ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

bible grandham telugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Revelation chapter 17 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 17వ అధ్యాయము

 1. అప్పుడు ఆ ఏడు పాత్రలుగల ఏడుగురు దేవదూతలలో ఒకడు నా కడకు వచ్చి, “నాతో రమ్ము అనేక జలములపై ఆసీనురాలైన మహావేశ్య ఎట్లు శిక్షింపబడనున్నదో నీకు చూపెదను. 2. భువియందలి రాజులు ఈ మహావేశ్యతో వ్యభిచరించిరి. ఆమె యొక్క జారత్వమను మద్యమును గ్రోలుటద్వారా భువియందలి ప్రజలు త్రాగుబోతులైరి” అని పలికెను. 3. నేను ఆత్మవశుడనైతిని. దేవదూత నన్ను ఒక ఎడారికి తీసికొనిపోయెను. అట ఒక ఎఱ్ఱని మృగముపై కూర్చుండియున్న ఒక స్త్రీని నేను చూచితిని. ఆ మృగము సర్వావయవములందును దుష్టనామములు లిఖింపబడి ఉండెను. ఆ మృగమునకు ఏడు తలలు, పది కొమ్ములు. 4. ఆ స్త్రీ ధూమ్ర, రక్త వర్ణములుగల వస్త్రములను ధరించి ఉండెను. ఆమె సువర్ణా భరణములను అమూల్యములైన రత్నములను, ముత్యములను దాల్చియుండెను. ఆమె హస్తమున ఒక సువర్ణ పాత్రను ధరించెను. అది ఆమె అసహ్యకరములు, జుగుప్సాకరములు, వ్యభిచారసంబంధమైన అపరిశుద్ధతతో నిండియుండెను. 5. ఆమె నుదుటియందు ఒక రహస్యార్ధము గల నామము లిఖింపబడి ఉండెను. “వేశ్యలకు మాతయు, లోకమునందలి దుర్నీతులకు తల్లియు అగు బబులోనియా మహానగరము” అని అట వ్రాయబడి ఉండెను. 6. ఆమె పునీతుల మరియు యేసు కొరకు ప్రాణమును ఇచ్చిన వేదసాక్షుల రక్తపానముచే మత్తిల్లి ఉండుట

Jude chapter 1 || Telugu Catholic Bible || యూదా వ్రాసిన లేఖ 1వ అధ్యాయము

 1. యేసుక్రీస్తు సేవకుడును, యాకోబు సహోదరుడునైన యూదా నుండి, దేవునిచే పిలువబడి, తండ్రియగు దేవుని ప్రేమయందును, యేసుక్రీస్తు రక్షణనందు జీవించువారికి: 2. కృప, శాంతి, ప్రేమ మీయందు విస్తరించునుగాక! 3. ప్రియులారా! మనందరి రక్షణను గూర్చి నేను మీకు వ్రాయ ఆశించితిని. కాని దేవుడు తన ప్రజలకు శాశ్వతముగా ఒసగిన విశ్వాసమునకై మీరు పోరాడు చునే ఉండవలెనని మిమ్ము ప్రోత్సాహపరచుట అవసరమని తోచినది. కనుకనే నేను ఇట్లు వ్రాయుచున్నాను. 4. దొంగచాటుగ మనయందు భక్తిహీనులు కొందరు ప్రవేశించి, మన ఏకైక యజమానుడును, ప్రభువునగు యేసుక్రీస్తును తిరస్కరించి, వారి అవినీతికరమగు ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవకృపను గూర్చిన సందేశమునకు అపార్థములు కల్పించుచున్నారు. వారు తీర్పునకు గురియగుదురు అను విషయము ముందే సూచింపబడినది. 5. మీకు ఈ విషయమంతయు చిరపరిచితమే అయినను, యిస్రాయేలు ప్రజలను ప్రభువు ఐగుప్తుదేశమునుండి రక్షించినప్పటికి వారిలో విశ్వసింపని వారిని తరువాత ఆయన నాశనము చేసిన విషయము మీకు జ్ఞాపకము చేయ తలంచితిని. 6. తమ నియమిత అధికారమును అతి క్రమించి, తమ నివాసములను విడిచిన దేవదూతల వృత్తాంతమును స్మరింపుము. దేవుడు వారిని అధః పాతాళమున శాశ్వత శృంఖల

