ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Wisdom of Jesus ben Sira (Sirach)

Q ➤ 1864. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథమును ఎన్ని అధ్యాయాలున్నవి?


Q ➤ 1865. నీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథమున ఎన్ని వచనములున్నవి?


Q ➤ 1856. సీరాకు గ్రంథమున వచనముల శ్రేణి (రేంజి) ఎంత?


Q ➤ 1857. విజ్ఞానమునకు ఆధారము ఎవరు?


Q ➤ 1858. భక్తులు ఎప్పటినుండి విజ్ఞానమును పొందుదురు?


Q ➤ 1859. పరిపూర్ణ విజ్ఞానము ఏది?


Q ➤ 1860. దేవునిపట్ల భయభక్తులు చూపినచో ఏది తొలగిపోవును, ఏదిమటు మాయమైపోవును?


Q ➤ 1861. ఏది కోపిష్టిని నాశనము చేయును?


Q ➤ 1862. ఎవరు ధర్మశాస్త్రమునకు బద్దులయి, దేవుని యెదుట వినయ విధేయతలను ప్రదర్శింతురు?


Q ➤ 1863. ప్రభువు ఎవరికి తన రహస్యములను ఎరిగించును?


Q ➤ వేనిని ఒప్పుకొనుటకు సిగ్గుపడకూడదు?


Q ➤ వేనివలన ఖ్యాతి, అపఖ్యాతి కూడకలుగును?


Q ➤ 1866. వేనితో పాదములను బంధించుకొనవలయును?


Q ➤ 1867. వ్యవసాయముగాని, ఇతరములైన కాయ కష్టములను ఎందుకు తప్పించుకోవలదు?


Q ➤ 1868. ఎవరితో వివాదమునకు దిగరాదు?


Q ➤ 1869. ఎవరి సలహాలను మాత్రమే అడుగవలయును?


Q ➤ 1870. దేవుడు ఎవరిని గౌరవించును?


Q ➤ 1871. విజయమునకు తొలిమెట్టు ఏది?


Q ➤ 1872 అపజయమునకు సోపానములు ఏవి?


Q ➤ 1873. పనిచేయునపుడు దేనిని ప్రదర్శింప అక్కరలేదు?


Q ➤ 1874. రెక్కలతో ఎగురు ప్రాణులలో చాలా చిన్నదేది?


Q ➤ 1875. ఉపకారము చేయుటకు నియమములు ఏ అధ్యాయములో వివరించబడినవి?


Q ➤ 1876. ఎపుడు ధనము, దారిద్ర్యము చెడ్డవికావు?


Q ➤ 1877 నరుని హృదయ భావములను ఏది చూపించును?


Q ➤ 1878. పురాతన నియమము ప్రకారము జీవకోటికి ఏది తప్పదు?


Q ➤ 1879. ఎవని విజ్ఞానము అనంతమైనది?


Q ➤ 1880. దేవుడు అపారకృపతో ప్రతి వానికి వేనికి తగినట్లు ప్రతిఫలమిచ్చును?


Q ➤ 1881. నరునికి పంచేంద్రియములతోపాటు, ఆరవ యింద్రియముగా ఒసగినది ఏది?


Q ➤ 1882. దేనితో నరుడు తాను పంచేంద్రియముల ద్వారా గ్రహించిన జ్ఞానమును అర్ధము చేసికొనును?


Q ➤ 1883. ఎవరు దేవుని స్తుతింతురు?


Q ➤ 1884. ఏ ఒక్కడే నీతిమంతుడు?


Q ➤ 1885. ఎవరు ప్రతి ప్రాణిని కరుణతో చూచును?


Q ➤ 1886. దేవుని మన్ననను పొందుటకు మొదటి మెట్టు?


Q ➤ 1887. సద్విజ్ఞాన మేది?


Q ➤ రాళ్ళు పరచిన నేలమీద జారిపడుటకంటె ఏది ఎక్కువ హానికరము?


Q ➤ 1889. ఇల్లు కట్టుకొనుటకు సొమ్ము బాకీచేయుట దేనివంటిది?


