ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

bible grandham telugu lo లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పేతురు వ్రాసిన 1వ లేఖ

1వ అధ్యాయము + -  1. యేసుక్రీస్తు అపోస్తలుడగు పేతురు, పొంతు, గలతీయ, కప్పదోసియ, ఆసియా, బితూనియాల యందు చెదరిపోయి, వలసదారులుగా జీవించు దేవుని ప్రియజనులకు వ్రాయునది: 2. పితయగు దేవుని సంకల్ప ఫలముగనే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసు క్రీస్తునకు విధేయులగుటకును,ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మవలన పవిత్రులనుచేసెను. మీకు కృపయు, సమాధానము లభించునుగాక! 3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలోనుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థాన మొనరించి, దాని మూలమున మనకు నూత్న జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. 4. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీకొరకై పరలోకమున భద్ర పరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. 5. మీరు యుగాంతమున ప్రకటింపబడెడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడు చున్నారు. కనుక అవి మీ కొరకే. 6. మీరు ఎదుర్కొనవలసిన పలువిధములగు పరీక్షలవలన తాత్కాలికముగ మీకు బాధ కలిగినను, దీనిని గూర్చి సంతోషింపుడు. 7.

యాకోబు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. దేవునియొక్కయు, యేసుక్రీస్తు ప్రభువుయొక్కయు, సేవకుడగు యాకోబు నుండి: ప్రపంచమునందంతటను చెదరియున్న పండ్రెండు గోత్రముల వారికి శుభాకాంక్షలు. 2. నా సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనునప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగ ఎంచుకొనుడు. 3. ఎట్లన, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుటవలన, మీకు సహనము చేకూరును. 4. కాని మీ సహనము విఫలముకాక, తుదివరకు మిమ్ము తీసుకొనిపోవునట్లు చూచు కొనుడు. అపుడు మీరు ఏ కొరతయులేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. 5. కాని మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్నయెడల, అతడు దేవుని అడుగవలెను. ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరకు ఉదారముగ అనుగ్రహించును గదా! 6. కాని అతడు విశ్వాసముతో అడుగవలెను. ఏ మాత్ర మును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్రతరంగము వంటివాడు. 7. అట్టి వాడు ప్రభువు నుండి ఏమైన పొందగలనని తలంపరాదు. 8. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు. 9. దీనస్థితిలో నున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను. 10. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్విం

ఫిలేమోనుకు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. క్రీస్తుయేసు కొరకు బందీయైన పౌలు, మన సోదరుడగు తిమోతి: మాకు ప్రియమైన తోడిపని వాడును అయిన ఫిలేమోనునకును, 2. మన సహో దరియగు అప్పియకును, మన తోడి సైనికుడగు అర్కిప్పునకును, నీ ఇంట సమావేశమగు దైవసంఘ మునకు వ్రాయునది: 3. మన తండ్రి దేవునినుండియు, ప్రభువగు యేసు క్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము. 4. ప్రార్థించునపుడెల్లను నిన్ను జ్ఞాపకము చేసికొని దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. 5. ఏలయన ప్రభువైన యేసుక్రీస్తుయెడల, పవిత్రులందరియెడల నీకు ఉన్న ప్రేమను, విశ్వాసమును గూర్చియు నేను వినియున్నాను. 6. విశ్వాసమునందు నీతోడి మా సహవా సము, మనము క్రీస్తునందు కలిగియున్న ప్రతి ఆశీ ర్వాదమును మరింత సుబోధక మొనర్చునుగాక! అని నా ప్రార్ధన. 7. నా సోదరుడా! నీ ప్రేమ నాకు అమిత మగు ఆనందమును, ఊరటను కలిగించినది. ఏలయన పవిత్రుల మనస్సులకు నీవు విశ్రాంతిని కలిగించితివి. 8. ఈ కారణము వలననే, నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను, 9. దానికి బదులుగా ప్రేమకొరకై ప్రాధేయపడు చున్నాను. యేసు క్రీస్తు కొరకు రాయబారి, ఇపుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయు చున్నాడు. 10. నేను చెరసాలలో ఒనేసిమునకు తండ్ర

