1. క్రీసు యేసునందును జీవమును గూర్చియు వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు,
2. నాప్రియ పుత్రుడగు తిమోతికి వ్రాయునది: పితయగు దేవునినుండియు, మన ప్రభువగు క్రీస్తుయేసునుండియు, నీకు కృప, కనికరము, సమాధానము.
3. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను స్మరించుచు, నా పితరులవలె నిర్మలమైన అంతఃకరణ ముతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను.
4. నీ కన్నీరు తలంచుకొని, నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవ లెనని రేయింబవళ్ళు ఎంతగానో ఆశించుచున్నాను.
5. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి, తల్లియగు యూనీకేలోను ఉండెడిది. కనుక ఇపుడు అట్టి విశ్వాసము నీలోను ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు.
6. అందు వలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింప వలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.
7. దేవుడు మనకు పిరికితనముగల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను.
8. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకుగాని, ఆయన బందీనగు నన్ను గూర్చిగాని, నీవు సిగ్గుపడకుము. దానికి మారుగ దేవుని శక్తివలన సువార్తకొరకై నావలె పాటుపడుము.
9. మనము చేసిన కార్యములవలనగాక, అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి, పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అను గ్రహమును మనకు ప్రసాదించెను.
10. కాని ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్యజీవ మును మనకు ప్రదర్శించెను.
11. అపోస్తలునిగ, బోధకునిగ, ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను.
12. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచు న్నాను. అయినను నేను సిగ్గుపడుట లేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియును. ఆయన నాకు అప్పగించిన దానిని, ఆనాటివరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది.
13. నీవు నానుండి వినిన దానిని స్వచ్చమైన సిద్దాంతమునకు ఆదర్శముగ పాటించుచు, క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమల యందు నిలిచియుండుము.
14. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మనయందు అవసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరచు కొనుము.
15. పుగెల్లు, హెర్మొగెనెతో సహా ఆసియా మండలములోని వారు అందరును నన్ను విడిచిపోయిరని నీకు తెలియును.
16. నన్ను పెక్కు మారులు ఉత్సాహపరచిన ఒనేసీఫోరు కుటుంబమును ప్రభువు కనిక రించునుగాక! నేను చెరయందు ఉంటినని అతడు సిగ్గుపడక,
17. రోమునకు వచ్చిన వెంటనే నా కొరకై శ్రద్దగ వెదకి నన్ను కనుగొనెను.
18. మహా దినమున ఆయన కనికరమునకు పాత్రుడగునట్లు ప్రభువు అతనిని అనుగ్రహించునుగాక! అతడు ఎఫెసులో నాకు ఎంతగా తోడ్పడెనో నీవు ఎరుగుదువు కదా!
1. అంత్య దినములలో కష్టసమయములు వచ్చు నని తెలిసికొనుము.
2. ప్రజలు స్వార్థపరులును, ధనా పేక్ష కలవారును, గర్విష్ఠులును, అహంకారులును అగుదురు. వారు పరులను అవమానింతురు. తల్లిదండ్రులను ధిక్కరింతురు. కృతఘ్నులును, అపవిత్రులును అగుదురు.
3. వారు కృపారహితులును, దయాహీనులును, పరులను దూషించువారును, క్రూరులును, దౌర్జన్యమొనర్చు వారును కాగలరు. జనులను వారు ద్వేషింతురు.
4. వారు మోసగాండ్రును, నిర్లక్ష్య స్వభావులును, గర్వముచే ఉబ్బి పోయిన వారునై ఉందురు. వారు దేవునికంటె శరీర సౌఖ్యములనే ఎక్కువగ. ప్రేమింతురు.
5. మతము యొక్క కేవల బాహ్యరూపమును మాత్రమే అంగీకరించి, వారు దాని యథార్థ ప్రభావమును తిరస్కరింతురు. ఇట్టి వారికి దూరముగ ఉండుము.
6. వారిలో కొందరు గృహములందు ప్రవేశించి, పలు రకములైన వ్యామోహములచే ప్రేరేపింపబడుచు, తమ పాపభారముచే క్రుంగిపోవు బలహీనురాండ్రగు స్త్రీలను వశపరచుకొందురు.
7. అట్టి స్త్రీలు నేర్చుకొనవలెనని సర్వదా ప్రయత్నించుచున్నప్పటికిని సత్యమును ఎన్న టికి తెలిసికొనలేరు.
8. యన్నే, యంత్రేలు మోషేను ఎదిరించినట్లే, విశ్వాసభ్రష్టులును, బుద్ధిహీనులును అగు ఈ మనుజులు సత్యమును ఎదిరించుచున్నారు.
9. యన్నే, యంబ్రెల విషయములో జరిగినట్లే వారు ఎంత మూడూలో అందరును గ్రహింతురు. కనుక వారు ఎక్కువగ పురోగమింపజాలరు.
