ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

adikandam telugu bible లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Genesis chapter 10 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 10వ అధ్యాయము

 1. నోవా కుమారులు షేము, హాము, యాఫెతుల వంశవృత్తాంతము ఇది. జలప్రళయము తరువాత ఆ ముగ్గురికి కుమారులు పుట్టిరి. 2. యాఫేతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. 3. గోమెరు కుమారులు: అష్మనసు, రీఫతు, తోగర్మా, 4. యావాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిట్టీము, దాడోనీము. 5. వీరినుండి ద్వీపనివాసులు తమతమ భాషల ప్రకారము, తమతమ కుటుంబముల ప్రకారము, తమతమ జాతుల ప్రకారము వేరై ఆయా దేశములలో స్థిరపడిరి. 6. హాము కుమారులు: కూషు, మిస్రాయీము, పూతు, కనాను. 7. వీరిలో కూషుకు సెబా, హవీలా, సప్తా, రామా, సబ్తకా అను కుమారులుకలిగిరి. వారిలో రామాకు షెబా, దెదాను అను కుమారులు 8. కూషుకు నిమ్రోదు పుట్టెను. నిమ్రోదు భూలోకములో మహావీరుడుగా ప్రసిద్ధిగాంచెను. 9. అతడు దేవుని దయవలన బలిమిగల వేటకాడయ్యెను. కావున “దేవుడు నిన్ను నిమ్రోదువలె గొప్ప వేటగానిని చేయుగాక” అను లోకోక్తి వ్యాపించెను. 10. మొట్టమొదట షీనారు దేశమందున్న బాబెలు, యెరెకు, అక్కదు అను పటణములతో అతని రాజ్యము ప్రారంభమయ్యెను. 11. నిమ్రోదు ఆ దేశమునుండి బబులోనియాకు వలసపోయెను. అతడు నీనెవె, రహోబోతీరు, కాలహు, రెసెను అను పట్టణములను నిర్మించెను. 12. రెసెను- నీనెవె,

Genesis chapter 9 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 9వ అధ్యాయము

 1. దేవుడు నోవాను, అతని కుమారులను దీవించి “పిల్లలతో, పాపలతో పెంపొంది భూమియందంతట వ్యాపింపుడు. 2. క్రూరజంతువులకు, ఆకాశమున విహరించుపక్షులకు, భూమిమీద నడయాడు ప్రతి ప్రాణికి, సముద్రమున సంచరించు చేపలకు మీరన్నచో బెదురుపుట్టును. వానిని మీ వశము చేసితిని. 3. భూమిమీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును. చెట్టుచేమలను ఇచ్చినట్లే, ఇప్పుడు ఈ ప్రాణులను గూడ మీకు అప్పగించుచున్నాను. 4. నెత్తుటిలో ప్రాణముండును. కనుక, మీరు జంతువుల మాంసమును తినునపుడు వాని నెత్తురు మాత్రము ముట్టుకొనరాదు. 5. నెత్తురు ప్రాణముతో సమానము. కావున నెత్తురు చిందించువారు జంతువులైనను, నరులైనను నాకు జవాబుదారులగుదురు. మనుష్యుని ప్రాణమునకు మనుష్యునినే బాధ్యునిగా చేసెదను. 6. దేవుడు తనను పోలిన వానినిగా మానవుని సృజించెను. అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెత్తుటిని గూడ నరుడే చిందించును. 7. పిల్లలతో, పాపలతో పెంపొందుడు. భూ మండలమంతట వ్యాప్తి చెందుడు” అనెను. 8-9. దేవుడు నోవాను, అతని కుమారులను చూచి “నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసికొనుచున్నాను. 10. ఓడనుండి వెలుపలికి వచ్చి మీతోపాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూరమృగములు - ఇంత ఎందులకు? మీ చెంత

Genesis chapter 8 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 8వ అధ్యాయము