తిమోతికి వ్రాసిన 1వ లేఖ

1వ అధ్యాయము + -  1. మన రక్షకుడగు దేవునియొక్కయు, మన నమ్మికయగు క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, 2. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి, పితయగు దేవునినుండియు, మన ప్రభువగు క్రీస్తు యేసునుండియు, నీకు కృప, కనికరము, సమాధానము. 3. మాసిడోనియాకు వెళ్ళబోవుచు నేను నిన్ను కోరిన విధముగ, నీవు ఎఫెసునందే నిలిచియుండుము. అచట కొంతమంది అసత్య బోధనలను చేయుచున్నారు. వారు మానివేయునట్లు నీవు ఆజ్ఞాపింపవలెను. 4. ఆ కట్టుకథలను, అంతులేని వంశావళులను వదలి వేయవలెనని వారికి బోధింపుము. అవి వాగ్వివాదములను మాత్రమే కలిగించును గాని, దేవుని ప్రణాళికను తెలియజేయవు. ఆ ప్రణాళిక విశ్వాసము వలన తెలియదగును. 5. ప్రజలయందు ప్రేమను రూపొందించు టకే నేను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. ఆ ప్రేమ నిర్మలమగు హృదయము నుండియు, స్వచ్చమగు మనస్సాక్షి నుండియు, యథార్థమగు విశ్వాసమునుండియు ఉద్భవింపవలెను. 6. కొందరు వీనినుండి విముఖులై వితండవాదములలో పడి తమ త్రోవను కోల్పోయిరి. 7. తాము దేవుని చట్టమును బోధించువారలమని వారు చెప్పుకొందురేగాని, వారు మాట్లాడునది, రూఢిగా పలుకునది వారికే బోధపడదు. 8. ధర్మశాస్త్రము తగిన పద్ధతిలో వినియోగి

తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 1వ లేఖ

1వ అధ్యాయము + -  1. తండ్రియగు దేవునియందును, ప్రభువగు యేసు క్రీస్తునందును, తెస్సలోనిక దైవసంఘ ప్రజలకు పౌలు, సిలాసు, తిమోతిలు వ్రాయునది: మీకు కృపయు, శాంతియు కలుగునుగాక! 2. మీ అందరి కొరకును మేము సదా దేవునకు కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పు డును మిమ్ము పేర్కొందుము. 3. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి ఒనర్చునట్లు చేసినదియు, మన యేసుక్రీస్తు ప్రభువునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనదియు, మన దేవుడును, తండ్రియును అగు వానిఎదుట మేము స్మరింతుము. 4. సోదరులారా! దేవుడు మిమ్ము ప్రేమించి, మిమ్ము తన వారిగ ఎన్నుకొనియున్నాడని మాకు తెలియును. 5. ఏలయన, కేవలము మాటలచే మాత్రమేకాక, శక్తితోను, పవిత్రాత్మతోను, దాని సత్యము నందలి సంపూర్ణమగు నమ్మకముతోను మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే గదా! 6. మమ్మును, ప్రభువును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను, పవిత్రాత్మవలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి. 7. అందువలననే మాసిడోనియా, అకయాలలోని విశ్వాసులందరకును మీరు మార్గదర్శకులైతిరి. 8. ఏలయన, ప్రభు

Revelation chapter 19 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 19వ అధ్యాయము

 1. అనంతరము, దివియందు ఒక గొప్ప ప్రజాసమూహపు కలకల ధ్వనివంటిది ఏదో నాకు వినబడెను. “అల్లెలూయా! రక్షణ, మహిమ, శక్తి మన దేవునకే చెల్లును! 2. ఆయన తీర్పులు న్యాయాన్వితములు, సత్యోపేతములు. ఏలయన, తన జారత్వముతో భువిని కలుషిత మొనర్చుచున్న ఆ మహా వేశ్యను ఆయన శిక్షించెను గదా! ఆమె చిందించిన తన సేవకుల రక్తమునకు దేవుడు ఆమెను దండించెను” అని వారు పలుకుచుండిరి. 3. మరలవారు ఇట్లు బిగ్గరగా పలికిరి: “అల్లెలూయా! ఆ మహానగరము నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండునుగాక!” 4. అప్పుడు ఇరువది నలుగురు పెద్దలును, నాలుగు జీవులును సింహాసనాసీనుడగు దేవుని ముందు సాగిల పడి ఆయనను ఆరాధించి “ఆమెన్! అల్లెలూయా!” అని పలికిరి. 5. అంతట సింహాసనమునుండి ఒక స్వరము ఇట్లు వినబడెను: “మన దేవుని స్తుతింపుడు! ఆయన సేవకులును, ఆయనయందు భయభక్తులుగల పిన్నలును, పెద్దలును, అందరును స్తుతింపుడు!" 6. అంతట ఒక గొప్ప జనసమూహముయొక్క ధ్వని వంటిదియు, భయంకర జలపాత గర్జనను పోలినదియు, గొప్ప ఉరుమువలె ఉన్న ఒక స్వరమును నేను వింటిని. “అల్లెలూయా! మన దేవుడు, ప్రభువు మహాశక్తిమంతుడు పరిపాలించును. 7. మనము ఆనందింతము, సంతోషింతము, ఆయన ఘనతను స్తుతింతము!  గొఱ్ఱెపిల్ల వివాహ మహోత్సవ

