q ➤ 445. దుష్ట ఆత్మ సౌలును సోకినపుడెల్ల ఎవరు సితారపుచ్చుకొని పాటవాయించెడివాడు?
Q ➤ 446. దావీదు గొల్యాతును ఎక్కడ సంహరించెను?
Q ➤ 447. గొల్యాతు జన్మస్థలమేది?
Q ➤ 448. రాజు అయిన గొర్రెల కాపరి ఎవరు?
Q ➤ 449. యుద్ధభూమిలో దావీదుపై మండిపడిన పెద్దన్న పేరేమిటి?
Q ➤ 450. "నేను కుక్కననుకొంటివా” అని ఎవరు అనెను?
Q ➤ 451. యోనాతాను ఎవరిని తన ప్రాణమువలె ప్రేమించెను?
Q ➤ 452. దావీదును ప్రేమించిన సౌలు చిన్న కూతురు పేరు ఏమిటి?
Q ➤ 453. ఎచట సౌలు ప్రవచనములు పలుకుచుండెను?
Q ➤ 454. ఏ రాజు బట్టలు తొలగించుకొని పగలు రాత్రి ప్రవచనములు చెప్పెను?
Q ➤ 455. “నాకు చావుకు ఒక్క అడుగు ఎడము మాత్రమున్నది" అని ఒట్టు పెట్టుకొని పలికినది ఎవరు?
Q ➤ 456. దావీదు ప్రాణ స్నేహితుడు ఎవరు?
Q ➤ 457. ఎక్కడ దావీదు మరియు యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి?
Q ➤ 458. నోబు నగరమున నివసించు యాజకుని పేరేమి?
Q ➤ 459. యాజకులకు సంబంధించిన దేవుని సాన్నిధ్యపు రొట్టెలను తినినరాజు ఎవరు?
Q ➤ 460. ఎదోమీయుడైన సౌలు సేవకుని పేరేమి?
Q ➤ 461. ఎ రాజు ఎదుట దావీదు పిచ్చివానివలె నటించెను?
Q ➤ 462. పరపీడకు లొంగినవారు, రుణమువలన మ్రగ్గువారు, అన్యులవలన అసంతృప్తి చెందిన వారి నాయకుడు ఎవరు?
Q ➤ 463. ఏ రాజు నోబు నగరమునకు చెందిన యావే యాజకులను వధింపమని ఆజ్ఞ ఇచ్చెను?
Q ➤ 464. యాజక నగరమని ఏ నగరమును పిలిచెదరు?
Q ➤ 465. ఎడారులలో కొండ చరియలలో వసించిన రాజు ఎవరు?
Q ➤ 466. అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు, అని ఎవరిని గురించి దావీదు అనెను?
Q ➤ 467. తెలివితేటలు మరియు అందగత్తె అయిన స్త్రీ ఎవరు?
Q ➤ 468. పేరుకు తగ్గట్టు మొరటు తనము కలిగిన పనికిమాలిన వాడెవడు?
Q ➤ 469. ఆకీషురాజు దావీదు నివసించుటకు యిచ్చిన పట్టణమేది?
Q ➤ 470. ఏ రాజు దావీదు తనకు జీవితాంతము సామంతుడుగనే ఉండిపోవును, అని అనుకొనెను?
Q ➤ 471. ఏ కొండమీద ఫిలిస్తీయులు యిస్రాయేలీయులను మట్టు పెట్టిరి?
Q ➤ 472. ఏ రాజు, ఆత్మహత్య చేసికొనెను?
Q ➤ 473. ఎక్కడ సౌలు ముగ్గురు కుమారులతో చచ్చిపడియుండెను?
Q ➤ 474. ఏ ప్రాకారమునకు సౌలు కళేబరమును వ్రేలాడగట్టిరి?
Q ➤ 475. ఎవరు సౌలు మరియు అతని కుమారుల చావునకు ఏడునాళ్ళు ఉపవాసముండిరి?