ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యిర్మియా గ్రంధము

Text Example

1. బెన్యామీను మండలములోని అనాతోతు గ్రామ మునకు చెందిన యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడగు యిర్మీయా వాక్కులివి.

2. ఆమెను కుమారుడైన యోషీయా యూదాకు రాజైన పిమ్మట పదమూడవయేట ప్రభువు యిర్మీయాకు తన వాక్కు వినిపించెను.

3. యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజుగా వున్నకాలమున కూడ ప్రభువు తన వాక్కును యిర్మీయాకు విన్పించెను. అటుతరువాత యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైనపిమ్మట పదునొకండవఏటి చివరి వరకును ప్రభువు తన వాక్కును అతనికి విన్పించు చునేయుండెను. ఆ పదునొకండవయేడు ఐదవ మాసమున యెరూషలేము పౌరులను బందీలనుగా గొనిపోయిరి.

4. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

5. "నిన్ను మాతృగర్భమున రూపొందింపకమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టకమునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని.”

6. నేను “యావే ప్రభూ! నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు. నేను బాలుడను” అని పలికితిని

7. కాని ప్రభువు నాతో ఇట్లు నుడివెను: “నీవు నేను బాలుడనని చెప్పవలదు. v

8. నీవు వారికి భయపడనక్కర లేదు. ఇది ప్రభుడనైన నా వాక్కు "

9. అంతట ప్రభువు చేయిచాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను: “ఇదిగో! నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను.

10. ఈ దినము జాతులమీదను, రాజ్యములమీదను నేను నీకు అధికారమొసగితిని. నీవు వానిని పెల్లగించుటకును, కూలద్రోయుటకును, నాశనము చేయుటకును, పడగొట్టుటకును, పునర్నిర్మించుటకును, నాటుటకును సమర్ధుడవగుదువు.”

11. ప్రభువు నాకు తన వాక్కును విన్పించుచు “యిర్మీయా! నీకేమి కనిపించుచున్నది?” అని అడిగెను. నేను “బాదముచెట్టు కొమ్మ కనిపించుచున్నది” అని పలికితిని.

12. ప్రభువు “నీవు బాగుగనే కనిపెట్టితివి. నేను కూడ నా పలుకులను నెరవేర్చుటకు కాచుకొని యున్నాను” అని చెప్పెను.

13. రెండవమారు ప్రభువు నాకు తనవాక్కును విన్పించుచు “నీకేమి కనిపించుచున్నది?” అని అడిగెను. నేను “కాగుచున్న కుండ కనిపించుచున్నది. అది ఉత్తరదిక్కునకు తిరిగియున్నది” అని అంటిని.

14. అప్పుడు ప్రభువు ఇట్లనెను: “ఈ దేశమున వసించువారిని తెగటార్చుటకు ఉత్తరదిక్కునుండి వినాశము కుతకుత కాగుచున్నది.

15. నేను ఉత్తరదిక్కున గల జాతులన్నిటిని పిలుతును. వాని రాజులు వచ్చి యెరూషలేము ద్వారములయెదుటను, దాని ప్రాకారములచుట్టును, యూదా నగరములచుట్టును తమ సింహాసనములను అమర్చుకొందురు.

16. నా ప్రజల పాపములకుగాను నేను వారిని శిక్షింతును. వారు నన్ను విడనాడి అన్యదైవములకు బలులు అర్పించిరి. తాము స్వయముగా మలచిన బొమ్మలను పూజించిరి.

17. కనుక నీవు నడుముకట్టుకొని నిలువబడి, నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. నేను వారియెదుట నీకు భయము పుట్టింతును.

18. యూదారాజులును, నాయకులును, యాజకులును, ప్రజలును, ఈ దేశీయులు అందరును నిన్ను ఎదిరింతురు. కాని నేను నిన్ను ఈ దినమున సురక్షితనగరమువలెను, ఇనుప స్తంభమువలెను, ఇత్తడితలుపువలెను చేసెదను.

19. వారు నీతో పోరాడుదురు కాని నీమీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు."

Text Example

1. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను.

2. “నీవు వెళ్ళి యెరూషలేమునకు ఇట్లు ప్రకటింపుము: ప్రభువు వాక్కు ఇది. నీవు యువతివిగా ఉన్నపుడు నాపట్ల చూపిన అనురాగమును, నా వధువువైనపుడు నాపట్ల చూపిన ప్రేమను నేను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. నీవు పైరువేయని తావగు ఎడారిగుండ నన్ను అనుసరించివచ్చితివి.

3. యిస్రాయేలీయులు నాకు పవిత్ర ప్రజలు. నాకు ముట్టవలసిన పంటలో ప్రథమఫలముల వంటివారు. వారికి కీడుచేయువారిని నేను శిక్షించి కష్టాలపాలు చేసితిని.”

4. యాకోబు వంశజులారా! యిస్రాయేలు తెగలారా! ప్రభువు పలుకులాలింపుడు.

5. ప్రభువు వాక్కు ఇది: “నాలో ఏమి నేరము చూచి మీ పితరులు నన్ను త్యజించిరి? వారు వ్యర్ధమైన విగ్రహములను కొలిచి తామును నిరర్థకులైపోయిరి.

6. 'నేను వారిని ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చితిని. వారిని ఎడారిగుండ తోడుకొనివచ్చితిని. ఇసుక గోతులుగల మరుభూమిగుండ నడిపించితిని. అది ఎవరును వసింపని, ఎవరును పయనింపని భయంకరమైన తావు, ఎండి మలమలమాడు నేల. అయినను ఆ ప్రజలు నన్ను పట్టించుకోరైరి.

7. నేను వారిని సారవంతమైన నేలకు గొనివచ్చితిని. వారు దానిలో పండినపంటను, దానిలో లభించు ప్రశస్త వస్తువులను అనుభవింపవచ్చును. కాని వారు ఆ నేలమీద కాలు మోపగనే, దానిని నాశనము చేసిరి. నా దేశమును ఆపవిత్రము చేసిరి.

8. యాజకులు నన్ను పట్టించుకోరైరి. ధర్మశాస్త్రమును బోధింపవలసిన యాజకులు నన్ను తలంచరైరి. 'ప్రభువు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగి, పాలకులు నా మీద తిరుగబడిరి. ప్రవక్తలు బాలుదేవత పేరుమీద ప్రవచనములు చెప్పిరి. శక్తిచాలని బొమ్మలను పూజించిరి.

9. కనుక నేను నా ప్రజలమీద వ్యాజ్యము తెచ్చెదను. వారి సంతతిమీద నేరము తెచ్చెదను. ఇది ప్రభుడనైన నా వాక్కు

10. మీరు పడమరన కిత్తీము ద్వీపము వరకును పొండు. తూర్పున కేదారు దేశము వరకును మీ దూతలను పంపుడు. ఇట్టి కార్యము పూర్వము ఎప్పుడైనా జరిగినదేమో పరిశీలించిచూడుడు.

11. తాము కొలుచు దైవములు నిజముగా దైవములు కాకున్నను, ఏ జాతికూడ వారిని విడనాడలేదు. కాని నా ప్రజలు తమకు కీర్తి తెచ్చిన నన్ను విడనాడి తమకెట్టి మేలుచేయజాలని బొమ్మలను కొలిచిరి.

12. ఆకాశమా! నీవు ఈ చెయిదమును గాంచి వెరగొందుము. భీతితో కంపించుము. ఇది ప్రభువు వాక్కు.

13. నా ప్రజలు రెండు నేరములు చేసిరి. వారు జీవజలముల బుగ్గనైన నన్ను పరిత్యజించిరి, నెఱ్ఱెవిచ్చుటచే నీరు నిలువని రాతితొట్లను తొలిపించుకొనిరి.

14. యిస్రాయేలీయులు దాసులా? ఇంట పుట్టినవాడు దాసుడా? కాడుకదా! అతడు ఎలా దోపుడుసొమ్ము అయ్యెను? మరి వారి శత్రువులు వారిని ఈ రీతిగా కొల్లగొట్టనేల?

15. విరోధులు వారిని చూచి సింహములవలె గర్జించిరి. వారి దేశమును ఎడారి గావించిరి. వారి నగరములను పాడుజేసి నిర్మానుష్యము గావించిరి.

16. నోపు, తహపనేసు ప్రజలు వారి పుఱ్ఱెలను పగులగొట్టిరి.

17. కాని ఈ అనర్ధములను మీరే కొనితెచ్చుకొంటిరి. నేను మిమ్ము మార్గము వెంట నడిపించుచున్నను మీరు మీ ప్రభుడను, దేవుడనైన నన్ను విడనాడితిరి

18. మీరు ఐగుప్తునకు వెళ్ళి నైలునది నీళ్ళు త్రాగుటవలన లాభమేమి? అస్సిరియాకు వెళ్ళి యూఫ్రటీసు నీళ్ళు త్రాగుటవలన ఫలితమేమి?

19. మీ పాపమే మిమ్ము శిక్షించును. నన్ను విడనాడుటవలన మీరు చీవాట్లు తెచ్చుకొందురు. మీరు మీ ప్రభుడను, దేవుడనైన నన్ను పరిత్యజించుటవలన, నన్ను నిర్లక్ష్యము చేయుటవలన ఎట్టికీడును, ఎట్టిశ్రమయు తెచ్చుకొందురో ఊహింపుడు. సైన్యములకు అధిపతియు ప్రభుడనైన నా వాక్కిది.

20. మీరు పూర్వమునుండే నా అధికారమును ధిక్కరించి, మేము నీకు సేవలు చేయమని పలికితిరి. ప్రతి ఎత్తయిన కొండమీద ప్రతిపచ్చని చెట్టుక్రింద మీరు వ్యభిచరించితిరి.

21. మంచివిత్తనమునుండి మొలకెత్తిన శ్రేష్టమైన ద్రాక్షతీగగా నేను మిమ్ము నాటితిని. కాని మీరిపుడు నిష్ప్రయోజకమైన భ్రష్టజాతి ద్రాక్షలుగా మారిపోతిరి.

22. మీరెన్ని క్షాళనపదార్ధములతో కడుగుకొనినను ఎన్ని క్షారములతో తోముకొనినను మీ దోషపుమరకలు నాకు కన్పించుచునే ఉండును ఇది ప్రభుడనైన నా వాక్కు,

23. మీరు, మేము అపవిత్రులము కాలేదనుచున్నారు. మేము బాలు దేవతను కొలువలేదు అని పలుకుచున్నారు. కాని మీరు లోయలో ఎట్లు ప్రవర్తించితిరో చూడుడు. మీరేమి చేసితిరో గమనింపుడు. మీరు ఎదకు వచ్చిన అడవి ఒంటె వంటివారు.

24. అడవి గాడిద ఎదకుపోయి అటునిటు పరుగెత్తును ఎడారిలో అటునిటు పరుగిడి గాలిని వాసనచూచును. ఋతు సమయము వచ్చినపుడు దానిని ఎవడాపగలడు? మగగాడిద దానికొరకు వెదకనక్కర లేదు. ఋతుకాలమున అది దానికి సులభముగానే దొరకును.

25. మీరు మీ కాలిచెప్పులు అరగిపోవువరకును మీ గొంతు దప్పికతో ఎండిపోవువరకును అన్యదైవముల వెంటబడి తిరుగనేల? కాని మీరు, మేమిపుడు వెనుకకు తిరిగిరాలేము. మేము అన్యదైవములను వలచితిమి. కనుక వారివెంట పోకతప్పదు అని పలుకుచున్నారు.”

26. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “దొంగ పట్టుపడినపుడు అవమానము పాలగును. యిస్రాయేలీయులకును ఇట్టి గతియేపట్టును. వారి ప్రజలు, రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు తలవంపులు తెచ్చుకొందురు.

27. మీరు కొయ్యదిమ్మెను 'మా తండ్రి' అని పిలుచుచున్నారు. రాతిని 'మా తల్లి' అని పిలుచుచున్నారు. మీరు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొని నా నుండి వైదొలగుచున్నారేగాని, నా చెంతకు వచ్చుటలేదు. కాని మీకు ఆపద వచ్చినపుడు మాత్రము 'లెమ్ము, నీవు వచ్చి మమ్ము ఆదుకోవలెను' అని ప్రాధేయపడుచున్నారు.

28. మీరు స్వయముగా చేసికొనిన ఆ దేవతలేరి? వారినివచ్చి మీ ఆపదలో మిమ్ము రక్షింపుమనుడు. యూదా దేశమా! నీకెన్ని నగరములున్నవో అందరు దైవములు ఉన్నారుకదా!

29. మీరు నాపై ఎట్టి వ్యాజ్యము తెచ్చెదరు? మీరు నామీద తిరుగుబాటు చేయనేల? ఇది ప్రభుడనైన నా వాక్కు

30. నేను మిమ్ము దండించినను ఫలితము దక్కలేదు. మీరు నా శిక్షను అంగీకరింపలేదు. మీరు గర్జించు సింహము వలె మీ ప్రవక్తలను వధించితిరి.

31. యిస్రాయేలీయులారా! నా పలుకులాలింపుడు. నేను మీపట్ల నివాసయోగ్యముకాని ఎడారివలెను, చీకటి ప్రదేశమువలెను మెలగితినా? మరి మీరు 'మేము మా ఇష్టము వచ్చినట్లు చేయుదుము. మేము మరల నీ చెంతకురాము' అని పలుకనేల?

32. యువతి తన ఆభరణములను మరచిపోవునా? వధువు తన వివాహవస్త్రములను విస్మరించునా? కాని నా ప్రజలు మాత్రము లెక్కింప అలవిగానన్నినాళ్ళ వరకును నన్ను విస్మరించిరి.

33. మీకు మీ ప్రేమికుల వెంటబడుట బాగుగా తెలియును. వేశ్యలుకూడ మీ నుండి కామకలాపములు నేర్చుకోవచ్చును.

34. మీ బట్టలమీద పేదలు దీనులునైన వారి నెత్తురుమరకలు కనిపించుచున్నవి. అవి దోపుడుకాండ్రను చంపుటవలననైన మరకలుగావు.

35. అయినను మీరు, 'మేము నిర్దోషులము. ప్రభువు కోపము నిక్కముగా మా నుండి తొలగిపోయినది” అని అనుకొనుచున్నారు. మీరు 'మేము పాపము చేసితిమి' అని ఒప్పుకొనుటలేదు. కనుక నేను మిమ్ము దండింతును.

36. మీరు ఇంతతేలికగా దైవములను మార్చుకోనేల? మీరు అస్సిరియాను నమ్మి ఆశాభంగము తెచ్చుకొన్నట్లు ఐగుప్తును నమ్ముట వలన మీకు నిరాశతప్పదు.

37. అక్కడనుండి కూడా చేతులు నెత్తిన పెట్టుకొని తిరిగివత్తురు. ప్రభుడనైన నేను మీరు నమ్మినవారిని తిరస్కరించితిని. కనుక ఆ దేశీయులవలన మీకు లాభము కలుగదు”

Text Example

1. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను: “ఎవడైనను తన భార్యను పరిత్యజింపగా ఆమె మరియొకనిని పెండ్లియాడెనేని, మొదటివాడు ఆమెను మరల స్వీకరించునా? స్వీకరించెనేని దేశము అపవిత్రమగును. కాని అనేక ప్రేమికులతో వ్యభిచరించిన మీరు నావద్దకు తిరిగిరమ్మని ప్రభువు పిలుచుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు

2. పర్వతాగ్రములవైపు చూడుడు. అందు మీరు వేశ్యలుగా శయనింపని తావు ఎందైనా కలదా? అరబ్బు దేశీయుడు ఎడారిలో కాచియుండునట్లుగా మీరును త్రోవప్రక్కన విటులకొరకు కాచుకొనియుండిరి. మీ దుష్కార్యములతోను వ్యభిచారములతోను మీరు దేశమును భ్రష్టము చేసితిరి.

3. కావుననే వానలు కురియలేదు. వసంతఋతు వర్షములు ఆగిపోయినవి. మీరు వేశ్యలవలె కన్పించుటకు జంకరైతిరి. మీకు సిగ్గు సెరము లేదు.

4. కాని మీరిప్పుడు 'నీవు మాకు తండ్రివి. మా చిన్న నాటినుండి నీవు మమ్ము వలచితివి.

5. నీవు మామీద దీర్ఘకాలము కోపపడవు. మా మీద నిరంతరము ఆగ్రహము చెందవు' అని పలుకుచున్నారు. ఇట్లు పలుకుచునే మీ పాపములను మీరు చేయుచున్నారు.”

6. యోషీయా రాజు పరిపాలనాకాలమున ప్రభువు నాతో ఇట్లనెను: “విశ్వాసఘాతకురాలైన యిస్రాయేలు ఏమి చేసినదో నీవు చూచితివా? ఆమె ప్రతి కొండకొమ్ము మీదికెక్కిపోయి ప్రతిపచ్చని చెట్టుక్రింద రంకాడెను.

7. 'ఈ కార్యము చేసిన పిదపనైన ఆమె నా చెంతకు తిరిగి వచ్చును' అని నేను భావించితిని. కాని రాలేదు. విశ్వాసఘాతకురాలగు ఆమె సోదరి యూదా ఆమె చేయు పనులను చూచెను.

8. నేను నా నుండి వైదొలగిన యిస్రాయేలును పరిత్యజించి ఆమె రంకులకు గాను ఆమెకు పరిత్యాగ పత్రికను ఇచ్చుటను యూదా చూచెను. కాని యిస్రాయేలు సోదరియు, విశ్వాసఘాతకురాలునైన యూదా ఏ మాత్రము భయ పడక తానును వేశ్యఅయ్యెను.

9. ఆమె సిగ్గు సెరము లేక రంకాడి దేశమును అమంగళము చేసెను. ఆమె రాతిబండలతోను, కొయ్యదిమ్మలతోను వ్యభిచరించెను.

10. ఇంత చేసిన పిదపగూడ యిస్రాయేలు సోదరియు, విశ్వాసఘాతకురాలునైన యూదా నా చెంతకు తిరిగి వచ్చుచున్నట్లు నటించెనేగాని యథార్థముగా తిరిగి రాలేదు.” ఇది ప్రభుడనైన నా వాక్కు.

11. మరియు ప్రభువు నాతో ఇట్లు అనెను: “యిస్రాయేలు నానుండి వైదొలగినను విశ్వాసఘాతకురాలైన యూదాకంటే ఆమెయే మెరుగు.

12. కావున నీవు వెళ్ళి ఉత్తరదిక్కుననున్న యిస్రాయేలునకు ఇట్లు బోధింపుము. విశ్వాస ఘాతకురాలవైన యిస్రాయేలూ! నీవు నా చెంతకు మరలిరమ్ము. నేను కరుణాళుడను. కనుక నీపై ఇక కోపింపను. నీమీద నిరంతరము ఆగ్రహము చెందను.

13. నీవు నీ తప్పు ఒప్పుకొనుము. నీవు ప్రభుడనైన నా మీద తిరుగబడితివని ఒప్పుకొనుము. నీవు నా మాటవినక ప్రతిపచ్చనిచెట్టు క్రింద అన్యదైవములతో క్రీడించితివని అంగీకరింపుము" ఇది ప్రభుడనైన నా వాక్కు.

14. విశ్వాసఘాతకులైన ప్రజలారా! మీరు నా చెంతకుమరలిరండు. మీకు యజమానుడను నేనే. నేను ప్రతి పట్టణమునుండియు మీలో ఒకనిని, ప్రతి కుటుంబము నుండియు మీలో ఇద్దరిని ఎన్నుకొని వారిని సియోను కొండకు గొనివత్తును.

15. 'నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకులనుగా నియమింతును. వారు వివేక విజ్ఞానములతో మిమ్ము పాలింతురు.

16. మీరు దేశమున బహుళ సంఖ్యా కులుగా విస్తరిల్లినపిదప జనులలో ఎవ్వరును “ప్రభువు నిబంధనమందసమును” గూర్చి ప్రస్తావింపరు. వారు దానిని గూర్చి ఆలోచింపరు. దానిని జ్ఞప్తికి తెచ్చుకొనరు. సందర్శింపరు. మరల క్రొత్తమందసమును చేసికొంద మని అనుకొనరు.

17. ఆ కాలము వచ్చినపుడు, యెరూషలేమును ప్రభువు సింహాసనమని పిలుతురు. జాతులెల్ల అచట ప్రోగై నన్ను ఆరాధించును. ఆ ప్రజలిక మొండితనముతో తమ దుష్టాలోచనల ప్రకారము తాము నడచుకొనరు.

18. ఆ కాలమున యిస్రాయేలు యూదాతో ఐక్యమగును. ఆ రెండు దేశముల ప్రజల ప్రవాసము ముగించుకొని ఉత్తర దిక్కున నున్న దేశమునుండి తిరిగివచ్చి నేను పితరులకు భుక్తము చేసిన నేలను చేరుకొందురు.

19. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “ 'నేను మిమ్ము నా తనయులనుగా చేసికోవలెనని ఎంచితిని. ప్రపంచములోని దేశములన్నిటిలోను సుందరమైనదియు, ఆహ్లాదకరమైనదియును అగు దేశమును మీ కొసగవలెనని కోరుకొంటిని. మీరు నన్ను 'తండ్రీ' అని పిలచుచు నిరతము నా వెంటరావలెనని అభిలషించితిని.

20. కాని భార్య భర్తకు ద్రోహము చేసినట్లే మీరును నాకు ద్రోహము చేసితిరి.' ప్రభుడనైన నా వాక్కు ఇది.

21. కొండకొమ్ములమీద శోకాలాపములు వినిపించుచున్నవి. అవి యిస్రాయేలీయుల ఏడుపులు, మనవులు. వారు దుష్టమార్గముపట్టి ప్రభువును విస్మరించినందులకుగాను విలపించుచున్నారు.

22. ద్రోహులై వైదొలగినవారలారా! తిరిగిరండు. నేను మీకు చికిత్సచేసి మిమ్ము విశ్వాసపాత్రులుగా చేయుదుననగా, మీరు ఇట్లు అనుచున్నారు: “ప్రభూ! మేము నీ చెంతకు వచ్చుచున్నాము. నీవే మాకు దేవుడవు.

23. కొండకొమ్ముల మీద పూజలు చేయుటవలన లాభములేదు. పర్వతాగ్రములమీద అరచుటవలన ఫలితములేదు మా దేవుడవు ప్రభుడవునైన నీ నుండియేగాని మాకు రక్షణము లభింపదు.

24. లజ్జాపూరితమైన బాలుదేవతను కొలుచుటవలన మా పశులమందలను, కుమారులను, కుమార్తెలను కోల్పోవలసి వచ్చినది. పూర్వము నుండియు మా పూర్వులు కూడబెట్టిన వానినన్నిటిని పోగొట్టుకోవలసి వచ్చినది.

25. మేము అవమానమను పడకపై పరుండి సిగ్గను దుప్పటిని కప్పుకోవలసి వచ్చినది. మేమును, మా పితరులును పూర్వమునుండియు నీకు ద్రోహము చేయుచునే ఉంటిమి. నీ ఆజ్ఞలను పాటింపమైతిమి.”

Text Example

1. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “యిస్రాయేలీయులారా! మీరు తిరిగి రాగోరెదరని నా చెంతకే తిరిగిరండు. మీరు నేను అసహ్యించుకొను విగ్రహములను తొలగించి నన్ను అనుసరింతురేని,

2. యథార్థముతోను, న్యాయబుద్దితోను, చిత్తశుద్ధితోను నా పేరుమీద " ప్రమాణము చేయుదురేని, వివిధ జాతుల ప్రజలు మీవలె తామును దీవెనలు పొందవలెనని నన్నర్ణింతురు, నన్ను కొనియాడుదురు."

3. యూదా యెరూషలేము జనులతో ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “మీరు బీడువడిన పొలములను బాగుగా దున్నుడు. ముండ్లనడుమ విత్తకుడు.

4. యూదా, యెరూషలేము ప్రజలారా! మీరు మీ ప్రభుడనైన నా నిమిత్తము మీ చర్మాగ్రమున సున్నతి చేయించుకొనుడు అట్లేమీ హృదయముననుసున్నతి చేయించుకొనుడు లేదేని, మీరు చేసిన దుష్కార్యములవలన నా కోపము అగ్నివలె ఎగసి గనగనమండును. ఇక దానిని ఎవడును చల్లార్పజాలడు.”

5. యూదా ప్రజలకు హెచ్చరికచేయుడు, తన యెరూషలేము జనులకు ప్రకటనము చేయుడు. “దేశమునందంతట బాకానూది పెద్దగా అరవుడు, ప్రజలను సురక్షితపట్టణములకు పారిపొమ్మనుడు'

6. సియోనుకు జెండా యెత్తి చూపుడు. జాగుచేయక భద్రతా స్థలములకు పారిపొండు. ప్రభువు ఉత్తరదిక్కునుండి వినాశనమును తెచ్చుచున్నాడు. మహావిపత్తును గొనివచ్చుచున్నాడు.

7. సింహము పొదలోనుండి కదలినది, జాతులను నాశనముచేయువాడు బయలుదేరెను. అతడు యూదాను ధ్వంసము చేయును. యూదానగరములు పాడువడును, వానిలో ఇక ఎవడును వసింపడు.

8. ప్రభువు ఉగ్రకోపము యూదానుండి వైదొలగలేదు కనుక మీరు గోనెతాల్చి శోకింపుడు.”

9. ప్రభువు ఇట్లు అనెను: -“ఆ రోజున రాజులు ధైర్యము కోల్పోవుదురు. అధికారులు డీలాపడుదురు. యాజకులు విస్మయమొందుదురు. ప్రవక్తలు విభ్రాంతి చెందుదురు.”

10. అపుడు నేను ఇట్లంటిని: “హా! ప్రభుడవైన యావే! యెరూషలేము పౌరులను నీవు పూర్తిగా వంచించితివి. నీవు వారికి క్షేమము కలుగునని పలికితివి. కాని ఇపుడు కత్తి ఈ ప్రజల గొంతు మీదకు వచ్చినది.

11. ఎడారి నుండి వేడిగాలి తమ ప్రక్కకు వీచుచున్నదని యెరూషలేము పౌరులు గుర్తించుకాలము వచ్చుచున్నది. అది ధాన్యమును తూర్పారబట్టుటకును, శుద్దిచేయుటకును ఉపయోగపడు మెల్లనిగాలి కాదు,

12. ప్రభువాజ్ఞవలన వీచు బలమైన గాలి. ప్రభువే తన ప్రజలు దోషులని తీర్పు చెప్పుచున్నాడు.”

13. అదిగో! శత్రువు మేఘమువలె వచ్చుచున్నాడు. అతని రథములు సుడిగాలివలె గిఱ్ఱున తిరుగును. అతని అశ్వములు గరుడపక్షి కంటె వేగముగా పరుగెత్తును. కటకటా! మనము శాపముపాలయితిమి.

