ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

telugu catholic bible download లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Telugu Catholic Bible Matthew chapter 25 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 25వ అధ్యాయము

 1. "పరలోకరాజ్యము ఇట్లుండును: పదిమంది కన్యలు తమ కాగడాలతో పెండ్లికుమారునకు స్వాగతమీయ ఎదురేగిరి. 2. అందు అయిదుగురు వివేకవతులు, మరియైదుగురు అవివేకవతులు. 3. అవివేకవతులు తమ కాగడాలతోపాటు నూనెను తీసికొనిపోలేదు. 4. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసికొనిపోయిరి. 5. పెండ్లి కుమారుని రాక ఆలస్యముకాగా, వారెల్లరు కునికి పాట్లు పడుతు నిద్రించుచుండిరి. 6. అర్ధరాత్రి సమయమున 'ఇదిగో! పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. అతనికి ఎదురు వెళ్ళుడు' అను కేక వినబడెను. 7. అపుడు ఆ కన్యలందరు నిదురనుండి మేల్కొని తమ కాగడాలను సవరించు కొనసాగిరి. 8. అవివేకవతులు వివేకవతులతో 'మా కాగడాలు కొడిగట్టుచున్నవి. మీ నూనెలో కొంత మాకీయుడు' అని కోరిరి. 9. అందుకు ఆ వివేకవతులు, 'మాకును మీకును ఇది చాలదు. అంగడికి వెళ్ళి కొనితెచ్చుకొనుడు' అనిరి. 10. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగనున్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. 11. తరువాత మిగిలిన కన్యలు వచ్చి 'ప్రభూ! ప్రభూ! తలుపుతీయుడు' అని మొర పెట్టిరి. 12. ఆయన 'నేను మిమ్ము ఎరుగనని నిశ్చయ

Telugu Catholic Bible Matthew chapter 24 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 24వ అధ్యాయము

 1. యేసు దేవాలయమునుండి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. 2. “వీటిని అన్నిటిని మీరు చూచుచున్నారుగదా! ఇది రాతిపై రాయి నిలువకుండ పడగొట్టబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు పలికెను. 3. ఓలివు కొండపై యేసు కూర్చుండియుండగా ఆయన వద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి "ఇవి అన్నియు ఎప్పుడు సంభవించును? నీ రాకకు, లోకాంతమునకు సూచనయేమి?” అని అడిగిరి. 4. యేసు వారికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను: “మిమ్ము ఎవ్వరు మోసగింపకుండునట్లు మెలకువతో ఉండుడు. 5. అనేకులు నా పేరట వచ్చి 'నేనే క్రీస్తును' అని ఎందరినో మోసగింతురు. 6. మీరు యుద్ధములను గూర్చియు, వాటికి సంబంధించిన వార్తలనుగూర్చియు విందురు. కాని కలవరపడవలదు. ఇవి అన్నియు జరిగితీరును. కాని అంతలోనే అంతము రాదు. 7. ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడిచేయును. అనేక ప్రదేశము లందు కరువులు, భూకంపములు వచ్చును. 8. ఇవి అన్నియు ప్రసవవేదన ప్రారంభసూచనలు. 9. అపుడు జనులు మిమ్ము శ్రమలపాలు చేసి చంపుదురు. నా నిమిత్తము అందరు మిమ్ము ద్వేషింతురు. 10. ఆ దినములలో అనేకులు పతనమగుదురు. ఒకరి నొకరు మోసగించుకొందురు, ద్వేషించుక

Telugu Catholic Bible Matthew chapter 23 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 23వ అధ్యాయము Telugu Catholic Bible Matthew chapter 24 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 24వ అధ్యాయము

 1. అప్పుడు యేసు జనసమూహములతోను, తన శిష్యులతోను ఇట్లనెను: 2. "ధర్మశాస్త్ర బోధకులును, పరిసయ్యులును మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు. 3. కాబట్టి వారి క్రియలనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన వారు బోధించునది వారే ఆచరింపరు. 4. వారు మోయ సాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెనవ్రేలైనను కదపరు. 5. తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీయంచులు పొడవు చేసికొందురు. 6. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధానాసనములను కాంక్షింతురు. 7. అంగడి వీధులలో వారు వందనములను అందుకొనుటకును, 'బోధకుడా,” అని పిలిపించు కొనుటకును తహతహ లాడుదురు. 8. మీరు 'బోధకులు' అని పిలిపించు కొనవలదు. ఏలయన, మీకు బోధకుడు ఒక్కడే. మీరందరు సోదరులు. 9. ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని 'తండ్రీ' అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే. ఆయన పరలోకమందున్నాడు. 10. మీరు 'గురువులు' అని పిలిపించుకొనవలదు. ఏలయన క్రీస్తు ఒక్కడే మీ గురువు. 11. మీ అందరిలో గొప్ప వాడు మీకు సేవకుడైయుండవలయును. 12. తనను తాను