Revelation chapter 1 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 1వ అధ్యాయము

 1. యేసుక్రీస్తు బహిరంగమొనర్చిన విషయములు ఇచట గ్రంథస్థము కావింపబడినవి. దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతికాలమున ఏమి సంభవింపనున్నదియు ఆయనచే దేవుని సేవకులకు ప్రకటింపబడవలెను. ఇది దేవుని అభిమతము. క్రీస్తు తన దూతద్వారా తన సేవకుడగు యోహానుకు ఈ విషయములను విదితము చేసెను. 2. తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను. ఇది దేవుని వాక్కును గూర్చియు, యేసు క్రీస్తు బహిరంగము చేసిన సాక్ష్యమును గూర్చియు యోహాను వ్రాసిన నివేదిక. 3. ఇవి అన్నియు అనతికాలముననే సంభవింప నున్నవి. కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయ ములను పాటించువారు ధన్యులు. 4. ఆసియా మండలమునందలి సప్తసంఘ ములకు యోహాను వ్రాయునది: భూత, భవిష్యత్, వర్తమానములందున్న దేవుని నుండియు ఆయన సింహాసనము ఎదుట ఉన్న సప్త ఆత్మలనుండియు 5. విశ్వాసపాత్రుడగు సాక్షియు, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువును అగు యేసు క్రీస్తునుండియు, మీకు కృపయు శాంతియు లభించును గాక! ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాపవిముక్తులను చేసెను. 6. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసె

2nd John chapter 1 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము

 1. పెద్దనైన నేను ఎన్నుకొనబడిన ఆమెకును, ఆమె బిడ్డలకును వ్రాయునది; నేను మిమ్ము నిజముగా ప్రేమించుచున్నాను. నేను మాత్రమేకాక, సత్యమును ఎరిగిన వారందరును మిమ్ము ప్రేమింతురు. 2. ఏలయన, సత్యము మనయందు ఉండుటచేతను, అది శాశ్వతముగ మనతో ఉండును కనుకను వారు అటుల చేయుదురు. 3. తండ్రియగు దేవుడును, ఆ తండ్రికి కుమారుడగు యేసుక్రీస్తును, మనకు కృపను, కనికరమును, శాంతిని ప్రసాదించునుగాక! సత్యప్రేమలయందు అవి మనవి అగునుగాక! 4. తండ్రి మనలను ఆజ్ఞాపించిన విధముగ, నీ బిడ్డలు కొందరు సత్యమున జీవించుట కనుగొని ఎంతయో సంతోషించితిని. 5. కనుక అమ్మా! మనము పరస్పరము అనురాగము కలిగియుందుము. నేను నీకు వ్రాయుచున్నది క్రొత్త ఆజ్ఞ కాదు. ఇది మొదటి నుండియు మనకు ఉన్న ఆజ్ఞ. 6. ఈ ప్రేమకు అర్ధము, మనము దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకవలెను అనుటయే. మొదటినుండియు మీరు వినుచున్నట్లుగ మీరు అందరు ప్రేమలో జీవింపవలెను అనునదియే ఆ ఆజ్ఞ. 7. యేసు క్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చె నని ఒప్పుకొనని మోసగాండ్రు ఎందరో లోకమున సంచరించుచున్నారు. అట్టి వ్యక్తి మోసగాడే. అతడు క్రీస్తు విరోధి. 8. మీరు ఇంతవరకును దేనికొరకై కృషి సలిపితిరో దానిని కోల్పోక మీ బహుమానమును సంపూర్ణము