Q ➤ ఇసుక, ఉప్పు, ఇనుము కంటె ఏ బరువు ఎక్కువ?


Q ➤ 1891. ఏది విజ్ఞానము, వివేకములతో నిండియుండును?


Q ➤ 1892. దేవునికి, నరులకు ప్రీతి కలిగించు మూడు కార్యములు ఏవి?


Q ➤ 1893. అందరికంటె ఘనుడు ఎవడు?


Q ➤ 1894. స్త్రీని చూచి స్త్రీ అసూయపడినపుడు ఏమి కలుగును?


Q ➤ 1895. పాపి ఘోరమైన ఏ రెండింటికి వశుడగును?


Q ➤ 1896. ఎవరు నరుల పాపములనెల్ల గమనించును?


Q ➤ 1897. ఎవరు ఎవనిని గౌరవించుటకు మారుగా అవమానించి పంపును?


Q ➤ 1898. నరుని నాలుగు ప్రాధమిక అవసరములు ఏవి?


Q ➤ 1899. ఏ బిడ్డ కడన తండ్రికి నిరాశ కలిగించును?


Q ➤ 1900. దేనివలన దీర్ఘాయువు కలుగును?


Q ➤ 1901. ఏవి ఆయుష్షును తగ్గించును?


Q ➤ 1902. దేనివలన చాలా మంది నాశనమైరి?


Q ➤ 1903. దేనివలన బాగుగా నిద్రపట్టి వేకువనే ఉత్సాహముతో మేల్కొనవచ్చును?


Q ➤ తగిన కాలమున, తగినంతగా ద్రాక్షరసము సేవించిన ఏమి చేకూరును?


Q ➤ 1905 మితము మీరి త్రాగినచో ఏమి జరుగును?


Q ➤ 1906. ఎపుడు ఒకరితో ఒకరు మాటలాడుకోరాదు?


Q ➤ 1907. ఉరుమునకు ముందు మెరుపు చూపట్టినట్లే వినయవంతునికి ముందుగా నడచునది ఏది?


Q ➤ 1908. ధర్మ శాస్త్రమును నమ్ముట అనగా నేమి?


Q ➤ 1909. ఎవరికి ఎట్టికీడును కలుగదు?


Q ➤ 1910. ప్రభువు వివేకముతో నరుల మధ్య వ్యత్యాసము కలిగించి వారికి ఏమి ఒప్పగించెను?


Q ➤ 1911. మహోన్నతుడైన ప్రభువు కార్యములను పరిశీలించినచో, అవి ఎలా కన్పించును?


Q ➤ 1912. గాడిదకు మేత, కట్టు, బరువు అవసరమయినట్లు పనివానికి అవసరమయినవి ఏవి?


Q ➤ 1913. లేనిపోని ఆశలవలన ఎవరు మోసపోవుదురు?


Q ➤ 1914. దేవుడు ఎవరిని ఒక కంట కనిపెట్టి, తప్పక ఆదుకొని సంరక్షించును?


Q ➤ 1915. దేనిని పాటించిన చాలా బలులు అర్పించినట్లు?


Q ➤ 1916. కానుకలు, దశమ భాగము ఎలా యివ్వాలి?


Q ➤ 1917 తనకు యిచ్చినవారిని ప్రభువు ఎన్నిరెట్లు అధికముగా బహూకరించును?


Q ➤ ఎవరు ప్రతి ఒక్కరికి వానివాని తలంపులను, పనులను బట్టి ప్రతి ఫలము ఇచ్చును?


Q ➤ ప్రభు స్తుతి గానములతో మారు మ్రోగునగరము ఏది?


Q ➤ మహా అదృష్టవంతుడైన భర్త ఎవరు?


Q ➤ బురుజు మీదకూర్చుండిన ఏడుగురు పహారవారికంటే కూడ మనకు ఏది ఎక్కువ తెలుపును?


Q ➤ మన ఆలోచన ఏ నాలుగు అంశములకు జన్మస్థానము?


