Q ➤ 476. "నీ అపరాధమునకు నీవే బాధ్యుడవు” అని ఎవరు ఎవరితో అనెను?
Q ➤ 477. సౌలు మరియు యోనాతాను మహావీరులు కూలిరని ఎక్కడ చాటవద్దని దావీదు చెప్పెను?
Q ➤ 478, ఎవరుడేగకంటె వడిగలవారు?
Q ➤ 479. ఏ తండ్రి కుమారుడు చావునగూడ విడివడలేదు?
Q ➤ 480. ఎక్కడ దావీదు యూదుల రాజుగా అభిషేకింపబడెను?
Q ➤ 481. సౌలు తదుపరి యిస్రాయేలు రాజు ఎవరు?
Q ➤ 482. ఎవరు అడవిలేడివలె చంగున పరుగిడెను?
Q ➤ 483. “అబ్బాలోము” పేరుకు అర్ధమేమి?
Q ➤ 484. దావీదు మొదటి కుమారుని పేరేమి?
Q ➤ 485. సౌలుకాక దావీదుని మామగారైన రాజు ఎవరు?
Q ➤ 486. అబ్లాలోము తల్లి ఎవరు?
Q ➤ 487. దావీదు ఫిలిస్తీయుల చర్మాగ్రములు నూరింటిని సమర్పించి, ఎవరిని ప్రధానమునకు పొందెను?
Q ➤ 488. అబ్నేరు సమాధి చెంత పెద్దగా ఏడ్చిన రాజు ఎవరు?
Q ➤ 489. "నేను రాజుగా అభిషిక్తుడనైన దుర్బలుడను" అని ఎవరనిరి?
Q ➤ 490. యోనాతాను అవిటి కుమారుడు ఎవరు?
Q ➤ 491. ఎవరు మెల్లమెల్లగా ఇల్లుసొచ్చి పరుండిన ఈ షో షెతును వధించి తలనరికిరి?
Q ➤ 492. ఎవరి తలను హెబ్రోనునందు అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి?
Q ➤ 493, దావీదురాజు ఎన్ని యేండ్లు పరిపాలించెను?
Q ➤ 494. ఏ రాజుకు కుంటి, గ్రుడ్డివారనిన ఇష్టము లేదు?
Q ➤ 495. ఎవరు దావీదునకొక ప్రాసాదము నిర్మించిరి?
Q ➤ 496. సొలోమోను పేరునకు అర్థమేమి?
Q ➤ 497. ఏటిపొంగు నది ఒడ్డులను కోసికూల్చివేసినట్లు ప్రభువు శత్రువుల మీదబడి వారి సైన్యములను కూల్చివేసెను?
Q ➤ 498. ఎక్కడ ఎడ్లబండిని గతుకులలోకి ఈడ్చుటచే మందసము జారి క్రింద పడోబోయెను?
Q ➤ 499. ఎవరు చేయిచాచి మందసమును పట్టుకొనినందుకు ప్రాణము విడిచెను?
Q ➤ 500. మందసము నగరము ప్రవేశించుచుండగా ఎవరు కిటికినుంచి చూచిరి?
Q ➤ 501. ఎవరు దావీదునుగాంచి ఏవగించుకొని చిన్నచూపు చూచెను?
Q ➤ 602 ఎవరి కుటుంబము, ఆస్తిపాస్తులు మందసము మూలముగా వృద్ధి చెందెను?
Q ➤ 603. దావీదు భార్యలలో ఎవరికి బిడ్డలు కలుగలేదు?
Q ➤ 504. ఏ రాజు, సోబారాజు హదదెసరు గుర్రముల గిట్టలు తెగగొట్టించెను?
Q ➤ 505. దావీదు కార్యదర్శి ఎవరు?
Q ➤ 506. “ఏలిక ఈ దానునికెంతటి ఆదరము చూపెను. నేనేపాటివాడను,చచ్చినకుక్కవంటివాడను కదా!" అని ఎవరు అనెను?
Q ➤ 507. ఎవరు రాజపుత్రులవలె దావీదు ఇంట భుజించెను?
Q ➤ 508. ఎవరు దావీదు రాయబారులను పట్టుకొని వారి గడ్డముల నొక చెంప పూర్తిగా గొరిగించి సిగ్గుపరచెను?