Telugu Catholic Bible Matthew chapter 22 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 22వ అధ్యాయము

 1. యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. 2. "పరలోక రాజ్యము ఇట్లున్నది: ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి, 3. ఆహ్వానింపబడిన వారిని 'విందుకు బయలుదేరిరండు' అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి. 4. అందుచే అతడు, 'ఇదిగో! నా విందు సిద్ధపరుపబడినది. ఎద్దులును, క్రొవ్వినదూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రండు' అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. 5. కాని పిలువబడినవారు దానిని లక్ష్యపెట్టక, తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరియొకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. 6. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి. 7. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగుల బెట్టించెను. 8. అంతట, తన సేవకులను పిలిచి, 'నా విందు సిద్ధముగా ఉన్నది. కాని, నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. 9. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు' అని పంపెను. 10. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్ళి, మంచి, చెడు తేడా లేక తమ కంటబడిన

Telugu Catholic Bible Matthew chapter 21 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 21వ అధ్యాయము

 1. వారు యెరూషలేము సమీపించుచు, ఓలివు కొండ దగ్గరనున్న 'బెత్ఫగే' అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, 2. “మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచట కట్టివేయబడియున్న ఒక గాడిదను, దాని పిల్లను చూచెదరు. వానిని విప్పి నాయొద్దకు తోలుకొని రండు. 3. ఎవడైనను మిమ్ము ఆక్షేపించిన యెడల, ప్రభువునకు వాటితో పనియున్నదని తెల్పుడు. వెంటనే అతడు వాటిని తోలుకొనిపోనిచ్చును” అని చెప్పెను. 4. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. 5. “ఇదిగో! నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు. గాడిదపై భారవాహకమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు.” 6. కాబటి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. 7. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను. 8. జన సమూహములో అనేకులు దారిపొడవున తమ వస్త్రములను పరచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి. 9. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము "దావీదు కుమారా హోసన్న! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక! సర్వోన్నత

Telugu Catholic Bible Matthew chapter 20 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 20వ అధ్యాయము

 1. “పరలోకరాజ్యము ఈ ఉపమానమును పోలి యున్నది: ఒక యజమానుడు తన ద్రాక్షతోటలో పని చేయుటకు పనివారలకై ప్రాతఃకాలమున బయలు దేరెను. 2. అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసికొని, వారిని తన తోటకు పంపెను. 3. తిరిగి ఆ యజమానుడు తొమ్మిదిగంటల' సమయమున బయటకు వెళ్ళి, అంగడి వీధిలో పనికొరకు వేచియున్న కొందరిని చూచి, 4. 'మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు. న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను' అనెను. వారు అటులనే వెళ్ళిరి. 5. తిరిగి పండ్రెండు గంటలకు, మరల మధ్యాహ్నం మూడుగంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. 6. రమారమి సాయంకాలము ఐదుగంటల సమయమున వెళ్ళి, సంతవీధిలో ఇంకను నిలిచియున్నవారిని చూచి, 'మీరు ఏల రోజంతయు పనిపాటులు లేక ఇచట నిలిచియున్నారు?' అని ప్రశ్నించెను. 7. 'మమ్మేవ్వరు కూలికి పిలువలేదు' అని వారు ప్రత్యుత్త రమిచ్చిరి. అంతట ఆ యజమానుడు 'అటులైన మీరు కూడ నా ద్రాక్షతోటలో పనిచేయుటకు వెళ్ళుడు' అనెను. 8. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో 'ద్రాక్షతోటలో పని చేసినవారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి

Telugu Catholic Bible Matthew chapter 19 || Telugu Catholic Bibleonline || మత్తయి సువార్త 19వ అధ్యాయము