2nd Peter chapter 3 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము

 1. ప్రియ మిత్రులారా! ఇది నా రెండవ జాబు. రెండు జాబులలోను ఈ విషయములను గుర్తుచేయుట ద్వారా మీ మనస్సులలో సద్భావములను రేకెత్తించుటకు ప్రయత్నించితిని. 2. గతమున పవిత్రులగు ప్రవక్తలచే ప్రబోధింపబడిన పలుకులను మీరు జ్ఞాపకము ఉంచు కొనవలెనని నా అభిమతము. మీరు మీ అపోస్తలుల ద్వారా పొందిన ప్రభువును, రక్షకుడును అగువాని ఆజ్ఞను మరువరాదు. 3. తుది సమయమున, అపహాసకులు కొందరు ఉదయింతురను విషయమును మీరు ముఖ్యముగా తెలిసికొనవలయును. వారు మిమ్ము హేళనచేయుచు తమ వ్యామోహములను అనుసరించుదురు. 4. "ఆయన వచ్చెదనని వాగ్దానమొనర్చినాడు గదా! మరి ఎచట ఉన్నాడు? మన తండ్రులు అప్పుడే గతించినారు. కాని మార్పేమియును లేదే? సమస్తమును యథాతథముగనే ఉన్నదే? సృష్ట్యాది నుండి ఎట్లున్నదో ప్రపంచము అట్లే ఉన్నది గదా!” అని వారు పలుకుదురు. 5. అనాది కాలమున దేవుడు పలికెను కనుకనే దివి, భువి సృజింపబడినవి అను ఈ విషయమును వారు బుద్ధిపూర్వకముగనే ప్రస్తావింపరు. జలములద్వారా, జలమునుండి భువి సృజింప బడినది. 6. ఆ జలమువలననే, జలప్రళయము చేతనే అప్పటి లోకము నశింప జేయబడెను. 7. దేవుని వాక్కు చేతనే ఇప్పటి దివియు, భువియు, అగ్నిలో దగ్గమ గుటకు గాను ఉంచబడినవి. దుష్టులు తీర్పున

1st Peter chapter 3 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము

 1. భార్యలారా! మీరును అట్లే మీ భర్తలకు విధేయులై ఉండవలెను. అపుడు వారిలో ఎవరైన దేవుని వాక్కును విశ్వసింపనివారు ఉన్నచో మీరు ఒక్క మాటయైన పలుకవలసిన అవసరము లేకయే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. 2. ఏలయన, భయభక్తులతోను, పరిశుద్ధతతోను కూడిన మీ ప్రవర్తనను వారు గమనింపగలరు. 3. శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములను ధరించుట, దుస్తులు వేసికొనుట అను బాహ్య సౌందర్యము కాక, 4. మీ సౌందర్యము ఆంతరంగికమైనదై ఉండవలెను. అది సౌమ్యమును, సాధువును అగుఅక్షయ ఆత్మ సౌందర్యము. అదియే దేవుని దృష్టిలో అమూల్యమైనది. 5. ఏలయన, భక్తురాండ్రగు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తమ సౌందర్య మును పోషించుకొనుచు, తమ భర్తలకు విధేయురాండ్రై ఉండిరి. 6. సారా అట్టిదే. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానునిగ సంబోధించినది. మీరును సత్కార్యములొనర్చు వారై దేనికిని బెదరనివారైనచో ఆమెకు బిడ్డలగుదురు. 7. భర్తలారా! అట్లే మీరును మీ భార్యలు జీవము అను కృపావరములో మీతో పాలివారై ఉన్నవారని ఎరిగి సగౌరవముగను, ఉదారముగను వారితో జీవింపుడు. స్త్రీలు అబలలని మీరు ఎరుగుదురు గదా! మీ ప్రార్థనలకు ఏదియు అడ్డురాకుండ ఇట్లు చేయుడు. 8. కడన, మీరు అం

James chapter 4 || Telugu Catholic Bible || యాకోబు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము

 1. మీ మధ్య ఇన్ని కలహములు, వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి, సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే గదా! 2. మీరు ఆశించుచున్నారుగాని పొందుటలేదు. కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురుగాని పొందలేరు. కనుక మీరు కలహించుదురు. యుద్ధములు చేయుదురు. మీకేమి కావలయునో వాని కొరకై దేవుని అర్ధింపక పోవుటచేతనే, మీకు కావలసిన వానిని మీరు పొంద లేకున్నారు. 3. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురుగదా! 4. విశ్వాసరహితులారా! ఐహికమును ప్రియముగ నెంచువాడు దేవునకు విరోధియని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింపనెంచువాడు దేవునితో విరోధము తెచ్చి పెట్టుకొనుచున్నాడు. 5. “మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును” అను పరిశుద్ధ గ్రంథ వచనము అర్థరహితము అగునని అనుకొందురా! 6. కాని ఆయన కృపను ఎక్కువగ ఇచ్చును. ఏలయన, “దేవుడు అహంకారులను ఎదిరించును. వినమ్రులకు కృపను అనుగ్రహించును” అని లేఖనము చెప్పుచున్నది. 7. కావున దేవునకు విధేయులు కండు. సైతానును వ్యతిరేకింపుడు. అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును. 8. దేవుని దరిక