 1. నోవా, ఓడలో అతనితోపాటునున్న క్రూర మృగములు, పశువులు దేవునకు జ్ఞప్తికివచ్చెను. దేవుడు భూమిమీద గాలివీచునట్లు చేసెను. అంతట నీరుతీయుట మొదలయ్యెను. 2. అగాధజలముల ఊటలుతగెను. ఆకాశరంధ్రములు మూతపడెను. పైనుండి పడుచున్న వానవెలిసెను. 3. క్రమక్రమముగా భూమిమీది నుండి నీళ్ళు తీసిపోవుచుండెను. నూటయేబది రోజులు అయిన పిదప నీరు పూర్తిగా తగ్గేను. 4. ఏడవనెల పదునేడవ రోజున ఓడ అరారతులోనున్న కొండకొమ్మున నిలిచెను. 5. పదవనెలవరకు నీళ్ళు తగ్గుచు వచ్చెను. పదవనెల మొదటిరోజున కొండకొమ్ములు కనబడెను. . 6. నలువది రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరచెను. నీరు తగెనో లేదో తెలిసికొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. 7. అది భూమి మీది నీరు ఇంకిపోవు వరకు అటునిటు తిరుగాడెను. 8. తరువాత నీళ్ళు తగ్గేనో లేదో తెలిసికొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను. 9. ఇంకను భూమిమీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటుకూడలేదు. అందుచే అది ఓడలో నున్న నోవా వద్దకే తిరిగివచ్చెను. నోవా చేయిచాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. 10. మరియొక ఏడురోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. 11. అది క్రొత్తగా త్రుంచిన ఓలివుచెట్టు రెమ్మను నోటకరచుకొ

Genesis chapter 7 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 7వ అధ్యాయము

 1. దేవుడు నోవాతో “ఈ తరము వారిలో నీవు ఒక్కడవే నీతిమంతుడవు. కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు. 2. స్వచ్చమైన వానిలో ప్రతిజాతి వానిని ఏడుజంటల చొప్పున నీతోపాటు తీసికొని వెళ్ళుము. స్వచ్చముకాని అశుచికరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతిదానిని ఒక్కజంట చొప్పున కొనిపొమ్ము. 3. పక్షులలో ప్రతిజాతికి చెందిన వానిని ఏడు జంటలచొప్పున తీసికొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమిమీది ప్రాణులు నశింపవు. 4. ఇంక ఏడు రోజులకు భూమిమీద నలువదిపగళ్ళు, నలువది రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమిమీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండ చేయుదును” అనెను. 5. నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను. 6. భూలోకములో జలప్రళయము సంభవించినప్పుడు నోవా వయస్సు ఆరువందల యేండ్లు. 7. జలప్రళయము తప్పించుకొనుటకై నోవా తన భార్య, కొడుకులు, కోడండ్రతో ఓడలోనికి వెళ్ళెను. 8-9. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తినదగిన జంతువులలో, తినదగని జంతువులలో, ప్రాకెడు పురుగులలో, పక్షులలో ప్రతిజాతికి చెందినవి జతలు జతలుగా ఓడలోనున్న నోవా వద్దకు చేరెను. 10. అంతట ఏడు రోజులయిన తరువాత భూలోకములో జలప్రళయము సంభవించెను. 11. నోవాకు ఆరువందల యేండ్లు నిండి రెండు నెలల పదునేడవనాడు అగాధజల

Genesis chapter 6 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 6వ అధ్యాయము

 1. మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి. వారికి కుమార్తెలు పుట్టిరి. 2. దేవపుత్రులు వారి సౌందర్యమును చూచి, వారిలో తమకు నచ్చినవారిని పెండ్లాడిరి. 3. కాని దేవుడు “నా ఆత్మ మనుష్యునితో ఎల్లప్పుడును వాదించదు. అతడు భౌతికదేహము ధరించిన దుర్బలప్రాణి. నరుడు నూట యిరువది యేండ్లు మాత్రమే బ్రతుకును” అని తలంచెను. 4. ఆ రోజులలో భూమిపై నెఫీలులను మహాకాయులు ఉండిరి. దేవపుత్రులు మానవ స్త్రీలను కూడగా జన్మించినవారే ఈ మహాకాయులు. వారే ప్రసిద్ధుల యిన పురాతన వీరులు. 5. భూమిపై గల మానవులు పరమ దుష్టులై పోయిరి. వారు ఎల్లప్పుడు చెడుపనులు చేయవలెననియే తలంచుచుండిరి. 6. ఇది చూచి దేవుడు భూమిమీద మానవుని సృష్టించినందులకు పరితాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. 7. అంతట దేవుడు "నేనే సృష్టించిన ఈ మానవజాతిని జంతువులతో, ప్రాకెడుపురుగులతో, పక్షులతో సైతము భూమి మీద కానరాకుండ మొదలంట తుడిచి వేయుదును. ఈ మానవులను సృజించినందులకు చింతించు చున్నాను” అని అనుకొనెను. 8. కాని నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. 9. నోవా వంశచరిత్ర ఇది: నోవా నీతిమంతుడు. తన కాలమువారిలో ఉత్తముడు. దేవునకు సహచరుడై జీవించెను. 10. అతనికి షేము, హాము, యాఫెతు అన

