ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 21

1. ప్రభూ! నీవు ప్రసాదించిన బలమునకుగాను రాజు సంతసించును. నీవు దయచేసిన విజయమునకుగాను, అతడు మిగుల హర్షించును.
2. నీవతని కోర్కెలు తీర్చితివి, అతని వేడుకోలును ఆలించితివి.
3. అతనికి మేలైన దీవెనలు కొనివచ్చితివి. అతని తలమీద బంగారు కిరీటమును పెట్టితివి.
4. రాజు ఆయుస్సునిమ్మని వేడగా నీవు దయచేసితివి. అతనికి దీర్గాయువును ఒసగితివి.
5. నీ సహాయము వలన రాజు మహా మహిమను బడసెను. నీవు అతనికి కీర్తిప్రాభవముల ను దయచేసితివి.
6. అతనికి శాశ్వతములైన దీవెనలను అను గ్రహించితివి. నీ సాన్నిధ్యము వలన అతడు ప్రమోదము చెందును.
7. రాజు ప్రభువును నమ్ముకొనెను. మహోన్నతుని కరుణవలన అతడు నిత్యము రాజ్యముచేయును.
8. నీ హస్తము నీ శత్రువులనెల్ల పట్టుకొనును.నీ కుడి చేయి నిన్ను ద్వేషించువారిని బంధించును.
9. అతడు తాను విజయము చేయు దినమున ఆ విరోధులనెల్ల అగ్ని గుండము వలే దహించి వేయును. ప్రభువు మహోగ్రుడై ఆ విరోధులను మ్రింగి వేయును. అగ్ని వారిని కబళించివేయును.
10. రాజు తన విరోధుల సంతానమును చంపును. వారి వంశజులనెల్ల మట్టుపెట్టును.
11. ఆ విరోధులు అతనికి కీడు తలపెట్టి అతని మీద కుట్రలు పన్నినను ఫలితము దక్కదు.
12. రాజు వారి మీద బాణములు రువ్వగా వారు వెన్నిచ్చి పారిపోవుదురు
13. ప్రభు! నీవు బలముతో లెమ్ము. మేము నీ మహాశక్తి ని కీర్తించి గానము చేసెదను