Hebrews chapter 11 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము

 1. విశ్వసించుటయన, మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగ ఉండుట; మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయ ముగ ఉండుట. 2. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. 3. కంటికి కనిపింపని వానినుండి, కంటికి కనిపించు ప్రపంచము దేవుని వాక్కుచేత సృజింప బడినదని, విశ్వాసమువలన మనకు అర్థమగుచున్నది. 4. విశ్వాసమువలన హేబెలు కయీను కంటె ఉత్తమమగు బలిని దేవునికి అర్పించెను. అట్టి విశ్వా సమువలన అతడు నీతిమంతుడని గుర్తింపు పొందెను. అతని కానుకలను ఆమోదించిన దేవుడే అందుకు సాక్షి. హేబెలు మరణించెను. కాని విశ్వాసముద్వారా అతడు ఇంకను మాటలాడుచునే ఉన్నాడు. 5. విశ్వాసమే హనోకును మృత్యువునుండి కాపా డినది. అతడు దేవునివద్దకు తీసికొనిపోబడెను. దేవుడు అతనిని గ్రహించుటచే ఎవరును అతనిని కనుగొన లేకపోయిరి. తాను తీసికొనిపోబడక పూర్వమే హనోకు దేవుని సంతోషపెట్టెనని పరిశుద్ధ గ్రంథము తెలుపు చున్నది. 6. విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతివ్యక్తి, దేవుడు ఉన్నాడనియు, తన కొరకై వెదకువారికి ఆయన ప్రతిఫలమిచ్చుననియు విశ్వసింపవలెను. 7. తాను చూడని భవిష్యత్కాలపు విషయము లను గూర్చిన దేవుని హెచ్చరిక

Hebrews chapter 8 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము

 1. మనము చెప్పుచున్న విషయసారాంశమిది. పరలోకమున సర్వేశ్వరుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉండెడి ప్రధానయాజకుని మనము పొందియున్నాము. 2. ఆయన పరమ పవిత్రమగు, అనగా మానవనిర్మితము కాని, దేవునిచే ఏర్పరుపబడిన నిజమైన గుడారమున ప్రధానయాజకుడుగ ఉండును. 3. ప్రతి ప్రధానయాజకుడును దేవునికి కాను కలను అర్పించుటకును, బలులను సమర్పించుటకును నియమింపబడును. కనుకనే మన ప్రధానయాజకుడు సమర్పించుటకును ఏదియో ఒకటి ఉండవలెను. 4. ఆయన ఇంకను భూమియందే ఉన్నచో, యూదుల నిబంధనల ననుసరించి కానుకలను అర్పించు యాజకులు ఉన్నారు కనుక, ఆయన యాజకుడే కాకపోయి ఉండును. 5. యాజకులుగ వారు చేయుపని యథార్థముగ పరలోకమందుండు దానికి కేవలము అనుకరణమును, ఛాయామాత్రమునై ఉన్నది. మోషే గుడారమును నిర్మించునపుడు "పర్వతముపై నీకు ప్రదర్శింపబడిన మాదిరిగ అన్ని అమర్చబడునట్లు జాగ్రత్తపడుము” అని దేవుడాతనితో చెప్పెను. 6. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడియున్నందున, దేవునికిని మానవులకును మధ్య, క్రీస్తు ఏర్పరచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అటులనే వారి కంటె చాల గొప్పదగు యాజకత్వకార్యము యేసునకు ఇయ్యబడెను. 7. మొదటి నిబంధన కొరత లేనిదైనయెడల రెండవ నిబంధనకు