14. యెరూషలేమూ! నీ హృదయమునుండి మాలిన్యమును కడిగి వేసుకొని, రక్షణమునుబడయుము. నీవెన్నాళ్ళు దుష్టాలోచనలు ఆలోచింతువు?

15. దానునుండి వార్తావహులు వచ్చుచున్నారు. ఎఫ్రాయీము కొండనుండి వినాశవార్తలు వచ్చుచున్నవి.

16. 'దూరప్రాంతమునుండి శత్రువులు వచ్చుచున్నారు. యెరూషలేమునకు విరోధముగా జాతులకు ప్రకటనము చేయువారు వచ్చుచున్నారు.

17. ఈ శత్రువులు యూదా పట్టణముల చుట్టు బిగ్గరగా అరతురు. పొలము కాపరులు చేనిచుట్టు కావలికాసినట్లుగా, వారు యెరూషలేమును చుట్టుముట్టుదురు. ఆ నగర పౌరులు ప్రభువుమీద తిరుగబడిరి. కనుక ఈ కార్యము జరుగును ఇది ప్రభువు వాక్కు

18. యూదా! నీ దుష్టవర్తనమువలన ఈ అనర్థము వాటిల్లెను. నీ పాపమువలన ఈ తిప్పలు వచ్చెను. ఇప్పుడు నీ గుండెలో బాకు దిగబడనున్నది.”

19. నా హృదయము బాధచెందుచున్నది. " నేను ఈ వ్యధను భరింపజాలకున్నాను. నా గుండె వేగముగా కొట్టుకొనుచున్నది. నేను నెమ్మదిగా ఉండజాలను. నాకు బాకాధ్వని, యుద్దరవము విన్పించుచున్నవి

20. నాశనము వెంట నాశనము వచ్చుచున్నది, దేశమంతయు ధ్వంసమైనది. త్రుటికాలములో మన గుడారములు కూలినవి. మన డేరాతెరలు చినిగిపోయినవి.

21. నేను ఎంతకాలము పోరును గాంచవలెను? ఎంతకాలము బాకాలధ్వనిని ఆలింపవలెను?

22. ప్రభువు ఇట్లనుచున్నాడు: “ఈ ప్రజలు మూర్ఖులు, వీరు నన్నెరుగరు. వీరు మందమతులైన బిడ్డలు, బుద్దిలేనివారు. వీరికి చెడునుచేయుట బాగుగా తెలియును. మంచినిచేయుట మాత్రము తెలియదు.”

23. నేను భూమివైపు చూడగ అది అస్తవ్యస్తముగానుండెను. ఆకసమువైపు చూడగా దాని వెలుగు అంతరించెను.

24. పర్వతములవైపు చూడగా అవి కంపించుచుండెను. తిప్పలవైపు చూడగా అవి చలించుచుండెను.

25. నేను పారజూచితిని, గాని నరుడెవ్వడును కన్పింపలేదు. పక్షులుకూడ తిరిగిపోయినవి.

26. సారవంతమైన నేల ఎడారివలె చూపట్టెను. ప్రభువు తీవ్రకోపమువలన నగరములు పాడువడినట్లు కన్పించెను.

27. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “దేశమంతయు నాశనమగును, ఐనను నేను దానిని పూర్తిగా ధ్వంసముచేయను

28. ఈ వినాశమువలన భూమి విలపించును, ఆకాశము చీకటిమయమగును. ప్రభువునోట మాట వెలువడెను. కనుక ఆయన ఇక మనసు మార్చుకొనడు. ఆయన నిర్ణయము చేసెను కనుక ఇక వెనుదీయడు.”

29. రౌతుల ధ్వనిని, విలుకాండ్రసందడిని విని ఎల్లరును పారిపోవుదురు. కొందరు అడవులలోనికి పరుగెత్తుదురు. కొందరు కొండలు ఎక్కుదురు. ప్రతి నగరము నిర్మానుష్యమగును. వానిలో ఇక ఎవడును వసింపడు.

30. యెరూషలేమూ! నీవిక ఏమి చేయుదువు? నీవు ఎఱ్ఱని బట్టలు ధరింపనేల? సువర్ణాభరణములు తాల్చనేల? కాటుక పెట్టుకోనేల? నీ సౌందర్యమెందుకును అక్కరకురాదు. నీ ప్రేమికులు నిన్ను తిరస్కరించిరి. వారు నీ ప్రాణములు తీయుదురు.

31. నేను ప్రసవవేదనను అనుభవించు స్త్రీ రోదనవంటి రోదనను వింటిని. తొలిచూలు బిడ్డను కను ఉవిద కేకలవంటి కేకలను వింటిని. అవి సియోను కుమారి ఏడ్పులు. ఆమె ఊపిరాడక రొప్పుచు చేతులు చాచి “హా! నాకు వినాశనము దాపురించినది, శత్రువులు నన్ను వధించుటకు చుట్టుముట్టిరి” అని పలుకుచున్నది.

Text Example

1. యెరూషలేము వీధులలో అటునిటు పరుగిడుడు. మీమటుకు మీరే పరికించి చూడుడు. అచటి విశాలమార్గములను పరిశీలింపుడు. సత్యనిష్ఠకలవాడు ఒక్కడైన మీ కంటబడినచో, నేను ఆ నగరమును మన్నింతును. ఇది ప్రభువు వాక్కు.

2. మీరు “ప్రభువు జీవముతోడు' అని బాసచేసినను, మీవన్నియు అబద్ద ప్రమాణములే.

3. ప్రభువు నిక్కముగా సత్యమును అపేక్షించును. ఆయన మిమ్ము మోదినను, మీరు లెక్కచేయలేదు. మిమ్ము చితుకగొట్టినను, మీరు పాఠము నేర్చుకోలేదు. మీరు మీ ముఖమును రాయిచేసికొని పశ్చాత్తాపపడరైతిరి.

4. నేను ఇట్లు తలంచితిని. “వీరు నిరుపేదలును, మూర్ఖులునైన ప్రజలు. ప్రభువు ఏమి కోరుకొనునో, ఏమి అపేక్షించునో వారికి తెలియదు.

5. కావున నేను ప్రజానాయకులవద్దకుపోయి వారితో సంభాషింతును. ప్రభువేమి కోరుకొనునో, ఏమి అపేక్షించునో వారికి తెలియును.” కాని వారుకూడ ప్రభువు అధికారమును ధిక్కరించి, ఆయనకు అవిధేయులైరి.

6. ఆ ప్రజల పాపములు లెక్కకుమించినవి. వారు మాటి మాటికి ఆయన నుండి వైదొలగిరి. కావున అడవినుండి వచ్చిన సింగములు వారిని హతమార్చును. ఎడారినుండి వచ్చిన తోడేళ్ళు వారిని నాశనము చేయును. చిరుతపులులు వారి నగరముచుట్టు పొంచియుండి, బయటకు వచ్చినవారిని చీల్చివేయును.

7. ప్రభువు ఇట్లడుగుచున్నాడు: “నేను నా ప్రజల పాపములను ఏల మన్నింపవలెను? వారు నన్ను విడనాడి, దైవముకాని వాటితోడని ప్రమాణము చేయుదురు

8. నేను వారికి తృప్తిగా భోజనము పెట్టగా వారు వ్యభిచారులైరి, వేశ్యాగృహములకు ఎగబడిరి.

9. వారు బలిసిన మావిగుఱ్ఱములవలె కామపూరితులైరి. ప్రతివాడును, తన పొరుగువాని భార్య కొరకు సకిలించుచున్నాడు. ఇట్టి కార్యములకుగాను నేను వారిని దండింపవలదా? ఇట్టి జాతిమీద నేను పగతీర్చుకోవలదా?

10. నేను శత్రువులను పంపి వారి ద్రాక్షతోటలను నరికింతును కాని వారు వానిని పూర్తిగా నాశనము చేయరు. నాకు చెందని కొమ్మలను నరికివేయుడని నేను వారితో చెప్పుదును.

11. యిస్రాయేలు జనులును, యూదా ప్రజలును నాకు పరమ ద్రోహముచేసిరి. ఇది ప్రభువు వాక్కు

12. ప్రభువు ప్రజలు ఆయనను నిరాకరించిరి. ఆయనేమియు చేయడులే' అని పలికిరి. మనకు కష్టములు రావు. యుద్ధము, క్షామము సంభవింపవు అని ఎంచిరి.

13. ప్రవక్తలు వట్టి గాలిమాటలు పలుకువారనియు వారికి ప్రభువుసందేశము తెలియదు అనియు వాకొనిరి.

14. అందుచే సైన్యములకు అధిపతియైన ప్రభువు నాతో ఇట్లు నుడివెను: “ఈ ప్రజలు ఇట్లు పలికిరి. కనుక నేను నా పలుకులను నీ నోట అగ్గివలెనుంతును. ఈ ప్రజలు కట్టెపుల్లలవంటి వారగుదురు. ఆ అగ్ని వీరిని బుగ్గిచేయును.

15. యిస్రాయేలీయులారా! ప్రభువు దూరప్రాంతమునుండి మీ మీదికి ఒకజాతిని గొనివచ్చును. అది అజేయమును, పురాతనమునైన జాతి, దాని భాష మీకు తెలియదు.

16. వారు శూరులైన విలుకాండ్రు, రు నియతో శత్రువులను చంపువారు.

17. వారు మీపంటను, మీ ఆహారమును తినివేయుదురు. మీ కుమారులను, కుమార్తెలను చంపుదురు మీ గొఱ్ఱెలమందలను, గొడ్ల మందలను వధింతురు మీ ద్రాక్షతోటలను, అత్తితోటలను నరికివేయుదురు మీరింతగా నమ్ముకొనిన మీ సురక్షితపట్టణములను కూల్చివేయుదురు.”

18. ప్రభువు ఇట్లనుచున్నాడు: “ఆ దినములలో కూడ నేను నా ప్రజలను శేషము లేకుండా నాశనము చేయను.

19. వారు ప్రభువు ఈ కార్యములెల్ల ఎందుకు చేసెను' అని ప్రశ్నించినపుడు నీవు వారితో ఇట్లు చెప్పుము. 'మీరు ప్రభువును విడనాడి, మీ దేశముననే అన్యదైవములను కొలిచితిరికదా! కనుక మీరిపుడు పరదేశమున అన్యులను కొలువవలెను. "

20. ప్రభువు ఇట్లు అనెను: యాకోబు వంశజులకు ఇట్లు ప్రకటింపుడు. యూదా ప్రజలకిట్లు చాటింపుడు.

21. “మూర్ఖులును, మందబుద్ధులునైన ప్రజలారా వినుడు! మీరు కన్నులున్నను చూడలేరు, చెవులున్నను వినలేరు.

22. మీరు నన్ను గాంచి భయపడరేల? నా ఎదుట గడగడవణకరేల? నేను ఇసుకను కడలికి చెలియలి కట్టగా నిలిపితిని సాగరము ఆ శాశ్వతావధిని దాటలేదు. తరంగములెంత పొర్లినను ఆ ఎల్లను దాటలేవు అలలు ఘోషించునుగాని, ఆ మేరను అతిక్రమింపలేవు.

23. కాని జనులారా! మీరు మొండివారు, తిరుగబడువారు, మీరు నా నుండి వైదొలగి నన్ను విడనాడితిరి.

24. 'నేను మీకు తొలకరివానలను, కడపటివానలను సకాలమున కురియించుచుందును. ప్రతియేడు మీకు పంటకాలమును దయచేయు చుందును. అయినను మీకు నాపట్ల భయభక్తులు చూపవలెను అను కోరికలేదు.

25. మీ పాపములవలన అవి క్రమము తప్పెను. మీ దోషముల వలన ఈ ప్రశస్తభాగ్యములు అంతరించెను.

26. నా జనుల నడుమ దుర్మార్గులున్నారు. వారు పక్షులుపట్టు వారివలె పొంచియుండి ఉచ్చులు పన్నుదురు. కాని నరులనే పట్టుకొందురు.

27. పంజరము పక్షులతోవలె వారి ఇండ్లు కొల్లసొమ్ముతో నిండి ఉన్నవి. కావున వారు ధనవంతులు, బలవంతులైరి.

28. బాగుగా తినిబలిసిరి. వారి దుష్యార్యములకు అంతము లేదు. వారు అనాథశిశువుల హక్కులను మన్నింపరు, పీడితులకు న్యాయము జరుగనీయరు.

29. ఇట్టి వారిని నేను శిక్షింపవలదా? ఇట్టి జాతిమీద నేను పగతీర్చుకోవలదా? ఇది ప్రభువువాక్కు"

30. దేశమున ఘోరమును భీకరమునైన కార్యము జరిగినది.

31. ప్రవక్తలు అసత్య ప్రవచనములు చెప్పుచున్నారు. యాజకులు ప్రవక్తలు చెప్పినట్లుగా ఏలుచున్నారు. నా ప్రజలు దీనికి ఇష్టపడుచున్నారు. కాని అంతము వచ్చినపుడు మీరేమి చేయుదురు?

Text Example

1. బెన్యామీనీయులారా! యెరూషలేమునుండి పారిపొండు. రక్షణస్థలమును వెదకుకొనుడు. తెకోవా నగరమున బాకానూదుడు. బేత్ హక్కెరెమున సంజ్ఞగా నిప్పుమంట వేయుడు. ఉత్తరదిక్కునుండి కీడును, ఘోరవిపత్తును వచ్చుచున్నవి.

2. సియోను నగరము సుందరమైనది. కాని దాని వినాశము చేరువలోనే ఉన్నది.

3. కాపరులు తమ సైన్యములతో వచ్చి ఆ నగరముచుట్టును శిబిరములుపన్నుదురు. ఎవరికి నచ్చినచోట వారు . గుడారములు వేసికొందురు.

4. ఆ రాజులు ఇట్లు చెప్పుకొందురు “మనము నగరముపైకి యుద్ధమునకు పోవుదము మిట్టమధ్యాహ్నము దానిని ముట్టడింతము.” “కాని ఇప్పటికే చాల జాగైనది, ప్రొద్దువాలుచున్నది. సాయంకాలపు నీడలు పొడుగుగా కనిపించుచున్నవి.”

5. “కనుక రేయి ముట్టడి ప్రారంభించి నగరములోని కోటలను ధ్వంసము చేయుదము.”

6. సైన్యములకు అధిపతియైన ప్రభువు ఆ జాతులతో ఇట్లు చెప్పెను: “మీరు చెట్లను నరికివేయుడు. యెరూషలేమును ముట్టడించుటకు మట్టిదిబ్బలు పోయుడు. నగరము పరపీడనముతో నిండియున్నది. కనుక నేను దానిని శిక్షింతును.

7. బావిలో నిరంతరము జలము ఊరునట్లే, యెరూషలేమున నిరంతరము దుష్టత్వము ఊరుచున్నది. అది దౌర్జన్యమునకును, దోపిడికిని ఆలవాలమై ఉన్నది. నాకు కన్పించునవెల్ల రోగములు, గాయములు మాత్రమే.

8. యెరూషలేము పౌరులారా! మీరు ఈ హెచ్చరికలు గైకొనుడు. లేదేని నేను మిమ్ము పరిత్యజింతును. నేను మీ పురమును ఎడారి కావింతును. ఇక అచట ఎవడును వసింపడు.”

9. సైన్యములకధిపతియైన ప్రభువు నాతో ఇట్లనెను: “ద్రాక్షతోటలో పరిగెలేరినట్లే శత్రువులు యిస్రాయేలీయులలో పరిగెలు ఏరుదురు. నీవు చివరిసారిగా వారిలో నీకు చేతనయిన వారిని రక్షింపుము.”

10. కాని నేనిట్లంటిని: నేనెవరికి చెప్పగలను? నా హెచ్చరికలను ఎవరు పాటింతురు? వారికి విను సంస్కారములేదు, వారు వినరు, నా మాటలను వారు లెక్కచేయరు. నీ పలుకులు వారికి రుచింపవు.

11. ప్రభూ! వారిపై నీకు గల కోపము నా గుండెలోను రగుల్కొనుచున్నది. నేనిక దానిని భరింపజాలను. ప్రభువు ఇట్లు అనెను: - “నీవు ఆ కోపమును వీధిలోని పిల్లలమీదను, యువజన సమావేశములమీదను కుమ్మరింపుము శత్రువులు వచ్చి భార్య భర్తలను గొనిపోవుదురు. గడ్డములు నెరసిన వారిని, పండు ముదుసలులను గూడ విడచిపెట్టరు.

12. వారి గృహములు, భూములు, భార్యలు అన్యుల హస్తగతమగుదురు. నేనీ దేశమునందలి ప్రజలను శిక్షింతును.” ఇది ప్రభువు వాక్కు

13. “అల్పులు, అధికులుకూడ అన్యాయమునకు పాల్పడుచున్నారు. ప్రవక్తలు, యాజకులుకూడ వంచనకు ఒడిగట్టుచున్నారు.

14. వారు నా ప్రజల గాయములను పట్టించుకొనుటలేదు. ఎల్లరును కుశలముగా లేకున్నను, ఎల్లరును 'కుశలముగా, శాంతిగా' ఉన్నారని పలుకుచున్నారు.

15. ఇట్టి హేయమైన కార్యములు చేసినందుకు వారు సిగ్గుపడిరా? లేదు, అసలు వారికి సిగ్గుపడుటకూడ చేతకాదు. కనుక పూర్వము నా శిక్షకు లోనైనవారు కూలినట్లే వారును కూలుదురు. నేను దండింపగా వారు నేలకొరుగుదురు.” ఇది ప్రభువు వాక్కు

16. ప్రభువు తన ప్రజలతో ఇట్లనెను: ను: “మీరు నాలుగు త్రోవలు కలియుచోట నిలుచుండి పురాతన మార్గమేది? అని ప్రజలను అడుగుడు. సత్పథమేది? అని ప్రశ్నింపుడు, దానిలో నడువుడు కాని ప్రజలు ఆ మార్గమున నడుచుకొనము' అనుచున్నారు.

17. అంతట ప్రభువు కావలివారిని నియమించి ప్రజలతో 'మీరు వారి బూరధ్వనిని ఆలింపుడు' అని చెప్పెను కాని ప్రజలు 'మేము ఆలింపము' అనిరి.

18. కనుక ప్రభువు ఇట్లనెను: జాతులారా! మీరు నా పలుకులు ఆలింపుడు. బృందములారా! నా ప్రజలకేమి జరుగునో తెలిసికొనుడు.

19. భూమీ వినుము! నా ప్రజల దుష్కార్యములకుగాను నేను వారిని నాశనము చేయబోవుచున్నాను. వారు నా పలుకులు ఆలింపరైరి. నా ఉపదేశములను పెడచెవిని పెట్టిరి.

20. వారు షేబానుండి నాకు సాంబ్రాణిని గొనివచ్చిననేమి? దూరదేశమునుండి సుగంథ ద్రవ్యములను గొనివచ్చిననేమి? వారి దహనబలులను నేను అంగీకరింపను. వారి అర్పణలు నాకు ప్రీతిని కలిగింపవు.

21. కావున 'నేను ఈ ప్రజల బాటలో అడ్డురాళ్ళు వేయుదును. వారు వానిని తట్టుకొని పడిపోవుదురు. తండ్రులు కుమారులు, మిత్రులు, ఇరుగుపొరుగు వారెల్లరును చత్తురు."

22. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు: “ఉత్తరదేశమునుండి ఒకజాతి వచ్చుచున్నది. దూరప్రాంతమునుండి ఒక మహాజాతి యుద్ధమునకు సన్నద్ధమగుచున్నది.

23. ఆ జాతి ప్రజలు విల్లులను, కత్తులను చేపట్టిరి. వారు క్రూరహృదయులు, నిర్దయులు. ఆ ప్రజలు గుఱ్ఱములపై ఎక్కి వచ్చుచుండగా సాగరము ఘోషించునట్లుగా ఉండును. వారు యెరూషలేమును ముట్టడింతురు.”

24. యెరూషలేము పౌరులు ఇట్లందురు. మేమావార్త వింటిమి, మా చేతులు చచ్చుపడినవి. మేము భయభ్రాంతులమైతిమి. ప్రసవవేదనను అనుభవించు స్త్రీవలె వేదననొందితిమి.

25. పొలమునకు పోవుటకుగాని, మార్గములలో నడచుటకుగాని మాకు ధైర్యములేదు. శత్రువులు కత్తితో కాచుకొని ఉన్నారు. ఎల్లయెడల భయము ఆవహించి ఉన్నది.

26. ప్రభువు తన ప్రజలతో ఇట్లనును: మీరు గోనెతాల్చి బూడిదలో పొర్లాడుడు. ఏకైక కుమారుని కోల్పోయినవారివలె తీవ్రదుఃఖముతో శోకాలాపము చేయుడు. మిమ్ము నాశనము చేయువాడు దిఢీలున వచ్చి మీ మీదపడును.

27. యిర్మీయా! “నీవు లోహపరీక్షకునివలె నా ప్రజలను పరీక్షించి, వారెట్టివారో తెలిసికొనుము.

28. వారు తిరుగుబాటు చేయువారు ఇత్తడివలెను, ఇనుమువలెను కఠిన మనస్కులు, దుష్టవర్తనులు, పుకార్లు పుట్టించువారు.

29. కొలిమితిత్తులు గాలిని ఊదుచున్నవి, కొలిమి మండుచున్నది. కాని వెండి నుండి చిట్టెముకరిగి వెలుపలికి వచ్చుటలేదు. ఈ ప్రజలను పుటమువేయుట నిష్ప్రయోజనము. వీరిలో దుష్టులను వేరుచేయుట పొసగకున్నది.

30. ప్రభుడనైన నేను వీరిని పరిత్యజించితిని. కావున నరులు వీరిని పరిత్యజింపబడిన వెండి అని పిలుతురు.”

Text Example

1-2. ప్రభువువాణి యిర్మీయాకు ప్రత్యక్షమై ఇట్లనెను: “నీవు యావే మందిర ద్వారము వద్ద నిలు చుండి ప్రజలకు ఇట్లు బోధింపుము. ప్రభువును కొలుచుటకు ఈ ద్వారముగుండ లోనికివచ్చు యూదా వాసులారా! మీరు ప్రభువు వాక్కు ఆలింపుడు.

3. సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు. మీరు మీ ప్రవర్తనను, మీ క్రియలను మార్చుకొనుడు. అప్పుడు నేను మిమ్మిట వసింపనిత్తును.

4. మీరు 'ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, మనము సురక్షితముగా ఉండవచ్చును' అను మోసపు మాటలను నమ్మవలదు.

5. మీ ప్రవర్తనను, మీ క్రియలను మార్చుకొనుడు. ఒకరిపట్ల ఒకరు నీతితో మెలగుడు.

6. పరదేశులను, అనాథలను, వితంతువులను పీడింపకుడు. ఈ దేశమున నిర్దోషులనెత్తురును ఒలికింపకుడు. పరదైవములను కొలిచి వినాశము తెచ్చుకొనకుడు.

7. మీరు మీ బుద్ధిని మార్చు కొందురేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ నేలపై మిమ్ము బ్రతుకనిత్తును.

8. కాని మీరు మోసపుమాటలు నమ్ముచున్నారు. వానివలన లాభములేదు.

9. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారమునకు, అబద్ద ప్రమాణములకు పాల్పడుచున్నారు. బాలుదేవతకు ధూపము వేయుచున్నారు. మీకు తెలియని పరదైవములను అనుసరించుచున్నారే!

10. ఈ పనులన్నియుచేసి నాదైన ఈ దేవాలయము లోనికి వచ్చి నా ఎదుట నిలుచుండి, మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొను చున్నారు. మీరు సురక్షితముగా ఈ దుష్కార్యములెల్ల చేయవచ్చుననియే మీ తలపు.

11. నాదైన ఈ దేవళము దొంగలు తలదాచుకొను గుహకాదు. నేను మీ కార్యములెల్ల గమనించుచునే ఉందును. ఇది ప్రభువువాక్కు.

12. మీరు షిలోకు వెళ్ళిచూడుడు. అది నేను ఎన్నుకొనిన ప్రథమ ఆరాధనాస్థలము. నా ప్రజలైన యిస్రాయేలీయుల పాపములకుగాను నేను ఆ తావునకు ఏమి చేసితినో చూడుడు.

13. మీరీ పాపములేల చేసితిరి. నేను వేకువనే లేచి మీతో మాట లాడినను మీరు నా పలుకులు పెడచెవిన పెట్టితిరి. నేను మిమ్ము పిలిచినను మీరు బదులీయరైతిరి.

14. కనుక నేను షిలోనువలె నాదైన ఈ దేవళమును, మీరింతగా నమ్ముకొను ఈ మందిరమును నాశనము చేయుదును. మీకును, మీ పితరులకును నేనిచ్చిన ఈ తావును షిలోనువలె ధ్వంసము చేయుదును.

15. నేను మీ బంధువులైన యిస్రాయేలీయులనువలె మిమ్ము కూడ నా ఎదుటినుండి తరిమివేయుదును. ఇవి ప్రభుడనైన నా పలుకులు.

16. “యిర్మీయా! నీవు ఈ ప్రజల తరపున ప్రార్థన చేయవలదు. వారి పక్షమున మొర పెట్టవలదు, వేడికోలు చేయవలదు. నీవు నన్ను అర్ధింపవలదు. నేను నీ ప్రార్ధన వినను.

17. యూదానగరములలోను, యెరూషలేము వీధులలోను వారు ఏమి చేయుచున్నారో నీవు చూచుటలేదా?

18. పిల్లలు పుల్లలేరుకొని వచ్చుచున్నారు. పురుషులు పొయ్యిలో మంట సిద్ధము చేయుచున్నారు. స్త్రీలు పిండి విసరి ఆకాశరాణి అనబడు దేవతకు అర్పించుటకుగాను మోదకములు వండుచున్నారు. ఇంక వారు అన్యదైవములకు ద్రాక్షాసారాయమును పానీయార్పణగా పోసి నన్ను బాధింప చూచుచున్నారు.

19. కాని వారు నన్ను బాధించుటకు మారుగా తమ్ముతామే బాధించుకొందురు. తమకు తామే అవమానము తెచ్చుకొందురు.

20. కనుక యావే ప్రభుడనైన నేను నా ఉగ్రకోపమును ఈ దేవళముపై కుమ్మరింతును. ప్రజలమీదను, పశువుల మీదను, చెట్లమీదను, పైరులమీదను కూడ దానిని కుమ్మరింతును. అది ఆర్పజాలని అగ్నివలెమండును.”

21. సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: “మీ దహన బలులను, సమాధానబలులను కూడ కలుపుకొని అన్నింటిలోను నైవేద్యమును భుజింపుడు.

22. నేను మీ పితరులను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినపుడు దహనబలులను గూర్చిగాని, ఇతర బలులను గూర్చి గాని వారికి ఎట్టి ఆజ్ఞలను ఈయలేదు.

23. కాని నేను మీరు నాకు విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపించుచున్నాను. అటులచేసినచో నేను మీకు దేవుడనగుటకును, మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగును' అని చెప్పితిని.