 1. తన ఉపదేశమును ముగించిన పిదప, యేసు గలిలీయ సీమను వీడి, యోర్దాను నదికి ఆవల నున్న యూదయా ప్రాంతమును చేరెను. 2. గొప్ప జనసమూహములు ఆయనను వెంబడింపగా వారిని అచట స్వస్థపరచెను. 3. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి “ఏ కారణము చేతనైన ఒకడు తన భార్యను పరిత్య జించుట చట్టబద్ధమా?” అని ప్రశ్నించిరి. 4. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించి నట్లు మీరు చదువలేదా? 5. ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని, విడిచి తన భార్యను హత్తుకొనియుండును. వారు ఇరువురు ఏకశరీరులై యుందురు. 6. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక, ఏకశరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రుడు వేరుపరుపరాదు” అని యేసు పలికెను. 7. "అటులైన విడాకుల పత్రము నిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏల ఆజ్ఞా పించెను?" అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. 8. “మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని, ఆరంభమునుండి ఇట్లు లేదు. 9. వ్యభిచార కారణమున తప్ప, తన భార్యను విడనాడి మరియొకతెను వివాహమాడువాడు వ్యభిచారియగును” అని యేసు ప్రత్యుత్తర మిచ్చెను. 10. అపుడు శిష్యులు, “భార్య, భర్తల సంబంధము ఇ

Telugu Catholic Bible Matthew chapter 18 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 18వ అధ్యాయము

 1. ఆ సమయమున శిష్యులు యేసువద్దకు వచ్చి, “పరలోకరాజ్యమున అందరికంటె గొప్పవాడు ఎవ్వడు?” అని అడిగిరి. 2. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారిమధ్యన నిలిపి, 3. “మీరు పరివర్తనచెంది చిన్నబిడ్డలవలె రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించు చున్నాను. 4. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలునివలె రూపొందువాడే పరలోకరాజ్యమున గొప్పవాడు. 5. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించు వాడు నన్ను స్వీకరించుచున్నాడు. 6. “నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవ్వనినైన పాపమునకు ప్రేరేపించుటకంటె అట్టివాని మెడకు తిరుగటిరాయి కట్టి అగాధ సముద్రములో పడద్రోయుట వానికి మేలు. 7. ఆటంకములతో కూడిన ప్రపంచమా! అనర్థము! ఆటంకములు తప్పవు. కాని అందుకు కారకుడైన వానికి అనర్థము! 8. నీ చేయికాని, నీ కాలుకాని నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. కాళ్ళు, చేతులతో ఆరని ఆగ్నిలో దహింపబడుటకంటె, అంగహీనుడవై అమరజీవము పొందుట మేలు. 9. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కనులతో నీవు నరకాగ్నిలో దహింపబడుటకంటె ఒంటికంటితో నిత్య జీవము పొందుట మేలు. 10. ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలయన వీరి దూతలు పరలోకమందుండు

Telugu Catholic Bible Matthew chapter 17 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 17వ అధ్యాయము

 1. ఆరుదినములు గడచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసికొని, ఒక ఉన్నతపర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళెను. 2. అచట వారియెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగానయ్యెను. 3. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. 4. అప్పుడు పేతురు "ప్రభూ! మనము ఇచటనుండుట మంచిది. నీకు అనుమతియైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి మూడు శిబిరములను నిర్మింతును” అని పలికెను. 5. అంతలో ఒక కాంతి వంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి “ఈయన నా కుమారుడు. నాకు ప్రియమైనవాడు. ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు,” అను వాణి వినిపించెను. 6. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. 7. అప్పుడు యేసు వారి కడకు వచ్చి, వారిని తట్టి, “లెండు, భయపడకుడు” అని పలికెను. 8. అంతట వారు కనులెత్తిచూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. 9. వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో “మనుష్యకుమారుడు మృతులనుండి లేపబడువరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు” అని ఆజ

Telugu Catholic Bible Matthew chapter 16 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 16వ అధ్యాయము

