ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 26

1. ప్రభూ! నీవు నాకు తీర్పు చెప్పుము. నేను ధర్మమార్గమున నడచితిని. నిశ్చల మనస్సుతో నిన్ను నమ్మితిని.
2. ప్రభూ! నీవు నన్ను నిశితముగా పరిశీలింపుము. నా కోరికలను, ఆలోచనలను పరీక్షించి చూడుము.
3. నీ నిచితమైన ప్రేమ నాకు విధితము, నేను నీ పట్ల విశ్వాసపాత్రుడనుగా మెల గుచున్నాను.
4. నేను దుర్మార్గులతో కలిసి తిరుగనైతిని.వేషధారులతో సంచరింపనైతిని.
5. దుష్టబృందమనిన నాకు గిట్టదు. దుర్జనులతో నాకు పొత్తులేదు.
6. అమాయకత్వమునందు నా చేతులను కడుగుకొని, నీ బలిపీఠము చుట్టు ప్రదక్షిణము చేయుదును.
7. నీకు కృతజ్ఞత తెలియజేయుచు కీర్తనలు పాడెదను. నీ అద్భుత కార్యములెల్లరికి వెల్లడి చేయుదును.
8. నీవు వసించు మందిరమనిన, నీ తేజస్సు నెలకొని యున్న దేవాలయమనిన నాకు పరమ ప్రీతి.
9. పాపాత్ములతోపాటు నన్ను నాశము చేయకుము. నరహంతలకు పట్టుగతి నాకు పట్టనీయకుము.
10. వారు దుష్కార్యములు చేయు వారు, లంచములిచ్చుటకు సిద్ధముగా ఉండు వారు.
11. నా మటుకు నేను ధర్మమార్గమున నడచితిని. నీవు నన్ను రక్షింపుము, నన్ను కరుణతో చూడుము.
12. నేను అపాయము నుండి తప్పించుకొంటిని గాన, భక్తసమాజమున ప్రభుని కీర్తించెదను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services