24. కాని వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్టహృదయము ప్రకారము తామునడచిరి. నా చెంతకు రాక నానుండి వైదొలగిరి,

25. మీ పితరులు ఐగుప్తునుండి వచ్చినప్పటినుండి నేటివరకును అనుదినము పెందలకడనే లేచి నేను నా దాసులైన ప్రవక్తలను మీచెంతకు పంపుచునేయుంటిని.

26. కాని నా పలుకులు ఎవరును ఆలింప లేదు. మీరు మొండివారై మీ పితరులకంటెను దుష్టులుగా తయారైతిరి.

27. యిర్మీయా! “నీవు ఈ పలుకు లన్నింటిని ప్రజలతో చెప్పవచ్చును. కాని వారు నీ మాటవినరు. నీవు వారిని పిలువవచ్చును. కాని వారు, నీకు ప్రత్యుత్తరమీయరు.

28. నీవు వారితో “ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవునిమాట వినుటలేదనియు, తాము పొందిన దండననుండి పాఠము నేర్చుకొనుట లేదనియు చెప్పుము. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది. దానిని గూర్చి మాట్లాడువాడుకూడ లేడు.

29. యెరూషలేము పౌరులారా! మీ కేశములను కత్తిరించి ఆవల పారవేయుడు. కొండకొమ్ముల మీద శోకగీతములు ఆలాపింపుడు. ప్రభుడనైన నేను కోపము చెందిన నా ప్రజలను విడనాడితిని.

30. యూదా ప్రజలొక దుష్కార్యము చేసిరి. వారు నేను ఏవగించుకొను విగ్రహములను నా దేవళమున నెలకొల్పి, దానిని అమంగళము చేసిరి.

31. హిన్నోము లోయలో తోఫెతు అను బలిపీఠము కట్టి వారి కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చి వేసిరి. నేను ఈ కార్యము చేయుడని వారిని ఆజ్ఞాపింప లేదు. అట్టి ఆలోచన నాకు తట్టనుకూడ తట్టలేదు.

32. కనుక ప్రజలు ఇక దానిని తోఫెతు పీఠమనిగాని, హిన్నోములోయయని గానీ పిలువక, వధలోయ అని పిలుచు రోజులు వచ్చును. పాతి పెట్టుటకు స్థలము లేకపోవువరకు తోఫేతులో శవములు పాతి పెట్ట బడును. ఇది ప్రభువు వాక్కు,

33. వన్యమృగములును, ఆకాశపక్షులును వారి శవములను తినివేయును. వానినెవడును తోలివేయడు.

34. నేను దేశమును ఎడారి చేయుదును. యూదా నగరముల లోను, యెరూషలేము వీధులలోను ఆనందనాదముల నెల్ల అణచి వేయుదును. వివాహోత్సవములలో వధూ వరులనోట విన్పించు సంతోషధ్వానములనెల్ల నిర్మూ లింతును.

Text Example

1. ఆ కాలము వచ్చినపుడు రాజుల అస్థికలను, అధికారుల అస్థికలను, యాజకుల అస్థికలను, ప్రవక్తల అస్థికలను, యెరూషలేమున వసించిన ఇతర ప్రజల అస్థికలను సమాధులలోనుండి బయటికి తీయుదురు.

2. వారు ప్రేమించు సూర్యచంద్ర తారకల ఎదుట నేలపై పరతురు. ప్రజలు ఈ గ్రహములను అభిమానించిరి, సేవించిరి, సంప్రతించిరి, అను సరించిరి, నమస్కరించిరి, పూజించిరి. వానిని ప్రోగు జేసి భూస్థాపనము చేయుటకు మారుగా, నేలమీద ఎరువుగా వెదజల్లుదురు.

3. ఈ దుష్టజాతిలో మిగిలినవారు నేను తమను చెల్లాచెదరు చేసిన తావులలో వసింతురు. వారికి అచట బ్రతుకుటకంటె, చచ్చుట మేలు అనిపించును. ఇది సైన్యములకు అధిపతియగు ప్రభుడనైన నా వాక్కు”

4. ప్రభువు నన్ను తన ప్రజలకు ఇట్లు చెప్పుమనెను: "క్రిందపడినవాడు పైకిలేవడా? త్రోవ దప్పినవాడు వెనుకకు తిరిగిరాడా?

5. నా ప్రజలారా! | మీరు నానుండి వైదొలగి కలకాలము నాపట్ల విశ్వాసఘాతకులుగా మెలగనేల? మీరు మీ విగ్రహములను అంటిపెట్టుకొని నా చెంతకు తిరిగిరాకున్నారు.

6. నేను మీ పలుకులను జాగ్రత్తగా వినుచున్నాను. మీరు సత్యము చెప్పుటలేదు. మీలో ఎవడును తన తప్పులకు పశ్చాత్తాపపడుటలేదు. 'నేను చేసిన నేరమేమిటా? అని ఎవడును ఆత్మవిచారము చేసికొనుటలేదు. అశ్వము రణరంగమునకు ఉరకలెత్తినట్లే ప్రతివాడును మూర్ఖముగా తనదారిన తాను పోవుచున్నాడు."

7. ఆకాశమున ఎగురు బెగ్గురు పక్షులకు తాము తిరిగిరావలసిన కాలము తెలియును. గువ్వలకు, వాన కోవెలలకు, కొంగలకు తాము వలసపోవలసిన సమయమును తెలియును. కాని నా ప్రజలైన మీకు ప్రభుడనైన నా ఆజ్ఞలు ఏమాత్రమును తెలియవు.

8. 'మేము జ్ఞానులమనియు, మాకు ధర్మశాస్త్రము తెలియుననియు' మీరు వాకొననేల? కల్లలాడు ధర్మశాస్త్ర బోధకులు ప్రభువు ధర్మ విధులను మార్చివేసిరి.

9. జ్ఞానులైనవారు. అవమానమును పొందుచున్నారు పట్టువడి నోటమాట రాకున్నారు. వారు ప్రభువు వాక్కును తృణీకరించిరి, ఇక వారి జ్ఞానమేపాటిది?

10. కనుక నేను వారి భూములను అన్యుల వశము చేయుదును. వారి భార్యలను పరులకు అప్పగింతును. అల్పులు, అధికులు కూడ అన్యాయార్జనమునకు పాల్పడుచున్నారు. ప్రవక్తలు యాజకులుకూడ , వంచనమునకు ఒడిగట్టుచున్నారు.

11. వారు నా ప్రజల గాయములను పట్టించుకొనుటలేదు. ఎల్లరును కుశలముగా లేకున్నను, ఎల్లరును శాంతిగా లేకున్నను, “ఎల్లరును కుశలముగాను, శాంతిగాను ఉన్నారు' అని చెప్పుచున్నారు.

12. ఇట్టి హేయమైన కార్యములు చేసినందులకు వారు సిగ్గుపడిరా? లేదు, అసలు వారికి సిగ్గుపడుట కూడ చేతకాదు. కనుక పూర్వము నా శిక్షకులోనైన వారు కూలినట్లే వారును కూలుదురు. నేను దండింపగా వారు నేలకొరుగుదురు. ఇది ప్రభువు వాక్కు

13. నేను ద్రాక్షపండ్లు కోయగోరినపుడు, ద్రాక్షతీగలమీద పండ్లులేవు, . అంజూరముల మీద ఫలములు లేవు. వాని ఆకులు కూడ వాడిపోయినవి. కనుక నేను వారికిచ్చినది వారినుండి వెడలిపోయినది.

14. ప్రభువు ప్రజలు ఇట్లందురు: మనమిచట వట్టినే కూర్చుండి ఉండనేల? రండు, సురక్షిత పట్టణములకు పారిపోయి అచట చత్తము. మనము ప్రభువునకు ద్రోహముచేసితిమి. కనుక మన దేవుడు మనకు చావు విధించెను, విషము త్రాగనిచ్చెను.

15. మనము శాంతికొరకు ఆశించితిమి, కాని మేలేమియు కలుగలేదు. ఆరోగ్యము కలుగును అనుకొంటిమి, కాని భీతి వాటిల్లెను.

16. దానునుండి శత్రువుల గుఱ్ఱముల బుసలు విన్పించుచున్నవి. వారి గుఱ్ఱముల సకిలింపులకు నేల దద్దరిల్లుచున్నది. విరోధులు మన దేశమును, అందున్న వానినన్నిటిని, మన నగరములను, అందలి ప్రజలను నాశనముచేయుటకు వచ్చిరి.

17. ప్రభువు ఇట్లు అనును: “నేను మీ మీదికి పాములను పంపుదును. మాంత్రికులకు లొంగని విషసర్పములను పంపుదును. అవి మిమ్ము కరచితీరును” ఇది ప్రభువు వాక్కు

18. నేను ఈ దుఃఖమునెట్లు భరింతును? నా గుండెలు పగిలిపోవుచున్నవి.

19. వినుడు, దేశము నలుమూలలను నా ప్రజలు శోకించుచున్నారు. వారు “ప్రభువిక సియోనునలేదా? సియోను రాజు ఇక అచట లేదా?” అని ఏడ్చుచున్నారు. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “మీరు విగ్రహములను ఆరాధించి నాకు కోపము రప్పింపనేల? నిష్ప్రయోజకములైన అన్యదైవములను కొలువనేల?”

20. ప్రజలు ఇట్లు విలపింతురు: “వేసవి గతించినది, కోతకాలము దాటిపోయినది. మనము రక్షణమును బడయమైతిమి.”

21. నా ప్రజల హృదయవేదనను చూచి నేనును వేదన చెందుచున్నాను. నేను శోకించుచున్నాను. భయభ్రాంతుడను అగుచున్నాను.

22. గిలాదున మందులేదా? అచట వైద్యుడు లేడా? ఉన్నచో నా జనులు ఆరోగ్యము బడయరేల?

Text Example

1. నా శిరస్సు జలకూపమైన ఎంత బాగుండును! నా నేత్రములు కన్నీటిచెలమలైన ఎంత బాగుండును! అప్పుడు నేను హతులైన నా ప్రజలకొరకు రేయింబవళ్ళు విలపించెడివాడను.

2. ఎడారిలో నాకు బాటసారుల గుడిసె దొరకిన ఎంత బాగుండును. అప్పుడు వ్యభిచారులును, ద్రోహులునైన నా ప్రజలను విడనాడి నేను అచటికి వెళ్ళేడివాడను.

3. వారి నాలుక అబద్దములాడుటకు వంచిన విల్లువలె సిద్ధముగా ఉన్నది. దేశమున అసత్యము రాజ్యము చేయుచున్నది. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “ఈ ప్రజలు కీడువెంట కీడు చేయుచున్నారు. వీరికి నన్నుగూర్చి తెలియదు”.

4. ప్రతివాడు తన మిత్రుని ఒక కంట కనిపెట్టి ఉండవలెను. ఎవడును తన సోదరుని నమ్మరాదు. ప్రతి సోదరుడును యాకోబువలె మోసము చేయును. ప్రతివాడును తన మిత్రునిమీద నిందలుమోపువాడే.

5. ప్రతివాడును తోడివానిని వంచించువాడే. సత్యము చెప్పువాడు ఒక్కడును లేడు. వారు తమ నాలుకలకు కల్లలాడుట నేర్పిరి. కనుక ఇక తమ దుష్ట వర్తనమును మార్చుకొనరు.

6. వారు దౌర్జన్యము మీద దౌర్జన్యమును, మోసము మీద మోసమును చేయుచున్నారు. ప్రభువు తన ప్రజలు తనను నిరాకరించిరని పలుకుచున్నాడు.

7. కనుక సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు. “నేను నా ప్రజలను శుద్ధి చేయుదును. పరీక్షకు గురిచేయుదును. తప్పు చేసిన నా వారిని ఇంతకంటె ఏమిచేయుదును?

8. వారి నాలుకలు చంపెడు బాణములవలె ఉన్నవి. వారు ఎల్లవేళల కల్లలాడుదురు. ప్రతివాడు పొరుగువానితో ఆప్యాయముగా మాట్లాడును. కాని లోలోపల అతనికి ఉచ్చులు పన్నును.

9. ఇట్టి పనులకు పాల్పడువానిని నేను దండింపవలదా? ఇట్టి జాతిమీద నేను పగతీర్చుకోవలదా? ఇది ప్రభుడనైన నా వాక్కు

10. నేనిట్లు తలంచితిని: నేను పర్వతముల కొరకు శోకింతును. పచ్చికపట్టుల కొరకు విలపింతును. అవి ఎండిపోయినవి. వానిగుండ ఎవ్వడును పయనించుటలేదు. వానిలో పశువులమందల అరపులు విన్పించుటలేదు. పక్షులు, వన్యమృగములు పారిపోయినవి.

11. ప్రభువు ఇట్లనెను: నేను యెరూషలేమును శిథిలము గావింతును. నక్కలు దానిలో వసించును. యూదానగరములు ఎడారులగును వానిలో ఎవడును నివసింపడు.”

12. నేను 'ప్రభూ! ఈ దేశము శిథిలము కానేల? నరసంచారము లేని ఎడారివలె ఎండిపోనేల? ఈ విషయము గ్రహింపగల వివేకము ఎవనికి గలదు? ఈ సంగతిని నీ వద్దనుండి తెలిసికొని దానిని ఇతరు లకు వివరింపగలవాడెవడు?' అని అడిగితిని.

13. ప్రభువు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను: “ఈ కార్యము జరుగుటకు కారణమిది. నా ప్రజలు నేనొసగిన ఉపదేశమును పాటింపలేదు. నా మాట వినలేదు. నేను చెప్పిన పని చేయలేదు.

14. పైగా వారు మొండి హృదయముతో తమ పితరులు నేర్పినట్లుగానే బాలుదేవత బొమ్మలను కొలిచిరి.

15. కనుక సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడనైన నేనేమి చేయుదునో వినుము. ఈ ప్రజలచేత చేదుకూరలు తినిపింతును. విషజలములు త్రాగింతును.

16. వీరికిగాని, వీరి పితరులకుగాని తెలియని జాతులమధ్య వీరిని చెల్లాచెదరు చేయుదును. వీరి మీదికి సైన్యములను పంపి వీరిని పూర్తిగా నాశనము చేయింతును.”

17. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనెను: “యోచింపుడు. మీరు శోకాలాపముచేయు స్త్రీలను పిలువుడు. విలాపగీతములను పాడు ఉవిదలకు కబురు పెట్టుడు.

18. ప్రజలు ఇట్లనిరి: ఆ స్త్రీలు త్వరగా శోకగీతము ఆలపింతురుగాక! అప్పుడు మన నేత్రములు కన్నీరు కార్చును. ఏడుపుల వలన మన కనుగ్రుడ్లు తడియును”.

19. సియోనున వినిపించు శోకాలాపమును ఆలింపుడు: “మనము నాశనమైతిమి. అవమానమున మునిగితిమి. మనము ఈ దేశమును విడనాడవలెను. మన ఇండ్లు కూలినవి.”

20. నేనిట్లు పలికితిని: “ఉవిదలారా! మీరు ప్రభువు పలుకులాలింపుడు. ఆయన మాటలు వినుడు. మీ కుమార్తెలకు శోకగీతములు నేర్పుడు. మీ తోడి మగువలకు విలాపగీతములు నేర్పుడు.

21. మృత్యువు గవాక్షములగుండ దూరివచ్చి, మన ప్రాసాదములలో ప్రవేశించినది. అది మన వీధులలోని పిల్లలను, మన సంతలోని పెద్దలను సంహరించినది.

22. పీనుగులు పొలమున జల్లిన ఎరువువలె ఎల్లెడల కనిపించుచున్నవి. అవి కోతగాండ్రు వదలివెళ్లిన పనలవలె నున్నవి. ప్రభువు నన్ను చెప్పుమనిన పలుకిదియే.”

23. ప్రభువు ఇట్లనెను: “జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చిగాని, శూరులు తమ శౌర్యమును గూర్చిగాని, ధనికులు తమ సంపదలను గూర్చిగాని గొప్పలు చెప్పుకొనకుందురుగాక!

24. గొప్పలు చెప్పుకోగోరువాడు, తాను నన్నెరిగి నన్నర్థము చేసికొనుటను గూర్చి గొప్పలు చెప్పుకొనునుగాక! నేను కరుణతోను, నీతి న్యాయములతోను భూమిని ఏలుదును. నాకు నచ్చిన గుణములివియే. ఇది ప్రభుడనైన నా వాక్కు”

25-26. ప్రభువు ఇట్లనెను: “నేను ఐగుప్తు, యూదా, ఎదోము, అమ్మోను, మోవాబు ప్రజలను, తల వెంట్రుకలను కురచగా కత్తిరించుకొను ఎడారి ప్రజలను శిక్షించుకాలము వచ్చుచున్నది. వీరెల్లరును శారీరకమైన సున్నతి మాత్రమే పొందిరి. ఈ ప్రజలును, యిస్రాయేలీయులును హృదయమున సున్నతి పొందరైరి.”

Text Example

1. యిస్రాయేలీయులారా! ప్రభువు మీతో చెప్పు సందేశము ఆలింపుడు.

2. ఆయన ఇట్లనుచున్నాడు: “మీరు అన్యజాతుల పద్ధతులను అవలంబింపకుడు. ఆకాశములోని గురుతులను చూచి వెరగొందకుడు. అన్యజాతులు వాటికి వెరచిన వెరవవచ్చును.

3. అన్యజాతుల ఆచారములు నిష్ప్రయోజనమైనవి. నరుడు అడవిలో చెట్టును నరకునట్లు అవి నరకబడును. పనివాడు గొడ్డలితో చేసిన పనియిది.

4. దానిని వెండిబంగారములతో అలంకరించి, క్రింద పడిపోకుండునట్లు, చీలలతో కొట్టి నిలబెట్టుదురు.

5. విగ్రహములు దోసతోటలోని దిష్టి బొమ్మలవంటివి. అవి మాట్లాడలేవు, స్వయముగా నడువలేవు. కనుక నరులే వానిని మోసికొనిపోవుదురు. మీరు వానిని చూచి భయపడనక్కరలేదు. అవి మీకెట్టి కీడుగాని, మేలుగాని చేయజాలవు.”

6. ప్రభూ! నీకు తుల్యుడెవడును లేడు. నీవు మహామహుడవు. నీ దివ్యనామము మహామహిమాన్వితమైనది.

7. జాతులకు రాజువైన నిన్నెవడు గౌరవింపకుండును? గౌరవమును బడయుట నీ హక్కు నిఖిల జాతుల జ్ఞానులలో గాని, రాజులలోగాని నీ వంటివాడు లేడు.

8. వారెల్లరును మూర్ఖులు, మందమతులు. విగ్రహములనుండి వారు నేర్చుకొను బోధ నిరర్థకమైనది.

9. వారి విగ్రహములకు కమ్మచ్చున తీసిన తగ్లీషు వెండిని, ఊఫాజు బంగారమును పొదిగిరి. అవియన్నియు కళాకారులును, కంసాలులును చేసినవి. ఆ బొమ్మలకు నేర్పరులైన నేతపనివారునేసిన నీలము, ధూమ్ర వర్ణముగల బట్టలను తొడిగిరి.

10. కాని ప్రభువు నిక్కమైన దేవుడు, సజీవుడైన దేవుడు, శాశ్వతుడైనవాడు. ఆయన కోపగించినచో భూమి కంపించును. జాతులు ఆయన ఆగ్రహమును భరింపజాలవు.

11. “భూమ్యాకాశములను సృష్టింపని , ఈ దైవములు భూమిమీద నుండకుండగను, ఆకాశము క్రింద ఉండకుండగను తుడిచివేయ బడుదురు” అని మీరు ఆ జాతులతో నుడువుడు.

12. ప్రభువు తనబలముచేత భూమిని సృష్టించెను. తన జ్ఞానముతో ప్రపంచమును నెలకొల్పెను. తన ప్రజ్ఞతో ఆకసమును విశాలముగా విప్పెను.

13. ఆయన ఆజ్ఞాపింపగా ఆకాశజలములు పుట్టును ఆయన నేల అంచులనుండి మబ్బులను కొనివచ్చును. వర్షధారలలో మెరుపులు వెలిగించును. తన గిడ్డంగులలోనుండి వాయువులను పంపును.

14. ఈ కార్యములెల్లచూచి నరులు తెలివిని కోల్పోయి తికమకపడుదురు. విగ్రహములను చేయువారు సిగ్గుపడుదురు. వారి బొమ్మలు నిర్జీవములు, నిష్ప్రయోజకములు.

15. అవి జడములు, అస్తిత్వము లేనివి, నగుబాట్లు తెచ్చునవి. ప్రభువు వానికి తీర్పుచెప్పుటకు వచ్చినపుడు అవి నశించును.

16. కాని యాకోబు దేవుడు ఈ బొమ్మలవంటివాడుకాదు ఆయన సమస్తమును నిర్మించువాడు. యిస్రాయేలు తాను ఎన్నుకొనిన జాతి సైన్యములకధిపతియని ఆయనకు పేరు.

17. యెరూషలేము పౌరులారా! శత్రువులు మిమ్ము చుట్టుముట్టిరి కాన మీ వస్తువులను మూటకట్టుకొని పారిపొండు.

18. “ఇదిగో ప్రభువు మిమ్ము ఈ దేశమునుండి వెళ్ళగొట్టును. ఒక్కనినిగూడ మిగులనీయకుండ మిమ్మెల్లరిని మట్టుపెట్టును.” ఇది ప్రభువువాక్కు

19. యెరూషలేము పౌరులు ఇట్లు విలపించిరి: “కటకటా మేమెట్టి దెబ్బలుతింటిమి. మా గాయములిక మానవు. అయితే ఈ గాయము మాకు తగినదే అనుకొని, మేము దానిని సహింతుము.

20. కాని యిపుడు మా గుడారములు కూలినవి. వాని త్రాళ్ళు తెగిపోయినవి. మా పిల్లలు మాచెంతనుండి వెళ్ళిపోయిరి. పడిపోయిన గుడారములు ఎత్తుటకును, తెరలను కట్టుటకును, ఎవరును కనిపించుటలేదు.”

21. నేనిట్లు బదులు చెప్పితిని: మన కాపరులు మూర్ఖులు. వారు ప్రభువును సలహా అడుగరైరి. కనుకనే వారు వృద్దిలోనికి రారైరి. మన ప్రజలు చెల్లాచెదరైరి.

22. అదిగో వినుడు. వార్తలు వచ్చుచున్నవి! ఉత్తరదిక్కున ఉన్న ఆ జాతి సైన్యములు యూదా నగరములను ఎడారులు చేసి, నక్కలకు ఆటపట్టులు చేయుటకు వచ్చెడి గొప్ప అల్లకల్లోల ధ్వని వినబడుచున్నవి.

23. ప్రభూ! ఏ నరుడు తన గతిని తాను నిర్ణయించుకోజాలడనియు, తన జీవితమును తన వశములో ఉంచుకోజాలడనియు నేను ఎరుగుదును.

24. ప్రభూ! మమ్ము మృదువుగా శిక్షింపుము. కోపముతో కఠినముగా దండింతువేని, మేము నాశనమై పోయెదము.

25. నిన్నెరుగని అన్యజాతులమీద, నిన్ను ఆరాధింపని వారిమీద నీ ఆగ్రహమును కుమ్మరింపుము. వారు నీ ప్రజలను మట్టుపెట్టి సర్వనాశనము చేసిరి. మా దేశమును ఎడారి కావించిరి.

Text Example

1. ప్రభువు యిర్మీయాకు తన వాక్కునిట్లు విన్పించెను;

2. “నీవు నిబంధనపు షరతులను ఆలింపుము.

3. యిస్రాయేలు దేవుడనైన నేను నిబంధనపు షరతులు పాటింపని వానిని శపింతునని యూదా ప్రజలతోను యెరూషలేము పౌరులతోను చెప్పుము.

4. నేను వారి పితరులను కొలిమి వంటి ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినపుడు, వారితో ఈ నిబంధనమును చేసికొంటిని. వారు నాకు విధేయులై నేను చెప్పినదెల్ల చేయవలెనని ఆజ్ఞాపించి తిని. అట్లు విధేయులైనచో నేను వారికి దేవుడనగుదు ననియు, వారు నాకు ప్రజలగుదురనియు చెప్పితిని,

5. అపుడు నేను వారి పితరులకు చేసిన వాగ్దానమును నిలబెట్టు కొందుననియు, వారి స్వాధీనముననున్న నేలను వారికి భుక్తము చేయుదుననియు చెప్పితిని”. “ఆ మాటలకు నేను “ప్రభూ! అట్లే జరుగునుగాక!” అని అంటిని.

6. అంతట ప్రభువు నాతో ఇట్లనెను: నీవు యూదా నగరములలోనికిని యెరూషలేము వీధులలోనికిని వెళ్ళి ఇట్లు ప్రకటింపుము. “మీరు నా నిబంధనపు షరతులను విని వానిని పాటింపుడు.

7. నేను మీ పితరులను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చి నపుడు వారు నాకు విధేయులు కావలెనని ఖండితముగా ఆజ్ఞాపించితిని. ఈ రోజు వరకును నేను ప్రజలను హెచ్చరించుటను మానలేదు.

8. కాని వారు నా మాట వినలేదు, నాకు విధేయులు కాలేదు. ప్రతివాడును తన దుష్టహృదయము ప్రకారము నడచెను. నేను వారిని నిబంధన పాటింపుడని చెప్పితిని, గాని వారు వినలేదు. కనుక నేను వారిని ఆ నిబంధనమున చెప్పబడిన శిక్షలన్నిటికిని గురిచేసితిని.”

9. అటుపిమ్మట ప్రభువు నాతో ఇట్లనెను: యూదా ప్రజలును, యెరూషలేము నివాసులును నా మీద కుట్ర పన్నుచున్నారు.

10. వారుకూడ తమ పితరుల వంటివారై నేను చెప్పిన పనిని చేయుటలేదు. అన్యదైవములను పూజించుచున్నారు. యిస్రాయేలీయులును, యూదా ప్రజలును గూడ నేను తమ పితరులతో చేసికొనిన నిబంధనను మీరిరి.

11. కనుక ప్రభుడనైన నేనిపుడు వారిని వినాశమునకు గురిచేయుదుననియు, వారు దానిని తప్పించుకోజాలరనియు హెచ్చరించు చున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వినను.

12. యూదా నగరములలోని ప్రజలును, యెరూషలేము పౌరులును తాము సాంబ్రాణి పొగ వేసిన దేవతల యొద్దకు పోయి, వారికి మొరపెట్టుకోవచ్చును. కాని ఆ దేవతలు వారిని వినాశనమునుండి కాపాడజాలరు.

13. యూదా నివాసులు తమకెన్ని నగరములు ఉన్నవో, అన్ని దేవతలను కొలుచుచున్నారు, యెరూషలేము ప్రజలు తమ పట్టణమున ఎన్ని వీధులు కలవో అన్ని బలిపీఠములను హేయమైన బాలుదేవతకు నిర్మించిరి.