Genesis chapter 5 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 5వ అధ్యాయము

 1. ఆదాము వంశీయుల వృత్తాంతము ఇది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనిని తనను పోలినవానిగా చేసెను. 2. వారిని స్త్రీ పురుషులనుగా చేసెను. వారిని సృష్టించినప్పుడే ఆశీర్వదించి వారికి “నరుడు” అను పేరు పెట్టెను. 3. ఆదాము నూటముప్పది యేండ్ల వయస్సున తన పోలికయున్న రూపముగల కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. 4. షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిదివందలయేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి. 5. అతడు తొమ్మిదివందలముప్పది యేండ్లు బ్రతికి చనిపోయెను. 6-7. ఎనోషు పుట్టినపుడు షేతు వయసు నూట ఐదేండ్లు, తరువాత అతడు ఎనిమిదివందల యేడేండ్లు జీవించి కుమారులను, కుమార్తెలను కనెను. 8. షేతు తొమ్మిదివందల పండ్రెండేండ్లు బ్రతికి చనిపోయెను. 9-10. కేనాను పుట్టినప్పుడు ఎనోషు తొంబది. యేండ్లవాడు. తరువాత ఎనోషు ఎనిమిదివందల పదునైదేండ్లు జీవించి, కుమారులను కుమార్తెలను కనెను. 11. అతడు తొమ్మిది వందల ఐదేండ్లు బ్రతికి చనిపోయెను. 12-13. మహలలేలు పుట్టినపుడు కేనాను వయస్సు డెబ్బది యేండ్లు. అతడు పుట్టిన తరువాత కేనాను ఎనిమిదివందల నలువదియేండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. 14. అతడు తొమ్మిదివందల పదియేండ్లు బ్ర

Genesis chapter 4 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 4వ అధ్యాయము

 1. ఆదాము తన భార్య ఏవను కూడెను. ఆమె గర్భవతియై కయీనును కనెను. “దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను” అని ఆమె తలంచెను. 2. తరువాత ఆమె కయీను తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెలకాపరి. కయీను సేద్యగాడు. 3. కొంతకాలము గడచిన తరువాత కయీను పండినపంటలో కొంతపాలు దేవునికి కానుకగా కొనివచ్చెను. 4. హేబెలు కూడ మందలో పుట్టిన తొలిచూలు పిల్లలను, వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభువు హేబెలును, అతని కానుకను ప్రసన్నదృష్టితో చూచెను. 5. కాని కయీను కానుకను తోసిపుచెను. కావున కయీను మిక్కిలి కోపముతో ముఖము చిన్నబుచ్చుకొనెను. " 6. ప్రభువు కయీనుతో “నీకు కోపమేల? నీ ముఖము చిన్నబుచ్చుకొననేల? 7. మంచిపనులు చేసినచో తలయెత్తుకొని తిరుగగలవు. చెడుపని చేసినచో పాపమువచ్చి వాకిట పొంచియుండి నిన్ను మ్రింగజూచును. కాని నీవు దానిని అణగదొక్కవలెను.” అని అనెను. 8. ఒకనాడు కయీను తన సోదరుడు హేబెలుతో “మనమిద్దరము పొలమునకు వెళ్ళుదము రమ్ము" అని అడిగెను. అక్కడికి వెళ్ళిన తరువాత కయీను హేబెలు మీదపడి అతనిని చంపెను. 9. “నీ తమ్ముడు హేబెలు ఎక్కడ?” అని ప్రభువు కయీనును అడిగెను. దానికి కయీను “నాకు తెలియదు. నేనేమైన వానికి కావలి

