Q ➤ 567. కంబళ్ళతో కప్పినను ఏ రాజు దేహమునకు వేడి పుట్టదయ్యెను?
Q ➤ 568. దావీదు రాజు ముసలి ప్రాయమున ఏ షూనేమున యువతి రాజు వద్దనే ఉండి అతనికి పరిచర్యలు చేసెను?
Q ➤ 569. దావీదు ముసలి ప్రాయమున అతనిపై తిరుగబడినకుమారుడు ఎవరు?
Q ➤ 570. ఎవరు రాజు కావలెనని రధమును, గుఱ్ఱములను, బంటులను నియమించుకొనెను?
Q ➤ 571. సోలోమోను తల్లి ఎవరు?
Q ➤ 572. దావీదు తరువాత అతని స్థానమున రాజు అయినది ఎవరు?
Q ➤ 573. సోలోమోనును రాజుగా అభిషేకించిన యాజకుడు ఎవరు?
Q ➤ 574. ఎవనిని దావీదుకంటె అధికునిజేయును గాక, అతని రాజ్యమును సుప్రసిద్ధము చేయునుగాక! అని కొలువుగాండ్రు దీవించిరి?
Q ➤ 575. ఎవరు సోలోమోనుకు భయపడి ప్రభు మందిరము ప్రవేశించి పీఠము కొమ్ములకు పెనవేసికొనెను?
Q ➤ 576. దైవ చిత్తము ప్రకారము సోలోమోను రాజయ్యెను అని ఏరాకుమారుడు పలికెను?
Q ➤ 577. రాజుతల్లి అయిన పూర్వపు సైనికుని భార్య ఎవరు?
Q ➤ 578. దైవ మందసమును పూర్వము కాపాడినందున మరణము నుండి విడుదల పొందిన యాజకుడు ఎవరు?
Q ➤ 579. యాజకత్వము నుండి తొలగింపబడిన యాజకుడు ఎవరు?
Q ➤ 580. ఏ రాజు అబ్యాతారును యాజకత్వమునుండి తొలగించెను?
Q ➤ 581. ఏలి వంశమునకు చెందిన చివరి యాజకుడు ఎవరు?
Q ➤ 582. ఎవరు యావే గుడారమున చావవలయునని నిర్ణయించుకొనెను?
Q ➤ 583. ఎవరి శవమును అతని యింటనే పాతిపెట్టిరి?
Q ➤ 584. ఏ సైన్యాధిపతి యెడారిలో యిల్లు నిర్మించుకొని నివసించెను?
Q ➤ 585. షిమీయెరూషలేమును వీడరాదని నిర్ణయించిన సరిహద్దు వాగు ఏది?
Q ➤ 586. షిమీని మట్టుపెట్టినది ఎవరు?
Q ➤ 587. ప్రభువు ఎక్కడ సోలోమోసుకు కలలో కన్పించి నీకేమి కావలెనో కోరుకొమ్మనెను?
Q ➤ 588. ప్రభువును, సోలోమోను ఏ వరము కోరుకొనెను?
Q ➤ 589. సొలోమోను పాలనలో లేఖకుడెవరు?
Q ➤ 590. సొలోమోను సైన్యాధిపతి ఎవరు?
Q ➤ 591. సముద్ర తీరమునందలి ఇసుక రేణువులంత విశాల హృదయముకలిగి విస్తరించిన రాజు ఎవరు?
Q ➤ 592. అందరికంటే గొప్ప జ్ఞానముగల రాజు ఎవరు?
Q ➤ 593. జ్ఞానులందరికంటె మించిన జ్ఞానముగలవాడెవ్వరు?
Q ➤ 594. సొలోమోను రాజు మందిర నిర్మాణము ఎప్పుడు ప్రారంభించెను?
Q ➤ 595. సొలోమోను నిర్మించిన దేవుని మందిరపు పరిమాణపు కొలతలేవి?
Q ➤ 596. సోలోమోను దేవదూతల బొమ్మలను ఏ కొయ్యతో చేయించెను?
Q ➤ 597. లెబనోను అరణ్యము అను పేరుగల శాల ఉండిన మేడను ఎవరు కట్టించిరి?
Q ➤ 598. ఎవరు హీరాము కంచుకుంట ఇత్తడితో పోత పోయించెను?
Q ➤ 599. ఐగుప్తు రాజు ఫరో ఏ నగరమును తగులబెట్టించెను?
Q ➤ 600. వ్యాపార నిమిత్తము ఓడలను నిర్మించిన రాజు ఎవరు?