14. యిర్మీయా! “నీవు ఈ ప్రజల తరఫున మనవి కాని, ప్రార్ధన కాని చేయవలదు. వారు ఆపదలో చిక్కి నాకు మొరపెట్టుదురేని, నేను వినను.

15. నేను ప్రేమించుప్రజలు లజ్జాకరమైన పనులు చేయుచున్నారు. వారికి నా దేవాలయమున నిలుచుటకు అర్హత ఎక్కడిది? వారి మ్రొక్కుబడులును, జంతు బలులును రానున్న విపత్తునుండి వారిని కాపాడునా? ఆ విపత్తు వచ్చినపిమ్మట వారు సంతసింపగలరా?

16. వారు పచ్చని ఆకులతోను, మనోహర ఫలములతోను నిండిన ఓలివుచెట్టువంటి వారని నేను పూర్వము పలికితిని. " కాని ఇపుడు నా గర్జనమను పిడుగుతో దాని ఆకులను కాలును, దాని కొమ్మలను విరుతును.

17. సైన్యములకు అధిపతియు, ప్రభుడనైన నేను యిస్రాయేలును, యూదా ప్రజలను చెట్టువలె నాటితిని. కాని ఇపుడు వారికి వినాశము దాపురించినది. వారి దుష్కార్యముల వలననే వారికి ఈ గతి పట్టినది. వారు బాలు దేవతకు సాంబ్రాణి పొగ వేసి నా కోపమును రెచ్చగొట్టిరి.”

18. నా విరోధులు నామీదపన్ను కుట్రలను , ప్రభువు నాకు తెలియజేసెను.

19. నా మట్టుకు నేను తనను తోలుకొనిపోవువారిని నమ్మి వధ్యస్థానమునకు , వెళ్ళు గొఱ్ఱెపిల్ల వలె నుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు "పుష్టిగా నున్నపుడే చెట్టును నరికివేయుదము. ఇతనిని నరలోకము నుండి తుడిచి పెట్టుదము. ఇక ఇతనిపేరు కూడ విన్పింపకూడదు” అని పలికిరి.

20. నేను ఇట్లు మనవి చేసితిని: సైన్యములకు అధిపతియైన ప్రభూ! నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి. నరుల హృదయమును, మనసును పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యెమును నీకు అప్పగించితిని. నీవు నా విరోధులకు ప్రతీకారముచేయగా నేను చూతునుగాక!

21. అనాతోతు ప్రజలు నన్ను చంప నిశ్చయించుకొనిరి. “నీవు ప్రభువు సందేశము ప్రకటించినచో మేము నిన్ను వధింతుము” అని పలికిరి.

22. కనుక ప్రభువు ఇట్లనెను: “నేను వారిని శిక్షింతును. వారి యువకులు పోరున చత్తురు. వారి పిల్లలు ఆకలితో చత్తురు.

23. నేను అనాతోతును నాశనము చేయుటకు నిర్ణీతకాలమును ఎన్నుకొంటిని. ఆ సమయమురాగానే ఆ పట్టణములోని ప్రజలెల్లరును చత్తురు.”

Text Example

1. ప్రభూ! నేను నీతో వాదింతునేని, నీవు నీతిమంతుడువుగా అగుబడుదువు. అయినను న్యాయమును గూర్చి నేను నిన్ను ప్రశ్నింపగోరెదను. దుర్మార్గులు వృద్ధిలోనికి రానేల? దుష్టులు సుఖములను బడయనేల?

2. నీవు ఆ దుర్జనులను చెట్టువలెనాటగా, వారు వేరూని యెదిగి పండ్లుకాయుదురు.వారు నిరంతరము నిన్నుగూర్చి మాటాడుదురు. కాని నీవు వారి హృదయమున ఉండనే యుండవు.

3. ప్రభూ! నీకు నా గురించి తెలియును. నీవు నా కార్యములను గమనింతువు. నీ యెడల నా హృదయము ఎట్లున్నదని శోధించుచున్నావు. ఈ దుష్టులను గొఱ్ఱెలవలె వధ్యస్థానమునకు ఈడ్చుకొని పొమ్ము. వధించుకాలము వచ్చువరకును వారిని నీ అధీనమున ఉంచుకొనుము.

4. దేశము ఎన్నాళ్ళు శుష్కించి ఉండవలెను? బీళ్ళలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోయి ఉండవలెను? మా ప్రజల పాపములవలన మృగాలు, పక్షులు చచ్చుచున్నవి. వారు దేవుడు మన కార్యములు చూడడులే అనుకొనుచున్నారు.

5. ప్రభువు నాతో ఇట్లనెను: “నీవు పాదచారులవెంట పరుగెత్తలేక అలసిపోయినచో, ఇక గుఱ్ఱములవెంట ఎట్లు పరుగెత్తెదవు? పొలముననే నిలువజాలనిచో, ఇక యోర్దాను చేరువలోని అరణ్యమున ఎట్లు నిలుతువు?

6. నీ కుటుంబమునకు చెందిన నీ సోదరులే నీకు ద్రోహము తలపెట్టుచున్నారు. నీ మీదికెత్తి వచ్చుచున్నారు. వారు నీతో తీయగా మాట్లాడినను, నీవు వారిని నమ్మవలదు."

7. ప్రభువు ఇట్లనెను: “నేను యిస్రాయేలును పరిత్యజించితిని. నేనెన్నుకొనిన ప్రజలను విడనాడితిని. నేను ప్రేమతో చూచుకొను జనులను వారి శత్రువుల చేతికి అప్పగించితిని.

8. నా సొంత ప్రజలు అడవిలోని సింగములవలె నామీద తిరుగబడుచున్నారు. నన్ను చూచి గర్జించుచున్నారు. కనుక నేను వారిని ద్వేషించితిని.

9. నేను ఎన్నుకొనిన ప్రజలు రంగురంగుల క్రూరపక్షి వంటివారైరి. నలువైపులనుండి డేగలు దానిమీదికి దిగివచ్చెను. వన్యమృగములారా! మీరును వచ్చి దానిని కబళింపుడు.

10. అనేకమంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనము చేసిరి. నా పొలమును కాళ్ళతో తొక్కివేసిరి. నాకు ఇష్టమైన నా ద్రాక్షతోటను ఎడారి కావించిరి.

11. దానిని మరుభూమి కావించిరి. అది నా కన్నుల ఎదుటనే పాడువడియున్నది. దేశమంతయు ఎడారిగా మారిపోయినను చింతించువాడు ఎవడునులేడు.

12. ఎడారి భూములందు నాశనము చేయువారు తిరుగాడుచున్నారు. దేశమంతటిని తుడిచిపెట్టుటకు నేను యుద్ధమును తెచ్చిపెట్టితిని. ఇక ఏ నరుడును క్షేమముగా బ్రతుకజాలడు.

13. నా ప్రజలు గోధుమలు చల్లి ముండ్ల పంటను ప్రోగుచేసికొనుచున్నారు. వారు శ్రమించి పనిచేసినను ఫలితము దక్కలేదు. నేను ఆగ్రహించితిని కనుక వారికి పంటలు పండలేదు.”

14. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలీయులకు ఇరుగుపొరుగున ఉన్న జాతులు నేను నా ప్రజల కొసగిన దేశమును పాడుచేసిరి. ఆ జాతులనుగూర్చి నా పలుకులివి: “నేను ఆ దుష్టులను, వారి దేశము నుండి పెల్లగింతును. యూదాను వారి హస్తముల నుండి విడిపింతును.

15. కాని నేను ఆ అన్యజాతి ప్రజలను స్వీయదేశమునుండి పెరికివేసిన తరువాత వారిమీద కరుణ చూపుదును. వారిని మరల తమ దేశమునకు తమ నేలకు కొనివత్తును.

16. పూర్వము వారు నా ప్రజలకు బాలుదేవత పేరుమీద ప్రమా ణము చేయనేర్పిరి. కాని ఇప్పుడు వారు నా ప్రజల మార్గమును అంగీకరించి, నా పేరు మీద ప్రమాణము చేయుదురేని నేను వారిని నా జనులలో చేర్చుకొని వారిని వర్ధిల్లజేయుదును.

17. కాని ఏ జాతియైన నా మాటవినదేని నేను దానిని సమూలముగా పెల్లగించి, ఆ జాతిని నాశనము చేయుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు.”

Text Example

1. ప్రభువు నాతో “నీవు వెళ్ళి నారబట్టను కొని నీ నడుమునకు కట్టుకొనుము. కాని దానిని నీటిలో తడుపవలదు” అని చెప్పెను.

2. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నా నడుమునకు కట్టుకొంటిని.

3. ప్రభువు మరల రెండవసారి నాతో మాట్లాడెను.

4. ఆయన “నీవు కొనితెచ్చుకొని నడుమునకు కట్టుకొనియున్న నారవస్త్రమును యూఫ్రటీసు నదికి తీసికొని వెళ్ళి, అచట ఒక రాతి నెఱ్ఱలో దాచి పెట్టుము” అని చెప్పెను.

5. నేను ప్రభువు చెప్పినట్లే యూఫ్రటీసు నదికి వెళ్ళి ఆ వస్త్రమును దాచితిని.

6. చాలా రోజులైన పిమ్మట ప్రభువు నాతో “నీవు యూఫ్రటీసు నదికి వెళ్ళి అచట దాచియుంచిన వస్త్రమును తెమ్ము” అని చెప్పెను.

7. కనుక నేను యూఫ్రటీసునదికి వెళ్ళి ఆ తావును వెదకి నడికట్టును బయటికి తీసితిని. కాని అది చివికిపోయి ఎందుకు పనికిరానిదై యుండెను.

8. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

9. “నేను యూదా గర్వమును, యెరూషలేము పొగరును ఈ రీతినే అణచివేయుదును.

10. ఈ దుష్టులు నా మాట వినక తమ హృదయకాఠిన్యము ప్రకారము నడుచుచున్నారు. అన్యదైవములనుకొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకు పనికిరాని ఈ నారబట్టవంటి వారగుదురు.

11. నారబట్ట నరుని నడుమునకు అంటిపెట్టుకొనియుండునట్లే, యిస్రాయేలీయులు, యూదా ప్రజలు నాకు అంటిపెట్టుకొని యుండవలెనని కోరు కొంటిని. వారు నా ప్రజలై నా నామమునకు కీరి ప్రతిష్టలు తీసికొని రావలెనని అభిలషించితిని. కాని వారు నా మాటవినరైరి.

12. ప్రభువు నాతో ఇట్లు అనెను: నీవు ప్రజలతో ప్రతికూజాను ద్రాక్షారసముతో నింపవలెనని చెప్పుము. వారు ప్రతి కూజాను ద్రాక్షారసముతో నింపవలెనని మాకు తెలియునని జవాబిత్తురు.

13. అపుడు నీవు వారితో ఇట్లు చెప్పుము. ప్రభువు పలుకులివి. నేను ఈ దేశప్రజలనెల్ల అనగా దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తల నేమి, యెరూషలేము పౌరులందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.

14. అటుపిమ్మట ఈ ప్రజలు ఒకరినొకరు పడద్రోసికొనునట్లు చేయుదును. వృద్దులును, పిల్లలును గూడ తూలి ఒకరి పైనొకరు పడి పోయెదరు. నేను దయ, జాలి, కరుణ లేకుండ వారిని సంహరింతును.

15. యిస్రాయేలు ప్రజలారా! ప్రభువు మాట్లాడుచున్నాడు. పొగరును కట్టిపెట్టి సావధానముగా వినుడు.

16. మీ ప్రభువైన దేవుడు చీకటిని కొనిరాగా మీరు కొండలమీద జారిపడుదురు. కనుక ఆ దుర్గతి పట్టకమునుపే మీరు ఆయనను గౌరవింపుడు. మీరు వెలుగును ఆశింతురుగాని ఆయన దట్టమైన కారు చీకటిని కొనివచ్చును.

17. మీరు నా మాటవినరేని నేను మీ పొగరును గూర్చి రహస్యముగా విలపింతును. ప్రభువు ప్రజలు ప్రవాసమునకు గురియైరి కావున నేను గాఢముగా పరితపించి కన్నీరు కార్తును.

18. ప్రభువు నాతో ఇట్లు అనెను; నేను రాజును, రాజమాతను హెచ్చరింతును. “మీరు సింహాసనముదిగి క్రింద కూర్చుండవలెను. వైభవోపేతములైన మీ కిరీటములు పడిపోయినవి.

19. శత్రువులు యూదా దక్షిణ నగరములను ముట్టడించిరి. నేగేబు నగరములు మూయబడెను. ఇక వానియొద్దకు ఎవరును పోయి తెరువజాలరు యూదా ప్రజలెల్లరిని ప్రవాసమునకు ఈడ్చుకొనిపోయిరి.

20. నీ కన్నులెత్తి చూడుము. ఉత్తరమునుండి నీ శత్రువులు వచ్చుచున్నారు. నీకు అప్పగించిన మంద, నీకు గర్వకారణమునైన ఆ ప్రజలేరీ?

21. నీవు స్నేహితులుగా భావించినవారే నీమీదికెత్తివచ్చి నిన్ను జయించినచో నీవేమందువు? పురిటినొప్పులు వచ్చిన స్త్రీవలె తన్నుకలాడవా?

22. నాకు ఈ దుర్గతి ఏల పట్టినదని నిన్ను నీవు ప్రశ్నించుకోవచ్చును. నీ పాపము మహాఘోరమైనది, కనుక శత్రువులు నిన్ను వివస్త్రనుచేసి మానభంగము చేసిరి.

23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోగలిగినచో, దుష్టకార్యములకు అలవాటుపడిన మీరుకూడ మంచిని చేయగలుగుదురు.

24. ఎడారి గాలికి పొట్టు ఎగురునట్లు నేను మిమ్ము ఎగురగొట్టుదును.

25. మీరు నన్ను విస్మరించి అబద్దమును నమ్ముకుంటిరి కనుక ఈ శిక్షకును, ఈ దుర్గతికిని గురియైతిరి. నేనే మీకీగతి పట్టించితిని ఇది ప్రభుడనైన నా వాక్కు

26. నీ బట్టలను తొలగించి, నీ దిగంబరత్వము ఎల్లరికి కన్పించునట్లు చేసినది నేనే.

27. నేనొల్లని కార్యములను నీవు చేయుట చూచితిని. కొండల మీదను, పొలములలోను విగ్రహములను కొలుచుచు, కామాతురతతో వ్యభిచారమునకు పాల్పడుటకంటిని. యెరూషలేమూ! నీకు అనర్థముతప్పదు. నీవు అపవిత్రురాలవు. ఇంకను ఎంతకాలము ఇట్లే ఉండిపోయెదవు?”

Text Example

1. కరువును గూర్చి ప్రభువు యిర్మీయాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

2. యూదా విలపించుచున్నది, దాని నగరములు క్షీణించుచున్నవి. దాని ప్రజలు విచారముతో నేలకొరుగుదురు. యెరూషలేము ఆక్రందనము చేయుచున్నది.

3. సంపన్నులు సేవకులను నీళ్ళకు పంపుచున్నారు. వారు బావుల వద్దకు వెళ్ళి, అవి వట్టిపోవుటచూచి వట్టి కూజాలతో తిరిగి వచ్చుచున్నారు. నిరుత్సాహముతోను, తడబాటుతోను మొగములు కప్పుకొనుచున్నారు.

4. వానలు లేక నేల ఎండిపోవుటచే రైతులు నిరాశచెంది మొగము కప్పుకొనుచున్నారు.

5. మేయుటకు గడ్డి దొరకనందున లేడి తాను ఈనిన పిల్లను పొలాన వదలివేయుచున్నది.

6. అడవి గాడిదలు కొండకొమ్ము మీద నిలుచుండి నక్కలవలె రొప్పుచు గాలి పీల్చుచున్నవి. మేత దొరకనందున వాని కన్నులు మూతపడుచున్నవి.

7. మా పాపములు మేము దోషులమని చాటి చెప్పుచున్నవి. అయినను ప్రభూ! నీవు ప్రమాణము చేసినట్లే మమ్ము ఆదుకొనుము. మేము చాలసారులు నీనుండి వైదొలగితిమి. నీకు ద్రోహముగా పాపము చేసితిమి.

8. యిస్రాయేలు ఆశ నీవే. మమ్ము ఆపదనుండి రక్షించువాడవు నీవే. నీవు మా దేశమున పరదేశివలె వర్తింపనేల? ఒక్కరేయి మాత్రమే ఉండిపోవు బాటసారివలె కనిపింపనేల?

9. విభ్రాంతి చెందిన నరునివలెను, ఆపదలోనున్నవారిని రక్షింపజాలని శూరునివలెను చూపట్టనేల? ప్రభూ! నీవు నిశ్చయముగా మా నడుమనున్నావు. మేము నీ వారలము, నీవు మమ్ము పరిత్యజింపకుము.”

10. ప్రభువు ఈ ప్రజలను గూర్చి ఇట్లు అను చున్నాడు. వీరికి నా చెంతనుండి పారిపోవలెననియే కోరిక. వారు తమను తాము అదుపులో పెట్టుకోజాలకున్నారు. కనుక నేను వారిని అంగీకరింపను. వారి దుష్కార్యములు జ్ఞప్తియందుంచుకొని వారి పాపములకు గాను వారిని దండింతును.

11. మరియు ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: “నీ ప్రజల క్షేమము కొరకు విజ్ఞాపన చేయవలదు.

12. వారు ఉపవాసము చేసినను, నేను వారి మనవిని ఆలింపను. దహనబలిని, ధాన్యబలిని సమర్పించినను అంగీకరింపను. నేను వారిని పోరువలనను, ఆకలివలనను, అంటురోగమువలనను తెగటార్చబూనితిని.

13. అప్పుడు నేను ఇట్లు పలికితిని: అయ్యో ప్రభువా! యుద్ధము, క్షామము సంభవింపవని ప్రవక్తలు ఈ ప్రజలతో చెప్పుచున్నారు. నీవు ఈ దేశ ప్రజలకు దీర్ఘకాల శాంతి సమాధానము వాగ్దానము చేసితివని వారు ప్రజలతో చెప్పుచున్నారు.

14. ప్రభువు నాకు ఇట్లు బదులు చెప్పెను. “ఆ ప్రవక్తలు నా పేరు మీదుగా అబద్దములు చెప్పు చున్నారు. నేను వారిని నా పనిమీద పంపలేదు, వారికి ఆజ్ఞలీయలేదు, వారితో సంభాషింపనులేదు. వారు మీకుచెప్పు ప్రవచనములు అబద్ద దర్శనములు, నిష్ప్రయోజనమైన శకునములు, కేవలము వారి తలలో పుట్టిన కపటాలోచనలు.

15. కావున ప్రభుడనైన నేను ఇట్లు చెప్పుచున్నాను. ఈ ప్రవక్తలు నేను పంపకున్నను నా పేరు మీదుగా ప్రవచనములు పలికి 'ఈ దేశమున క్షామముగాని, కత్తిగాని సంభవింపవు' అని చెప్పుచున్నారు. కనుక నేను వారిని కత్తివలనను, ఆకలివలనను చంపుదును.

16. వారు ఎవరికి ప్రవచనములు చెప్పిరో ఆ నరులు కూడ క్షామము, కత్తి వలననే చత్తురు. నేనే వారి పీనుగులను యెరూషలేము వీధులలోనికి విసరివేయుదును. వానినెవరును పాతిపెట్టరు. వారి భార్యలకును, కుమారులకును, కుమార్తెలకును ఈ గతియే పట్టును. వారు చేసిన చెడును వారి మీదికే రప్పింతును,”

17. ప్రభువు నన్ను వారికి తన వేదనను గూర్చి ఇట్లు తెలియజేయుమనెను: నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరు కార్చునుగాక! నా ప్రజల కన్యక ఘోరమైన గాయమునొందియున్నది. ఈ దారుణమైన విపత్తువలన పీడింపబడుచున్నది.

18. నేను పొలమునకు వెళ్ళినచో ఖడ్గముచేత హతులైనవారు కనిపించుచున్నారు. పట్టణములోనికి వెళ్ళినచో క్షామపీడితులు తారసపడుచున్నారు. ప్రవక్తలును, యాజకులును తామెరుగని దేశమునకు పోవలెనని ప్రయాణమైరి.

19. ప్రభూ! నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకొంటివా? మరల కోలుకోనిరీతిగా మమ్ము గాయపరచితివేల? మేము శాంతికొరకు ఆశించితిమి కాని మేలేమియు కలుగలేదు. ఆరోగ్యము సిద్ధించుననుకొంటిమి, కాని భీతి వాటిల్లెను.

20. ప్రభూ! మేము నీకు ద్రోహముగా పాపముచేసితిమి. మేము మా తప్పులను మా పితరుల తప్పులను గూడ ఒప్పుకొనుచున్నాము.

21. నీవు నీ ప్రమాణములను జ్ఞప్తికి తెచ్చుకొనుము, మమ్ముచేయివిడువకుము. నీ మహిమాన్వితమైన సింహాసనమునకు అవమానము వాటిల్లనీయకుము. నీవు మాతో చేసికొనిన నిబంధనమును స్మరించుకొనుము. దానిని రద్దుచేయకుము.

22. అన్యజాతుల వ్యర్ధదేవతలు వానను కురియింపలేవు. ఆకసము స్వయముగా జల్లులు కురిపించలేదు. మా ప్రభుడవైన దేవా! నీవే ఆ పనికి సమర్థుడవు, మేము నిన్నే నమ్మితిమి, ఈ కార్యములెల్ల చేయగలవాడవు నీవే.

Text Example

1. ప్రభువు నాతో ఇట్లు అనెను: మోషే సమూవేలులు నా ముందట నిలిచి విన్నపములు చేసినను, నేను ఆ ప్రజలను కరుణింపను. వారిని నా ఎదుటినుండి గెంటివేయుము. వారిని పంపివేయుము.

2. వారు మేము ఎచటికి వెళ్ళుదుము అని నిన్ను అడిగినచో, వారితో నా మాటలుగా ఇట్లు చెప్పుము: వ్యాధివాత పడనున్నవారు వ్యాధికడకును, యుద్ధమున చావనున్నవారు యుద్ధము కడకును, క్షామమువాత పడనున్నవారు క్షామముకడకును, ప్రవాసమువాత పడనున్నవారు ప్రవాసమునకును పోవుదురుగాక!

3. ప్రభుడనైన నేను వారికి నాలుగు దౌర్భాగ్య ములు పట్టింతును. ఆ ప్రజలు కత్తిబారిన చత్తురు. కుక్కలు వారి పీనుగులను లాగుకొని పోవును. పక్షులు వానిని తినివేయును. వన్యమృగములు వానిని మ్రింగి వేయును.

4. హిజ్కియా కుమారుడగు మనష్షే యూదాకు రాజుగా నున్నపుడు యెరూషలేమున చేసిన దుష్కార్యములకుగాను ప్రపంచములోని జనులెల్లరును వారిని అసహ్యించుకొనుట్లు చేయుదును.

5. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: “యెరూషలేము ప్రజలారా! మిమ్ము కరుణించువారెవరు? మిమ్ముచూచి పరితాపము చెందువారెవరు? కొంచెముతడవాగి మీ క్షేమమును విచారించువారెవరు?

6. మీరు నన్ను విడనాడితిరి, నా నుండి వైదొలగితిరి. కనుక నేను నా చేతినిచాచి మిమ్ము నాశనము చేసితిని. మిమ్మును బట్టి సంతాపముతో విసిగిపోతిని.

7. మీదేశములోని ప్రతి పట్టణమునను నేను మిమ్ము ధాన్యమువలె చేటతో తూర్పారబట్టితిని. మీరు మీ దుష్కార్యములను మానరైతిరి. నేను మిమ్ము నాశనము చేసితిని, మీ పిల్లలను చంపితిని.

8. మీ వితంతువులు కడలి ఒడ్డుననున్న యిసుక రేణువులకంటె ఎక్కువ మందియైరి, మిమ్మును సంతానహీనులుగా చేసితిని. వారి తల్లులకు పుత్రశోకము కలిగించితిని. దిఢీలున వారిని పరితాపమునకును, భయమునకును గురిచేసితిని.

9. ఏడుగురు కుమారులను కోల్పోయిన తల్లి మూర్చపోయి ఎగశ్వాస తీయుచున్నది. పట్ట పగలే ఆమె వెలుగు అంతరించెను. ఆమె అవమానమునొంది గగ్గోలుపడెను. నేను మీలో మిగిలియున్న వారిని మీ శత్రువులచే కండతుండెములు చేయింతును” ఇది ప్రభువు వాక్కు.

10. అయ్యో! నేను ఎంతటి దౌర్బాగ్యుడను! తల్లీ! నీవు నన్నేలకంటివి? నేను ప్రతివానితోను వివాదమునకు దిగి తగవులాడవలసివచ్చెను... నేను ఒకనికి అప్పీయలేదు, ఒకనినుండి అప్పు తీసికోలేదు. అయినను ప్రతివాడును నన్ను శపించువాడే.

11. అందుకే యావే, “నీకు మేలు కలుగునట్లు తప్పక నిన్ను బలపరుతును. ఆపదలోను, వేదనలోను నీ శత్రువులు తప్పక నిన్ను వేడుకొనునట్లు చేయుదును”

12. ఇనుమును ఎవడైన విరువగలడా? ఉత్తరమునుండి వచ్చు కంచు కలిపి తయారుచేసిన ఇనుమును ఎవడైన తుంచగలడా?

13. ప్రభువు ఇట్లు అనెను: నేను నా ప్రజలమీదికి శత్రువులను పంపగా వారు వారి సొత్తును, నిధులను కొల్లగొట్టుకొని పోవుదురు. వారు దేశమందు ఎల్లయెడల చేసిన పాపములకు ఇది శిక్ష.

14. నా ప్రజలు తామెరుగని అన్యదేశమున తమ శత్రువులకు ఊడిగము చేయునట్లు నేను చేయుదును. నా కోపము నిప్పువలె రగుల్కొని ఆరకమండును.

15. అంతట నేనిట్లంటిని: ప్రభూ! నీకంతయు తెలియును. నీవు నన్ను జ్ఞప్తియందుంచుకొని ఆదుకొనుము. నా తరపున నన్ను హింసించు వారిమీద పగ తీర్చుకొనుము. నీవు వారిపట్ల ఓర్పు చూ పెదవేని వారు నన్ను చంపుదురు. నేను నీ కొరకే నిందలు అనుభవించుచున్నానని గ్రహింపుము.

16. నీ పలుకులు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. దేవుడవు సైన్యములకు అధిపతివైన ప్రభూ! నేను నీవాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను. నా హృదయమునకు ప్రమోదము చేకూర్చెను.

17. నేను ఆనందమున ఓలలాడు వారితో కలియలేదు. వారి సంతోషమున పాల్గొనలేదు. నీ ఆజ్ఞలకు బద్దుడనై ఒంటరిగానుంటిని నీవు నా యెడదను కోపాగ్నితో నింపితివి.

