ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 2వ లేఖ

 1. తండ్రియగు దేవునకును, ప్రభువగు యేసుక్రీస్తునకును సంబంధించిన తెస్సలోనిక సంఘ మునకు పౌలు,సిలాసు, తిమోతిలు వ్రాయునది:

2. తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతి.

3. సోదరులారా! మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింప ఋణపడి వున్నాము. ఇది మాకు సముచితమే. ఏలయన, మీ విశ్వాసము అత్యధికమగు చున్నది. అన్యోన్యమగు మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుచున్నది.

4. మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోను, కష్టములలోను కూడ మీరుచూపు ఓర్పును, విశ్వాసమును మేము ప్రశంసింతుము. అందువలన దేవుని సంఘములలో మిమ్ము గూర్చి మేమే గొప్పగ చెప్పుచుందుము.

5. దేవుని నీతి బద్దమగు తీర్పునకు ఇది నిదర్శనము. ఏలయన, దీని ఫలితముగ మీరు దేనికొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు.

6. ఏలయన, దేవుడు ఏది న్యాయమో దానినే చేయును. మిమ్ము కష్టపెట్టు వారికి కష్టములు కలిగించును

7. శక్తిమంతులగు దేవదూతలతో యేసుప్రభువు దివి నుండి ప్రత్యక్షమైనపుడు ఆయన, శ్రమనొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతిని కలిగించును.

8. దేవుని ఎరుగనివారిని శిక్షించుటకును, మన యేసు ప్రభువును గూర్చిన సువార్తకు విధేయులు కానివారిని దండించుటకును, అగ్నిజ్వాలలతో ఆయన దివినుండి దిగి వచ్చును.

9. దేవుని సన్నిధికిని, ఆయన మహత్తర మహిమకును దూరమై శాశ్వత వినాశమనెడి దండ నమునకు వారు గురియగుదురు.

10. తన పరిశుద్దులనుండి మహిమను పొందుటకును, విశ్వాసుల నుండి గౌరవమునందుటకును ఆ దినమున ఆయన వచ్చును. మేము చెప్పిన సందేశమును విశ్వసించితిరి కనుక వారిలో మీరును ఉందురు.

11. ఇందువలననే మేము సదా మీ కొరకై ప్రార్ధింతుము. దేవుడు పిలిచిన జీవితమునకు ఆయన మిమ్ముయోగ్యులను చేయవలెనని ఆయనను అర్థింతుము. తన శక్తివలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమొనర్చుగాక!

12. మన ప్రభువైన యేసునామము మీయందును, మీరు ఆయనయందును మహిమ పరుపబడుదురుగాక! ఇది మన దేవుని యొక్కయు, యేసుక్రీస్తు ప్రభువు యొక్కయు అనుగ్రహమువలన నెరవేరునుగాక! 

 1. సోదరులారా! మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క రాకడ విషయమునను, మనము ఆయనను కలిసికొనుటకు సమావేశమగు విషయమునను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను.

2. దేవుని దినము వచ్చెనను వాదమును విని మీరు తేలికగా పొరబడరాదు. తబ్బిబ్బు పడరాదు. బహుశ ప్రవచన పూర్వకముగ గాని, లేక బోధన పూర్వకముగగాని ఎవరో అటుల చెప్పియుండవచ్చును. లేక మేము ఏదియో ఒక లేఖలో అటు వ్రాసితిమనియు చెప్పియుండవచ్చును.

3. ఎవని చేతను ఏ విధముగను మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలెను. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చునంతవరకు ఆ దినము రాదు.

4. మానవులు పూజించు సమస్తమును, మానవుడు దైవికముగ భావించు దేనినైనను, ఆ దుష్టుడు వ్యతిరేకించును. అతడు సమస్తమునకు అతీతునిగ, తనను భావించు కొనును. అంతేకాక దేవుని ఆలయమున ప్రవేశించి కూర్చుండి, తానే దేవుడనని చెప్పుకొనును.

5. మీకు జ్ఞాపకములేదా? నేను మీతో ఉన్న ప్పుడు ఈ విషయములన్నియు చెప్పియుంటిని గదా!

6. కాని ఇప్పుడు ఇది జరుగకుండ ఆపుచున్నది ఏమియో మీకు తెలియును. కనుక యుక్త సమయమున దుష్టుడు కనిపించును.

7. ఆ తిరుగుబాటు ఇప్పటికే తన పనిని ప్రారంభించినది. కాని అది రహస్యముగా జరుగుచున్నది. తిరుగుబాటుదారుడు బహిరంగముగ రాకముందు దానిని నిరోధించుచున్న వ్యక్తి మొదట తొలగింపబడవలెను.

8. అపుడు దుష్టుడు కనబడును. యేసుప్రభువు వానిని తన నోటి శ్వాసచే సంహరించును. తన మహిమోపేత దర్శనముతోను, రాకడతోను దుష్టుని సర్వనాశనము చేయును.

