ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

telugu catholic bible pdf లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పేతురు వ్రాసిన 1వ లేఖ

1వ అధ్యాయము + -  1. యేసుక్రీస్తు అపోస్తలుడగు పేతురు, పొంతు, గలతీయ, కప్పదోసియ, ఆసియా, బితూనియాల యందు చెదరిపోయి, వలసదారులుగా జీవించు దేవుని ప్రియజనులకు వ్రాయునది: 2. పితయగు దేవుని సంకల్ప ఫలముగనే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసు క్రీస్తునకు విధేయులగుటకును,ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మవలన పవిత్రులనుచేసెను. మీకు కృపయు, సమాధానము లభించునుగాక! 3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలోనుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థాన మొనరించి, దాని మూలమున మనకు నూత్న జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. 4. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీకొరకై పరలోకమున భద్ర పరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. 5. మీరు యుగాంతమున ప్రకటింపబడెడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడు చున్నారు. కనుక అవి మీ కొరకే. 6. మీరు ఎదుర్కొనవలసిన పలువిధములగు పరీక్షలవలన తాత్కాలికముగ మీకు బాధ కలిగినను, దీనిని గూర్చి సంతోషింపుడు. 7.

యాకోబు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. దేవునియొక్కయు, యేసుక్రీస్తు ప్రభువుయొక్కయు, సేవకుడగు యాకోబు నుండి: ప్రపంచమునందంతటను చెదరియున్న పండ్రెండు గోత్రముల వారికి శుభాకాంక్షలు. 2. నా సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనునప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగ ఎంచుకొనుడు. 3. ఎట్లన, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుటవలన, మీకు సహనము చేకూరును. 4. కాని మీ సహనము విఫలముకాక, తుదివరకు మిమ్ము తీసుకొనిపోవునట్లు చూచు కొనుడు. అపుడు మీరు ఏ కొరతయులేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. 5. కాని మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్నయెడల, అతడు దేవుని అడుగవలెను. ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరకు ఉదారముగ అనుగ్రహించును గదా! 6. కాని అతడు విశ్వాసముతో అడుగవలెను. ఏ మాత్ర మును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్రతరంగము వంటివాడు. 7. అట్టి వాడు ప్రభువు నుండి ఏమైన పొందగలనని తలంపరాదు. 8. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు. 9. దీనస్థితిలో నున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను. 10. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్విం

హెబ్రీయులకు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధ ములుగ ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లా డెను. 2. కాని, ఈ కడపటి దినములలో ఆయన తన కుమారునిద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియ మించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. 3. ఆ కుమారుడు దేవుని మహిమయొక్క తేజస్సుగాను, అతని మూర్తిమంతమైన ప్రతిరూప ముగా ఉన్నాడు. శక్తిగల తనవాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తిని చేసినవాడై పిదప పరలోకమున సర్వ శక్తిమంతుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 4. ఆ కుమారుడు దేవదూతల కంటె ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటె అంత ఘనుడు. 5. ఎట్లన “నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని” అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా పలికి ఉండెనా? అట్లే “నేను ఆయన తండ్రినగుదును. ఆయన నా కుమారుడగును” అని దేవుడు ఏ దూతతోనైన చెప్పియుండెనా? 6. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినపుడు, “దేవుని దూతలందరు ఆయనను పూజింపవలెను” అనియు చెప్పుచున్నాడు. 7. దేవదూతలను గూర్చి దేవుడిట్లు పలికెను: “దేవుడు తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసికొనెను.” 8

యూదా వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. యేసుక్రీస్తు సేవకుడును, యాకోబు సహోదరుడునైన యూదా నుండి, దేవునిచే పిలువబడి, తండ్రియగు దేవుని ప్రేమయందును, యేసుక్రీస్తు రక్షణనందు జీవించువారికి: 2. కృప, శాంతి, ప్రేమ మీయందు విస్తరించునుగాక! 3. ప్రియులారా! మనందరి రక్షణను గూర్చి నేను మీకు వ్రాయ ఆశించితిని. కాని దేవుడు తన ప్రజలకు శాశ్వతముగా ఒసగిన విశ్వాసమునకై మీరు పోరాడు చునే ఉండవలెనని మిమ్ము ప్రోత్సాహపరచుట అవసరమని తోచినది. కనుకనే నేను ఇట్లు వ్రాయుచున్నాను. 4. దొంగచాటుగ మనయందు భక్తిహీనులు కొందరు ప్రవేశించి, మన ఏకైక యజమానుడును, ప్రభువునగు యేసుక్రీస్తును తిరస్కరించి, వారి అవినీతికరమగు ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవకృపను గూర్చిన సందేశమునకు అపార్థములు కల్పించుచున్నారు. వారు తీర్పునకు గురియగుదురు అను విషయము ముందే సూచింపబడినది. 5. మీకు ఈ విషయమంతయు చిరపరిచితమే అయినను, యిస్రాయేలు ప్రజలను ప్రభువు ఐగుప్తుదేశమునుండి రక్షించినప్పటికి వారిలో విశ్వసింపని వారిని తరువాత ఆయన నాశనము చేసిన విషయము మీకు జ్ఞాపకము చేయ తలంచితిని. 6. తమ నియమిత అధికారమును అతి క్రమించి, తమ నివాసములను విడిచిన దేవదూతల వృత్తాంతమును స్మరింపుము. దేవుడు వారిని అధః పాత