18. నేను నిరంతరము బాధలను అనుభవింపనేల? నా గాయము చికిత్సకు లొంగదేల? మానదేల? నీవు నాకు వేసవిలో ఎండమావులవలె అయితివి, వట్టిపోవుటచే నమ్మదగనిదిగానుండు వాగువంటి వాడవయ్యెదవా?

19. నా మాటలకు ప్రభువు ఇట్లు సెలవిచ్చెను: నీవు నా వైపు తిరిగినచో నీవు నా సాన్నిధ్యమున నిలబడునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి అధమమైనవో, ఏవి మాన్యములైనవో నీవు గ్రహించినయెడల నీవు నా నోటివలె ఉందువు. వారు నీ తట్టునకు తిరుగవలెనుగాని, నీవు వారు తట్టునకు తిరుగకూడదు.

20. నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రాకారముగా చేయుదును. వారు నీతో పోరాడుదురు గాని నిన్ను గెలవజాలరు. నేను నీకు తోడుగానుండి నిన్ను రక్షింతును.

21. దుష్టులనుండి నిన్ను కాపాడుదును. దౌర్జన్యపరులనుండి నిన్ను సంరక్షింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు ,

Text Example

1. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు విన్పించెను.

2. నీవిచట పెండ్లియాడవలదు. పిల్లలను కనవలదు.

3. ఇచట పుట్టిన పిల్లలకును, వారి తల్లిదండ్రులకును ఎట్టి గతిపట్టునో చెప్పెదను వినుము.

4. వారు ఘోరవ్యాధులతో చత్తురు. వారి కొరకు ఎవరును విలపింపరు. వారిని ఎవరును పాతి పెట్టరు. వారి పీనుగులు నేలపై ఎరువువలె కుప్పలుగా పడియుండును. వారు ఆకలివలనను, యుద్ధము వలనను చత్తురు. పక్షులు, వన్యమృగములు వారి శవములను తినివేయును.

5. నీవు ప్రజలు శోకించు ఇంటిలోనికి పోవలదు. ఎవరికొరకును విలపింపవలదు. నేను ఈ ప్రజలను దీవింపను. వారికి నా ప్రేమను, కరుణను చూపింపను.

6. ఈ దేశమున సంపన్నులు, పేదలుకూడ చత్తురు. ఎవరును వారిని పాతిపెట్టరు, వారి కొరకు శోకింపరు. వారిపట్ల సంతాపము చూపుటకుగాను ఎవరును తమ శరీరములకు గాయము చేసికొనరు, తమ తలలు గొరిగించుకొనరు.

7. బంధువులను కోల్పోయిన వారికి ఎవరును అన్నపానీయములు ఈయరు. తల్లి దండ్రులను కోల్పోయిన వారిపట్లగూడ ఎవరును సంతాపము చూపరు.

8. నీవు ప్రజలు ఉత్సవము చేసికొను ఇంటిలోనికి వెళ్ళవలదు. వారితో కలిసి అన్నపానీయములు సేవింప వలదు.

9. యిస్రాయేలు దేవుడను, సైన్యములకు అధి పతియు ప్రభుడనైన నా పలుకులు ఆలింపుము. నేను ప్రజల ఆనందనాదములను, వివాహోత్సవములలో వధూవరులనోట విన్పించు సంతోషధ్వానములను అణచి వేయుదును. ఇచటి ప్రజలు బ్రతికి ఉండగనే ఈ కార్యము జరుగును.

10. నీవు ఈ సంగతులన్నియు ప్రజలతో చెప్పగా వారు 'ప్రభువు మమ్మింత క్రూరముగా దండింపనేల? మేమేమి తప్పుచేసితిమి? మా దేవుడైన ప్రభువునకు ద్రోహముగా ఏమి పాపము చేసితిమి?' అని నిన్ను అడుగుదురు.

11. అప్పుడు నీవు నా మాటగా వారితో ఇట్లు చెప్పుము: మీ పితరులు నన్ను విడనాడి అన్యదైవములను కొలిచిరి. వానిని సేవించి పూజించిరి. వారు నన్ను త్యజించి నా ఆజ్ఞలను పాటింపరైరి.

12. మీరు మీ పూర్వులకంటెను దుష్టులైతిరి. మీలో ప్రతివాడును తన మొండి హృదయము, తన దుష్టహృదయము చెప్పినట్లుగా చేసి, నా మాట పెడచెవిన పెట్టెను.

13. కనుక నేను మిమ్ము ఈ దేశమునుండి గెంటివేయుదును. మీకు గాని, మీ పితరులకు గాని తెలియని పరదేశమునకు మిమ్ము పంపివేయుదును. అచట మీరు రేయింబ వళ్ళు అన్యదైవములనే పూజింతురు. నేను మీ మీద ఎంత మాత్రము దయచూపను.

14. ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను ఆ జనులను పూర్వము వారి పితరులకిచ్చిన నేలకే మరల తోడ్కొని వత్తును. కనుక రాబోవు దినములలో నా ప్రజలు ‘యిస్రాయేలును ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము' అని చెప్పరు.

15. 'యిస్రాయేలును ఉత్తరదేశము నుండియు, వారు చెల్లాచెదరైన అన్యదేశ ముల నుండియు తోడ్కొనివచ్చిన యావే జీవము తోడని ప్రమాణము చేయుచున్నాము' అని వారు పలుకుదురు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

16. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను జాలరులను చాలమందిని పిలిపింతును. వారు ఈ ప్రజలను చేపలను పట్టినట్టు పట్టుకొందురు. అటుపిమ్మట చాల మంది వేటగాండ్రను ప్రతిపర్వతముమీదను, గుట్ట మీదను, ప్రతి గుహలోను యీ ప్రజలను వేటాడుటకై పిలిపింతును.

17. ఏలయన, నేను ఈ జనులు చేయుపనులెల్ల చూచుచునే యున్నాను. నాకు మరుగై యుండునది ఏదియులేదు. వారి పాపములు నాకు కన్పింపకపోవు.

18. వారు పీనుగుల వంటి విగ్రహ ములతో నా దేశమును అపవిత్రము చేసిరి. హేయమైన ప్రతిమలతో దానిని నింపివేసిరి.” కనుక నేను వారు తమ పాపములకును, దుష్కార్యములకును రెండంతలు శిక్ష అనుభవించునట్లు చేయుదును.

19. ప్రభూ! నీవు నాకు బలము ఒసగువాడవు, నాకు ఆశ్రయణీయుడవు, ఆపదలలో నన్ను ఆదుకొనువాడవు. నేల నాలుగుచెరగులనుండి జాతులు నీ వద్దకు వచ్చి “మా పితరులు నిరర్ధకదైవములను కొలిచిరి, నిష్ప్రయోజకములైన విగ్రహములను సేవించిరి.

20. నరుడు తన దైవములను తానే చేసికొనునా? చేసికొనినచో, అవి దైవములే కావు” అని పలుకును.

21. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను నా బలమును, నా మహత్తును జాతులు ఖండితముగా గ్రహించునట్లు చేయుదును. వారు నన్ను ప్రభునిగా గుర్తించునట్లు చేయుదును.

Text Example

1. ప్రభువు ఇట్లనుచున్నాడు: “యూదా ప్రజల పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది. ఆ పాపము వారి హృదయఫలకముపై వజ్రపు మొనతో వ్రాయబడియున్నది. వారి బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడియున్నది.

2-3. యూదా ప్రజలు పరదైవముల పీఠములను మననము చేసుకొనుచున్నారు. పచ్చని చెట్ల క్రిందను తిప్పలమీదను, పొలములోని కొండలమీదను, అషేరా దేవతకు పాతిన కొయ్యగడెలచెంత పూజలు చేయుచున్నారు. నేను మీ పాపములకు శిక్షగా శత్రువులు మీ సొత్తును, నిధులను కొల్లగొట్టుకొని పోవునట్లు చేయుదును.

4. నేను మీకొసగిన నేలను మీరు విడనాడకతప్పదు. మీరు మీకు తెలియని దేశమున మీ శత్రువులకు ఊడిగము చేయవలసివచ్చును. నా కోపము నిప్పువలె రగుల్కొని, ఆరకమండును”.

5. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు.

6. అతడు ఎడారిలో ఎదుగు తుప్పవంటివాడు. అతనికి ఎట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో, ఏమియు పెరుగని చౌటిపఱ్ఱలో ఎదుగును.

7. కాని ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును.

8. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలెనుండును. అది ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్ళు జొన్పించును. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగానుండును, వానలు కురువకున్నను దానికి చింతలేదు, అది ఎల్లపుడు పండ్లు కాయుచుండును.”

9. హృదయము అన్నింటికంటెను మోసకరమైనది. దాని రోగము కుదర్చలేము. దానినెవడు అర్థము చేసికోగలడు?

10. నరుని ప్రవర్తనబట్టి వాని క్రియలఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభుడనైన నేను హృదయమును పరిశీలించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.

11. అన్యాయముగా ధనమును ఆర్జించువాడు తాను పెట్టని గ్రుడ్లను పొదుగు కౌజుపిట్ట వంటివాడు. అతడు సగప్రాయముననే తన సంపదను విడువవలసి వచ్చును. కడన వాడు మందమతిగా గణింపబడును.

12. అనాదినుండి ఉన్నతమైన పర్వతముపై నిలిచియున్న మహిమాన్వితమైన సింహాసనమువంటిది మన దేవాలయము.

13. ప్రభూ! యిస్రాయేలు ఆశ నీవే. నిన్ను విడనాడువారు అవమానము చెందుదురు. వారు జీవజలములబుగ్గవైన నిన్ను పరిత్యజించిరి గాన ధూళిమీద వ్రాసిన పేర్లవలె అదృశ్యులగుదురు.

14. ప్రభూ! నీవు నాకు చికిత్సచేసినచో నేను సంపూర్ణారోగ్యమును బడయుదును. నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణరక్షణ పొందుదును. నీవే కారణభూతుడవు కాగా నేను నిన్నే స్తుతింతును.

15. ప్రజలు నాతో “ప్రభువు వాక్కులు ఏమైనవి? అది మనమీదికి రానిమ్ము చూతము” అనుచున్నారు.

16. కాని ప్రభూ! నీవు వారికి చెడుచేయవలెనని నేను నిన్నెన్నడును ఒత్తిడి చేయలేదు. నేను వారికి కీడు కలుగవలెనని కోరుకోలేదు. ఈ సంగతి నీకు తెలియును, నా పలుకులను నీవు ఎరుగుదువు.

17. ఆపదలో నీవు నాకు ఆశ్రయణీయుడవు. నీవు నాకు భయంకరుడవు కావలదు.

18. నేను గాదు, నన్ను హింసించువారే అవమానము చెందుదురుగాక! నేనుగాదు, వారే భయకంపితులు అగుదురుగాక! నీవు వారిని నాశనము చేయుము, సర్వనాశనము చేయుము.

19. ప్రభువు నాతో ఇట్లనెను: ఓయి! నీవు యూదా రాజులు వచ్చుచు పోవుచుండు ప్రజా ద్వారము వద్దకుపోయి అచట నా సందేశము వినిపింపుము. అటుపిమ్మట యెరూషలేము ద్వారములన్నిటి చెంతకును పొమ్ము.

20. యూదారాజులును, ప్రజలును, ఆ ద్వారములలో ప్రవేశించు యెరూషలేము పౌరులును నా మాటలను ఆలింపవలెనని చెప్పుము.

21. నీవు వారికి నా పలుకులుగా ఇట్లు చెప్పుము. మీకు ప్రాణములమీద తీపికలదేని విశ్రాంతిదినమున బరువులు మోయకుడు. యెరూషలేము ద్వారముల గుండ వేనిని మోసికొనిరావలదు.

22. విశ్రాంతి దినమున మీ ఇండ్లనుండి ఎట్టిబరువులను మోసికొని రావలదు. మీరు ఆ దినమున ఎట్టి పనియు చేయ రాదు. నేను మీ పితరులను ఆజ్ఞాపించినట్లే, మీరు దానిని పవిత్రదినముగా ఎంచవలెను.

23. మీ పితరులు నా పలుకులు ఆలింపలేదు, లక్ష్యము చేయలేదు. పైగా వారు మొండివారై నాకు లొంగరైరి. నా ఉపదేశమును అంగీకరింపరైరి.

24. కాని మీరు నా మాటలను జాగ్రత్తగా వినుడు. మీరు విశ్రాంతిదినమున ఈ నగరద్వార ములగుండ ఎట్టి బరువులను మోసికొని రాకూడదు. మీరు ఆ రోజును పవిత్రదినముగా గణింపుడు. ఆ రోజు ఎట్టిపనులను చేయకుడు.

25. అప్పుడు దావీదు సింహాసనముపై కూర్చుండు రాజులు, రాజకుమారులు ఈ ద్వారములగుండ లోనికి ప్రవేశింపగలుగుదురు. వారుతమ అధికారులతోను, యూదాప్రజలతోను, యెరూషలేము పౌరులతోను కలిసి రథములపైనను, గుఱ్ఱములపైనను ఎక్కి రావచ్చును. యెరూషలేము కూడ నిత్యము ప్రజలతో క్రిక్కిరిసియుండును.

26. ప్రజలు యూదా నగరములనుండియు, యెరూషలేము పరిసర ప్రాంతములనుండియు, బెన్యామీను మండ లమునుండియు, కొండపాదులనుండియు, పర్వత సీమలనుండియు, దక్షిణ యూదానుండియు వత్తురు. అటులవచ్చి వారు నా దేవళమున దహనబలులను, సమాధానబలులను, ధాన్యబలులను, కృతజ్ఞతా బలులను అర్పింతురు. సాంబ్రాణి పొగ వేయుదురు.

27. కాని మీరు నేను ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమును పవిత్రదినముగా గణింపరేని, యెరూషలేము వీధులగుండ బరువులు మోయుటమానరేని, నేను ఆ నగరద్వారములకు నిప్పంటింతును. నగరములోని ప్రాసాదములు మంటలలో బుగ్గియగును. ఆ మంట లను ఎవరును ఆర్పలేరు.

Text Example

1-2. ప్రభువు నాతో “లెమ్ము, నీవు కుమ్మరి ఇంటికి పొమ్ము. అచట నీకు నా సందేశమును వినిపింతును” అని చెప్పెను.

3. కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు సారెమీద పనిచేయుటను చూచితిని.

4. కుమ్మరి జిగటమన్నుతో తాను చేయుచున్న కుండ తన చేతిలో విడివడగా, అతడు మరల ఆ మట్టితో తగినరీతిగ మరియొక పాత్రను తయారు చేసెను.

5. అపుడు ప్రభువు స్వరము నాతో ఇట్లనెను:

6. “యిస్రాయేలీయులారా! ఈ కుమ్మరి జిగటమట్టిని ఎట్లు మలచెనో, నేను మిమ్మును అటుల మలవకూడదా? కుమ్మరిచేతిలో మట్టివలె మీరును నా చేతిలో ఇమిడి పోయెదరు.

7. నేను కొన్నిమారులు ఏ జాతినైనను, ఏ రాజ్యమునైనను పెరికివేయుదుననియు, పడగొట్టుదుననియు, నాశనము చేయుదునననియు చెప్పి యుండవచ్చును.

8. కాని ఆ జాతి తన దుష్టవర్తనమును మార్చుకొన్నయెడల, నేను చేయుదునన్న కీడు చేయను.

9. నేను కొన్నిమారులు ఏ జాతినైనను, ఏ రాజ్యము నైనను నాటుదుననియు, కట్టుదుననియు మాట ఈయవచ్చును.

10. కాని ఆ జాతి దుష్టకార్యములు చేసి నాకు విధేయురాలు కాదేని, నేను దానికి చేయుదునన్న మేలును చేయను.

11. కనుక యిర్మీయా! నీవు యూదా ప్రజలతోను, యెరూషలేము పౌరులతోను నేను వారికి కీడు రప్పింతుననియు, వారిని శిక్షించు టకు సిద్ధముగా ఉన్నాననియు చెప్పుము. మీరు మీ దుర్మార్గమునుండి వైదొలగవలెననియు, మీ ప్రవర్త నను, కార్యములను మార్చుకోవలెనని చెప్పుము.

12. కాని వారు 'మేము మారము. మేము మా ఇష్టము వచ్చినట్లుగా, మా దుష్టహృదయము చెప్పినట్లుగా చేయుదుము' అని నీకు ప్రత్యుత్తరమిత్తురు.”

13. "ప్రభువు ఇట్లు అనుచున్నాడు: ఇట్టి చెయిదము పూర్వము ఎన్నడైనను జరిగినదేమో జాతులను అడిగి తెలిసికొనుడు. యిస్రాయేలీయులు ఘోరకార్యములు చేసిరి.

14. లెబానోను పర్వతశిఖరములనుండి మంచు అంతరించునా? ఆ కొండలలోపారు చల్లనియేరులు వట్టిపోవునా?

15. అయినను నా ప్రజలు నన్ను విస్మరించిరి. వారు మోసమునకు ధూపము వేసిరి. మెరకచేయబడని మార్గములలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్రిల్ల చేసుకొనుచున్నారు.

16. వారు తమ దేశమును పాడుచేసిరి. ఆ నేలను చూచినవారెల్ల నవ్వుదురు. దారిన పోవువారెల్ల ఆ దృశ్యమును చూచి విభ్రాంతిచెంది తల ఊపుదురు.

17. నేను తూర్పుగాలికి దుమ్ము ఎగిరిపోవునట్లే నా ప్రజలు శత్రువులదాడికి ఎగిరిపోవునట్లు చేయుదును. ఆపద వచ్చినపుడు వారికి నా మొగము చూపింపను.”

18. అపుడు ప్రజలు “రండు, మనము యిర్మీయా మీద కుట్రపన్నుదము. అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు. జ్ఞానులు సలహా యిత్తురు. ప్రవక్తలు సందేశము విన్పింతురు. రండు మనము అతనిమీద నేరము మోపుదము. అతని బోధలు పెడచెవిని పెట్టుదము” అని అనిరి.

19. కావున నేనిట్లు ప్రార్థించితిని: ప్రభూ! నీవు నా పలుకులు ఆలింపుము. "నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము.

20. మేలునకు కీడు చేయుదురా? వారు నన్ను కూలద్రోయుటకు గోతినిత్రవ్విరి. నేను నీ సమక్షమున నిలిచి వారిపక్షమున నీకు మనవిచేసి, నీ కోపమును శాంతింపజేసితినని జ్ఞప్తికి తెచ్చుకొనుము.

21. కనుక వారి పిల్లలు ఆకలివాత పడుదురుగాక! కత్తివాతన చత్తురుగాక! స్త్రీలు తమ మగలను, పిల్లలను కోల్పోవుదురుగాక! పురుషులు వ్యాధివాత బడుదురుగాక! యువకులు యుద్ధమున కూలుదురుగాక!

22. నీవు దిఢీలున దోపిడికాండ్రను వారి యిండ్ల మీదికి పంపగా, వారు గావుకేకలు వేయుదురుగాక! వారు నేను కూలుటకు గోతినిత్రవ్విరి. నన్ను పట్టుకొనుటకు ఉచ్చులుపన్నిరి.

23. ప్రభూ! వారు నన్ను చంపుటకు పన్నిన కుట్రలు నీకు తెలియును. నీవు వారి దోషమును మన్నింపకుము. వారి పాపములను తుడిచివేయకుము. వారు ఓడిపోయి క్రిందపడునట్లు చేయుము. నీవు కోపివిగా ఉన్న తరుణమున వారికి శాస్తి చేయుము.

Text Example

1. ప్రభువు నాతో “నీవు వెళ్ళి కుమ్మరి చేయు మట్టి కూజాను కొనుము. కొందరు పెద్దలను, వృద్ధులైన యాజకులను నీ వెంటకొనిపొమ్ము.

2. నీవు కుండ పెంకుల ద్వారముగుండ హీన్నోము లోయకు వెళ్ళుము. అచట నేను నీకు తెలియజేయు సందేశమును నీవు ప్రజలకు వినిపింపుము” అని చెప్పెను.

3. 'ప్రభువు నన్ను ఈ మాటలు చెప్పుమనెను: “యూదా రాజులారా! యెరూషలేము పౌరులారా! సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడనైన నా పలుకు లాలింపుడు. నేను ఈ తావునకు ఘోరవిపత్తు కలిగింతును. ఈ ఉదంతముగూర్చి వినినవారెల్ల విస్మయము చెందుదురు.

4. నేను ఈ కార్యమునెందుకు చేయబూనితిని అనగా, ప్రజలు నన్ను పరిత్యజించిరి. వారిచట అన్యదైవములకు బలులర్పించి, ఈ తావును అపవిత్రము చేసిరి. ఆ దైవములగూర్చి ఆ ప్రజలకు గాని, వారి పితరులకుగాని, యూదా రాజులకుగాని ఏమియు తెలియదు. ప్రజలు ఈ తావును నిర్దోషుల నెత్తురుతో నింపివేసిరి.

5. వారు బాలు దేవతకు బలి పీఠములు నిర్మించి, తమ కుమారులను దహనబలిగా కాల్చిరి. నేను ఏనాడును వారితో మీరు ఈ కార్యము చేయుడని చెప్పలేదు. నాకు అట్టి ఆలోచన కూడ తట్టలేదు.

6. కనుక జనులిక దీనిని తోఫెతు అనికాని, హిన్నోము లోయ అనికాని పిలువక, వధ లోయ అని పిలచు రోజులు వచ్చును.

7. ఈ తావున నేను యూదా ప్రజలయొక్కయు, యెరూషలేము పౌరుల యొక్కయు పథకములను భంగపరతును. వారి శత్రు వులు యుద్ధమున వారిని జయించి, వధించునట్లు చేయుదును. వారి శవములను పక్షులకును, వన్య మృగములకును ఆహారము చేయుదును.

8. నేను ఈ పట్టణమును సర్వనాశనము చేయుదును. దారిన బోవు వారెల్లరును దానిని చూచి విస్మయమొందు దురు. దానికి పట్టిన గతి చూచి అపహాసము చేయుదురు.

9. శత్రువులు నగరమును ముట్టడించి దాని పౌరులను చంపజూతురు. ఘోరమైన ఆ ముట్టడికి తట్టుకోజాలక నగరములోని పౌరులు ఒకరినొకరు భక్షింతురు. తమ పిల్లలనే భక్షింతురు.”

10. అటుపిమ్మట ప్రభువు నీ చెంతనున్న కూజాను నీతో వచ్చిన జనులు చూచుచుండగా పగుల గొట్టుమని నాతో చెప్పెను.

11. నన్ను వారితో ఇట్లు చెప్పుమనెను: “సైన్యములకధిపతియైన ప్రభువు పలుకులివి. నేను ఈ పట్టణమును, ఈ ప్రజలను ఈ కుమ్మరి పాత్రవలె పగులగొట్టుదును. పగిలిపోయిన ఈ కూజా పెంకులవలె వారినిగూడ ఎవరును మరల అతికింపజాలరు. పాతి పెట్టుటకు తోఫెతులో స్థలము లేకపోవునంతగా వారిని అక్కడ పాతి పెట్టుదురు.

12. నేను ఈ నగరమును, దాని పౌరులను తోఫెతు వలె చేయుదును.

13. యెరూషలేములోని గృహములును, యూదారాజుల మేడలును తోఫెతువలె అపవిత్రములగును. మిద్దెలమీద నక్షత్రములకు సాంబ్రాణి పొగ వేసిన ఇండ్లును, పరదైవములకు పానీయార్పణము చేసిన ఇండ్లును అట్లే అపవిత్రములగును.'

14. అటుపిమ్మట ప్రభువు నన్ను ప్రవచనము చెప్పుమనిన తోఫేతునుండి వెళ్ళిపోయి దేవాలయము ముంగిట నిలుచుండి ప్రజలతో ఇట్లు పలికితిని.

15. “సైన్యములకధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: 'ఈ నగరము మీదికిని, దీని పరిసర పట్టణముల మీదికిని నేను రప్పింతునన్న శిక్షలన్నిటిని రప్పింతును. మీరు మొండికి దిగి నా పలుకులు ఆలింపకున్నారు.' "

Text Example

1. దేవాలయ ప్రధానాధికారియు ఇమ్మేరు కుమారుడునగు పషూరు అను యాజకుడు యిర్మీయా పలికిన ప్రవచనములను వినెను.

2. అతడుయిర్మీయాను కొట్టించి, దేవాలయమునందలి బెన్యామీను మీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.

3. మరుసటిరోజు అతడు యిర్మీయాను బొండలో నుండి విడిపించెను. యిర్మీయా అతనితో ఇట్లనెను: “ప్రభువు నీకు పషూరు అని పేరు పెట్టలేదు. మాగోర్శిసబీబు ' అని పేరు పెట్టెను.

4. ప్రభువిట్లు చెప్పుచున్నాడు. నేను నిన్ను చూచి నీవే భయపడునట్లు చేయుదును. నీ మిత్రులుగూడ నిన్ను చూచి భయపడుదురు. వారెల్లరును యుద్ధమున శత్రువుల చేతికి చిక్కి చచ్చుట నీవు చూతువు. నేను యూదా ప్రజల నందరిని బబులోనియా రాజునకు అప్పగింతును. అతడు వారిలో కొందరిని తన దేశమునకు బానిసలుగా కొనిపోవును. మరికొందరిని చంపును.

5. నేను శత్రువులు ఈ నగరములోని సిరిసంపదలను, ఆస్తిపాస్తులను, యూదారాజుల నిధులను కొల్లగొట్టి బబులోనియాకు కొనిపోవునట్లు చేయుదును.

6. పషూరూ! శత్రువులు నిన్నును, నీ కుటుంబ సభ్యుల నందరిని బబులోనియాకు బందీలనుగా కొని పోవు దురు. నీవచటనే చత్తువు. అచటనే నిన్ను పాతి పెట్టుదురు. నీవు ఇన్ని కల్లబొల్లి ప్రవచనములు చెప్పి మోసపుచ్చిన నీ ఈ మిత్రులకుగూడ ఇదే గతిపట్టును.”

7. ప్రభూ! నీవు నన్ను చెరిచితివి, నేను చెడితిని. నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశముచేసికొంటివి. ఎల్లరును నన్ను గేలి చేయుచున్నారు. దినమెల్ల నన్నుచూచి నవ్వుచున్నారు.

8. నేను మాట్లాడునపుడెల్ల “దౌర్జన్యమునకును, వినాశమునకును పూనుకొనుచున్నారు” అని గొంతెత్తి అరువవలసి వచ్చెను. ప్రభూ! నీ సందేశము చెప్పినందుకుగాను . జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు.