Hebrews chapter 2 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. అందువలననే, మనము అన్యథా ప్రభావితులము కాకుండుటకై మనము వినిన సత్యములపైననే మరింత దృఢముగ ఆధారపడి ఉండవలెను. 2. దేవదూతల ద్వారా ఒసగబడిన సందేశము నిజమని నిరూపింపబడినప్పుడు, దానిని అనుసరింపని, దానికి తలవంచని ప్రతి వ్యక్తియు తగిన శిక్షను పొందియుండగా, 3. ఇక మిక్కిలి గొప్పదగు ఈ రక్షణను నిర్లక్ష్యము చేసిన మనము ఎట్లు తప్పించుకొనగలము? ప్రథమమున ప్రభువే ఈ రక్షణను ప్రకటించెను. ఆయన మాట వినినవారు అది యథార్థమని మనకు నిరూపించిరి. 4. అదే సమయమున, తమ సూచకక్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుత కృత్యముల చేతను తన చిత్తానుసారముగ అనుగ్రహించిన పవి త్రాత్మ వరములచేతను దేవుడే వారి పలుకులకు సాక్షి అయ్యెను. 5. మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమునకు దేవుడు తన దూతలను ప్రభువులుగా చేయలేదు. 6. అయితే ఒకానొకడు ఒకచోట ఇట్లు సాక్ష్యమిచ్చు చున్నట్లుగ: “ఓ దేవా! నీవు అతనిని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు? నీవతడిని లక్ష్యపెట్టుటకు అల్పుడగు మానవపుత్రుడు ఎంతటివాడు? 7. కొద్దికాలము మాత్రమే అతనిని దేవదూతల కంటె తక్కువగ చేసితివి. మహిమతో, గౌరవముతో నీవు అతనికి కిరీటము ధరింపజేసి 8. సర్వమును అతని పాదాక్రాంతమొనర్చితివి." “సర్వమును అ

2nd timothy Chapter 2 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 2వ అధ్యాయము

 1. నా కుమారుడా! క్రీస్తు యేసునందు లభించు అనుగ్రహము ద్వారా నీవు బలవంతుడవు కమ్ము. 2. పెక్కుమంది సాక్షుల సమక్షమున నేను బోధింపగా నీవు వినిన పలుకులను, ఇతరులకు గూడ బోధింపగల నమ్మకమైన వారికి అప్పగింపుము. 3. క్రీస్తు యేసు మంచి సైనికునివలె నాతోపాటు శ్రమను అనుభవింపుము. 4. ప్రతి సైనికుడు తనను సైన్యమున చేర్చుకొనిన నాయకుని సంతోషపెట్టవలె నని అభిలషించును. కనుకనే అతడు లౌకిక వ్యవహారములలో చిక్కుకొనడు. 5. పరుగు పందెములో పాల్గొనుచున్న వ్యక్తి నియమములను పాటింపనిదే కిరీటము పొందజాలడు. 6. బాగుగా కష్టించి పనిచేయు రైతునకు పంటలో ప్రథమభాగము లభింపవలెను. 7. నేను చెప్పు విషయమును గూర్చి ఆలోచింపుము. ప్రభువు నీకు అన్నిటిని గ్రహించు శక్తిని ఒసగును. 8. నేను బోధించు సువార్తయందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలోనుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞప్తియందుంచుకొనుము. 9. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్థునివలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను కూడ, కాని దేవుని వాక్కు బంధింప బడలేదు. 10. ఈ కారణముననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు, క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడ పొందవలెనని వారలకొర

1st timothy Chapter 5 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 5వ అధ్యాయము

 1. వృద్దుడగు వ్యక్తిని కఠినముగ గద్దింపక, అతనిని నీ తండ్రిగ భావించి హెచ్చరింపుము. పిన్నలను నీ సోదరులుగను, 2. వృద్దస్త్రీలను తల్లులుగను భావించి సరిదిద్దుము. యువతులను, అక్కచెల్లెండ్రుగా పరిగణించి పూర్ణపవిత్రతతో తీర్చిదిద్దుము. 3. నిజమైన అనాథలైన విధవరాండ్రను ఆదరింపుము. 4. కాని ఏ విధవరాలికైననూ బిడ్డలుగాని లేక మనుమలుగాని ఉండినయెడల, ఆ సంతానము ముందుగా తమకుటుంబము విషయమున తమకు గల బాధ్యతలను నిర్వర్తించుట ఎరుగవలెను. ఇది దేవుని సంతోషపరచును కనుక ఈ విధముగ వారు తమ పితృరుణమును తీర్చవలయును. 5. దిక్కులేక నిజముగ అనాథయైన స్త్రీ దేవునియందే తన నమ్మికను నిలుపుకొని, ఆయన సాయము కొరకై రేయింబవళ్ళు విన్నపములతో ప్రార్ధించుచుండును. 6. భోగలాలసు రాలైన వితంతువు బ్రతుకుచున్నను చచ్చినదై ఉండును. 7. వారు నిందారహితులై ఉండుటకుగాను వారిని ఇట్లు ఆజ్ఞాపింపుము. 8. కాని ఎవరైనను తన బంధు వులను గూర్చి, అందును విశేషించి తన కుటుంబ మును గూర్చి శ్రద్ధవహింపనిచో అతడు ఈ విశ్వాస మును విడనాడినట్లే. అట్టివాడు అవిశ్వాసికంటెను చెడ్డవాడు. 9. ఏ వితంతువునైనను అరువది యేండ్లు దాటనిదే విధవరాండ్ర పట్టికలో చేర్పకుము. అంతేకాక, ఆమె ఒక్క పురుషునకు మాత్రమే