Q ➤ మితిమీరి తిన్నచో ఏమి వచ్చును?


Q ➤ భూమి నుండి మందులు కలిగించినది ఎవరు?


Q ➤ నరులకు వైద్య విజ్ఞానమును దయచేసినది ఎవరు?


Q ➤ మృతుల సంతాపము కొరకు వివరణ ఏ వచనములందున్నది?


Q ➤ ఎవరు పని చేయనిచో పట్టణములు నిలు నవు, నగరములలో ఎవరు వసింపజాలరు?


Q ➤ ఎవరి రోజు వారి పనియే వారి ప్రార్ధన అగును?


Q ➤ సుప్రసిద్ధుల సూక్తులను ఎవరు పదిలపరుచును?


Q ➤ వాడుక చొప్పున వేకువనే లేచి తన సృష్టికర్తయైన దేవునికి జపము చేయునది ఎవరు?


Q ➤ 1931. ప్రభుని మార్గములు తిన్నగా ఎవరికుండును?


Q ➤ 1932 సత్పురుషులకు మేలుచేసి, దుర్మార్గులకు కీడు చేయు ప్రాథమిక వస్తువులు ఏవి?


Q ➤ 1933. నరులను శిక్షించుటకు సృజింపబడినవి ఏవి?


Q ➤ 1934. ఏవి దుష్టుల పనిబట్టు కత్తులవలె సంతోషముతో ప్రభువు ఆజ్ఞ పాటించును?


Q ➤ 1935. ఇది దానికంటె నాసిది అని ఎవడును అనకూడదు! ఎందుకు?


Q ➤ 1936. జలమంత సముద్రమునకు మరలిపోవునట్లుగా నేలనుండి పుట్టినదంత తిరిగి ఎక్కడికి పోవును?


Q ➤ 1937. ఏవి అడుగంటిపోయి ధర్మశాస్త్రము మాత్రమే శాశ్వతముగ నిల్చును?


Q ➤ 1938. ఏది నానాలాభములొసగు ఉద్యానవనము వంటిది, మరియు దానిని మించిన సదాశ్రయము లేదు?


Q ➤ 1939. ఏ వచనములు ఉపమానముల గురించి తెలియపరచినవి?


Q ➤ 1940. గతించిన పిదప కూడ నిలిచియుండునది ఏది?


Q ➤ 1941. నరుని మంచి జీవితము కొన్నాళ్ళపాటు మాత్రమే కొనసాగును, కాని శాశ్వతముగా నిలుచునది ఏది?


Q ➤ 1942 సిగ్గు పడవలసిన విషయములు గురించి ఏ వచనములలో తెలుసుకోగలము?


Q ➤ 1943 సిగ్గుపడకూడని విషయముల గురించి ఏ వచనములు తెలియపరచినవి?


Q ➤ 1944. విశ్వము ఎలా పుట్టినది?


Q ➤ 1945. సృష్టి రహస్యములనెల్ల వెల్లడిచేయు శక్తిని ప్రభువు ఎవరికి దయచేసెను?


Q ➤ 1946. ప్రభువు మహిమను ఎవరు పరిపూర్ణముగా గ్రహించగలరు?


Q ➤ 1947. కలకాలము మాసములను, ఋతువులను సూచించునది ఏది?


Q ➤ 1948. ఉత్సవ దినములను నిర్ణయించునది ఏది?


Q ➤ 1949. ఆకాశమునకు శోభనొసగునది ఏది?


Q ➤ 1950. మహా సౌందర్యముతో తళతళలాడుచుండు దేనిని చూచి సృష్టికర్తను కొనియాడవలెను?


Q ➤ 1951. ఏ గాలికి నీరు ఘనీభవించును?


Q ➤ 1952. సృష్టిని సంగ్రహముగా చెప్పుట ఎట్లు?


Q ➤ 1953. ప్రభువు తన విజ్ఞానమును ఎవరికి దయచేయును?


Q ➤ 1954. ఎవరి కుటుంబములు కలకాలము నిలుచును?