9. “నేను ప్రభువును జప్తియందుంచుకొనను, ఆయన పేరు మీదుగా మాట్లాడను” అని అనుకొంటిని, కాని నీ వాక్కు నా హృదయములో అగ్నివలె మండుచూ నా ఎముకలలోనే మూయబడినట్లు ఉన్నది. నేను ఆ వాక్కును లోలోపల అణచి యుంచుకోవలెనని ప్రయత్నము చేసి చేసి విసుగు చెందితిని, దానినిక ఆపుకోజాలను.

10. ఎల్లెడల భయము ఆవహించియున్నది మనము ఇతనిమీద అధికారులకు ఫిర్యాదు చేయుదము' అని యెల్లరును గుసగుసలాడుకొనుట నేనువింటిని. నా స్నేహితులు కూడ నా పతనముకొరకు కాచుకొనియున్నారు. బహుశ ఇతడు మోసమునకు లొంగును. అప్పుడు మనమితనిని పట్టుకొని పగతీర్చుకొందమని అనుకొనుచున్నారు.

11. కాని ప్రభూ! బలాఢ్యుడవు, వీరుడవునైన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు.

12. సైన్యములకు అధిపతియైన ప్రభూ! నీవు నరులను న్యాయబుద్దితో పరిశీలింతువు. వారి హృదయమును, మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యెమును నీకు అప్పగించితిని. కావున నీవు నా విరోధులకు ప్రతీకారముచేయగా నేను చూతునుగాక!

13. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారినుండి విడిపించును.

14. నేను పుట్టినదినము శాపగ్రస్తమగునుగాక! మా అమ్మ నన్ను కనినరోజు దీవెన బడయకుండునుగాక!

15. “నీకు కొడుకు, మగబిడ్డడు పుట్టెను” అని వార్త తెచ్చి మా తండ్రిని సంతోషచిత్తునిచేసిన నరుడు శాపగ్రస్తుడగునుగాక!

16. అతడు ఉదయము ఆర్తనాదము వినునుగాక! మధ్యాహ్నము యుద్ధనాదమును ఆలించునుగాక!

17. నా తల్లి గర్భమే నాకు సమాధియైయుండునట్లు ఆ జనుడు నేను పుట్టకమునుపే నన్ను చంపనందులకు ప్రభువు నిర్దయతో నాశనము చేసిన నగరములవలె అతడును అధోగతి పాలగునుగాక!

18. అసలు నేను మాతృగర్భమునుండి బయటికిరానేల? శ్రమను, దుఃఖమును అనుభవించుటకేనా? నా బ్రతుకు నగుబాట్లతో ముగియుటకేనా?

Text Example

1. యూదారాజగు సిద్కియా, మల్కియా కుమారుడగు పషూరును, మాసేయా కుమారుడును, యాజకుడునగు సెఫన్యాను నా యొద్దకు పంపెను.

2. వారు “నీవు మా తరపున ప్రభువును సంప్రతింపుము. బబులోనియా రాజగు నెబుకద్నెసరు మన మీద యుద్ధముచేయుచున్నాడు. ఒకవేళ ప్రభువు మనకొరకు అద్భుతకార్యములు చేసి శత్రువును పార ద్రోలవచ్చును” అని నన్ను అర్థించిరి.

3. అపుడు ప్రభువు నాతో మాటలాడగా నేను ఆ దూతలతో ఇట్లంటిని:

4. "మీరు సిద్కియాకు ఈ కబురు చెప్పుడు. 'యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు. నేను ప్రాకారము వెలుపల నగరమును ముట్టడించియున్న బబులోనియా రాజుతోను, అతని సైన్యముతోనుపోరాడు నీ సైన్యమును ఓడింతును. నీ సైనికుల ఆయుధములను నగరమధ్యమున కుప్ప వేయింతును.

5. నేను కోపముతోను, ఆగ్రహముతోను, రౌద్రముతోను, మహాబలముతోను నిన్నెదిరించి పోరాడుదును.

6. నేను ఈ నగరములోని నరులను, పశువులను చంపుదును. ఎల్లరును ఘోరమైన అంటురోగమువలన చత్తురు.

7. అటుపిమ్మట నేను నిన్నును, నీ ఉద్యోగులను అంటురోగమును, యుద్ధమును, కరవును తప్పించుకొని బ్రతికిన ప్రజలను, బబులోనియా రాజైన నెబుకద్నెసరు, మీ విరోధులు పట్టుకొనునట్లు చేయుదును, వారు మిమ్ము చంపగోరుదురు. నెబుకద్నెసరు మిమ్ము వధించును. అతడు మీలోనెవరినీ వదలిపెట్టడు. ఎవరిమీదను దయాదాక్షిణ్యములు చూపడు. ఇది ప్రభుడనైన నా వాక్కు .”

8. అటుపిమ్మట ప్రభువు నన్ను ప్రజలతో ఇట్లు చెప్పుమనెను: ఇవి ప్రభువు పలుకులు. మీరిపుడు జీవన మార్గమును గాని, మృత్యు మార్గమును గాని ఎన్నుకోవచ్చును.

9. ఈ నగరమున నిలుచువాడు యుద్ధము వలనను, ఆకలి వలనను, అంటురోగముల వలనను చచ్చును. కాని ఇచటినుండి వెళ్ళిపోయి నగరమును ముట్టడించుచున్న బబులోనీయులను శరణువేడువాడు బ్రతికిపోవును. అతడు కనీసము ప్రాణములైన కాపాడుకోవచ్చును.

10. నేను ఈ నగరమును కాపాడదల్చుకోలేదు. దానిని బబులోనియా రాజునకు అప్పగింతును. అతడు దానిని తగులబెట్టును. ఇది ప్రభుడనైన నా వాక్కు .”

11. యూదా రాజకుటుంబమునకు ప్రభువు సందేశము. 'మీరు ప్రభువు పలుకులు ఆలింపుడు.

12. దావీదు వంశజులారా! ప్రభువు ఇట్లనుచున్నాడు: మీరు ప్రతిదినమును న్యాయమైన తీర్పులు తీర్పుడు. వంచనకు గురియైన వారిని వంచకులనుండి కాపాడుడు. లేదేని మీ దుష్కార్యములవలన నా కోపము నిప్పువలె రగుల్కొని గనగనమండును. దానిని ఎవడును ఆర్పజాలడు."

13. “యెరూషలేమూ! నీవు లోయలకు పైన ఎత్తయిన తావున కూర్చుండియున్నావు. పొలములోని కొండవలె పైకి ఎగసియున్నావు. నేను నిన్నెదిరింతును. నిన్నెవరును ఎదిరింపజాలరనియు, నీ కోటను ఎవరును ఛేదింపజాలరనియు నీవు అనుచున్నావు.

14. నీ చెయిదములకుగాను నేను నిన్ను శిక్షింతును. నేను నీ ప్రాసాదమునకు నిప్పు పెట్టుదును. ఆ అగ్గి చుట్టుపక్కల ఉన్న వానిని అన్నిటిని దహించును. ఇది ప్రభుడనైన నా వాక్కు”

Text Example

1. ప్రభువు నన్ను యూదారాజ ప్రాసాదము నొద్దకు పోయి ఈ సందేశము చెప్పుమనెను:

2. '' దావీదు వంశజుడైన యూదారాజును, అతని ఉద్యోగులను, యెరూషలేము పౌరులును ప్రభువు పలుకును ఆలింతురుగాక!

3. ఇది ప్రభువు వాక్కు. మీరు నీతిని, ధర్మమును పాటింపుడు. వంచనకు గురియైన వారిని వంచకులనుండి కాపాడుడు. పరదేశులను, అనాథలను, వితంతువులను దోచుకొనకుడు, పీడింపకుడు. ఈ తావున నిర్దోషులను చంపకుడు.

4. మీరు చిత్తశుద్ధితో నా ఆజ్ఞలను పాటింతురేని, దావీదు వంశజులు రాజులుగా కొనసాగుదురు. వారును, వారి ఉద్యోగులును, ప్రజలును, రథములపైనను, గుఱ్ఱములపైనను ఎక్కి ఈ ప్రాసాదద్వారముల గుండపోవచ్చును.

5. కాని మీరు నా ఆజ్ఞలు పాటింప రేని ప్రభుడనైన నేను ప్రమాణముచేసి చెప్పుచున్నాను వినుడు. ఈ ప్రాసాదము నాశనమగును.

6. యూదా రాజప్రాసాదమునుగూర్చి ప్రభువు పలుకులివి: 'గిలాదు మండలమువలెను, లెబానోను కొండలవలెను యూదాప్రాసాదము నాకు సుందరముగా కన్పించును. అయినను నేను దానిని ఎడారి కావింతును, నిర్మానుష్యము చేయుదును.

7. నేను దానిని ధ్వంసము చేయుటకు జనులను పంపుచున్నాను. వారు గొడ్డళ్ళతో వచ్చి సుందరములైన దాని దేవదారు మొకరములను నరికి అగ్నిలో బడవేయుదురు.

8. తరువాత అన్యజాతి జనులు ఈ నగరము ప్రక్కగా బోవుచు ప్రభువు ఈ మహానగరమునకు ఈ గతి ఎందుకు పట్టించెనని ఒకరినొకరు ప్రశ్నించు కొందురు.

9. మీరు మీ దేవుడనైన నా నిబంధనను విడనాడి అన్యదైవములను పూజించి సేవించితిరి కనుక మీకు ఈ గతి పట్టినదని వారు ఒకరికొకరు జవాబు చెప్పుకొందురు."

10. యెరూషలేము ప్రజలారా! మీరు చనిపోయిన వానినిగూర్చి విలపింపవలదు. అతనికొరకు శోకాలాపము చేయవలదు. కాని వెళ్ళిపోవుచున్న వానికొరకు దుఃఖింపుడు. అతడిక తిరిగిరాడు, తన మాతృదేశమును కనులతో చూడడు.

11. యోషీయాకు బదులుగా యూదా రాజైన అతని కుమారుడు యెహోవాహసు గూర్చి ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. “అతడు ఈ తావునుండి వెడలిపోయెను. మరల ఇచటికిరాడు.

12. అతడు తాను బందీగా వెడలిపోయిన దేశముననే కన్ను మూయును. ఈ నేలను మరల కన్నులతో చూడ జాలడు.”

13. “అధర్మమార్గమున అంతఃపురమును నిర్మించి, అవినీతితో మీది అంతస్తును కట్టించువాడు నాశనమగును. తోడివారితో ఊరకే చాకిరి చేయించుకొని కూలి ఎగగొట్టువాడు నాశనమగును.

14. నేను విశాలమైన మీది గదులతో బ్రహ్మాండమైన ప్రాసాదమును నిర్మింతుననుకొని, దానికి గవాక్షములు పెట్టించి, ఎఱ్ఱరంగు వేయించి, దానిని దేవదారు పలకలతో అలంకరించువాడు సర్వనాశనమగును.

15. నీవు దేవదారు కొయ్యతో ఇతరులకంటే మెరుగైన మేడను కట్టించినందుననే గొప్పరాజు వయ్యెదవా? నీ తండ్రి అన్నపానములు కలిగి, నీతి న్యాయములను అనుసరించి క్షేమముగా ఉండలేదా?

16. అతడు దీనులైన పీడితులకు న్యాయము జరిగించుచు సుఖముగా జీవించెను. ప్రభువును ఎరుగుట అనగా ఇదియేకదా! ఇది ప్రభువు వాక్కు

17. కాని నీకు స్వార్ధ అభిలాష తప్ప మరిఏమియు లేదు. నీవు నిర్దోషులను చంపించితివి. దౌర్జన్యముతో ప్రజలను పీడించితివి.”

18. కనుక యోషీయా కుమారుడును, యూదా రాజునగు యెహోయాకీమును గూర్చి ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: " 'అయ్యో! సోదరీసోదరులారా' అనుచు, అతనికొరకు ఎవరును విలపింపరు. 'రాజా, దేవరా' అనుచు అతని కొరకెవరును పరితపింపరు.

19. అతడిని చచ్చినగాడిదనువలె ఆవలపారవేయుదురు. బయటికి ఈడ్చుకొనిపోయి యెరూషలేము ద్వారములకు ఆవల విసరివేయుదురు.”

20. “యెరూషలేము పౌరులారా! మీరు లెబానోనుకొండకు వెళ్ళి అరువుడు. బాషాను మండలమునకు వెళ్ళి ఏడ్వుడు. అబారీము పర్వతము పైనుండి శోకింపుడు, మీ ప్రియులు ఓడిపోయిరి.

21. మీరు వృద్దిలోనున్నపుడు ప్రభువు మీతో మాట్లాడెను. కాని మీరు ప్రభువు పలుకులు ఆలింపలేదు. మీ జీవితకాలమంతటను ఇట్లే చేసితిరి. ప్రభువు మాట ఏనాడును వినరైతిరి.

22. మీ కాపరులు గాలికి కొట్టుకొనిపోవుదురు. మీ మిత్రవర్గములు బందీలగును. మీరు చేసిన దుష్కార్యముల వలన మీరు అవమానముతో తలవంచుకొందురు.

23. మీరు లెబానోనునుండి కొనివచ్చిన దేవదారు కలపల మధ్య సురక్షితముగా ఉన్నారు. కాని మీకు బాధలు వచ్చినపుడు, పురిటి నొప్పులు సంభవించినపుడు మీరు బోరున ఏడ్తురు.”

24. “యెహోయాకీము కుమారుడును యూదా రాజునగు యెహోయాకీనును గూర్చి ప్రభువు ఇట్లు పలికెను: నేను సజీవుడనైన దేవుడను. నీవు నా కుడిచేతనున్న ముద్రాంగుళీయకమువంటి వాడవైనను, నేను నిన్ను నా వ్రేలినుండి తొలగింతును.

25. నీవు ఎవరికి భయపడుచున్నావో, నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో వారిచేతికి అనగా, బబులోనియా రాజగు నెబుకద్నెసరునకును, అతని సైనికులకును నిన్ను అప్పగింతును.

26. నిన్నును, నిన్ను కన్న తల్లిని గూడ ప్రవాసమునకు నెట్టివేయుదును. మీరిరువురును మీరు పుట్టని అన్యదేశమునకు వెడలిపోవుదురు. అచటనే చత్తురు.

27. మీరీ దేశమునకు తిరిగి రాగోరుదురుగాని రాజాలరు.”

28. నేను ఇట్లనుకొంటిని: ఈ యెహోయాకీను పగిలిన కుండవంటివాడు అయ్యెనా? ఎవరికిని అక్కరపట్టనందున అతనిని విసరి పారవేయుదురా? అతనిని అతని పిల్లలను తామెరుగని అన్యదేశమునకు ప్రవాసమునకు కొనిపోవునది. ఇందులకేనా?

29. ఓ దేశమా! దేశమా! దేశమా! ప్రభువేమి పలికెనో వినుము.

30. "సంతానహీనుడనియు, విజయమును సాధింపజాలనివాడనియు మీరితనిని గూర్చి జాబితాలో లిఖింపుడు. ఇతని కుమారులలో ఎవ్వడును దావీదు సింహాసనమునెక్కి యూదాను పరిపాలింపడు.” ఇది ప్రభుడనైన నా వాక్కు

Text Example

1. “ప్రభువు ప్రజలను చెల్లాచెదరుచేసి, నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు.”

2. యిస్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు రాజులనుగూర్చి ఇట్లు చెప్పుచున్నాడు: “మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదరుచేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి. కనుక మీ దుష్కార్యములకుగాను నేను మిమ్ము శిక్షింతును.

3. నా ప్రజలలో మిగిలియున్నవారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశములనుండి మరల ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలనుకని అధిక సంఖ్యాకులగుదురు.

4. నేను వారిని సంరక్షించుటకు గాను రాజులను నియమింతును. వారికిక వెరపును, భీతియునుండవు. వారిలో ఎవడును నాశనము కాడు. ఇది ప్రభుడనైన నా పలుకు.

5. “ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను దావీదు వంశమునుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును దేశమందంతట నీతిన్యాయములు నెలకొల్పును.

6. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. యిస్రాయేలీయులు శాంతితో మనుదురు. 'ప్రభువు మనకు రక్షణము' అని అతనికి పేరిడుదురు.

7. ప్రభువిట్లనుచున్నాడు: క్రొత్తకాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు, 'యిస్రాయేలును ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము' అని చెప్పరు.

8. ప్రజలు, 'యిస్రాయేలీయులును ఉత్తరదేశము నుండియు వారు చెల్లాచెదరైన అన్యదేశముల నుండియు తోడ్కొనివచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము' అని పలుకుదురు. వారు తమ నేలమీదనే జీవింతురు.”

9. నా హృదయము వేదనచెందుచున్నది. నేను గడగడ వణకుచున్నాను. ప్రభువును, ఆయన పవిత్రనామమును తలంచుకొని త్రాగి మత్తెక్కినవానివలె తూలుచున్నాను.

10. దేశము వ్యభిచారులతో నిండిపోయినది. వారు దుష్టజీవితము గడిపిరి. తమ అధికారమును దుర్వినియోగము చేసిరి. ప్రభువు శాపము వలన దేశము విలపించుచున్నది. గడ్డి బీళ్ళు ఎండిపోయినవి.

11. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “ప్రవక్తలును, యాజకులును భక్తిహీనులైరి. వారు నా దేశముననే దుష్కార్యములు చేయుచుండగా నేను చూచితిని.

12. వారిత్రోవ చీకటితో నిండియుండును. వారు దానిలో జారిపడుదురు. నేను, వారిని కాలుజారి పడిపోవునట్లు చేయుదును వారికి శిక్షాకాలము సమీపించుచున్నది. నేను వారిని నాశనము చేయబోవుచున్నాను. ఇది ప్రభుడనైన నా పలుకు.

13. నేను సమరియా ప్రవక్తల పాపము చూచితిని. వారు బాలు పేరు మీద ప్రవచనములు పలికి, నా ప్రజలను పెడత్రోవ పట్టించిరి.

14. కాని యెరూషలేము ప్రవక్తలు ఇంతకంటెను ఘోరకార్యములు చేయగా చూచితిని. వారు వ్యభిచారముచేసి అనృతములు పలికిరి. ప్రజలు దుష్కార్యములు చేయుటకు సాయపడిరి. కావున ఎల్లరును చెడ్డపనులే చేయుచున్నారు. నామట్టుకు నాకు వారెల్లరును సొదొమ గొమొఱ్ఱా ప్రజలవలె కనిపించుచున్నారు.”

15. కనుక సైన్యములకు అధిపతియు, ప్రభుడనైన నేను యెరూషలేము ప్రవక్తలను గూర్చి ఇట్లు చెప్పుచున్నాను: “వారివలన దేశమున అవిశ్వాసము వ్యాపించెను గాన నేను వారిచే చేదుకూరలు తినిపింతును, విషజలములు త్రాగింతును.”

16. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “మీరు ఈ ప్రవక్తల పలుకులు ఆలింపవలదు. వారు మిమ్ము మభ్యపెట్టుచున్నారు. వారు మీతో చెప్పు సంగతులు తమకు తాము కల్పించుకొనిన దృశ్యములే కాని, నా నోటినుండి వచ్చిన పలుకులు కావు.

17. నా పలుకులు ఆలింపనొల్లని జనులతో వారు 'మీకు క్షేమము కలుగును' అని చెప్పుచున్నారు. మూరపు హృదయముగల ప్రజలతో 'మీకు ఎట్టి కీడును వాటిల్లదు' అని పలుకుచున్నారు.”

18. నేను ఇట్లనుకొంటిని: ఈ ప్రవక్తలలో ప్రభువు వాక్కులు ఆలించి, అర్థము చేసికొనునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? ఆయన పలుకులు గ్రహించి వాటిని లక్ష్యము చేసినవాడెవడు?

19. ప్రభువు కోపము తుఫానువంటిది. అది దుర్మార్గులపై ప్రభంజనమువలె వీచును.

20. ప్రభువు తన సంకల్పమును నెరవేర్చువరకును ఆయన ఆగ్రహము చల్లారదు. రానున్న కాలమున ఆయన ప్రజలు ఈ సంగతిని బాగుగా అర్థము చేసికొందురు.

21. ప్రభువు ఇట్లనెను: నేను పంపకున్నను ఆ ప్రవక్తలు పరుగెత్తిపోయిరి. నేను వారికి సందేశము విన్పింపకున్నను వారు ప్రవచనములు చెప్పిరి.

22. వారు నా సభలో నిలచి ఉండినయెడల నా ప్రజలకు నా సందేశమును తెలియజేసియుందురు. వారిని తమ దుష్టమార్గమునుండి మరల్చియుందురు. తమ దుష్టకార్యములనుండి వైదొలగించి ఉందురు.

23. నేను దగ్గరలో ఉన్నపుడు మాత్రమే దేవుడనై, దూరముననున్నపుడు దేవుడను కాకుందునా?

24. ఎవడైన నా కంటపడకుండ రహస్యముగా దాగుకోగలడా? నేను భూమ్యాకాశములందంతట ఉండువాడను.

25. నా పేరు మీదుగా కల్ల ప్రవచనములు పలుకు ఆ ప్రవక్తలేమి చెప్పుచున్నారో నేనువింటిని. నేను వారికి కలలో నా సందేశమును వినిపించితినని వారు పలికిరి.

26. ఈ ప్రవక్తలు తాము సృజించుకొన్న అబద్ద సందేశములతో నా ప్రజలను ఇంకను ఎన్నాళ్ళు అపమార్గము పట్టింతురు?

27. వారు తాము చెప్పు స్వప్నవృత్తాంతముల ద్వారా నా ప్రజలు నన్ను విస్మరింతురని భావించుచున్నారు. పూర్వము తమ పితరులు బాలును కొలిచి, నన్ను మరచిపోయినట్లే జరుగునని తలంచుచున్నారు.

28. కలగన్న ప్రవక్తను తన కలను వివరింపనిండు. కాని నా నుండి సందేశ మును వినిన ప్రవక్త దానిని యథార్థముగా ప్రకటింపవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము?

29. నా వాక్కు నిప్పువలె దహింపదా? సమ్మెటవలె రాళ్ళను బ్రద్దలుచేయదా?

30. ఒకరి మాటలను ఒకరు తస్కరించి, వానిని దైవసందేశమువలె ప్రకటన చేయు ప్రవక్తలనిన నాకు గిట్టదు.

31. తమ సొంత మాటలనే 'ఇది ప్రభువు వాక్కు' అని ప్రకటన చేయు ప్రవక్తలనిన నాకుగిట్టదు.

32. కల్లలతో గూడిన కలలను ప్రవచనములుగా చెప్పు ప్రవక్తలనిన నాకు గిట్టదు. వారు ఈ కలలను ప్రకటనముచేసి తమ అబద్దములతోను, ప్రగల్భములతోను నా ప్రజలను అపమార్గము పట్టించుచున్నారు. నేను వారిని పంపలేదు. పొండని వారికి ఆజ్ఞ ఈయలేదు. వారి వలన నా ప్రజలకెట్టి లాభమును కలుగలేదు. ఇది ప్రభుడనైన నా వాక్కు

33. ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: ప్రజలుకాని, ప్రవక్తకాని, యాజకుడుకాని ప్రభువు భారము (సందేశము) ఏమిటని నిన్ను అడిగినచో నీవు వారితో “మీరే ఆయనకు భారమైతిరి. ఆయన మిమ్మెత్తి ఆవల పారవేయును” అని చెప్పుము.

34. ప్రజలలో ఎవడైనాకాని, ప్రవక్తకాని, యాజకుడుకాని 'ప్రభువు భారము' అన్న పదమును వాడెనేని నేను అతడిని, అతడి కుటుంబమును కూడ దండింతును.

35. ప్రతివాడును తన మిత్రులను కాని, బంధువులను కాని 'ప్రభువేమి జవాబు చెప్పెను? ఆయనేమి పలికెను?” అని మాత్రమే అడుగవలెను.

36. అంతే కాని ఎవడును “ప్రభువు భారము” అన్న పదములను వాడరాదు. ఎవడైన వాడెనేని వానికి నా సందేశము భారమై తీరును. ప్రజలు సజీవుడును సైన్యములకు అధిపతియును తమ దేవుడునైన ప్రభువు మాటలకు అపార్థము కల్పించిరి.

37. 'ప్రభువు ఏమి జవాబు చెప్పెను? ఆయనేమి పలికెను?' అని మాత్రమే జనులు ప్రవక్తలను అడుగవలెను.

38. ప్రజలు నా ఆజ్ఞ మీరి “ప్రభువు భారము" అను మాటలను వాడరాదు. వాడుదురేని,

39. నేను వారిని పైకెత్తి దూరముగా విసరివేయుదును. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన నగరమును గూడ ఈ రీతిగనే విసరి పారవేయుదును.

40. వారికి శాశ్వతమైన అవమాన మును, అపకీర్తిని కలిగింతును. జనులు వానినెన్నటికిని మరచిపోరు.”

Text Example

1. బబులోనియా రాజగు నెబుకద్నెసరు, యూదారాజును యెహోయాకీము కుమారుడునగు యెకొన్యా అనబడు యెహోయాకీనును యెరూషలేము నుండి బబులోనియాకు బందీగా కొనిపోయెను. అతడు యూదానాయకులను, కళాకారులను, చేతి వృత్తులవారినిగూడ బందీలనుగా కొనిపోయెను. ఆ సంఘటన జరిగిన తరువాత ప్రభువు నాకొక దర్శనమును చూపెను. నేను ప్రభువు దేవాలయము ముందట రెండు అంజూరపు పండ్ల బుట్టలు పెట్టి యుంచుటను చూచితిని.

2. ఒక బుట్టలో మంచి పండ్లుండెను. అవి ఋతువు రాకమునుపే పక్వమైన పండ్లను పోలియుండెను. మరియొక బుట్టలో పాడు పండ్లు ఉండెను. అవి తినుటకు పనికిరావు.

3. ప్రభువు, “యిర్మీయా! నీకేమి కనిపించుచున్నవి” అని నన్ను అడిగెను. నేను “అంజూరపు పండ్లు కనిపించుచున్నవి. మంచిపండ్లు చాలమంచివి. చెడ్డపండ్లు చాలచెడ్డవి. అవి తినుటకెంత మాత్రమును పనికిరావు” అని బదులిచ్చితిని.

4. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు విన్పించెను.

5. “యిస్రాయేలు దేవుడను ప్రభుడనైన నా పలుకులివి. నేను యూదా నుండి బబులోనియాకు బందీలనుగా పంపిన ప్రజలు ఈ మంచి పండ్లవంటివారు. నేను వారిని దయతో ఆదరింతును.

6. వారిని పరామర్శింతును. వారిని మరల ఈ నేలకు కొనివత్తును. వారిని భవనమువలె కట్టుదును గాని పడగొట్టను. మొక్కవలె నాటుదును గాని పెల్లగింపను.

7. నన్ను ప్రభువునుగా గుర్తింపవలెనన్న కోరికను వారికి కలిగింతును. వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడనగుదును. వారు పూర్ణహృదయ ముతో నా వద్దకు తిరిగివత్తురు.