1st timothy Chapter 2 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 2వ అధ్యాయము

 1. కనుక అన్నిటికంటె ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములును, ప్రార్థనలును, మనవులును, కృతజ్ఞతలును అర్పింపవలెనని విన్నవించుచున్నాను. 2. మనము సత్ప్రవర్తనతోను, సంపూర్ణమగు దైవభక్తితోను, ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్ధనలు సలుపవలెను. 3. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది. 4. మానవులు అందరు రక్షింపబడవలయుననియు, సత్యమును తెలిసికొనవలయుననియు దేవుని అభిలాష 5. దేవుడు ఒక్కడే, దేవుని, మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. 6. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరు రక్షింపబడవలెననెడి దేవుని కోరిక తగినసమయమున నిదర్శనమాయెను. 7. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను, అపోస్తలునిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు. యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. 8. ఎల్లెడల పురుషులు క్రోథముగాని, తర్కము గాని లేకుండ చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలెనని నేను కోరుచున్నాను. 9. స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకముత

1st Thessalonians Chapter 3 || Roman catholic Bible in Telugu || తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము

 1. తుదకు మేము దానిని ఎంత మాత్రము సహింపలేక ఒంటరిగా ఏతెన్సులో ఉండిపోవుటకు నిశ్చయించుకొని 2. క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటలో మాతో పాటు దేవుని కొరకు పనిచేయు మా సోదరుడగు తిమోతిని మీయొద్దకు పంపితిమి. 3. ఈ హింసల వలన మీలో ఏ ఒక్కరును వెనుదిరుగ రాదని మిమ్ము బలపరచుటకును, మీ విశ్వాసమునకు తోడ్పడుటకును అతనిని పంపితిమి. ఇట్టి శ్రమలు అనుభవించుట కొరకే మనము దేవునిచే ఎన్నిక చేయబడితిమని మీకు తెలియును. 4. ఏలయన, మనము హింసింపబడగలమని ముందుగనే, మీతో ఉన్నప్పుడే మీకు చెప్పితిమి. వాస్తవముగా అది అట్లే జరిగినది. అది మీకు బాగుగా తెలిసినదే కదా! 5. అందువలననే నేను ఇక సహింపలేక తిమోతిని పంపితిని. మీ విశ్వాసమును గూర్చి తెలిసికొనుటకు అతనిని పంపితిని. ఒకవేళ సైతాను మిమ్ము శోధించెనేమో అనియు మా కృషి అంతయు వ్యర్థమగునేమో అనియు భయముతో అటుల చేసితిని. 6. తిమోతి, ఇప్పుడు మీ నుండి మా వద్దకు తిరిగి వచ్చియున్నాడు. మీ విశ్వాసమును, ప్రేమను గూర్చిన శుభవార్తను మాకు అందించినాడు. మమ్మును గూర్చి మీరు ఎప్పుడునుమంచి గానే తలంతురనియు, మిమ్ము చూడవలెనని మేము ఎంత అపేక్షించుచున్నామో మమ్ము చూడవలెనని మీరును అంతగనే కోరుచున్నారనియు అతడు మాకు చెప

1st Thessalonians Chapter 2 || Roman catholic Bible in Telugu || తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 1వ లేఖ 2వ అధ్యాయము