Q ➤ 509. హదదెసరు సైన్యాధిపతి ఎవరు?
Q ➤ 510. ఏ రాజు అమ్మోనీయుల మండలముపై దాడి సల్పి రబ్బాను ముట్టడించెను?
Q ➤ 511. బక్సెబ ఎవరి భార్య?
Q ➤ 512. దావీదు పాపమును బట్టి దోషి అని చెప్పినదెవరు?
Q ➤ 513. “పాడుపనికి పాల్పడినవాడు నిక్కముగా వధింపతగినవాడు" అని ఎవరు అనెను?
Q ➤ 514. ఏ రాజు తన శిశువు కొరకు పస్తులుండి ప్రార్థించెను?
Q ➤ 515. దావీదు బక్సెబాలకు కలిగిన బిడ్డ పేరేమిటి?
Q ➤ 516. సొలోమోను మరో పేరేమిటి?
Q ➤ 517. ఏ రాకుమారుడు జబ్బుపడిన వానివలె నటించెను?
Q ➤ 518. యావే ప్రేమించిన దావీదు కుమారుని పేరేమి?
Q ➤ 519. ఎవరు తన అన్న అమ్మోను ఎదుట పెనము పై రొట్టెలు కాల్చి అతని ముందుంచెను?
Q ➤ 520. ఎవరు తన చెల్లెలను బయటకు గెంటి తలుపులు మూయించెను?
Q ➤ 521. ఏ స్త్రీ తలపై దుమ్ముపోసికొని, పెద్ద పెట్టున యేడ్చెను?
Q ➤ 522. ఏ రాకుమారుడు గొట్టెల ఉన్ని కత్తిరించుటకు వెళ్ళెను?
Q ➤ 523. ఏ రాజు విందుకు వెళ్ళక, తన కుమారుని దీవించెను?
Q ➤ 524. దేవదూతకు సాటియైన తెలివితేటలు కలరాజు ఎవరు?
Q ➤ 525. యిస్రాయేలీయులలో ఏ రాకుమారుడు మెచ్చుకోదగిన అందగాడు?
Q ➤ 526. ఎవని తల వెంట్రుకలు దట్టముగా ఉండినందున కత్తిరింపు వేయించెడివాడు?
Q ➤ 527. యోవాబు పొలములోని యవ ధాన్యపంటను తగుల బెట్టించినదెవరు?
Q ➤ 528. ఏరాకుమారుడు తనను న్యాయమూర్తిగా నియమింప ప్రయత్నించెను?
Q ➤ 529. ఎవరు తన ప్రవర్తనవలన యిస్రాయేలీయుల మనస్సులను దోచుకొనెను?
Q ➤ 530. అహీతో ఫెలు ఏరాజుకు మంత్రాంగము నెరపువాడు?
Q ➤ 631. పరదేశి మరియు ప్రవాసిగానున్న గిత్తీయుడు ఎవరు?
Q ➤ 632. చావుగాని, బ్రతుకుగాని, దావీదు రాజెచ్చటుండునో, యీ దాసుడచ్చటనే యుండునని వాగ్దానము చేసినదెవరు?
Q ➤ 533. దావీదు ఎవరిని ప్రవక్త అని పిలిచెను?
Q ➤ 534. ఏ రాజు తలమీద ముసుగువేసుకొని ఏడ్చుచు వట్టి కాళ్ళతో నడచిపోయెను?
Q ➤ 635. ఎవరి ఉపదేశములను వెట్టి తలపోతలను చేయునుగాక, అని దావీదు ప్రభువును ప్రార్థించెను?
Q ➤ 536. ఎవరు అహీతో ఫెలు ఉపదేశములను వమ్ముచేసెను?
Q ➤ 537. ఎవరు బట్టలు చింపుకొని, తలమీద దుమ్ముపోసుకొని, దావీదు యావే దేవళము వద్దనున్నపుడు వచ్చెను?
Q ➤ 538. ఏ సేవకుడు దావీదును ఎడారిలో సందర్శించెను?
Q ➤ 539. ఎవరు దావీదును, అతని పరిజనమును శపించెను?