8. కాని యూదారాజగు సిద్కియాను, అతనిని అనుసరించు నాయకులను, యెరూషలేమున మిగిలియున్నవారిని వారు ఈ దేశమున ఉన్నను, ఐగుప్తునకు వెడలిపోయినను వారి నెల్లరిని, ప్రభుడనైన నేను, తినుటకెంత మాత్రము పనికిరాని ఈ చెడ్డపండ్లవలె గణించెదను.

9. వారిని దారుణమైన శిక్షకు గురి చేయుదును. లోకములోని జాతులెల్ల వారినిగాంచి వెరగొందును. ప్రజలు వారిని గేలిచేసి పరిహసింతురు. వారిని చూచి నవ్వుదురు. నేను వారిని చెల్లాచెదరు చేసిన తావులందెల్ల జనులు వారి పేరును శాపవచనముగా వాడుకొందురు.

10. నేను వారిని పోరునకును, ఆకలికిని, అంటురోగమునకును గురి చేయుదును. నేను వారికిని, వారి పితరులకు ఇచ్చిన నేలమీద వారిలో ఒక్కడును మిగులడు.”

Text Example

1. యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజుగానున్న కాలము నాలుగవయేట యూదా అంతటిని గూర్చి నేను ప్రభువువాక్కును వింటిని. ఇది నెబుకద్నెసరు బబులోనియాను పరిపాలించు కాలము మొదటియేడు.

2. యూదా యెరూషలేము ప్రజలందరితోను నేను ఇట్లంటిని.

3. “ఆమోను కుమారుడగు యోషీయా యూదాను పరిపాలించు కాలము పదమూడవ యేటినుండియు, ఇరువది మూడేండ్లపాటు ప్రభువు నాకు తన వాక్కును విన్పించుచువచ్చెను. ఆయన నాకు విన్పించిన సంగతులను నేనెప్పటికప్పుడు మీకు తెలియజేయుచునే యుంటిని. కాని మీరు నా పలుకులను లెక్కచేయలేదు.

4. ప్రభువు తన సేవకులైన ప్రవక్తలను ఎల్లవేళల మీ చెంతకు పంపుచునే యుండెను. కాని మీరు వారి పలుకులను వినలేదు. లెక్కచేయలేదు.

5. వారు 'మీరు మీ దుష్ట మార్గముల నుండియు, దుష్కార్యముల నుండియు వైదొలగవలెనని చెప్పిరి. అట్లయిన ప్రభువు మీకును, మీ పితరులకును ఇచ్చిన నేలమీద మీరు శాశ్వతముగా జీవింపవచ్చునని చెప్పిరి.

6. మరియు ఆ ప్రవక్తలు మీరు అన్యదైవములను సేవించి పూజింపరాదనిరి. మీరు స్వయముగా చేసికొనిన విగ్రహములను ఆరాధించి ప్రభువు కోపమును రెచ్చ గొట్టరాదనియు, మీరు ఆయన మాట పాటించిన యెడల ఆయన మిమ్ము శిక్షింపడనియు నుడివిరి.

7. కాని ప్రభువే మీరు తనమాట వినలేదని వాకొను చున్నాడు. మీరు స్వయముగా చేసికొనిన విగ్రహము లతో ప్రభువు కోపమును రెచ్చగొట్టి ఆయన శిక్షను కొనితెచ్చుకొంటిరి.

8. మీరు ప్రభువు మాట వినరైతిరి. కనుక సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు:

9. నేను ఉత్తరదేశపు జాతులన్నిటిని పిలిపింతును. నా సేవకుడును బబులోనియా రాజునగు నెబుకద్నెసరును రప్పింతును. వారు యూదా మీదికిని, దాని ప్రజలమీదికిని, దాని చుట్టుపట్లనున్న జాతుల మీదికి దండెత్తివత్తురు. నేను ప్రజలనెల్లరిని సర్వనాశ నము చేయుదును. వారి వినాశనము చూచి జనులు కలకాలము వరకును వెరగందునట్లును, భయ భ్రాంతులు అగునట్లును చేయుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

10. నేను ఆ జనుల సంతోషనాదమును, వివాహములలో వారి వధూవరులు చేయు ఆనంద ధ్వానములను అణచివేయుదును. వారి తిరుగళ్ళు ధాన్యమును విసరవు. వారి దీపములు వెలగవు.

11. ఈ దేశమంతయు పాడువడిపోయి ఎల్లరికిని ఆశ్చర్యము కలిగించును. ఈ జాతులు డెబ్బదియేండ్ల పాటు బబులోనియా రాజునకు దాస్యము చేయును.

12. ఆ కాలము ముగిసిన పిదప నేను బబులోనియా ప్రజలను, వారి రాజును వారి పాపములకుగాను శిక్షింతును. నేను ఆ దేశమును నాశనముచేసి అది ఎల్లకాలము వరకును పాడువడి యుండునట్లు చేయుదును.

13. నేను యిర్మీయా ద్వారా మాట్లాడినపుడు ఆ దేశము మీదికి రప్పింతునన్న శిక్షలన్నింటిని, ఈ గ్రంథమున లిఖింపబడిన దండనములన్నింటిని రప్పించి తీరుదును.

14. నేను బబులోనియా ప్రజలుచేసిన దుష్కార్యములు వారి నెత్తి మీదికే దిగివచ్చునట్లు చేయుదును, పెక్కుజాతులును, మహాప్రభువులును వారిని బానిసలుగా ఏలుదురు."

15. యిస్రాయేలు దేవుడైన ప్రభువు నాతో ఇట్లనెను: “నీవు నా కోపముతోనిండిన ఈ పానపాత్రమును తీసికొని, నేను నిన్ను పంపు జాతులన్నింటి యొద్దకును పొమ్ము. ఆ జాతులచే దీనిలోని పానీయమును త్రాగింపుము.

16. ఆ ప్రజలు ఈ పాత్రలోని రసమును త్రాగి తెలివిని కోల్పోయి తూలి పడుదురు. నేను వారిమీదికి పంపు యుద్ధమువలన ఈ కార్యము జరుగును.”

17. కనుక నేను ప్రభువు చేతినుండి ఆ పాత్ర మును తీసికొని ఆయన నన్ను పంపిన జాతులన్నిటి చెంతకును పోయి వానిచే దానిలోని రసమును త్రాగించితిని.

18. యెరూషలేమును దాని రాజులును, నాయకులును, యూదా నగరములును దానిలోని రసము త్రాగునట్లు చేసితిని. ఆ పట్టణములు పాడువడి చూచువారికి భీతిగొల్పెను. ప్రజలు ఆ నగరముల పేర్లను శాపవచనములుగా వాడు కొనిరి. నేటికిని వాడుకొనుచున్నారు.

19-26. మరియు ఆ పాత్రమునుండి రసము త్రాగినవారి పేరులివి: - ఐగుప్తు ఫరోరాజు, అతని ఉద్యోగులు, అతని ప్రజలు, అతని దేశములోని పరదేశులు. - ఊజు దేశపు రాజులెల్లరు. - ఫిలిస్తీయాలోని అష్కేలోను, గాజ, ఎక్రోను నగరములును, అష్డోదున మిగిలియున్నవారును. - ఎదోము, మోవాబు, అమ్మోను ప్రజలు. - తూరు, సీదోను రాజులెల్లరు. - మధ్యధరాసముద్రతీర ప్రాంతములందలి రాజులందరు. - దదాను, తేమా, బూజు నగరములు. - తలలు బోడిగా గొరిగించుకొను ప్రజలెల్లరు. - అరాబియా దేశ రాజులెల్లరు. - ఎడారి తెగల రాజులందరు. - సిమ్రి, ఏలాము, మాద్యా రాజులందరు. - దూరమునగాని, దగ్గరలోగాని ఉన్న రాజులెల్లరు ఒకరి తరువాత నొకరు. భూమిమీది జాతులెల్ల ఆ పాత్రమునుండి రసమును త్రాగవలెను. కట్టకడన వారి తరువాత షెషాక్ రాజు త్రాగవలెను.

27. “అంతట ప్రభువు నాతో ఇట్లనెను: 'సైన్యములకు అధిపతియైన ప్రభుడను, యిస్రాయేలు దేవుడనైన నేను ఈ జాతుల జనులను తప్పత్రాగ ఆజ్ఞాపించితినని చెప్పుము. వారు వాంతిచేసికొనునంత వరకును, క్రిందపడి పైకి లేవజాలకుండునంత వరకును త్రాగవలెను. నేను వారి మధ్యకు పంపు ఖడ్గమువలన ఈ కార్యము జరుగును.'

28. 'వారు నీ చేతినుండి పాన పాత్రమును తీసికొనుటకును దానినుండి రసము త్రాగుటకును ఇష్టపడరేని, త్రాగకతప్పదని నా పలుకులుగా చెప్పుము.

29. నేను నా నగరముననే వినాశ మును ప్రారంభింతును. అచటి ప్రజలు నా శిక్షను తప్పించుకోగలమని ఎంచుచున్నారు కాబోలు! అది పొసగదు. నేను భూమిమీది నరులెల్లరి మీదికిని యుద్ధము పంపుదును. ఇది . సైన్యములకు అధిపతియు, ప్రభుడనైన నా వాక్కు

30. యిర్మీయా! నేను నీకు చెప్పిన సంగతులెల్ల నీవు వారికి తెలియజేయుము. వారితో ఇట్లనుము: ప్రభువు ఉన్నత స్థలమునుండి గర్జించును. తన పవిత్రనివాసమునుండి , భీకరనాదము చేయును. ఆయన తన ప్రజలను గాంచి గర్జించును. ద్రాక్షపండ్లను నలగదొక్కు వానివలె కేకలిడును. లోకములోని నరులెల్లరు ఆయన ధ్వానమును ఆలింతురు.

31. ఆ నాదము నేల ఎల్లెడల విన్పించును. ప్రభువు జాతులమీద నేరముతెచ్చును, ప్రజలనందరిని తీర్పునకు పిలుచును, దుర్మార్గులను వధించును. ఇది ప్రభువు వాక్కు'

32. “సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు: జాతి తరువాత జాతికి వినాశము దాపురించును. నేల అంచులనుండి పెనుతుఫాను పుట్టును.

33. ప్రభువు చంపివేసిన వారి పీనుగులు ఆ దినమున నేలపై ఒక కొననుండి మరియొక కొనవరకును వెదజల్లబడును. ఎవరును వానినెత్తుకొనిపోయి పాతిపెట్టరు. అవి నేలమీద ఎరువు కుప్పలవలె పడియుండును. ఆ మృతులకొరకు ఎవరును విలపింపరు.

34. కాపరులారా! మీరు విలపింపుడు. మీరు పెద్దగా కేకలిడుడు. బూడిదలో బడి పొర్లాడుడు. మిమ్ము వధించు కాలమాసన్నమైనది. మేలైన పొట్టేళ్ళనువలె మిమ్ము వధింతురు.

35. నాయకులైన మీరిక పారిపోజాలరు. కాపరులైన మీరిక తప్పించుకోజాలరు.

36. అదిగో నాయకులు ఆక్రందనము చేయుచున్నారు. కాపరులు గొంతెత్తి అరచుచున్నారు.

37. ప్రభువు కోపముతో వారి జనులను నాశనము చేసెను. ప్రశాంతమైన వారి దేశమును పాడుచేసెను.

38. సింహము తనపొదను విడనాడినట్లే ప్రభువు తన అజ్ఞాతమును విడనాడెను. యుద్దము వలనను, ప్రభువు కోపమువలనను వారి దేశము ఎడారియైపోయినది.”

Text Example

1. యెషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై సింహాసనము ఎక్కిన ఆరంభములో ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

2. “నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరములనుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజ లకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపుము. వాటిలో ఒక్కమాటకూడ వదలి పెట్టవలదు.

3. ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్టమార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్కార్యములకుగాను వారిని వినాశనమునకు గురిచేయను.

4. 'నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావలెనని చెప్పితిని.

5. నేను వేగిరపడుచు మీ యొద్దకు పంపుచు వచ్చిన నా సేవకులగు ప్రవక్తల పలుకులు ఆలింప వలెనని కోరితిని. కాని మీరు వారి మాటలు వినలేదు.

6. మీరు నా మాట పాటింపలేని ఈ దేవాలయమునకు షిలో దేవళమునకు పట్టినగతినే పట్టింతును. ప్రపంచములోని జాతులెల్ల ఈ నగరనామమును శాపవచనముగా వాడుకొందురు.”

7. యాజకులును, ప్రవక్తలును, ప్రజలెల్లరును నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుటనువినిరి,

8. నేను ప్రభువు చెప్పుమనిన సంగతులను చెప్పిన వెంటనే వారెల్లరును నన్ను పట్టుకొని, “నీకు మరణశిక్ష తప్పదు.

9. 'ఈ దేవాలయమునకు షిలో దేవళము నకు పట్టిన గతియేపట్టుననియు, ఈ నగరము పాడు వడగా దీనిలో ఎవరును వసింపరనియు ప్రభువు పేరుమీదుగా నీవేల ప్రవచించితివి?' అని అరచిరి. అంతట జనులు దేవాలయమున నాచుట్టును గుమి గూడిరి.

10. యూదానాయకులు ఈ సంగతిని విని రాజప్రాసాదమునుండి వెనువెంటనే దేవాలయము నకు వచ్చి నూత్న ద్వారమునొద్ద కొలువుదీరిరి.

11. అపుడు యాజకులును, ప్రవక్తలును నాయకులతోను, ప్రజలతోను “ఇతడు నగరమునకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను. కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరును ఇతని మాటలు వింటిరి కదా!” అని అనిరి.

12. కాని నేను వారికిట్లు జవాబు చెప్పితిని: “నేను ఈ దేవాలయమునకును, నగరమునకును వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను.

13. కనుక మీరు మీ మార్గములను, క్రియలను మార్చుకొని ప్రభువునకు విధేయులుకండు. అట్లయిన ఆయన తన మనసు మార్చుకొనును. తాను నిశ్చయించుకొని నట్లుగా మిమ్ము నాశనము చేయడు.

14. నా మటుకు నేను మీ అధీనముననున్నాను. మీకు ఉచితముగాను, న్యాయముగాను తోచిన దానిని మీరు చేయువచ్చును.

15. కాని ఈ సంగతి గుర్తింపుడు. మీరు నన్ను చంపు దురేని మీరును, ఈ నగరవాసులును ఒక నిర్దోషిని చంపినట్లు అగును. ఈ సంగతులెల్ల మీకు తెలియ జేయుటకు ప్రభువే నన్ను పంపెను.”

16. అంతట నాయకులును, ప్రజలును యాజకులతోను, ప్రవక్తలతోను "ఇతడు మన దేవుడైన ప్రభువు పేరుమీదుగా మాట్లాడెను. కనుక ఇతనికి మరణ శిక్షవిధించుట తగదు” అనిరి. .

17. అటుపిమ్మట కొందరు పెద్దలులేచి, అచట గుమి కూడిన ప్రజలతో ఇట్లనిరి.

18. “హిజ్కియా యూదాను పరిపాలించు కాలమున మోరెషెత్ నగర వాసి మీకా, ప్రభువు పేరుమీదుగా ప్రజలకిట్లు చెప్పెను: 'సియోనును పొలమువలె దున్నుదురు. యెరూషలేము పాడువడి గుట్టలగును. దేవాలయపు కొండ అడవియగును.”

19. హిజ్కియా రాజును, యూదా వాసులును అతనిని వధింపలేదు. పైపెచ్చు హిజ్కియా ప్రభువునకు భయపడి ఆయన మన్నన సంపాదించుకొనెను. కనుక ప్రభువు మనసు మార్చుకొని తాను సంకల్పించుకొని నట్లుగా వారిని నాశనము చేయడయ్యెను. ఇప్పుడు మనము ఈ కార్యము చేసినచో ఘోరవిపత్తును కొనితెచ్చుకోబోవుచున్నాము.”

20. కిర్యత్యారీము నగరవాసియు, షేమయా కుమారుడునైన ఊరియా అనునతడు కూడ యిర్మీయా వలె ఈ నగరమునకును, ఈ ప్రజలకును ప్రతికూలముగా ప్రవచనములు చెప్పెను.

21. యెహోయాకీము రాజును, అతని అంగరక్షకులును, ఉద్యోగులును అతని పలుకులు వినిరి. రాజు అతనిని చంపజూచుచుండగా ఈ సంగతిని గ్రహించి ఊరియా భయపడి ఐగుప్తునకు పారిపోయెను.

22. కాని రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడైన ఎల్నాతానును, మరికొందరిని ఐగుప్తునకు పంపెను.

23. వారు ఐగుప్తునుండి ఊరియాను తీసికొని వచ్చి, రాజు సమక్షమునకు గొని వచ్చిరి. రాజు అతనిని చంపించి, అతని శవమును సామాన్యులను పాతి పెట్టు శ్మశానమున పడ వేయించెను.

24. కాని షాఫాను కుమారుడైన అహీకాను యిర్మీయా కోపు తీసికొనెను. కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి.

Text Example

1. యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైన తొలిరోజులలో ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

2. “నీవు తోలుపలుపు లను, కాడిమానును తయారుచేసికొని, వానిని నీ మెడపై కట్టుకొనుము.

3. అటుపిమ్మట ఎదోము, మోవాబు, అమ్మోను, తూరు, సీదోను దేశముల రాజులకు ఈ వార్తను పంపుము. సిద్కియా రాజును సందర్శించుటకు యెరూషలేమునకు వచ్చిన ఆ రాజుల దూతల ద్వారా ఈ కబురు పంపుము.

4. సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఆ దూతలు తమ రాజులకు ఈ వృత్తాంత మును తెలియజేయ ఆజ్ఞాపించుచున్నాడని చెప్పుము.

5. "నేను నా మహా బలముతోను, చాచిన బాహువు తోను భూమిని సృజించితిని. భూమిని దానిమీద సంచరించు నరులను, జంతువులను సృజించితిని. నేను దానిని నా యిష్టము వచ్చిన వారికిత్తును.

6. నేనిపుడు ఈ దేశములన్నిటిని నా సేవకుడును బబులోనియారాజైన నెబుకద్నెసరునకు ఇచ్చివేసితిని. వన్యమృగములు కూడ అతనిని సేవించునట్లు చేసితిని.

7. ఎల్ల జాతులును అతనికిని, అతని పుత్రపౌత్రులకును ఊడిగము చేయును. అటు తరువాత అతని దేశము కూలిపోవును. అప్పుడతని దేశము గొప్ప జాతులకును, మహారాజులకును ఊడిగము చేయును.

8. “ఏ దేశమైన, ఏ జాతియైన బబులోనియా రాజైన నెబుకద్నెసరునకు ఊడిగముచేసి అతనికి లొంగియుండదేని, నేను వానిని పోరు, కరువు, అంటు రోగములతో శిక్షింతును. ఆ రాజుచే వానిని నాశనము చేయింతును.

9. మీ మట్టుకు మీరు మీ ప్రవక్తలు, జ్యోతిష్కులు, కలలు కనువారు, సోదె చెప్పువారు, మాంత్రికులు మొదలైనవారి పలుకులు ఆలింపకుడు. వారు బబులోనియా రాజు పాలనమునకు లొంగవలదు అని మీతో చెప్పుదురు.

10. మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా బహిష్కరించునట్లును, మిమ్ములను నేను వెళ్ళగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ద ప్రవచనములు మీకు ప్రకటింతురు.

11. ఏ ప్రజలైనను బబులోనియా రాజు పాలనమునకు లొంగి అతనికి ఊడిగము చేయుదురేని, నేను వారిని తమ సొంత దేశముననే మననిత్తును. వారు తమ సొంత దేశమున సేద్యము చేసికొని అచటనే వసింతురు.

12. యూదా రాజైన సిద్కియాకు నేను ఈ సంగతినే చెప్పితిని. “ప్రభువు పలుకులివి. నీవు బబులోనియారాజునకు లొంగుము. అతనికిని, అతని ప్రజలకును సేవలుచేసి బ్రతికిపొమ్ము .

13. నీవును, నీ ప్రజలును పోరు, ఆకలి, అంటురోగములవలన చావనేల? బబులోనియా రాజునకు లొంగని జాతుల న్నిటికిని ఈ గతియేపట్టునని ప్రభువు పలికెను.

14. ఆ రాజునకు లొంగవలదని చెప్పు ప్రవక్తల మాటలు నీవు నమ్మవలదు. వారు నిన్ను మోసగించుచున్నారు.

15. నేను వారిని పంపలేదు. వారు నా పేరుమీదుగా బొంకులాడుచున్నారు. నేను మిమ్మచటినుండి వెళ్ళ గొట్టుదును. మీరును, మీతో కల్లలాడు ప్రవక్తలు కూడ చత్తురు."

16. అటుపిమ్మట నేను యాజకులకును, ప్రజలకును ప్రభువు వాక్కులిట్లు తెలియజేసితిని. “మీరు పవిత్రపాత్రములను శీఘ్రమే బబులోనియా నుండి కొనివత్తురని చెప్పు ప్రవక్తల మాటలను నమ్మకుడు. వారు మిమ్ము మోసగించుచున్నారు.

17. వారి మాటలు నమ్మకుడు. మీరు బబులోనియా రాజునకు లొంగి బ్రతికిపొండు. ఈ నగరము పాడుబడిపోనేల?

18. వారు ప్రవక్తలగుదురేని, వారికి నా సందేశము విన్పించియుండెనేని దేవాలయమునను, రాజ ప్రాసాదమునను మిగిలియున్న పవిత్ర పాత్రములను, శత్రువులు బబులోనియాకు కొనిపోరాదని నాకు మనవి చేయుదురుగాక! సైన్యములకు అధిపతినైన నన్ను బ్రతిమాలుకొందురుగాక!

19. యెహోయాకీము కుమారుడును, యూదా రాజగు యెహోయాకీనును, యూదా యెరూషలేములందలి ప్రముఖవ్యక్తులను బబులోనియా రాజు తన దేశమునకు బందీలనుగా కొనిపోయెనుగదా!

20. కాని అతడు స్తంభములను, ఇత్తడితొట్టిని, బండ్లను, మిగిలిన దేవాలయ పాత్రములను కొనిపోలేదు.

21. యిస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభుడనగు నేను దేవాలయమునను, రాజప్రాసాదమునను ఇంకను మిగిలియున్న పవిత్ర పాత్రములను గూర్చి చెప్పు మాటలు వినుడు.

22. వానిని బబులోనియాకు తీసికొనిపోవుదురు. నేను వానిని జ్ఞప్తికి తెచ్చుకొనువరకును అవి అచటనే ఉండును. నేను వానిని గుర్తుకు తెచ్చుకొనిన పిదప, వానిని మరల ఈ తావునకు గొని వత్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు”

Text Example

1. ఆ సంవత్సరముననే, అనగా సిద్కియారాజు పరిపాలనాకాలము నాలుగవయేడు ఐదవనెలలో, గిబ్యోను నగరవాసియు, అస్సూరు కుమారుడునైన హనన్యాప్రవక్త యాజకులును, ప్రజలును వినుచుండగా దేవాలయమున నాతో ఇట్లు పలికెను:

2. యిస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను బబులోనియారాజు కాడిని విరుగగొట్టితిని.

3. బబులోనియారాజు నెబుకద్నెసరు ఈ తావునుండి తన దేశమునకు కొనిపోయిన దేవాలయ పాత్రములన్నిటిని రెండేండ్ల కాలములోనే నేను మరల కొనివత్తును.

4. యెహోయాకీము కుమారుడను, యూదారాజునునగు యెహోయాకీనును, బబులోనియాకు బందీలనుగా గొనిపోయిన యూదా జాతి ప్రముఖులందరిని నేను వెనుకకు తీసికొనివత్తును. నేను బబులోనియారాజు కాడిని విరుగగొట్టుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు."

5. అపుడు నేను దేవాలయమునందలి యాజకులును, ప్రజలును వినుచుండగా హనన్యాతో ఇట్లంటిని:

6. “అట్లే జరుగునుగాక! ప్రభువు ఈ కార్యము చేయునుగాక! ఆయన నీవు ప్రవచించిన కార్యమును నెరవేర్చి, దేవాలయ పాత్రములను, బందీలను బబులోనియా నుండి మరల ఇచటికి తీసికొని వచ్చును గాక!

7. కాని నేను నీకును, ఈ ప్రజలకును చెప్పు పలుకులాలింపుము.

8. పురాతన కాలమునుండియు నీకును నాకును ముందున్న ప్రవక్తలు పోరు, కరువు, అంటురోగములు సంభవించునని పెక్కుజాతులకును, రాజ్యములకును ప్రవచనములు చెప్పిరి.

9. కాని క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్త యున్నాడే, అతడు ప్రభువువలన పంపబడెనని నిర్ధారించుటెట్లు? అతని మాటలు నెరవేరుటవలననేగదా!”

10. అంతట హనన్యా నా మెడ మీదినుండి కాడిని తీసికొని విరుగగొట్టెను.

11. అతడు ప్రజలందరు విను చుండగా “నెబుకద్నెసరురాజు సకలజాతుల మెడమీద పెట్టిన కాడిని నేను రెండేండ్లలో ఈ రీతిగనే విరుగ గొట్టుదును” అని ప్రభువు పలుకుచున్నాడు అనెను. అటుతరువాత నేను అచటినుండి వెళ్ళిపోయితిని.

12. హనన్యా నా మెడ మీది కాడిని విరుగగొట్టిన తరువాత, ప్రభువు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను: నీవు హనన్యా వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్లు చెప్పుము.

13. “నీవు కొయ్యకాడిని విరుగగొట్ట వచ్చును, కాని దానికి బదులుగా నేను ఇనుపకాడిని సిద్ధము చేయుదును.

14. సైన్యములకు అధిపతియైన యిస్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు. నేను ఎల్ల ప్రజలమీద ఇనుపకాడినుంతును. వారు బబులోనియా రాజు నెబుకద్నెసరునకు ఊడిగము చేయుదురు. నేను వన్యమృగములు కూడ అతనికి సేవలు చేయునట్లు చేయుదును.”

15. తదనంతరము నేను హనన్యాతో ఇట్లంటిని: “ఓయి! నీవు నా పలుకులాలింపుము. ప్రభువు నిన్ను పంపలేదు. నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి.

16. కనుక ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు. నేను నిన్ను భూమి మీదినుండి ఆవలకు గెంటి వేయుదును. ప్రభువుమీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి. కావున ఈ యేడు ముగియకమునుపే నీవు చత్తువు.”

17. ఆ యేడు ఏడవ నెలలోనే హనన్యా కన్ను మూసెను.

Text Example

1. నెబుకద్నెసరు యెరూషలేము నుండి బబులోనియాకు బందీలనుగా గొనిపోయిన యాజకులకు, ప్రవక్తలకు, నాయకులకు, ఇతర జనులకు నేను యెరూషలేము నుండి లేఖను పంపితిని.

