ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 35

1. ప్రభూ! నన్నెదిరించు వారిని నీవు ఎదిరింపుము. నాతో పోరాడువారితో నీవు పోరాడుము.
2. నీ డాలును చేపట్టి నాకు సాయము చేయుటకు శీఘ్రమే రమ్ము.
3. నీ ఈటెను దూసి నన్ను వెన్నాడు వారిమీదికి రమ్ము. - “నేను నిన్ను రక్షింతును” అని అభయమిమ్ము.
4. నన్ను చంపజూచువారు అవమానమునకును అప్రతిష్ఠకును గురియగుదురుగాక! . నా మీద కుట్రలు పన్నువారు వెన్నిచ్చి పారిపోవుదురుగాక! సిగ్గుచెందుదురుగాక!
5. ప్రభువుదూత వారిని తరిమివేయునుగాక! వారు గాలికి ఎగిరిపోవు పొట్టువలె అగుదురుగాక! .
6. ప్రభువుదూత వారిని వెన్నాడగా, వారు చీకటిత్రోవనబడి పారిపోవుచు జారిపడుదురుగాక!
7. నేనెట్టి అపకారము చేయకున్నను ఒక వారు నాకు వలపన్నిరి. నన్ను కూలద్రోయుటకు గోతినిత్రవ్విరి.
8. కనుక తలవని తలంపుగా వారికి వినాశము దాపురించునుగాక! ఆ దుష్టులు తాము పన్నినవలలో తామే చిక్కుకొందురుగాక! తాము త్రవ్విన గోతిలో తామే కూలుదురుగాక!
9. అటుల జరిగినప్పుడు నేను ప్రభువును చూచి ఆనందింతును. అతడు నన్ను రక్షించుటనుచూచి సంతసింతును.
10. నా ఎముకలన్నియు ప్రభువుతో ఇట్లు పలుకును: “నీవంటివాడు మరొకడు లేడు. నీవు బలవంతుల బారినుండి దుర్భలుని రక్షింతువు. పీడకులనుండి బాధితుని, దీనుడైన నరుని కాపాడుదువు".
11. దుష్టులు నామీద కూటసాక్ష్యము చెప్పుచున్నారు. వారు నామీద మోపు తప్పులను నేను మాత్రము ఎరుగను.
12. నేను వారికి ఉపకారము చేయగా, వారు నాకు అపకారము చేయుచున్నారు. నేను విచారమున మునిగితిని.
13. వారు జబ్బుపడినపుడు నేను సంతాపముతో గోనె తాల్చితిని. కష్టపడి ఉపవాసముంటిని.
14. నా స్నేహితుని కొరకో, సోదరుని కొరకో ప్రార్థన చేసినట్లుగా వారి కొరకు తలవంచి ప్రార్ధన చేసితిని. నా సొంత తల్లికొరకు శోకించినట్లుగా వారి కొరకు దేహమువంచి శోకించితిని.
15. కాని ఇప్పుడు నేను ఆపదలో చిక్కుకొనగా వారు సంతసించుచున్నారు. ఆ నా చుట్టు గుమిగూడి నన్ను గేలిచేయుచున్నారు. ఈ నేను ఎరుగనివారు నా మీదపడి . నన్ను కొట్టుచున్నారు. ముందు నన్ను నిరంతరము మోదుచున్నారు.
16. నా మీద పండ్లు కొరకుచు నన్ను ఎగతాళి చేసి హింసించుచున్నారు.
17. ప్రభూ! నీవు ఇంకను ఎంతకాలము చూచుచూ ఊరకుందువు? వారి పీడనుండి నన్ను కాపాడుము.  నేను మిక్కిలి ప్రీతితో చూచుకొను నా ప్రాణమును ఈ సింహములనుండి రక్షింపుము.
18. అప్పుడు మహాభక్త సమాజమున నేను నిన్ను కొనియాడుదును. ప్రజాబాహుళ్యము ముందు నిన్ను కీర్తింతును.
19. “అసత్యవాదులైన నా శత్రువులు నా పతనమును చూచి ఆనందింపకుందురుగాక! నిష్కారణముగా నన్ను ద్వేషించు నా విరోధులు నా అగచాట్లను చూచి కన్ను గీటకుందురుగాక!
20. వారు స్నేహపూర్వకముగా మాట్లాడరు.శాంతియుతముగా జీవించువారిమీద లేనిపోని నిందలు మోపుదురు.
21. వారు పెద్దగొంతు చేసికొని నన్ను దూయబట్టుచున్నారు. “హాహా నీవు చేసిన పని మేము చూడలేదా” అనుచున్నారు.
22. ప్రభూ! ఇదియెల్ల నీవును స్వయముగా చూచితివికదా! కనుక ఇక నీవు మౌనము వహింపవలదు. దూరముగా నిలుచుండి ఊరక చూచుచుండవలదు.
23. ఇక నీవు నిద్రనుండి లెమ్ము! నాకు న్యాయము చెప్పుము. నా దేవుడవైన ప్రభూ! నీవు నా పక్షమున వాదింపుము.
24. ప్రభూ! నీవు న్యాయవంతుడవు కనుక న్యాయము చెప్పుము. నా విరోధులు నా పతనమును చూచి ఆనందింపకుందురుగాక!
25. వారు “తాము కోరుకొనినట్లే జరిగినది” అని భావింపకుందురుగాక! “మనమితనిని కూలద్రోసితిమి” అని తలంపకుందురుగాక!
26. నా అగచాట్లను చూచి ఉప్పొంగిపోవు వారికి అవమానమును, అగౌరవమును ప్రాప్తించునుగాక! నాకంటెను తాము యోగ్యులము అనుకొని పొంగిపోవువారికి అపకీర్తియు, నిందయు వాటిల్లునుగాక!
27. నాకు న్యాయము జరుగగా చూచి, సంతసించువారు మాత్రము సంతోషనాదము చేయుచు, “ప్రభువు మహనీయుడు, అతడు తన దాసుని , విజయమునుగాంచి ఆనందించును” అని మాటిమాటికి చెప్పుకొందురుగాక!
28. అప్పుడు నేను నీ నీతిని గూర్చియు, నీ కీర్తిని గూర్చియు రోజంతా నిన్ను స్తుతించి కీర్తింతును.