Q ➤ 540. పిల్లలను కోల్పోయిన అడవి ఎలుగుబంటివారు ఎవరు?
Q ➤ 541. పెరటిబావిలో దాగుకొనిన యిద్దరు వేగు వాండ్రు ఎవరు?
Q ➤ 542. ఎవరు ఇల్లు చక్కబెట్టి ఉరివేసికొని చనిపోయెను?
Q ➤ 543. అబాలోము యోవాబునకు బదులుగా ఎవరిని సైన్యాధిపతిని చేసెను?
Q ➤ 544. "నా మొగము చూచి ఏపడుచువానిపై చేయిచేసికొనకుడు" అని దావీదు ఆజ్ఞ ఇచ్చెను?
Q ➤ 545. ఎవరి తల సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను?
Q ➤ 546. అబ్లాలోమును బల్లెముతో పొడిచి ఎవరు చంపిరి?
Q ➤ 547. హా! కుమారా నీకు బదులు నేనే ప్రాణములు కోల్పోయిన ఎంత బాగుగానుండెడిది,అని దావీదు ఎవరిని గురించి విలపించెను?
Q ➤ 548. దావీదు వెడలిపోయిన నాటినుండి తిరిగి సురక్షితముగ వచ్చు వరకు, ఎవరు తన కాలు సేతుల సంగతి పట్టించుకోలేదు. దుస్తులు శుభ్రము చేసికోలేదు?
Q ➤ 549. ఎవరు సిరిసంపదలతో తులతూగుచు, ముసలి ప్రాయమున ఏమి ఆశించకుండ,దావీదు మహనాయీమున ఉన్నంత కాలము వెచ్చములిచ్చి పోషించెను?
Q ➤ 550. దుర్మార్గుడైన బెన్యామీను గోత్రీయుడెవరు?
Q ➤ 551. యోవాబు కత్తితో కడుపున పొడువగా ఎవరి ప్రేవులు జారి నేల పైబడి అసువులు విడిచెను?
Q ➤ 552. ఏ సైన్యాధిపతి నగర ప్రాకారమెత్తువరకు కట్టపోని ప్రాకారమును కూలద్రోయమనెను?
Q ➤ 553. ఎవరు గోనెపట్టపరచుకొని కొండమీద శవములకు కాపుండెను?
Q ➤ 554. సౌలు, యోనాతానుల అస్థికలను ఎక్కడ పూడ్చిరి?
Q ➤ 555. ఎవరు దావీదు తరపున పోరాడి ఫిలిస్తీయుని గెలిచెను?
Q ➤ 556. యిస్రాయేలీయుల సుమధుర కీర్తనాకారుడు ఎవరు?
Q ➤ 557. చేయి తిమ్మిరి పట్టి కత్తికి కరచుకొని పోవువరకు శత్రువులను విశేషముగా తునుమాడినది ఎవరు?
Q ➤ 558. పంటకోతకాలమున దావీదు ఎక్కడ దాగుకొనెను?
Q ➤ 559. ఎవరు మూడు వందలమందిని పొడిచి చంపి పేరు మోసెను?
Q ➤ 560. మంచు కురియుచుండగా పోయి గోతిలోనున్న సింగమును చావమోదినది ఎవరు?
Q ➤ 561. యిస్రాయేలీయుల జనాభా లెక్కలు తయారుచేయుడని, దావీదు ఎవరిని నియమించెను?
Q ➤ 562. అజానుబాహుడైన ఐగుప్తీయుని, అతని యీటెతోనె పొడిచి చంపినది ఎవరు?
Q ➤ 563. ప్రజలను లెక్క పెట్టిన తరువాత ఏ రాజు అంతరాత్మ అతనిని బాధించెను?
Q ➤ 564. ప్రభూ! నేను తెలివిమాలిన పనిచేసితిని, నా అపరాధము మన్నింపుము అని ఏ రాజు మనస్తాపపడెను?
Q ➤ 565. "పాపము చేసి అపరాధము కట్టుకొనినది నేను. ఈ ప్రజలు అన్నము పున్నెము ఎరుగరు? వీరిని విడిచిపెట్టి నన్ను నా కుటుంబమును శిక్షింపుము" అని ఎవరు యావే దేవునితో మనవి చేసికొనెను?