9. ఆ దుష్టుడు పైశాచికశక్తితో వచ్చి అద్భుతములను, సూచక క్రియలను, మహత్కార్యములను చేయును.

10. నశించువారిని అతడు అన్ని విధములగు దౌష్ట్యముతో మోసగించును. సత్యమును ప్రేమించి రక్షణను పొందుటకు నిరాకరించినందుకుగాను వారు నశింతురు.

11. ఇందువలననే వారు అసత్యమును నమ్మునట్లుగ వారియందు పనిచేయుటకు దేవుడు దోషశక్తిని పంపియున్నాడు.

12. తత్ఫలితముగ సత్యమును విశ్వసింపక పాపములో ఆనందించినవారు దండింపబడుదురు.

13. సోదరులారా! ప్రభువుచే ప్రేమింపబడు మీ కొరకై సర్వదా దేవునకు మేము కృతజ్ఞతలను అర్పింప వలసి ఉన్నది. ఏలయన, మిమ్ము పవిత్రపరచుట వలనను, సత్యమును మీరు విశ్వసించుటవలనను, మీరు రక్షింపబడుటకుగాను దేవుడు మిమ్ము మొదటనే ఎన్నుకొనెను.

14. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను.

15. కనుక సోదరులారా! దృఢముగా నిలిచి, మేము మా బోధనలలోను, లేఖలలోను మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు.

16. మనలను ప్రేమించి, అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రియైన దేవుడును, మన ప్రభువగు యేసు క్రీస్తును

17. మీ హృదయములను ఉత్సాహపరచి, మిమ్ము సమస్త సత్క్రియల యందును,సద్వాక్కులయందును స్థిరపరతురుగాక! 

 1.కడన సోదరులారా! ప్రభువు వాక్కు మీయందు వలెనే త్వరగ వ్యాపించి విజయమును పొందునట్లు మా కొరకై ప్రార్థింపుడు.

2. దుష్టులనుండియు, పాపుల నుండియు దేవుడు మమ్ము కాపాడునట్లు గూడ ప్రార్ధింపుడు. ఏలయన, అందరును సందేశమును విశ్వసింపరుగదా!

3. కాని ప్రభువు విశ్వసనీయుడు. ఆయన మిమ్ము శక్తిమంతులను చేయును. దుష్టునినుండి మిమ్ము కాపాడును.

4. ప్రభువునందు మాకు మీ విషయమున నమ్మకము కలదు. మా బోధనలను మీరు ఆచరించు చున్నారనియు, ఇక ముందును అట్లే పాటింపగలరనియు మా దృఢవిశ్వాసము.

5. దేవుని యందలి ప్రేమయు, క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయ ములను ప్రేరేపించునుగాక!

6. సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాము. సోమరి జీవితములను గడపుచు, మా ఉత్తరువులను అనుసరింపని వారినుండి దూరముగ ఉండుడు.

7. మమ్ము ఎట్లు అనుసరింపవలెనో మీకు తెలియును గదా! మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగ ప్రవర్తింపలేదు గదా!

8. మేము ఎవనివద్దను ఉచితముగ ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికిని బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి.

9. మేము ఇట్లు చేసినది మీనుండి సాయమును పొందు హక్కు లేకకాదు. మీకు ఆదర్శప్రాయముగ ఉండుటకే.

10. “పని చేయనివాడు భోజనమునకు అర్హుడుకాదు” అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమిగదా!

11. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు, వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్పవేరు పనిలేదనియు, మేము వినియుండుటచే ఇట్లు చెప్పుచున్నాము.

12. క్రమబద్ధమైన జీవితమును గడపవలెననియు జీవనోపాధికై కష్టపడి పనిచేయవలెననియు యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టివారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము.

13. సోదరులారా! మేలు చేయుటయందు మీరు విసిగిపోరాదు.

14. మేము ఈ లేఖ ద్వారా తెలియజేయు సందేశమునకు విధేయుడు కానివాడు అట ఎవ్వడైన ఉండవచ్చును. ఉన్నచో, అతడు సిగ్గుపడునట్లుగా వానిని గుర్తించి వానితో ఎట్టి పొత్తును పెట్టుకొనకుడు.

15. కాని, వానిని శత్రువుగ చూడక, సోది రునిగ భావించి హెచ్చరింపుడు.

16. మన శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగ శాంతిని ఒసగునుగాక! ప్రభువు మీకు అందరకును తోడై ఉండును.

17. పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను. నా జాబులు అన్నిటికిని ఇదే గుర్తు. నేను ఇట్లే వ్రాయుదును.

18. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరకు తోడై ఉండునుగాక! 