 1. శోధించు తలంపుతో పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరకువచ్చి "పరలోకమునుండి ఒక గురుతును చూపుము" అనిరి. 2. ఆయన వారికి ప్రత్యుత్తరముగా, “సంధ్యా సమయమున ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది. కనుక వాతావరణము బాగుండు ననియు, 3. ప్రాతఃకాల సమయమున ఆకాశము మబ్బుపట్టి ఎఱ్ఱగా ఉన్నది కనుక గాలివాన వచ్చు ననియు మీరు చెప్పుదురు. ఆకాశమును చూచి వాతావరణమును గుర్తింపగలిగిన మీరు ఈ కాలముల సూచనలను గుర్తింపలేకున్నారా? 4. వ్యభిచారులైన దుష్టతరమువారు ఒక గురుతును చూడగోరుచున్నారు. కాని యోనా గుర్తు తప్ప వేరొక గురుతు వారికి అనుగ్రహింప బడదు” అని వారిని వీడి వెళ్ళిపోయెను. 5. ఆయన శిష్యులు సరస్సుదాటి ఆవలి ఒడ్డునకు పోవునపుడు రొట్టెలు తీసికొనిపోవుట మరచిరి. 6. “పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండిని గూర్చి మీరు జాగరూకులైయుండుడు” అని యేసు వారితో చెప్పెను. 7. “మనము రొట్టెలు తీసికొని పోవుట మరచిపోయినందున ఆయన ఇట్లు పలికెను కాబోలు!" అని తమలో తాము మాటలాడుకొనిరి. 8. యేసు అది గ్రహించి, “అల్పవిశ్వాసులారా! రొట్టెలు లేవని మీరేల విచారించుచున్నారు? 9. మీరు ఇంతలోనే మరచితిరా? ఐదురొట్టెలను ఐదువేలమందికి పంచి పెట్టినపుడు మిగిలిన ముక్కలను మీరు ఎన

Telugu Catholic Bible Matthew chapter 15 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 15వ అధ్యాయము

 1. అంతట యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి 2. “మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు. వారు ఏల ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు?” అని అడిగిరి. 3. అందుకు యేసు “పూర్వుల ఆచారమును ఆచరించునపుడు మరి మీరు మాత్రము దైవాజ్ఞలను మీరుటలేదా? 4. "ఏలయన, దేవుడు ఇట్లు ఆజ్ఞాపించెను: “నీ తల్లిని, తండ్రిని గౌరవింపుము. తల్లిదండ్రులను దూషించువాడు మరణించుగాక! 5. ఎవ్వడేని తన తండ్రితోగాని, తన తల్లితోగాని, 'నానుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది' అని చెప్పినచో, అట్టివాడు తన తల్లిదండ్రులను ఆదుకొననవసరము లేదని మీరు బోధించుచున్నారు. 6. ఈ రీతిని మీరు పూర్వుల ఆచారముననుసరించు నెపమున దేవుని వాక్కును నిష్ప్రయోజనము చేయుచున్నారు. 7. వంచకులారా! యెషయా మిమ్మును గూర్చి యెంత యథార్థముగా ప్రవచించెను! 8. 'ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కాని, వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి. 9. మానవ కల్పిత నియమములను దైవాజ్ఞలుగా బోధించుచున్నారు. కావున వీరి ఆరాధన నిరర్ధకము." 10. అపుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి “మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. 11.

Telugu Catholic Bible Matthew chapter 14 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 14వ అధ్యాయము

 1. ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, 2. “ఇతడు స్నాప కుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుతశక్తులు ఇతనియందు కనిపించు చున్నవి” అని తన కొలువుకాండ్రతో చెప్పెను. 3. హేరోదు తన సోదరుడగు. ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. 4. ఏలయన, “ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు” అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. 5. . యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. 6. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, 7. ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. 8. అపుడు ఆమె తన తల్లి ప్రోత్సాహమువలన “స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము” అని అడిగెను. 9. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిథుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి, 10. సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను. 11. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను

Telugu Catholic Bible Matthew chapter 13 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 13వ అధ్యాయము

 1. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. 2. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టును చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరును తీరమున నిలుచుండిరి. 3. ఆయన వారికి అనేక విషయములు ఉపమానరీతిగా చెప్పెను. “విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. 4. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. 5. మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను 6. కాని, సూర్యుని వేడిమికి మాడి, వేరులేనందున ఎండి పోయెను. 7. మరికొన్ని ముండ్లపొదలలో పడెను. ఆ ముండ్లపొదలు ఎదిగి వానిని అణచివేసెను. 8. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా పంటనిచ్చెను. 9. వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అని యేసు పలికెను. 10. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి, “మీరు ప్రజలతో ప్రసంగించునపుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేల?” అని ప్రశ్నించిరి. 11. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా “పరలోకరాజ్య పరమరహస్యములను తెలిసికొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. 12. ఏలయన, ఉన్నవానికే మరింత ఇవ్వబడును. వా