James chapter 3 || Telugu Catholic Bible || యాకోబు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము

 1. సహోదరులారా! బోధకులమగు మనము ఇతరులకంటె తీవ్రముగ న్యాయవిచారణకు గురి అగుదుమని మీకు తెలియును గదా! కనుక మీలో ఎక్కువ మంది బోధకులు కారాదు. 2. మనము అందరమును పెక్కు తప్పులు చేయుచునే ఉందుము. ఎన్న డును తన మాటలయందు తప్పు చేయనివాడు పరిపూర్ణుడే. అట్టివాడు తన శరీరమును అదుపులో ఉంచుకొనగల వ్యక్తి. 3. గుఱ్ఱములు మనకు లొంగి ఉండుటకు వాని నోటికి కళ్ళెములు తగిలింతుము. అప్పుడే ఆ గుఱ్ఱములను మనము అదుపులో ఉంచగలము. 4. అట్లే ఒక ఓడ ఉన్నదనుకొనుడు. అది పెద్దదే కావచ్చు. అది పెనుగాలికి కొట్టుకొని పోవుచున్నను ఒక చిన్న చుక్కానితో ఓడ నడుపువాడు దానిని తన ఉద్దేశము చొప్పున త్రిప్పగా ఆ ప్రకారమే అది సాగిపోవును. 5. మన నాలుక విషయమునను ఇంతే. అది ఒక చిన్న అవయవమేయైనను, తనను తాను పొగడుకొనుటయందు అది దిట్ట. ఒక చిన్న నిప్పురవ్వ ఎంత విస్తారమైన అడవినైన తగులబెట్టును! 6. నాలుక నిప్పువంటిది. అదియొక దోష ప్రపంచము. దానికి నిలయము మన శరీరము. అది మన శరీరము నంతను మలినము చేయును. మన జీవితము సర్వస్యమునకు అది నిప్పుపెట్టును. దానికి ఆ అగ్నిజ్వాల నరకము నుండియే ప్రాప్తించును. 7. మానవుడు జీవకోటినంతటిని మచ్చిక ఒనర్చుకొనగలడు. ఇంతకు పూర్వమే మచ్చిక ఒనర్చుకొ

James chapter 1 || Telugu Catholic Bible || యాకోబు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము

 1. దేవునియొక్కయు, యేసుక్రీస్తు ప్రభువుయొక్కయు, సేవకుడగు యాకోబు నుండి: ప్రపంచమునందంతటను చెదరియున్న పండ్రెండు గోత్రముల వారికి శుభాకాంక్షలు. 2. నా సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనునప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగ ఎంచుకొనుడు. 3. ఎట్లన, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుటవలన, మీకు సహనము చేకూరును. 4. కాని మీ సహనము విఫలముకాక, తుదివరకు మిమ్ము తీసుకొనిపోవునట్లు చూచు కొనుడు. అపుడు మీరు ఏ కొరతయులేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. 5. కాని మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్నయెడల, అతడు దేవుని అడుగవలెను. ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరకు ఉదారముగ అనుగ్రహించును గదా! 6. కాని అతడు విశ్వాసముతో అడుగవలెను. ఏ మాత్ర మును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్రతరంగము వంటివాడు. 7. అట్టి వాడు ప్రభువు నుండి ఏమైన పొందగలనని తలంపరాదు. 8. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు. 9. దీనస్థితిలో నున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను. 10. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలెను. ఏలయన గడ్డి

Hebrews chapter 10 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము

 1. యూదుల చట్టము, రాబోవు మేలుల ఛాయ గలదియేగాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. ఏటేట ఎడతెగక ఒకే విధమైన బలులు అర్పింపబడుచుండెను. అటులైనచో ఈ బలుల మూలమున దేవుని చేరదలచిన ప్రజలను, చట్టము ఎట్లు సంపూర్డులను చేయగలదు? 2. దేవుని పూజించు ప్రజలు నిజముగ వారి పాపములు తొలగింపబడి ఉన్నచో, ఇక ఏ మాత్రము వారు పాపాత్ములమను కొనరు. అప్పుడు వానిని అర్పించుట మానుకొందురు గదా! 3. ప్రజలకు ఏటేట వారి పాపములను గూర్చి గుర్తుచేయుటకు ఈ బలులు తోడ్పడుచున్నవి. 4. ఏలయన ఎద్దులయొక్కయు, మేకలయొక్కయు రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు. 5. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవే శించునపుడు, దేవునితో క్రీస్తు ఇట్లు అనెను: “నీవు జంతుబలులను, అర్పణలను కోరలేదు. కాని నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. 6. దహన బలులకును, పాప పరిహారార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు.” 7. అప్పుడు నేను ఇట్లంటిని: “నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగ, ఇదిగో! ఓ దేవా! నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను”. 8. ఆయన మొదట ఇట్లు చెప్పెను: “బలులను, అర్పణలను, దహనబలులను, పాపపరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు.” ఈ బలుల సమర్పణ