 1. యజమానులారా! మీరును మీ సేవకుల యెడల సక్రమముగా న్యాయముగా ప్రవర్తింపుడు. పరలోకములో మీకు కూడ ఒక యజమానుడు కలడను విషయము గుర్తుంచుకొనుడు

2. ప్రార్థనను పట్టుదలతో చేయుడు. ప్రార్థన చేయునపుడు జాగరూకతతో ఉండుడు. దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగియుండుడు.

3. ఇదే సమయములో మాకొరకు కూడ ప్రార్థింపుడు. దేవుని సందేశమును బోధించుటకును క్రీస్తు రహస్యమును వివరించుటకును దేవుడు మాకు మంచి అవకాశము ఇవ్వవలెనని ప్రార్థింపుడు. అందులకే నేను ఇప్పుడు కారాగారమునందు ఉన్నాను.

4. ఆ విషయమును నేను స్పష్టముగా వివరించు సామర్థ్యము నాకు కలుగునట్లు ప్రార్ధింపుడు.

5. అవిశ్వాసులగు వారితో వ్యవహరించునప్పుడు మీరు, మీకు గల ప్రతి అవకాశమును చక్కగా వినియోగించుకొనుచు వివేకముతో ప్రవర్తింపుడు.

6. మీ సంభాషణ ఎల్లప్పుడును, దయాపూరితముగాను, ఉప్పువేసినట్లుగా రుచికరముగాను ఉండవలెను. ప్రతి వ్యక్తికి సరియైన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను.

7. ప్రియ సోదరుడును, నమ్మకమైన పరిచారకుడును, ప్రభువు కార్యమందు తోడి సేవకుడునైన 'తుకికు' మీకు నన్ను గురించిన అన్ని వార్తలను తెలుపును.

8. ఇందుకొరకే మేము అందరమును ఎట్లు ఉన్నదియు మీకు వివరించి మీ హృదయములను ప్రోత్సాహపరచుట కొరకే నేను అతనిని మీ వద్దకు పంపుచున్నాను.

9. అతనితో పాటు మీ బృందమునకు చెందిన విశ్వసనీయుడైన ప్రియతమ సోద రుడు 'ఒనేసిము' కూడ వచ్చును. ఇచ్చట జరుగుచున్న వానిని అన్నింటిని వారు మీకు చెప్పగలరు.

10. నాతో పాటు కారాగారము నందున్న 'అరిస్టార్కు', బర్నబాకు దగ్గర బంధువైన మార్కు మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు. (అతడు మీ వద్దకు వచ్చినచో అతనికి స్వాగతము చెప్పవలసినదిగా, అతనిని గురించి మీరు ఇదివరకే ఉత్తరువులు పొందియున్నారు).

11. 'యుస్తు' అనెడి 'యోషువా' కూడ శుభాకాంక్షలు తెలుపుచున్నాడు. సున్నతి పొందిన వీరు మాత్రమే దేవుని రాజ్యము కొరకు నాతో కలిసి పనిచేయుచున్నారు. వీరు నాకు చాల సాయ పడుచున్నారు.

12. మీ బృందమునకు చెందిన మరొక సభ్యు డును, యేసుక్రీస్తు సేవకుడునైన 'ఎపఫ్రా' కూడ అభినందనలు తెలుపుచున్నాడు. మీరు ఎల్లపుడును దృఢముగా నిలబడగలుగునట్లు పరిణతి పొందగలుగునట్లు, దేవుని సంకల్పమునకు సంపూర్ణ విధేయతతో దృఢవిశ్వాసము కలిగి ఉండునట్లును, అతడు దేవుని సర్వదా ప్రార్ధించుచున్నాడు.

13. మీ కొరకును లవోదికయ, హిరాపోలిలలోని ప్రజల కొరకును అతడు పడుచున్న కఠినమైన శ్రమను నేను స్వయముగ ధ్రువపరుపగలను.

14. మన ప్రియతమ వైద్యుడు 'లూకా' మరియు 'డెమాసు' కూడ మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు.

15. లవోదికయలోని సోదరులకును, నుంఫాకును, ఆమె యింట కూడుచుండు దైవసంఘమునకును నా శుభాకాంక్షలు తెలుపుడు.

16. మీరు ఈ లేఖను చదివిన పిమ్మట ఇది లవోదికయలోని సంఘములో కూడ తప్పనిసరిగా చదువబడునట్లు శ్రద్ధ వహింప గలరు. ఇదే సమయములో లవోదికయ మీకు పంపగల జాబును సైతము చదువవలెను.

17. “దేవుని సేవయందు నీకు అప్పగింపబడిన పరిచర్య పూర్తియగునట్లు శ్రద్ధవహింపుము” అని 'అర్కిప్పు'నకు చెప్పగలరు.

18. పౌలునైన నేను స్వహస్తముతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను. నా సంకెళ్ళను మరువకుడు! కృప మీకు తోడై ఉండునుగాక!