Q ➤ 1710. నీనెవె పట్టణమును రాజధానిగా చేసికొని అస్సిరియా రాజ్యమును పరిపాలించినది ఎవరు?
Q ➤ 1711. ఎక్బటానా నగరమును రాజధానిగా ఎంచుకొని మాదియా దేశమును ఏలినరాజు ఎవరు?
Q ➤ 1712. నెబుకద్నెసరు రాజు సర్వసైన్యాధిపతి ఎవరు?
Q ➤ 1713. సకల జాతులు నెబుకద్నెసరునే దేవునిగా అంగీకరించి, పూజింపచేయవలెనని ఎవరు ఆజ్ఞలు పొందియుండెను?
Q ➤ 1714. ఎవరు తలమీద బూడిదచల్లుకొని, ప్రభువునెదుట చేతులు ఎత్తి ప్రార్థించిరి?
Q ➤ 1715. ఏ ప్రజలు కొలుచుదేవుడు పాపమును ఎంత మాత్రము సహింపనివాడు?
Q ➤ 1716.యిప్రాయేలీయులలో అడపొడ కానరాకుండ తుడిచివేయుట ప్రపంచాధినేతయైన నెబుకద్నెసరు ఆజ్ఞ అని ఎవరు అనిరి?
Q ➤ 1717. అకియోరును బెతూలియాకు కొనిపోయి, యిస్రాయేలీయులకు అప్పగించిరండని ఆజ్ఞాపించినది ఎవరు?
Q ➤ 1718 ప్రభువు మనలను పూర్తిగా చేయివిడుచువాడు కాడు, అని ఎవరు చెప్పెను?
Q ➤ 1719. ఎండ దెబ్బ తగిలి, జబ్బుతో మంచము పట్టి బెతూలియా నగరమున తన యింటనే ప్రాణములు విడిచినది ఎవరు?
Q ➤ 720. ఎవరును ఎపుడును వ్రేలెత్తి చూపనంత నిష్టగా జీవించిన అందగత్తె ఎవరు?
Q ➤ 1721 దేవునికి షరతులు పెట్టుట మీపనికాదు, బుజ్జగించుటకుగాని,బెదిరించుటకుగాని అతడు నరుడా యేమి? అని ఎవరు అనిరి?
Q ➤ 1722. నీవు సర్వశక్తిగల దేవుడవని, యిస్రాయేలును సంరక్షించు ఏకైకనాధుడవని,నీ ప్రజలు, సకల జాతులు గుర్తించునట్లు చేయుమని ప్రార్థించినది ఎవరు?
Q ➤ 1723 సైనికులు ఎవరి సౌందర్యమునకు పరవశులై యిస్రాయేలీయులు ఎట్టివారోయని ఆశ్చర్యపడిరి?
Q ➤ 1724. హోలో ఫెర్నెసు ఎవరితో ధైర్యము వహింపుము, నన్ను చూచి భయపడవలదు అనెను?
Q ➤ 1725. హోలో ఫెర్నెసు, అతని సేవకులు ఎవరి పలుకులను మెచ్చుకొనిరి?
Q ➤ 1726 నేనీ భోజనము ముగింపక పూర్వమే, మా దేవుడు నా ద్వారా తన కార్యమును ముగించుకొనునని చెప్పినది ఎవరు?
Q ➤ యూదితును చూచి ఆనందము పట్టజాలక, ఎవరు తన జీవితమున ఏనాడు త్రాగనంత ద్రాక్షసారాయమును త్రాగెను?
Q ➤ 1728. యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! నాకు బలము దయచేయుము అని ప్రార్ధించి,హోలో ఫెర్నెసు గొంతును నరికినది ఎవరు?
Q ➤ 1729. హోలో ఫెర్నెసు ఎవరి అందమునకు భ్రమసి వినాశనము తెచ్చుకొనెను?
Q ➤ 1730 మన దేవునితోడు, హోలో ఫెర్నెసు నన్ను చెఱుపను లేదు, నాకుకళంకము ఆపాదింపను లేదు, అని చెప్పినది ఎవరు?
Q ➤ 1731 ఎవరు సున్నతి పొంది, యిస్రాయేలు సమాజమున చేరెను?
Q ➤ 1732. హోలో ఫెర్నెసు మొండెమును చూచి ఎవరుగావుకేకలు పెట్టి వెక్కి వెక్కి యేడ్చి బట్టలు చించుకొనెను?
Q ➤ 1733 ఏ నగరము చుట్టు కొండలలో శిబిరములుపన్నిన అస్సిరియా సైనికులు గగ్గోలుడి చెల్లాచెదరైపోయిరి?
Q ➤ 1734. యూదితును అభినందించుటకు యెరూషలేము నుండి బెతూలియాకు విచ్చేసినది ఎవరు?
Q ➤ 1735. ప్రభువుకు అధిక ప్రీతి కలిగించువారు ఎవరు?
Q ➤ 1736. పుణ్యాత్మురాలు యూదితు తన నూట ఐదవయేట ఏ నగరమున పరమపదించెను?
Q ➤ 1737 యిస్రాయేలీయులు యూదితు మృతికి ఎన్ని రోజులు సంతాపము తెలిపిరి?