Q ➤ 601. సొలోమానురాజు ఏ దేశము నుండి ఓడలలో బంగారమును తెప్పించెను?
Q ➤ 602. ఏ రాణి సోలోమోను ప్రసిద్ధిని గూర్చి అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షించుటకు వచ్చెను?
Q ➤ 603. సోలోమోను ఏ కొయ్యతో సంగీతకారులకు పిల్లనగ్రోవులు, వీణలు చేయించెను?
Q ➤ 604. ఎవరు దంతముతో గొప్ప సింహాసనమును చేయించెను?
Q ➤ 605. ఎవరి కాలమున యెరూషలేమున వెండి రాళ్ళవలె లభించెడిది?
Q ➤ 606. సొలోమోనురాజు ఎచ్చటి నుండి రథములను తెప్పించెను?
Q ➤ 607. ప్రభువు సోలోమోనుకు శత్రువుగా ఎవరిని పురికొల్పెను?
Q ➤ 608. ఏ యాజకుడు తాను ధరించుకొన్న క్రొత్త వస్త్రములను విప్పి పండ్రెండు తునకలుగా చేసెను?
Q ➤ 609. ముక్కలైన సొలోమోను రాజ్యములో పది ముక్కలను పొందినవారెవరు?
Q ➤ 610. సొలోమోను కుమారులలో ఎవరు అతని తరువాత రాజయ్యెను?
Q ➤ 611. నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును” అని ఎవరు చెప్పిరి?
Q ➤ 612. ఏ రాజు పెద్దల ఉపదేశమును త్రోసిపుచ్చి యువకులమాటలు వినెను?
Q ➤ 613. ఎవరు రెండు బంగారు కోడెదూడల ప్రతిమలను చేయించి ఒకటి బేతేలునందును, రెండవది దానునందును ప్రతిష్టించిరి?
Q ➤ 614. దైవభక్తినివైపు చేయిచాచి ఇతనిని పట్టుకొనుడు అని ఆజ్ఞాపించిన ఏ రాజు చేయి చాచినది చాచినట్లుగానే కొయ్యబారిపోయెను?
Q ➤ 615. ఏ రాజు భార్య మారు వేషములో బిడ్డ గురించి తెలుసుకొనుటకు ప్రవక్త అహీయా
Q ➤ 616. ఎవరి సంతతి వారందరిని కసువు వూడ్చినట్లు ఊడ్చివేసెను?
Q ➤ 617. రెహబాము తల్లి పేరేమిటి?
Q ➤ 618. ఎవరు యెరూషలేము మీదికి దండెత్తి మొదటిగా ద్రవ్యమెల్ల దోచుకొని పోయెను?
Q ➤ 619. ఏ రాజు తన పితామహి మాకా అషేరా దేవతకొక విగ్రహము నెలకొల్పగా ఆమెను రాజమాత పదవినుండి తొలగించెను
Q ➤ 620. ఏ రాజు వృద్ధాప్యములో కాలిజబ్బుతో బాధపడెను?
Q ➤ 621. ఇశ్రాయేలీయుల రాజైన నాదా ను ఎవరు చంపిరి?
Q ➤ 622. ప్రభువు ఎవరిని దీనదశ నుండి పైకి తీసికొనివచ్చి యిస్రాయేలుకు రాజుగా నియమించెను?
Q ➤ 623. ఏ రాజు తప్ప త్రాగి పడిపోయెను?
Q ➤ 624. ఏ రాజు ఇశ్రాయేలీయులను కేవలము 7 రాజులు పాలించెను?
Q ➤ 625. ఏ రాజు తన రాజ గృహమునకు నిప్పంటించి ఆ మంటలలోనే ప్రాణము కోల్పోయెను?
Q ➤ 626. పోరున తిబ్నీ ప్రాణములు కోల్పోగా ఎవరు ఇశ్రాయేలీయులకు రాజైరి?
Q ➤ 627. ఏ రాజు సమరియా కొండను కొని, దానిమీద నగరమును నిర్మించెను?
Q ➤ 628. ఆహాబు భార్య ఎవరు?
Q ➤ 629. యెహోషువ శపించిన ఎరికోపట్టణమును పునర్నిర్మించినది ఎవరు?
Q ➤ 630. శపించబడిన యెరికో పట్టణమును తిరిగి కట్టించినదెవరు?
Q ➤ 631. యెరికో పట్టణమునకు పునాదివేసినపుడు ఎవరు మరణించిరి?
Q ➤ 632. ఏలియా ప్రవక్త జన్మస్థలము ఏది?
