1. తాను యాకోబునకు పిల్లలను కనక పోవుటచే రాహేలు తన సోదరిని చూచి కన్నులలో నిప్పులు పోసికొనెను. ఆమె యాకోబుతో “నాకు పిల్లలను కలిగింతువా? లేక నన్ను చావమందువా?” అనెను. 2. యాకోబునకు అరికాలిమంట నడినెత్తి కెక్కెను. అతడు రాహేలుతో “నీ కడుపున కాయ కాయకుండునట్లు చేసినది దేవుడు. నేనేమైనా ఆయన స్థానమున ఉంటినా?” అనెను. 3. అంతట ఆమె అతనితో "ఇదిగో నా దాసి బిల్హా ఉన్నదికదా! నీవు దానితో శయనింపుము. అది నా బదులుగా బిడ్డలను కనును. ఆమెవలన నేనుగూడ పిల్లలతల్లిని అగుదును” అనెను. 4. ఇట్లని ఆమె దాసియైన బిల్హాను అతనికి భార్యగా జేసెను. యాకోబు ఆమెతో శయనించెను. 5. బిల్హా గర్భవతియై యాకోబునకు ఒక పుత్రుని కనెను. 6. రాహేలు “దేవుడు నావైపు మొగ్గి తీర్పుచేసెను. నా మొరాలకించి నాకు కుమారుని ప్రసాదించెను” అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. 7. రాహేలు దాసి బిల్హా మరల గర్భవతియై యాకోబునకు మరల ఒక కొడుకుని కనెను. 8. అంతట రాహేలు “మా అక్కతో బాగుగా పోరాడితిని చివరకు నేనే నెగ్గితిని” అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. 9. లేయా తన కడుపు పండుటలేదని తలంచి దాసియయిన జిల్పాను తీసికొనిపోయి యాకోబునకు భార్యగా చేసెను. 10. జిల్పా యాకోబు