Telugu Catholic Bible Matthew chapter 12 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 12వ అధ్యాయము

 1. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంటపొలముగుండా పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి, తినసాగిరి. 2. పరిసయ్యులు అది చూచి, “ఇదిగో! నీ శిష్యులు విశ్రాంతిదినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు” అని యేసుతో పలికిరి. 3. అందుకు ఆయన వారితో " దావీదును అతని అనుచరులును ఆకలిగొనినపుడు ఏమి చేసినది మీరు చదువలేదా? 4. దేవుని మందిరములో ప్రవేశించి, అర్చకులు తప్ప తానుకాని, తన అనుచరులుకాని తినకూడని అచటనుండు నైవేద్యపు రొట్టెలను అతడును, అతని అనుచరులును తినిరిగదా! 5. దేవాలయములో యాజకులు విశ్రాంతిదినమున, విశ్రాంతినియమమును ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మ శాస్త్రమందు మీరు చదువలేదా? 6. దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. 7. 'నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు.' అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగినయెడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. 8. ఏలయన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు కూడ అధిపతి” అనెను. 9. తరువాత ఆయన ఆ స్థలమును విడిచి, వారి ప్రార్థనామందిరమున ప్రవేశించెను. 10. అచ్చట ఊచచేయిగలవాడు ఒకడుండెను. కొందరు యేసుపై నేరమును మోపదలచి "విశ్రాంతిదినమున స్వస్థ

Telugu Catholic Bible Matthew chapter 11 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 11వ అధ్యాయము

 1. యేసు పండ్రెండుమంది శిష్యులకు తన ఆదేశములను ఒసగిన పిదప, ఆయా పట్టణములలో బోధించుటకును, ప్రసంగించుటకును బయలుదేరెను. 2. చెరసాలలోనున్న యోహాను, క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని, శిష్యులను ఇద్దరిని ఆయన వద్దకు పంపెను. 3. "రాబోవు వాడవు నీవా! లేక మేము మరియొకని కొరకు ఎదురు చూడవలెనా?" అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. 4. వారితో యేసు, “పోయి, మీరు వినుచున్న దానిని, చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. 5. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు. కుంటివారు నడుచు చున్నారు. కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. చెవిటి వారు వినుచున్నారు. మృతులు పునరుత్థానులగు చున్నారు. పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. 6. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు” అని ప్రత్యుత్తరమిచ్చెను. 7. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో, “మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా? 8. మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడినా? మృదువస్త్రములను ధరించు వారు రాజభవనములలో నుందురుగదా! 9. మరి ఎందులకుపోయితిరి? ప్రవక్తను చూచుటకా? అవును, ప్రవక్తకంటే గొప్పవాడిని” అని నేను మీతో నుడు

Telugu Catholic Bible Matthew chapter 10 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 10వ అధ్యాయము

 1. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను. 2. ఆ పన్నిద్దరు అపోస్తలుల పేర్లు ఇవి: అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు అంద్రెయ, జెబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, 3. ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి, 4. కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. 5. యేసు ఈ పన్నిద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: “అన్య జనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. 6. కాని, చెదరిపోయిన గొఱ్ఱెలవలెనున్న యిస్రాయేలు ప్రజలయొద్దకు వెళ్ళి, 7. వరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, 8. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను ఎల్లగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. 9. మీతో బంగారమును గాని, వెండిని గాని, రాగిని గాని కొనిపోవలదు. 10. ప్రయాణమునకై జోలెనుగాని, రెండు అంగీలనుగాని, పాదరక్షములనుగాని, చేతికర్రను గాని తీసి

Telugu Catholic Bible Matthew chapter 9 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 9వ అధ్యాయము