Genesis chapter 3 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 3వ అధ్యాయము

 1. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సర్పము జిత్తులమారిది. అది “తోటలో నున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట! నిజమేనా?" అని స్త్రీని అడిగెను. 2-3. దానికి స్త్రీ “తోట నడుమనున్న చెట్టుపండు తప్ప  మిగిలిన ఏ చెట్టు పండయినను మేము తినవచ్చును. ఆ చెట్టుపండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని దేవుడు చెప్పెను” అని బదులిచ్చెను. 4. అంతట సర్పము “ఆ మాట నిజముగాదు. మీరు చావనే చావరు. 5. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, మీరు మంచిచెడులు తెలిసికొని దేవునివలె అగుదురనియు ఎరిగి ఆయన మీకు అటుల చెప్పెను” అని అనెను. 6. స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ‘ఆ పండు వలన తెలివితేటలు గలిగిన, ఎంత బాగుండునోకదా!' అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టుపండ్లు కోసి తానుతిని, తనతోపాటు నున్న తన భర్తకును ఇచ్చెను. అతడును తినెను. 7. అపుడు వారిద్దరి కనులు తెరువబడెను. తాము దిసమొలతో ఉన్నట్లు వారు తెలిసికొనిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. 8. ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్ల గాలికి తోటలో తి

Genesis chapter 2 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 2వ అధ్యాయము

 1. ఈ విధముగా ఆకాశము, భూమి, సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొందెను. 2. ఏడవరోజు దేవుడు తాను చేయుచున్న పనియంతటి నుండి విశ్రమించెను. 3. సృష్టిని పూర్తిచేసి ఏడవరోజున దేవుడు తాను చేసిన, సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని 'పవిత్రదినము'గా చేసెను. 4. భూమ్యాకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. 5. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు, నేలమీద పచ్చని చెట్టుచేమలేవియును లేవు. ఏలయన దేవుడు భూమిమీద వానలు కురిపింపలేదు. నేలను సాగుచేయుటకు ఎవ్వడును లేడు. 6. కాని భూమి నుండి నీటియావిరి పెల్లుబికి నేలనెల్ల తడుపుచుండెను. 7. అప్పుడు దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసికొని, దానినుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను. 8. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోటను నాటెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. 9. చూచుటకు ఇంపుగానుండి, తినుటకు తియ్యగానుండు పండ్లనిచ్చు చెట్లన్నియు ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోటనడుమ జీవమిచ్చుచెట్టు, మంచిచెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింపచేసెను. 10. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహ

Genesis chapter 1 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 1వ అధ్యాయము

 1. ఆదిలో దేవుడు ఆకాశమును, భూమిని సృష్టించెను. 2. భూమికి ఒక ఆకారము లేకుండ శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించియుండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. 3. అపుడు 'వెలుగు కలుగునుగాక” అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. 4. దేవుని కంటికది బాగుగా నుండెను. ఆయన చీకటినుండి వెలుగును వేరుచేసెను. 5. వెలుగునకు పగలని, చీకటికి రాత్రియని పేర్లు పెట్టెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే మొదటి రోజు. 6. “నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని రెండు భాగములుగా విడదీయును గాక" అని దేవుడానతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. 7. పై నీటి నుండి క్రింది నీటిని వేరుచేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. 8. ఆయన ఆ గుండ్రని కప్పునకు 'ఆకాశము' అని పేరు పెట్టెను. అంతట సాయంకాలము గడచి, ఉదయమాయెను. అదే రెండవ రోజు. 9.' 'ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రింద నున్న నీరంతా ఒక చోట నిలుచును గాక!" అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను. 10. ఆరిన నేలకు భూమియని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికది బాగుగానుండెను. 11."గింజల నిచ్చు