Q ➤ 633. ఆహాబు కాలములో శక్తివంతమైన ప్రవక్త ఎవరు?
Q ➤ 634. ఏలియా అను పదమునకు అర్ధమేమి?
Q ➤ 635. నేను ఆజ్ఞాపించిననే తప్ప వానగాని, మంచుయైనను, కురియదని ప్రవచించినదెవరు?
Q ➤ 636. ఏలియా ఎచ్చట దాగెను?
Q ➤ 637. ఏ ప్రవక్తకు కాకులు భోజనము కొనివచ్చెను?
Q ➤ 638. ఎచ్చట దేవుడు ఒక విధవరాలిచేత ఏలియాకు ఆహారము అందించెను?
Q ➤ 639. చనిపోయిన విధవరాలి కుమారుని ఏ ప్రవక్త బ్రతికించెను?
Q ➤ 640. రాజుల కాలములో ఏ దేశము కరువు కాటకములతో దారుణముగానుండెను?
Q ➤ 641. ఎవరు నూరుగురు ప్రవక్తలను కొండ గుహలలో దాచివుంచి వారిని అన్న పానీయములతో పోషించెను?
Q ➤ 642. ఏరాజు పశువులకు చాలినంత గడ్డి దొరుకునో లేదో పరిశీలించెను?
Q ➤ 643. ఏ ప్రవక్త అడవిలో రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణము విడువగోరెను?
Q ➤ 644. ఏలియా బాలు ప్రవక్తలను ఎచటికి తోడ్కొని రమ్మనెను?
Q ➤ 645. ఏరాణి ఏలియాను వధింతునని వార్త పంపించెను?
Q ➤ 646. ఏప్రవక్తను దేవదూత తట్టి నిద్రనుండి లేపి లేచి భుజింపుము అని చెప్పెను?
Q ➤ 647. ఏ ప్రవక్త నలుబది రోజులు నడచి దేవుని కొండ హోరేబు చేరెను?
Q ➤ 648. ఏప్రవక్త దేవుని స్వరము వినగానే తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని నిలిచెను?
Q ➤ 649. ఏలియా తరువాత ప్రవక్తగా అభిషేకించబడినవాడెవరు?
Q ➤ 650. ఎలీషా నివాస స్థలము ఏది?
Q ➤ 651 ఎలిషా తండ్రి యెవరు?
Q ➤ 652. పండ్రెండు అరకలచేత దుక్కిదున్నించుచున్నదెవరు?
Q ➤ 653. ఏ ప్రవక్త ఎద్దుల మాంసమును వండి, దుక్కిదున్ను అనుచరులకు వడ్డించెను?
Q ➤ 654. ఆహాబు ఎవరి ద్రాక్షతోటను కూరగాయలు పండించుకొనుటకు అడిగెను?
Q ➤ 655.ఏ భర్త పేరుమీద ఉత్తరము వ్రాసి, దాని మీద రాజముద్రవేసెను?
Q ➤ 656. ఏ భార్య తన భర్త అహాబుచే దుర్మార్గపు పనులు చేయించెను?
Q ➤ 657. ఏ రాజువలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడు లేడు?
Q ➤ 658. నా తండ్రి నుండి లభించిన స్వాస్థ్యమును నేను అమ్మను అన్నదెవరు?
Q ➤ 659. అహాబు రాజు ఏ ప్రవక్తను చెరసాలలో వేయించెను?
Q ➤ 660. ఏ ప్రవక్త నిజము చెప్పినందుకు సిద్కియా చెంపలు వాయించెను?
Q ➤ 661. ఆహాబు తరువాత ఇశ్రాయేలీయులకు రాజైనదెవరు?
Q ➤ 662. ఏ ప్రవక్తకు చాలీ చాలని రొట్టె, నీళ్ళు మాత్రమే ఇయ్యబడెను?
Q ➤ 663. యుద్ధ రంగమందు ఎవరు కేకలువేసెను?
Q ➤ 664. దంతముతో గృహము నిర్మించుకొన్న రాజు ఎవరు?
Q ➤ 665. ఇశ్రాయేలు పట్టణమున ఎవరి శవమును కుక్కలు పీక్కొని తినును?
Q ➤ 666. ఏ దేశమునకు రాజు లేనందున, యూదారాజు నియమించిన రాజ ప్రతినిధి ఆ దేశమును పాలించెను?
Q ➤ 667. ఏ రాజు యొక్క ఓడలు త్రోవలో మునిగిపోయెను?