Hebrews chapter 6 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము

 1. కావున క్రీస్తు సందేశమునందలి ప్రారంభ దశను వదలి, పరిపక్వమైన బోధనలవైపుకు సాగి పోదము. ప్రయోజన రహితములగు పనులనుండి విముఖులమై, దేవుని విశ్వసింపవలెనను విషయ మును తిరిగి మనము ప్రస్తావింపరాదు. 2. అట్లే బప్తిస్మ బోధనలను గూర్చియు, హస్త నిక్షేపణమును గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు, శాశ్వతమగు తీర్పును గూర్చియు తిరిగి మనము ప్రస్తావింపరాదు. 3. దేవుని అనుమతి ఉన్నచో ముందుకు సాగుదము. 4. పతితులైన వారిని తిరిగి పశ్చాత్తాప మార్గమునకు తెచ్చుట ఎట్లు? ఒకప్పుడు వారు జ్ఞానజ్యోతిని పొంది, పరలోక వరమును చవిచూచిరి. పవిత్రాత్మలో భాగస్వాములైరి. 5. దేవుని సువార్తను, భవిష్యత్కాలపు శక్తుల ప్రభావములను రుచిచూచిరి. 6. అయినను భ్రష్టులైరి. వారు దేవుని కుమారుని తిరిగి సిలువ వేయుచు, బహిరంగముగ అవమానములపాలు చేయుచున్నందున, వారిని పశ్చాత్తాపమునకు తిరిగి మరల్చుట అసాధ్యము. 7. ఏలయన, భూమి తనపై తరచుగా కురియు వాన నీటిని గ్రహించి, వ్యవసాయము చేయువారికి అనుకూలమైన పంట పండించినయెడల దేవుని దీవెనను పొందును. 8. కాని అది ముళ్ళపొదలు, కలుపు మొక్కలు పెరుగు భూమియైనచో విలువలేనిది అగును. అట్టిదానికి దేవునిచే శపింపబడు ప్రమాదమున్నది. అది అగ్న

Philemon chapter 1 || Telugu Catholic Bible || ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము

 1. క్రీస్తుయేసు కొరకు బందీయైన పౌలు, మన సోదరుడగు తిమోతి: మాకు ప్రియమైన తోడిపని వాడును అయిన ఫిలేమోనునకును, 2. మన సహో దరియగు అప్పియకును, మన తోడి సైనికుడగు అర్కిప్పునకును, నీ ఇంట సమావేశమగు దైవసంఘ మునకు వ్రాయునది: 3. మన తండ్రి దేవునినుండియు, ప్రభువగు యేసు క్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము. 4. ప్రార్థించునపుడెల్లను నిన్ను జ్ఞాపకము చేసికొని దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. 5. ఏలయన ప్రభువైన యేసుక్రీస్తుయెడల, పవిత్రులందరియెడల నీకు ఉన్న ప్రేమను, విశ్వాసమును గూర్చియు నేను వినియున్నాను. 6. విశ్వాసమునందు నీతోడి మా సహవా సము, మనము క్రీస్తునందు కలిగియున్న ప్రతి ఆశీ ర్వాదమును మరింత సుబోధక మొనర్చునుగాక! అని నా ప్రార్ధన. 7. నా సోదరుడా! నీ ప్రేమ నాకు అమిత మగు ఆనందమును, ఊరటను కలిగించినది. ఏలయన పవిత్రుల మనస్సులకు నీవు విశ్రాంతిని కలిగించితివి. 8. ఈ కారణము వలననే, నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను, 9. దానికి బదులుగా ప్రేమకొరకై ప్రాధేయపడు చున్నాను. యేసు క్రీస్తు కొరకు రాయబారి, ఇపుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయు చున్నాడు. 10. నేను చెరసాలలో ఒనేసిమునకు తండ్రిగా మారాను. ఆ బిడ్