10. కాని నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవిత ధ్యేయమును గమనించితివి. నా విశ్వా సమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను,
11. నా బాధలను, నా శ్రమలను తెలిసికొంటివి. అంతియోకు, ఇకోనియ, లిస్త్రాలలో నాకేమి సంభవించెనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణములగు హింసలు నీకు తెలియును, కాని ప్రభువు వానిని అన్నింటినుండి నన్ను రక్షించెను.
12. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవితమును గడపదలచిన వారు అందరును హింసింపబడుదురు.
13. దుర్జనులును, వంచకులును ఇతరులను మోసగించుచు, ఆత్మ వంచన మొనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టులగుదురు.
14. నీవు మాత్రము నీకు బోధింపబడిన వియు, నీవు దృఢముగా విశ్వసించునవియు అగు సత్యములయందే సాగిపొమ్ము. నీవు ఎవరినుండి నేర్చుకున్నావో నీకు తెలియును.
15. బాల్యమునుండి నీవు పవిత్రలేఖనములను ఎరిగియుంటివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తుయేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును.
16-17. దైవ జనుడు ఎట్టి సత్కార్యమునకైనను సంపూర్తిగ సిద్ధపడియుండునట్లు దైవప్రేరణ వలననే కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించుటకును, దోషమును ఖండించు టకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును తోడ్పడును.

1. ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చు చున్నందున సజీవులకును, మృతులకును తీర్పుతీర్చు క్రీస్తుయేసు ఎదుటను, దేవుని సమక్షమునను, నేను నిన్ను శాసించుచున్నాను.
2. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును, ప్రతి కూలసమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో, ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండుము.
3. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును. దురద చెవులు కలవారై తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు.
4. సత్యమును వినుటవదలి కట్టుకథల వైపు వెళ్ళుదురు.
5. కాని అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు, దేవుని సేవకుడవుగ నీ విధిని సక్రమముగా నేరవేర్పుము.
6. నేను పానార్పణముగ పోయబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది.
7. నేను మంచి పోరాటమును పోరాడితిని. నా పరుగును ముగించితిని. విశ్వాసమును నిలుపు కొంటిని.
8. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు. ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్నవారికి అందరికిని అనుగ్రహించును.
9. త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుము.
10. దేవ ఇహలోకముపై మక్కువతో నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి.
11. లూకా మాత్రమే నాతో ఉన్నాడు. మార్కును నీ వెంట బెట్టు కొనిరమ్ము. అతడు పనిలో నాకు సాయపడగలడు.
12. తుకికును నేను ఎఫెసునకు పంపితిని.
13. నీవు వచ్చునపుడు నేను త్రోయలో కర్పునొద్ద వదలి వచ్చిన నా అంగీని, నా గ్రంథములను, అందు ముఖ్యముగ చర్మపత్రములను వెంట తీసికొనిరమ్ము.
14. లోహకారుడగు అలెగ్జాండరు నాకు గొప్ప హానియొనర్చెను. వాని పనుల ననుసరించి ప్రభువు వానికి ప్రతిఫలమిచ్చును.
15. కాని నీవు మాత్రము వానిని గూర్చి జాగ్రత్తపడుము. మన సందేశమును అతడు ఎంతగానో ప్రతిఘటించెను.
16. మొదటిసారి నా పక్షమున నేను వాదించి నపుడు ఎవరును నాకు తోడు నిలువలేదు. అందరును నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగ దేవుడు దానిని లెక్కింపకుండునుగాక!
17. కాని, సువార్తా ప్రబోధము నా వలన సంపూర్తి యగుటకును, అన్య జనులందరు దానిని వినగలుగుటకును, ప్రభువు నాకు తోడునిలిచి శక్తినొసగెను. కనుక సింహము నోటినుండి నేను రక్షింపబడితిని.
18. ప్రభువు అన్ని కీడులనుండి కాపాడి నన్ను తన పరలోకరాజ్యములోనికి సురక్షి తముగ చేర్చుకొనును. ఆయనకు సర్వదామహిమ కలుగునుగాక! ఆమెన్.
19. ప్రిస్కకును, అక్విలాకును, ఒనేసిఫోరు కుటుంబమునకును నా శుభాకాంక్షలు.
20. ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను. త్రోఫిము వ్యాధిగ్రస్తుడై నందున అతనిని మిలేతలో వదలితిని.
21. శీతకాలమునకు ముందే నీవు ఇచ్చటకు వచ్చుటకు ప్రయ త్నింపుము. యుబూలు, పూదేను, లీను, క్లౌదీయలును, సోదరులందరును, తమ శుభాకాంక్షలను అందించుచున్నారు.
22. ప్రభువు నీ ఆత్మతో ఉండునుగాక! దేవుని కృప మీతో ఉండునుగాక!