 1. అంతట యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. 2. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని, కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో “కుమారా! ధైర్యము వహింపుము. నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను. 3. అపుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, “ఇతడు దైవదూషణము చేయుచున్నాడు” అని తమలో తాము అనుకొనిరి. 4. వారి తలంపులను గ్రహించిన యేసు, “మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? 5. నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవులేచి నడువుమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము? 6. ఈ భూమి మీద మనుష్యకుమారునకు పాపములనుక్షమించు అధికారము కలదని మీకిపుడే తెలియును” అని పలికి, ఆ రోగితో “నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి పొమ్ము” అనెను. 7. అతడు వెంటనే లేచి తన యింటికి పోయెను. 8. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి. 9. తరువాత యేసు అటనుండి వెళ్ళుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న 'మత్తయి' అనువానితో “నన్ను అనుసరింపుము” అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. 10. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినపుడు సుంకరులును, పాపులును అనేక

Telugu Catholic Bible Matthew chapter 8 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 8వ అధ్యాయము

 1. బోధను ముగించి పర్వతముపైనుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. 2. ఆ సమయమున కుష్ఠరోగియొకడు వచ్చి, ప్రభువుముందు మోకరించి “ప్రభూ! నీకు ఇష్టమైనచో నన్ను శుద్దుని చేయగలవు" అని పలికెను. 3. అంతట యేసు తన చేయిచాపి, అతనిని తాకి “నాకిష్టమే. నీకు శుద్ధికలుగునుగాక”! అని పలికెను. వెంటనే వాని కుష్ఠముపోయి వాడు శుద్దుడాయెను. 4. యేసు అతనితో “ఈ విషయమును ఎవరితోను చెప్పవలదు. నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము" అని పలికెను. 5. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా, శతాధిపతి యొకడు ఆయనను సమీపించి, 6. "ప్రభూ! నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టియున్నాడు” అని తెలుపగా, 7. “నేను వచ్చి వానిని స్వస్థపరతును” అని యేసు ఆ శతాధిపతితో పలికెను. 8. ఆ శతాధిపతి ఆయనతో “ప్రభూ! నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుకాను. నీవు ఒక్కమాట పలికిన చాలును. నా సేవకుడు స్వస్తత పొందును. 9. నేను అధికారము గలవాడను. నా అధీనమందున్న ఏ సైనికుడినైనా నేను 'రమ్ము' అనిన వచ్చును; 'పొమ్ము' అనిన పోవును నా

Telugu Catholic Bible Matthew chapter 7 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 7వ అధ్యాయము

 1. “పరులను గూర్చి మీరు తీర్పుచేయకుడు. అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పుచేయబడదు. 2. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పుచేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో, ఆ కొలతతోనే మీకును కొలువబడును. 3. నీ కంటిలోని దూలమును గమనింపక, నీ సహోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేల? 4. 'నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము' అని, సోదరుని నీవెట్లు అడుగగలవు? నీ కంటిలో దూలమున్నదిగదా! 5. కపట భక్తుడా! ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసికొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టము గానుండును. 6. పవిత్రమైన దానిని కుక్కలపాలు చేయవలదు. వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో తొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును. 7. “అడుగుడు మీ కొసగబడును; వెదకుడు మీకు దొరకును; తట్టుడు మీకు తెరువబడును. 8. ఏలయన, అడిగిన ప్రతివానికి లభించును. వెదకిన ప్రతివానికి దొరకును. తట్టిన ప్రతివానికి తెరువబడును. 9. కుమారుడు రొట్టెనడిగిన, మీలో ఎవడైన వానికి రాయి నిచ్చునా? 10. చేపనడిగిన పామునిచ్చునా? 11. మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమానాలు ఇచ్చుట మీకు తెలియునుగదా! పరలోక మందున

Telugu Catholic Bible Matthew chapter 6 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 6వ అధ్యాయము

 1. "మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. 2. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను, వీధులలోను డాంబికులు చేయు నట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. 3. నీవు దానము చేయునపుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమచేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. 4. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును. 5. "కపట భక్తులవలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో, వీధుల మలుపులలో నిలువబడి, జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించెనని మీతో వక్కా ణించుచున్నాను. 6. ప్రార్ధన చేయునపుడు నీవు నీ గదిలో ప్రవేశించి, తలుపులు మూసికొని అదృశ్యుడైయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగును. . 7. అన్యులవలె అనేక వ్యర్ధ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటుల చేసినగాని, దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. 8.