 1. సోదరులారా! మేము మిమ్ము చూడవచ్చుట వ్యర్ధము కాలేదని మీకే తెలియునుగదా! 2. మీరు ఎరిగినట్లు మేము మీయొద్దకు రాకముందు ఫిలిప్పి నగరములో బాధలు అవమానములు పడినప్పటికిని మేము దేవునియందు ధైర్యము తెచ్చుకొని ఎన్నియో ఆటంకముల మధ్య మీకు సువార్తను ప్రకటించితిమి. 3. ఏలయన, మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు. కపటబుద్దితోనైనదియును కాదు. 4. అంతేకాక, దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడగోరునో ఎల్లవేళలయందును అటులే పలికెదము. ఏలయన, ఆయన మమ్ము ఆమోదించి, సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడును ప్రయత్నింపక, మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము. 5. ఏలయన ముఖస్తుతితో మేము మీయొద్దకు రాలేదు. ధనాపేక్షను మరుగుచేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టముగా తెలియును. ఇందుకు దేవుడే సాక్షి! 6. మీ నుండి గాని, ఇతరుల నుండిగాని, ఎవరి నుండియైనను పొగడ్తలు పొందవలెనని మేము యత్నింపలేదు. 7. అంతేకాక, క్రీస్తు యొక్క అపోస్తలులుగా మీపై అధికారమును ప్రదర్శింపగలిగి ఉండియు అటులచేయలేదు సుమా! పాలిచ్చుతల్లి తన పిల్లల విషయమై మృదువుగ శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగ ప్రవర్తించ

Colossians chapter 3 || RCM Telugu Bible online || కొలొస్సియులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము

 1. మీరు క్రీస్తుతోపాటు సజీవులుగ లేవనెత్త బడితిరి. కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడిప్రక్కన క్రీస్తు తన సింహాసనముపైన అధిష్ఠించి ఉండును. 2. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీదగాక, అచ్చట పరలోకమునందుగల వస్తువులపైన లగ్నము చేయుడు. 3. ఏలయన, మీరు మరణించితిరి. మీ జీవితము క్రీస్తుతోపాటు దేవునియందు గుప్తమై ఉన్నది. 4. మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమ యందు కనబడుదురు. 5. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్షవంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. 6. ఇటువంటి వానివలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును. 7. ఒకప్పుడు మీ జీవితములు ఈ కోర్కెలతో ప్రభావితమైయున్నప్పుడు మీరు ఇటువంటి మనుష్యులతో నడుచుకొనెడివారు. 8. కాని ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అనువానినుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడును దుర్భాషలాడరాదు. అవమానించెడి మాటలను, నిందించెడి మాటలను పలుకరాదు. 9. అబద్దములు ఆడరాదు. ఏలయన, మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి, 10. క్రొత్త స్వభావమును ధరించినారు కదా! తనను గూర్చి మీరు

Colossians chapter 2 || RCM Telugu Bible online || కొలొస్సియులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. మీ కొరకును, లవోదికయలోని ప్రజల కొరకును, నాకు వ్యక్తిగతముగ తెలియని వారందరి కొరకును, నేను ఎంత తీవ్రముగ పాటుపడినది మీకు చెప్పనిండు. 2. వారి హృదయములు ధైర్యముతో నిండగలవనియు, వారు ప్రేమతో సన్నిహితులు కాగల రనియు, సరియైన అవగాహనవలన లభించు సకల సంపదలను పొందగలరనియు నేను అటుల చేయు చున్నాను. అలాగున వారు దేవుని రహస్యమును గ్రహింపగలరు. ఆ రహస్యమే క్రీస్తు. 3. ఆయన యందు దేవుని వివేక విజ్ఞానముల సంపదలన్నియు గుప్తమైయున్నవి. 4. తప్పుడు వాదములతో ఎవ్వరును మిమ్ము మోసము చేయకుండునట్లును చూచుకొనవలెనని చెప్పుచున్నాను. 5. శరీరరీత్యా దూరము గానున్నను, నేను ఆత్మరీత్యా మీతో ఉన్నాను. క్రీస్తు నందు విశ్వాసముకలిగి మీరు కలిసికట్టుగా దృఢసంకల్పముతో కృతనిశ్చయులైయుండుట చూచి నేను ఆనందించుచున్నాను. 6. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సాహచర్యములో ఉండుడు. 7. ఆయ నను ఆధారముగా చేసికొని, మీ జీవితమును నిర్మించు కొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. అమితముగ కృత జ్ఞులై ఉండుడు. 8. ఎవడును తమ మోసకరమగు నిరర్థక వాదములతో మిమ్ము వశపరచుకొనకుండ చూచుకొనుడు. ఆ తత్త్వవాదములు క్రీస్తునకు చెందినవి

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-3 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము

