1. నోవా కుమారులు షేము, హాము, యాఫెతుల వంశవృత్తాంతము ఇది. జలప్రళయము తరువాత ఆ ముగ్గురికి కుమారులు పుట్టిరి. 2. యాఫేతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. 3. గోమెరు కుమారులు: అష్మనసు, రీఫతు, తోగర్మా, 4. యావాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిట్టీము, దాడోనీము. 5. వీరినుండి ద్వీపనివాసులు తమతమ భాషల ప్రకారము, తమతమ కుటుంబముల ప్రకారము, తమతమ జాతుల ప్రకారము వేరై ఆయా దేశములలో స్థిరపడిరి. 6. హాము కుమారులు: కూషు, మిస్రాయీము, పూతు, కనాను. 7. వీరిలో కూషుకు సెబా, హవీలా, సప్తా, రామా, సబ్తకా అను కుమారులుకలిగిరి. వారిలో రామాకు షెబా, దెదాను అను కుమారులు 8. కూషుకు నిమ్రోదు పుట్టెను. నిమ్రోదు భూలోకములో మహావీరుడుగా ప్రసిద్ధిగాంచెను. 9. అతడు దేవుని దయవలన బలిమిగల వేటకాడయ్యెను. కావున “దేవుడు నిన్ను నిమ్రోదువలె గొప్ప వేటగానిని చేయుగాక” అను లోకోక్తి వ్యాపించెను. 10. మొట్టమొదట షీనారు దేశమందున్న బాబెలు, యెరెకు, అక్కదు అను పటణములతో అతని రాజ్యము ప్రారంభమయ్యెను. 11. నిమ్రోదు ఆ దేశమునుండి బబులోనియాకు వలసపోయెను. అతడు నీనెవె, రహోబోతీరు, కాలహు, రెసెను అను పట్టణములను నిర్మించెను. 12. రెసెను- నీనెవె,