ఫిలేమోనుకు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. క్రీస్తుయేసు కొరకు బందీయైన పౌలు, మన సోదరుడగు తిమోతి: మాకు ప్రియమైన తోడిపని వాడును అయిన ఫిలేమోనునకును, 2. మన సహో దరియగు అప్పియకును, మన తోడి సైనికుడగు అర్కిప్పునకును, నీ ఇంట సమావేశమగు దైవసంఘ మునకు వ్రాయునది: 3. మన తండ్రి దేవునినుండియు, ప్రభువగు యేసు క్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము. 4. ప్రార్థించునపుడెల్లను నిన్ను జ్ఞాపకము చేసికొని దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. 5. ఏలయన ప్రభువైన యేసుక్రీస్తుయెడల, పవిత్రులందరియెడల నీకు ఉన్న ప్రేమను, విశ్వాసమును గూర్చియు నేను వినియున్నాను. 6. విశ్వాసమునందు నీతోడి మా సహవా సము, మనము క్రీస్తునందు కలిగియున్న ప్రతి ఆశీ ర్వాదమును మరింత సుబోధక మొనర్చునుగాక! అని నా ప్రార్ధన. 7. నా సోదరుడా! నీ ప్రేమ నాకు అమిత మగు ఆనందమును, ఊరటను కలిగించినది. ఏలయన పవిత్రుల మనస్సులకు నీవు విశ్రాంతిని కలిగించితివి. 8. ఈ కారణము వలననే, నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను, 9. దానికి బదులుగా ప్రేమకొరకై ప్రాధేయపడు చున్నాను. యేసు క్రీస్తు కొరకు రాయబారి, ఇపుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయు చున్నాడు. 10. నేను చెరసాలలో ఒనేసిమునకు తండ్ర

తీతుకు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. దేవుని సేవకుడును, యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలునుండి: ఎన్నుకొనబడిన దేవుని ప్రజల విశ్వాసమునకు తోడ్పడుటకును, భక్తి జీవనసంబంధమగు సత్యమును బోధించుటకును, 2.నిత్యజీవమును గూర్చిన నమ్మకమును వారి కొసగుటకును నేను ఎన్ను కొనబడితిని. ఈ నిత్యజీవమును దేవుడు చాలకాలము క్రితమే వాగ్రత్త మొనర్చెను. ఆయన ఎన్నటికిని అసత్య మాడడు. 3. కనుక, యుక్తసమయమున తానొనర్చిన వాగ్దానమును ఆయన ప్రదర్శించెను. నాకు అప్పజెప్ప బడిన ఈ విషయమును, మన రక్షకుడైన దేవుని ఆజ్ఞచే నేను ప్రకటించుచున్నాను. 4. మన విశ్వాసమునందు సహపాలివాడును నా నిజమైన కుమారుడు తీతునకు వ్రాయుచున్నాను: పితయగు దేవునినుండియు, మన రక్షకుడగు క్రీస్తు యేసునుండియు నీకు కృప, సమాధానము. 5. నేను నీకాజ్ఞాపించిన ప్రకారము ఇంకను తీర్చి దిద్దబడవలసిన వానిని క్రమపరచుటకును, ప్రతినగరము నందును దైవసంఘమునకు పెద్దలను నియమించుటకును, నిన్ను నేను క్రీటులో వదలి వచ్చితిని. 6. సంఘాధిపతి దోషరహితుడును, ఒకే భార్య కల వాడునై ఉండవలెను. అతని పిల్లలు భోగలాలసులును, క్రమరహితులును గాక, విశ్వాసము గలవారై ఉండవలెను. 7. అతడు దేవుని పనికి యాజమాన్యము వహించును కనుక, సంఘాధిపతి నిందారహితుడై

తిమోతికి వ్రాసిన 2వ లేఖ

1వ అధ్యాయము + -  1. క్రీసు యేసునందును జీవమును గూర్చియు వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, 2. నాప్రియ పుత్రుడగు తిమోతికి వ్రాయునది: పితయగు దేవునినుండియు, మన ప్రభువగు క్రీస్తుయేసునుండియు, నీకు కృప, కనికరము, సమాధానము. 3. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను స్మరించుచు, నా పితరులవలె నిర్మలమైన అంతఃకరణ ముతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను. 4. నీ కన్నీరు తలంచుకొని, నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవ లెనని రేయింబవళ్ళు ఎంతగానో ఆశించుచున్నాను. 5. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి, తల్లియగు యూనీకేలోను ఉండెడిది. కనుక ఇపుడు అట్టి విశ్వాసము నీలోను ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. 6. అందు వలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింప వలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 7. దేవుడు మనకు పిరికితనముగల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. 8. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకుగాని, ఆయన బందీనగు నన్ను గూర్చిగాని, నీవు సిగ్గుపడకుము. దానికి