1. ఇందువలననే అన్యులగు మీకొరకై, క్రీస్తుయేసు బందీనైన పౌలునగు నేను, దేవుని ప్రార్ధించుచున్నాను. 2. మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు. 3. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. 4. నేను వ్రాసిన దానిని మీరు చదివినచో, క్రీస్తు రహస్యమును నేను గ్రహించితినని మీకు తెలియగలదు. 5. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. కాని, నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులగు అపోస్తలులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. 6. అనగా, సువార్తవలన అన్యులకును యూదులతోపాటు దేవుని దీవెనలలో పాలులభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తుయేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్తులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము. 7. దేవుని విశేషవరముచే నేను ఈ సువార్తికరణ సేవచేయువాడనైతిని. ఆయన తన శక్తి ప్రభావము ద్వారా దానిని నాకు ఒసగెను. 8. పవిత్రులందరిలో నేను అత్యల్పుడను. అయినను క్రీస్తు అనంత ఐశ్వర్య ములను అన్యులకు అందించువరమును దేవుడు నాకు ప్రసాదించెను. 9. దేవుని రహస్యప్రణాళిక ఎట్లు అమలు జరుపబడవలెనో మానవాళిలో ప్రత

Galatians Chapter 3 || Telugu Catholic Bible || గలతీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము

 1. అవివేకులగు గలతీయులారా! మీరు ఎవని మాయకు లోనైతిరి? సిలువపై యేసు క్రీస్తు మరణము మీ కన్నులయెదుట ప్రత్యక్షము చేయబడినదిగదా! 2. ఈ ఒక్క విషయము మీనుండి నేర్చుకొనగోరు చున్నాను. ధర్మశాస్త్రము ఆజ్ఞాపించుదానిని చేయుట వలన మీరు దేవుని ఆత్మను పొందితిరా? లేక విశ్వాసముతో సువార్తను వినుటవలననా? 3. మీరు ఇంతటి మూర్ఖులా! మీరు దేవుని ఆత్మతో ఆరంభించి శరీరముతో ముగించుచున్నారా? 4. నిష్ప్రయోజనము గనే ఇన్ని కష్టములు అనుభవించితిరా? నిశ్చయముగ అవి వ్యర్ధమగునా? 5. దేవుడు మీకు ఆత్మనొసగి, మీ మధ్యలో అద్భుతములుచేయుట మీరు ధర్మశాస్త్ర మును అనుసరించుట చేతనేనా? లేక విశ్వాసముతో వినుటవలననా? 6. “అతడు దేవుని విశ్వసించెను. ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను.” అని అబ్రహామును గూర్చి లేఖనము చెప్పుచున్నది. 7. కనుక, విశ్వాసముగలవారే అబ్రహాముయొక్క నిజమైన సంతతియని మీరు గ్రహింపవలెను. 8. విశ్వాసమువలన అన్యజనులను నీతిమంతులుగ దేవుడు చేసికొనునని లేఖనము ముందే చెప్పుచున్నది. కనుకనే అది “భువియందలి ప్రజలందరిని దేవుడు నీ ద్వారా దీవించును” అను శుభసందేశమును ముందే అబ్రహామునకు తెలియజేసినది. 9. అబ్రహాము విశ్వసించెను. కనుకనే దీవింపబడెను. అతనివలెనే విశ్

రోమీయులకు వ్రాసిన లేఖ | Roman catholic bible in Telugu

1 వ అధ్యాయము + -  1. యేసుక్రీస్తు సేవకుడును, అపోస్తలుడుగా ఉండుటకును పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు వ్రాయునది: 2. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను దేవుడు ముందుగా తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనము లందు వాగ్దానము చేసెను. 3. మన ప్రభువైన యేసు క్రీస్తు మానవుడుగా, దావీదు సంతతియై జన్మించెను. 4. కాని, ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను. 5. అన్ని జాతుల ప్రజలును ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును ఒసగెను. 6. మీరును వారిలోని వారే. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను. 7. రోము నగరమందలి పరిశుద్దులుగా ఉండు టకు పిలువబడిన దేవుని ప్రియులందరికి శుభమును కోరుచు వ్రాయునది. మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపను, సమాధానమును కలుగునుగాక! 8. మొట్టమొదట మీ అందరికొరకై యేసుక్రీస్తు ద్వారా నా దేవునకు కృతజ్ఞతలు చెప్పుకొందును. ఏలయన మీ విశ్వాసమును ప్రపంచమంతయు పొగడుచున్నది. 9. తన కుమారుని గురించి సువార్తా ప్రచారముచేయుచు, హృ