Q ➤ ఎవరిని ప్రభువు స్వర్గమునకు కొనిపోయెను?


Q ➤ 1956. పరిపూర్ణ భక్తుడు ఎవరు?


Q ➤ ఎవరివలన జలప్రళయానంతరము నూతన నరజాతి ఉద్భవించినది?


Q ➤ ఎవరు బహు జాతులకు సుప్రసిద్ధుడైన పితామహుడు?


Q ➤ ఎవరి యశస్సు అనన్య సామాన్యమైనది?


Q ➤ అబ్రహాము మీదగల ఆదరముచే ప్రభువు ఎవరెవరికి కూడ దీవెనలు ఒసగెను?


Q ➤ నేలను పండ్రెండు భాగములు చేసి పండ్రెండు తెగలకు యిచ్చినది ఎవరు?


Q ➤ దేవునికి, నరులకు ప్రీతిపాత్రుడయిన భక్తుని పేరేమిటి?


Q ➤ ప్రభువు ఎవరికి ముఖాముఖి ధర్మశాస్త్రమును ఒసగెను?


Q ➤ ప్రభువు తన ప్రజలకు యాజకునిగా ఎవరిని నియమించెను?


Q ➤ యాజకుని తలపాగా మీద ఏ అక్షరములు చెక్కిన కిరీటము కలదు?


Q ➤ ఎవరు అహరోనుని పరిశుద్ధ తైలముతో అభిషేకించి యాజకునిగా ప్రతిష్టించెను?


Q ➤ యాజకులు వేనిని భుజింతురు?


Q ➤ కీర్తిని పొందినవారిలో మూడవవాడు ఎవరు?


Q ➤ ప్రభువు ఫీనెహాసుతో సమాధానపు నిబంధనముచేసికొని అతనిని దేనికి అధికారిని చేసెను?


Q ➤ 1970. ఒడంబడిక ప్రకారము తండ్రి నుండి కుమారునికి సంక్రమించెడిది ఏది?


Q ➤ 1971. అనుయాయులందరికి సంక్రమించునది ఏది?


Q ➤ 1972. మోషే తరువాత ప్రవక్త అయిన మహావీరుడు ఎవరు?


Q ➤ 1973. సూర్యుని ఆకాశమున ఆపివేసి ఒక రోజుకు రెండు రోజులంత దీర్గముగా చేసినది ఎవరు?


Q ➤ 1974. ఎవరు ప్రార్థింపగా ప్రభువు శత్రువులను వడగండ్ల వానకు గురిచేసి సర్వనాశనము చేసెను?


Q ➤ 1975. ఎడారిలో పయనించిన ఆరు లక్షలమందిలో ఏ యిరువురు నమ్మిన బంటులు మాత్రమే ప్రాణములతో బ్రతికి పాలుతేనెలు జాలువారు వాగ్దత్త భూమిని చేరుకోగలిగిరి?


Q ➤ 1976. ఎవరి సంస్మరణమువలన దీవెనలను పొందుదుము?


Q ➤ సమాధినుండి ప్రవచనము పలికి ప్రజల పాపములను తొలగించిన ప్రవక్త ఎవరు?


Q ➤ బాలుడుగా వున్నప్పుడే రాక్షసుని చంపి తన ప్రజల అవమానమును బాపినది ఎవరు?


Q ➤ దినమంతయు దేవాలయము ప్రభు నామ స్తుతితో ప్రతిధ్వనించునట్లు చేసిన రాజు ఎవరు?


Q ➤ తండ్రి సమస్తము సిద్ధముచేసి ఈయగా సురక్షితముగా శాంతియుతముగా పాలించిన రాజు ఎవరు?


Q ➤ ఎవరు ప్రభువు పేరిట శాశ్వతమైన మందిరమును నిర్మించెను.


Q ➤ ఎవని హృదయము వివేకముతో నదివలె నిండియుండెను?


Q ➤ ఎవని శరీరమును వనితలకు అప్పగించి, వారికి దాసుడై, తన కీర్తిని కళంకితమొనర్చుకొని, తన వంశజులకు కూడ మచ్చ తెచ్చెను?


Q ➤ ఏ రాజుకాలమున యిస్రాయేలీయ ప్రజల పాపములు పెచ్చు పెరిగిపోగా వారు స్వీయ దేశము నుండి బహిషృతులైరి?


Q ➤ ఏ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపి, మూడు మారులు అగ్నిని కురిపించెను?


Q ➤ ఎవరు ప్రభువు పేరు మీదుగా చచ్చిన శవమును బ్రతికించెను?


Q ➤ దేవుడు ఎవరిని నిప్పుమంటలతో కూడిన సుడిగాలిలో, నిప్పు గుఱ్ఱములు లాగెడి రధమున స్వర్గమునకు గొనిపోయెను?


Q ➤ ఏలియా సుడి గాలిలో కలసిపోగా అతని ఆత్మ ఎవరిని ఆదేశించెను?


Q ➤ చనిపోయిన పిదప కూడ ఎవరి దేహము అద్భుతము చేసెను?


Q ➤ ఎవరు నగరమును సురక్షితము చేసి నీటిని సరఫరా చేయించెను?


Q ➤ ప్రజలు చేతులెత్తి కరుణాళుడైన దేవుని ప్రార్థించగా, వారిని కాపాడుటకు ఎవరిని పంపెను?


Q ➤ ఏ మహా ప్రవక్త చూచిన దర్శనములు సత్యములు?


Q ➤ ఏ ప్రవక్త సూర్యుని వెనుకకు పంపి, హిజ్కియా రాజు ఆయుస్సును పొడిగించెను?


Q ➤ ఎవరు దీక్షతో కృషి చేసి ప్రజల బుద్ధులు మార్చి, ఘోరాచారమైన విగ్రహారాధనను రూపుమాపెను?


Q ➤ ప్రభువునకు నమ్మదగిన బంటయి, విశ్వాసము లేశమైనలేని రోజులలో భక్తిని పెంపొందించిన రాజు ఎవరు?


Q ➤ ఘోర పాపములు చేయని ముగ్గురు రాజులెవరు?


Q ➤ ప్రభువు ఎవరిని మాతృ గర్భము నుండియే ప్రవక్తగా ఎన్నుకొని, పెరికివేయుటకు, నాశనము చేయుటకు, నిర్మూలించుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకుకూడ నియమించెను?


Q ➤ దేవదూతలతో కూడిన రధము మీద నెలకొనియున్న ప్రభువు మహిమను దర్శనమున వీక్షించిన ప్రవక్త ఎవరు?


Q ➤ ప్రభువు కుడి హస్తమున నొప్పు ముద్రాంగుళీయము వంటివాడు ఎవరు?


Q ➤ ప్రభువు పవిత్ర మందిరమును పునర్నిర్మించినది ఎవరు?


Q ➤ శిధిలమైపోయిన నగర ప్రాకారములు పునర్నిర్మించినది ఎవరు?


Q ➤ ఎవరి కీర్తి ఏ నరునికి అబ్బలేదు?


Q ➤ దేవాలయమును మరమ్మత్తు చేయించి దృఢపరచిన ప్రధాన యాజకుడెవరు?


Q ➤ 2004. వేనిని పొందు పరచుటకు యెరూషలేము నివాసియైన సీరా ఎలియాసరు పుత్రుడను, యేసు నామధేయుడు ఈ గ్రంథమును లిఖించెను?


Q ➤ 2005. ఎవని ఉపదేశమును పాటించువాడు ఎట్టి సంఘటనకైన తట్టుకొని, దేవుని వెలుగులో నడచును?


Q ➤ 2006. బ్రతికియున్నంతకాలము దేనిని వెదకవలెను?


Q ➤ 2007. ఎవనిని స్తుతించుటకు ఎన్నడును సిగ్గుపడక, సకాలమునందే మీ పనిని మీరు చేసినచో, ప్రభువు తన కాలమున, ఆయన మీ బహుమానమును మీకు బహూకరించును?