2. యెహోయాకీము రాజు, అతనితల్లి, ప్రాసాదాధికారులు, యూదా యెరూషలేము అధిపతులు, కళాకారులు, చేతివృత్తుల వారు ప్రవాసమునకు పోయిన తరువాత ఈ లేఖను పంపితిని.

3. యూదారాజగు సిద్కియా షాపాను కుమారుడైన ఎలాసాను, హిల్కియా కుమారుడైన గెమర్యాను బబులోనియా రాజగు నెబుకద్నెసరు నొద్దకు పంపుచుండెను. నేను వారిద్వారా ఈ లేఖను పంపితిని. దానిలోని సంగతులివి:

4. "సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు తాను యెరూషలేము నుండి బబులోనియాకు బందీలనుగా పంపిన వారికందరి కిని ఇట్లు చెప్పుచున్నాడు:

5. మీరు ఇండ్లు కట్టుకొని కాపురముండుడు. తోటలువేసి వానిలో పండు పంటను భుజింపుడు.

6. పెండియాడి సంతతిని బడయుడు. మీ పుత్రులు పెండ్లిండ్లుచేసికొని బిడ్డలను కనుదురుగాక! మీ సంఖ్య పెరుగవలెనే కాని తరుగకూడదు. మీ కుమార్తెలకు వరులను సంపాదించుడి.

7. నేను మిమ్ము ప్రవాసమునకు పంపిన నగరముల క్షేమము కొరకు కృషిచేయుడు. ఆ పట్టణముల మేలుకొరకు నాకు ప్రార్థనచేయుడు. వారి క్షేమమే మీ క్షేమము.

8. సైన్యములకధిపతియు, యిస్రాయేలు దేవుడ నైన నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. మీరు మీనడుమ నున్న ప్రవక్తలవలన కాని, సోదె చెప్పువారి వలన కాని మోసపోకుడు. వారి కలలను నమ్మకుడు.

9. వారు నా పేరు మీదుగా మీకు అబద్దములు చెప్పుచున్నారు. నేను వారిని పంపలేదు. ఇవి ప్రభుడనైన నా పలుకులు.

10. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: బబులోనియాకు ఈయబడిన డెబ్బదియేండ్లు ముగిసినతోడనే నేను మిమ్ము సందర్శింతును. నేను ప్రమాణము చేసినట్లే మిమ్ము ఈ తావునకు తీసికొనివత్తును.

11. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినేగాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని.

12. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. నేను మీ మనవి నాలింతును.

13. మీరు పూర్ణహృదయముతో నన్ను వెదకుదురు. నేను మీకు దొరకుదును.

14. ఇవి ప్రభుడనైన నా మాటలు. నేను మీకు తప్పక దొరకుదును. నేను మిమ్ము చెరనుండి విడిపింతును. మిమ్ము చెల్లాచెదరు చేసిన దేశములనుండియు, తావుల నుండియు మిమ్ము తోడ్కొనివత్తును. ఏ దేశము నుండి మిమ్ము ప్రవాసమునకు కొనిపోయిరో, ఆ దేశమునకు మిమ్ము చేరును. ఇవి ప్రభుడనైన నా మాటలు. .

15. బబులోనియాలో ప్రభువు మీకు ప్రవక్తల నొసగెనని మీరు చెప్పుచున్నారు.

16. ఇపుడు దావీదు సింహాసనమున కూర్చుని పరిపాలనముచేయు రాజు గూర్చియు మీతోపాటు ప్రవాసమునకుపోక ఈ నగరమున వసించు మీ బంధువులను గూర్చియు ప్రభువు చెప్పు మాటలు వినుడు.

17. 'సైన్యములకు అధిపతియైన ప్రభువు వాక్కిది. నేను వారి మీదికి యుద్ధమును, ఆకలిని, అంటురోగములను గొనివత్తును. వారిని కుళ్ళిపోయి తినుటకు పనికిరాని అంజూరపుపండ్ల వంటి వారిని చేయుదును.

18. పోరు, ఆకలి, అంటు రోగములతో నేను వారిని వెన్నాడుదును. లోకములోని ప్రజలెల్ల వారిని చూచి విభ్రాంతి చెందుదురు. నేను వారిని ఎల్లెడల చెల్లాచెదరు చేయుదును. వారికి పట్టిన దుర్గతిని చూచి ప్రజలు విస్మయమొంది వెరగు చెందుదురు. వారిని గేలిచేయుదురు. వారి నామమును శాపముగా వాడుకొందురు.

19. నేను వేకువనే లేచి నా సేవకులైన ప్రవక్త లను ఎడతెగక వారియొద్దకు పంపినను, వారు నా సందేశమును ఆలింపలేదు. నా మాటలు వినలేదు.”

20. నేను యెరూషలేము నుండి బబులోనియాకు పంపిన వారందరును ప్రభుడనైన నా పలుకులు ఆలింపుడు.

21. 'సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు తన నామము మీదుగా మీకు అబద్దప్రవచనములు చెప్పుచున్న కోలాయా కుమారు డగు అహాబును గూర్చియు, మాసియా కుమారుడగు సిద్కియాను గూర్చియు ఇట్లనుచున్నాడు. నేను వారిని బబులోనియారాజగు నెబుకద్నెసరునకు అప్పగింతును. మీరెల్లరును చూచుచుండగా అతడు వారిని వధించును.

22. యెరూషలేము నుండి బబులోనియాకు బందీలుగా వెళ్ళిన వారు ఎవరినైన శపింపగోరినచో, “బబులోనియారాజు నిలువున నిప్పులలో కాల్పించిన సిద్కియా, అహాబులను చూచిన చూపుననే ప్రభువు మిమ్మును చూచునుగాక!' " అని పలుకుదురు.

23. వారు ఘోరపాపములు చేసిరి. కనుక ఈ దుర్గతికి గురియగుదురు. వారు వ్యభిచరించిరి. నేను పంపకున్నను నా పేరుమీదుగా ప్రవచనము చెప్పి కల్లలా డిరి. ఆయినను వారి కార్యములు నాకు తెలియును. నేను వారికి ప్రతికూలముగా సాక్ష్యమిత్తును. ఇవి ప్రభుడనైన నా పలుకులు."

24. నెహెలాము నగరవాసియైన షెమయాను గూర్చి సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు నాకొక సందేశము చెప్పెను:

25. “షేమయా యెరూషలేములోని ప్రజలకును, మాసియా కుమారుడును, యాజకుడునైన జెఫన్యాకును, ఇతర యాజకులకును తన పేరు మీదుగానే లేఖను పంపెను. ఆ లేఖలో జెఫన్యాకిట్లు వ్రాసెను:

26. 'ప్రభువు యెహోయాదాకు బదులుగా నిన్ను యాజకుని చేసెను. నీవిపుడు దేవాలయమున ప్రధానాధికారివి. ప్రవక్తల వలె నటనచేయు పిచ్చివారిని గొలుసులతో బంధించి, వారి మెడకు ఇనుపవలయమును తొడిగించుట నీ బాధ్యత.

27.మరి నీవు ప్రవక్తవలె నటనచేయు అనాతోతు నగరవాసియైన యిర్మీయాను ఏల అదుపులో పెట్టవైతివి?

28. తాను ప్రవక్తనన్న ధీమాతోనే అతడు బబులోనియాలో వసించు మాకు సందేశము పంపెను. ప్రవాసము దీర్ఘకాలము కొనసాగును కనుక మీరు ఇండ్లు కట్టుకొని వానిలో కాపురముండుడు. తోటలువేసి వానిలో పండిన పంటను తినుడని వ్రాసెను.”

29. జెఫన్యా నాకు ఆ లేఖ చదివి విన్పించెను.

30. అపుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు తెలియ చేసెను.

31. “నీవు బబులోనియాలోని బందీలకు ఈ సందేశమును పంపుము. 'నెహలాము నగర వాసియైన షెమయానుగూర్చి ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. నేను పంపకున్నను అతడు మీకు ప్రవచనము చెప్పి, మీచే అనృతములను నమ్మించెను.

32. కనుక ప్రభుడనైన నేను అతనిని, అతని వంశజులను కూడ శిక్షింతును. అతడు జనులచే నా మీద తిరుగుబాటు చేయించెను. కనుక అతని వంశజులెవరు మీ నడుమ కొనసాగరు. నేను నా ప్రజలకు కలుగజేయు శుభములను అతడు కంటితో చూడడు. ఇది ప్రభుడనైన నా వాక్కు. "

Text Example

1. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను.

2. "యిస్రాయేలు దేవుడైన ప్రభువిట్లు చెప్పు చున్నాడు. నేను నీకు చెప్పిన సంగతులెల్ల ఒక పొత్తమున వ్రాయుము.

3. నేను నా ప్రజలగు యిస్రాయేలు, యూదావాసులను చెరనుండి విడిపించు సమయము వచ్చుచున్నది. నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని తోడొనివతును. వారు ఆ నేలను మరల స్వాధీనము చేసికొందురు. ఇది ప్రభుడనైన నా వాక్కు,

4. యూదా యిస్రాయేలు ప్రజలకు ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు:

5. “నేనొక ఆర్తనాదము వింటిని. అది శాంతినిగాక, భయమును సూచించునాదము.

6. మీరు ఆలోచింపుడు. పురుషుడు ప్రసవించునా? అట్లయిన పురిటి నొప్పులలోనున్న స్త్రీవలె పురుషులు తమ నడుముపై చేతులను పెట్టుకోనేల? వారి మొగములు పాలిపోయి ఉండనేల?

7. అయ్యో! భీకరమైన దినము సమీపించుచున్నది. అట్టిదినము మరియొకటి ఉండబోదు. అది యిస్రాయేలునకు ఆపద తెచ్చును. కాని వారు దానినుండి తప్పించుకొందురు.

8. సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. ఆ దినమున నేను వారి మెడమీద కాడిని విరుగగొట్టుదును. వారి బంధనములను థ్రించి వేయుదును. వారు అన్యజాతులకిక దాస్యము చేయరు.

9. వారు తమ ప్రభుడను, దేవుడనైన నన్నును, నేను రాజుగా నియమించిన దావీదు వంశజుని సేవింతురు.

10. కనుక నా సేవకులగు యాకోబు వంశజులారా! మీరు భయపడకుడు. యిస్రాయేలీయులారా! మీరు భీతి చెందకుడు. నేను దూర దేశముననున్న మిమ్ము రక్షింతును. పరదేశమున చెరలోనున్న మీ సంతతిని కాపాడుదును. యాకోబు వంశజులకు మరల క్షేమము కలుగును వారు ఎవరి పీడయులేక సురక్షితముగా మనుదురు

11. నేను మీకు తోడుగా నుండి కింతును. మిమ్ము చెల్లాచెదరు చేసిన దేశములను పాడు చేయుదును. కాని నేను మిమ్ము సమూలముగా నాశనము చేయను. మిమ్ము అసలు దండింపకుండ వదలివేయను కాని తగుమాత్రముగా శిక్షింతును.

12. ప్రభువిట్లు చెప్పుచున్నాడు: మీ వ్రణములు మానవు. మీ గాయములు నయముకావు.

13. మిమ్మెవరును పరామర్శింపరు. మీ పుండ్లు నయముకావు. మీకు చికిత్స లేదు.

14. మీ వలపుకాండ్రు మిమ్ము విస్మరించిరి. వారు మిమ్ము పట్టించుకొనరు. మీరు పెక్కుపాపములుచేసి ఘోరమైన దుష్టవర్తనమునకు పాల్పడితిరి. కనుక నేను మిమ్ము శత్రువుమోదినట్లుగా మోదితిని. కఠినముగా దండించితిని.

15. మీరు మీ గాయములనుగూర్చి ఫిర్యాదు చేయవలదు, అవి నయముకావు. మీరిన్ని పాపములుచేసి, ఇంతటి దుష్టవర్తనమునకు పాల్పడితిరి కనుక నేను మిమ్మట్లు శిక్షించితిని.

16. కాని ఇప్పుడు మిమ్ము మ్రింగువారిని నేను మ్రింగుదును. మీ శత్రువులను నేను బందీలను చేయుదును. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. మిమ్ము దోచుకొనువారిని నేను దోచుకొందును.

17. మీ శత్రువులు సియోనును వెలివేసి దానినిక ఎవరును ఆదరింపరని పలికినను నేను మీకు ఆరోగ్యము దయచేసి, మీ గాయములను మాన్పుదును.

18. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను యిస్రాయేలీయులను చెరనుండి విడిపింతును వారి కుటుంబములన్నిటికిని దయచూపుదును యెరూషలేమును పునర్నిర్మింతురు. దాని ప్రాసాదమును దాని చోటనే తిరిగి కట్టుదురు.

19. అచట వసించు ప్రజలు నా స్తుతులను పాడుదురు, సంతసముతో కేకలు వేయుదురు. నేను వారి సంఖ్యను తగ్గనీయను, పెంచుదును. వారికి అపకీర్తికాక కీర్తి కలుగునట్లు చేయుదును.

20. వారికి మరల పూర్వవైభవము దయచేయుదును. వారిని స్థిరముగా పాదుకొల్పుదును. వారిని పీడించువారిని శిక్షింతును.

21. వారి పాలకుడు వారి జాతినుండియే ఉద్భవించును. వారి రాజు వారి ప్రజలనుండియే పుట్టును. అతడు నేను ఆహ్వానించినపుడు కలు నా చెంతకు వచ్చును. నేను పిలువకుండనే నా దగ్గరకు వచ్చుటకెవడు సాహసించును?

22. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు”

23. ప్రభువు కోపము తుఫాను వంటిది. అది దుర్మార్గులపై ప్రభంజనమువలె దిగును.

24. ప్రభువు తన సంకల్పమును నెరవేర్చుకొనువరకు ఆయన ఆగ్రహము చల్లారదు. మన రానున్న కాలమున ఆయన ప్రజలు ఈ సంగతిని బాగుగా అర్థము చేసికొందురు.

Text Example

1. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను యిస్రాయేలు తెగలన్నింటికి దేవుడను. కాగా వారు నాకు ప్రజలగు రోజులు వచ్చుచున్నవి.

2. “మృత్యువును తప్పించుకొన్నవారికి ఎడారిలో నేను కరుణ చూపితిని. యిస్రాయేలీయులు విశ్రాంతిని కోరగా

3. నేను దూరమునుండి వారికి దర్శనమిచ్చితిని. యిస్రాయేలీయులారా! శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని. ఇప్పుడు కూడ మిమ్ము నిత్యప్రేమతో ప్రేమింతును.

4. నేను మిమ్ము పునర్నిర్మింతును. మీరు మరల తంత్రీవాద్యములు గైకొని, సంతసముతో నాట్యము చేయుదురు.

5. మీరు తిరిగి సమరియా కొండలమీద ద్రాక్షతోటలు నాటుదురు. నాటి ఆ తోటలు కాయుఫలములను ఆరగింతురు

6. ఎఫ్రాయీము కొండలమీదినుండి కావలివారు 'లెండు, సియోనునవున్న మన దేవుడైన ప్రభువు చెంతకు పోవుదము రండు' అని అరచు రోజులు నిర్ణయమయ్యెను.”

7. ప్రభువు ఇట్లనుచున్నాడు: “మీరు జాతులన్నిటిలోను తలమానికమైన యిస్రాయేలును తలంచుకొని సంతసముతో పాడుడు. “ప్రభువు తన ప్రజలను రక్షించెను, శేషజనమును విమోచించెను' అని పలుకుచు స్తుతి గానముచేయుడు.

8. ఉత్తరదేశమునుండి నేను వారిని తోడ్కొనివత్తును. నేల అంచులనుండి వారిని కొనివత్తును. గ్రుడ్డివారును, కుంటివారును, గర్భవతులును, ప్రసవించుటకు సిద్ధముగానున్నవారును ఎల్లరును కలిసి మహాసమూహముగా తిరిగివత్తురు

9. నేను వారిని నడిపించుకొనిరాగా వారు ఏడ్పులతోను, ప్రార్థనలతోను తిరిగివత్తురు. నేను ఆ ప్రజలను తిన్నని మార్గమున నడిపింతును. వారు కాలుజారి పడిపోరు. వారిని జలప్రవాహముల వద్దకు కొనివత్తును. నేను యిస్రాయేలునకు తండ్రిని అగుదును. ఎఫ్రాయీము నాకు తొలిచూలు బిడ్డడగును.

10. ప్రభువిట్లు నుడువు చున్నాడు: “అన్యజాతి ప్రజలారా! మీరు నా పలుకులు ఆలింపుడు. దూరప్రాంతముల వారికి నా పలుకులు ఇట్లు వినిపింపుడు. 'నేను యిస్రాయేలును చెల్లాచెదరు చేసితిని. కాని వారిని మరల ప్రోగుచేయుదును. కాపరి మందనువలె వారిని కాచి కాపాడుదును.'

11. నేను యిస్రాయేలునకు దాస్యవిముక్తి కలిగించితిని. వారికంటె బలాఢ్యులైన వారినుండి వారిని విడిపించితిని.

12. వారు తిరిగివచ్చి సియోను కొండమీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యమునుగాంచి సంతసింతురు. నేను వారికి ధాన్యమును, ఓలివుతైలమును, గొఱ్ఱెలమందలను, గొడ్లమందలను బహూకరింతును. వారిక విచారమునకు గురికాక నీరు కట్టిన తోటవలె కళకళలాడుదురు.

13. అపుడు యువతులు ఆనందముతో నాట్యము చేయుదురు. వృద్దులును, యువకులును సంతసింతురు. నేను వారి శోకమును నాట్యముగామార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపమునకు బదులుగా ప్రమోదమును ఒసగుదును.

14. నేను నా యాజకులకు ప్రశస్తభోజనము పెట్టుదును. నా ప్రజలకు మేలివస్తువులు అనుగ్రహింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు"

15. ప్రభువు ఇట్లనుచున్నాడు: రామానుండి అంగలార్పులు విన్పించుచున్నవి. దారుణమైన శోకాలాపములు చెవిని బడుచున్నవి. రాహేలు తన బిడ్డలకొరకై విలపించుచు ఓదార్పును పొందజాలకున్నది.

16. ప్రభువిట్లనుచున్నాడు: నీ ఏడ్పును ఆపుకొనుము. నీ కన్నీటిని తుడుచుకొనుము. నీ బిడ్డలకు నీవు చేసిన సేవకు ఫలితము దక్కును. వారు శత్రుదేశమునుండి మరలివత్తురు.

17. నీ సంతతికి మంచిరోజులు వచ్చును. నీ బిడ్డలు స్వీయదేశమునకు తిరిగివత్తురు.

18. 'ప్రభూ! నీవు కాడికిలొంగని కోడెను శిక్షించినట్లుగా నన్ను శిక్షించితివి. నీవు నా మనసును మరలింపుము. నా దేవుడవైన నీ చెంతకు నేను తిరిగివత్తును' అని ఎఫ్రాయీము పరితపించుచుండగా నేను వింటిని.

19. నేను నీ నుండి వైదొలగితిని. కాని ఇప్పుడు నీ చెంతకు రాగోరెదను. నీవు నన్ను శిక్షించినపిదప నేను దుఃఖముతో రొమ్ము బాదుకొనుచున్నాను. నేను యవ్వనమున చేసిన పాపములకుగాను సిగ్గుతో తలవంచుకొనుచున్నాను.

20. ఎఫ్రాయీము! నీవు నాకు ఇష్టుడవైన పుత్రుడవు. నాకు ప్రీతిపాత్రుడవు. నేను నీ గూర్చి మాట్లాడునపుడెల్ల నీ జ్ఞాపకము నన్ను విడువకున్నది. నీ గూర్చి నా కడుపులో చాల వేదనగానున్నది. నేను నీమీద తప్పక కరుణ చూపెదను. ఇది ప్రభువు వాక్కు.

21. మార్గనిర్దేశక రాళ్ళను నెలకొల్పుడు. సంజ్ఞా స్తంభములను పాతుడు. నీవు వెళ్ళిపోయిన త్రోవను గుర్తింపుము. యిస్రాయేలు కన్యా! నీవు మరలిరమ్ము. ఈ నీ నగరములకు మరలిరమ్ము.

22. విశ్వాసహీనులైన ప్రజలారా! మీరెన్నాళ్ళు సందేహింతురు? నేను భూమిపై నూతనమైన కార్యమును సృజించితిని: 'స్త్రీ' పురుషుని ఆవరించును. ”

23. సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “నేను ప్రజలను చెరవిడిపించి, వారి దేశమునకు గొనివచ్చిన పిదప వారు యూదా దేశమునను, దాని నగరములలోను రక్షణపర్వతమా! పవిత్రనగరమా! ప్రభువు నిన్ను దీవించునుగాక!' అని పలుకుదురు.

24. ప్రజలు యూదా దేశమునను, దాని నగరములలోను వసింతురు. రైతులును, మందలతోగూడిన కాపరులును కలిసి జీవింతురు.

25. నేను అలసిపోయిన వారికి ఓదార్పు నొసగుదును. ఆకలివలన కృశించిన వారిని ఆహారముతో సంతృప్తిపరతును.”

26. కనుక జనులు: 'మేము మేలుకొని ఆలోచింపగా నిద్ర బహు వినోదమాయెను' అని పలుకుదురు.

27. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను యిస్రా యేలు, యూదా దేశములను మరల ప్రజలతోను, పశువులతోను నింపుకాలము వచ్చుచున్నది.

28. నేను పూర్వము వారిని దీక్షతో పెల్లగించితిని, పడగొట్టితిని, నేలమట్టము చేసితిని, నాశనము చేసితిని, కూలద్రోసి తిని. ఆ రీతినే ఇపుడు వారిని దీక్షతో నాటుదును, నిర్మింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

29. ఆ కాలము వచ్చినపుడు ప్రజలు: 'తండ్రులు పుల్లని ద్రాక్షపండ్లు భుజింపగా, తనయులకు పండ్లు పులుపెక్కెను' అని అనరు.

30. ఎవడు పుల్లని ద్రాక్షపండ్లు భుజించునో వానికే పండ్లు పులుపెక్కును. ఎవని పాపమునకు వాడే చచ్చును.

31. ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను యిస్రాయేలు ప్రజలతోను, యూదా ప్రజలతోను నూత్న నిబంధనము చేసికొను రోజులు వచ్చుచున్నవి.

32. కాని అది పూర్వము నేను పితరులను చేతితో బట్టుకొని ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసికొనిన నిబంధనము వంటిదికాదు. నేను వారికి ప్రభుడనైనను, వారు నా నిబంధనమును మీరిరి.

33. ఆ దినము వచ్చినపుడు నేను యిస్రాయేలు ప్రజలతో చేసికొను నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగముననుంతును. వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు.

34. వారిలో ఎవడును తన పొరుగువానికి 'దేవుని తెలిసికొనుటనుగూర్చి బోధింపనక్కరలేదు. అల్పులు, అధికులెల్లరు నన్ను తెలిసికొందురు. నేను వారి పాపములను మన్నింతును. వానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను. ఇవి ప్రభుడనైన నా పలుకులు.”

35. పగలు వెలుతురునిచ్చుటకు సూర్యుని, రేయి వెలుగునిచ్చుటకు చంద్రతారకలను నియమించినవాడును, సముద్రతరంగములను రేపి వానిచే ఘోషణ చేయించువాడును, సైన్యములకు అధిపతియని పిలువబడువాడును అయిన ప్రభువిట్లు చెప్పుచున్నాడు:

36. “నియమబద్దమైన ఈ జగత్తు నా యెదుటనుండి తొలగిపోయెనేని, యిస్రాయేలు సంతతికూడ నా యెదుట ఒక జాతిగా శాశ్వతముగా మనకపోవును. ఇదే యావే వాక్కు

37. పైనున్న ఆకాశామును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను శోధించుటయు, ఎవనికైన శక్యమైనయెడల యిస్రాయేలు చేసిన అంతటినిబట్టి నేను వారినందరిని తోసివేతును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

38. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “హనన్యేలు నుండి బురుజు మూలద్వారమువరకును, యెరూషలేము నా నగరముగా నిర్మింపబడు రోజులు వచ్చుచున్నవి.

39. దాని సరిహద్దు అచటినుండి గారేబు కొండ వరకును, అచటినుండి గోయావరకును పోవును.

40. మృతులను పాతి పెట్టి చెత్తచెదారము కుమ్మరించు లోయయంతయు నా పేరిట పవిత్రస్థలమగును. అట్లే కెద్రోనునది మీదిభాగమునను, తూర్పున అశ్వ ద్వారము వరకును వ్వాపించియున్న పొలములు కూడ నా పేరిట పవిత్రస్థలమగును. ఈ పట్టణమునిక ఎవరును పడగొట్టరు. నాశనము చేయరు.”

Text Example

1. సిద్కియా యూదాకు రాజుగానున్న కాలము పదియవయేటను, నెబుకద్నెసరు పరిపాలనాకాలము పదునెన్మిదియవయేటను ప్రభువు నాకు తన వాక్కును వినిపించెను.

2. అపుడు బబులోనియారాజు సైన్యము యెరూషలేమును ముట్టడించుచుండెను. నన్ను రాజభవన ఆవరణమునందలి చెరలో బంధించి యుంచిరి.

3. సిద్కియారాజు నన్నచట బంధించెను. నేనీ క్రింది ప్రవచనము చెప్పినందున అతడు నామీద తప్పుపట్టెను. 'ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను బబులోనియా రాజు ఈ నగరమును స్వాధీనము చేసి కొనునట్లు చేయుదును.

4. సిద్కియారాజు తప్పించు కోజాలడు. అతనిని బబులోనియారాజునకు అప్ప గింతురు. అతడా రాజును ముఖాముఖి చూచి అతనితో మాట్లాడును.

5. సిద్కియాను బబులోనియాకు గొని పోవుదురు. నేను జోక్యము చేసికొనువరకును అతడచటనేయుండును. అతడిపుడు బబులోనియా ప్రజల నెదిరించినను విజయము బడయ జాలడు.' ఇది ప్రభుడనైన నా వాక్కు .

6. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను.

7. “నీ పినతండ్రియైన షల్లూము కుమారుడగు హనమేలు నీ చెంతకువచ్చును. అతడు అనాతోతు గ్రామముననున్న తన పొలమును కొనుమని నిన్ను అడుగును. నీవు దగ్గరి చుట్టమువు కనుక దానిని కొనుటకు నీకు హక్కుకలదు అని చెప్పును.

8. ప్రభువు చెప్పినట్లే హనమేలు చెరలోనున్న నా చెంతకు వచ్చి 'బెన్యామీను మండలమునందలి అనాతోతు గ్రామములోని నా పొలమును నీవు కొనుము. నీవు నాకు దగ్గరి చుట్టము, కనుక దానిని కొని భుక్తము చేసికొను హక్కు నీకు కలదు అనెను.' " ఇది ప్రభువు సందేశమేయని నేను గ్రహించితిని.

9. “కనుక నేను అనాతోతునకు చెందిన హనమేలునుండి ఆ పొలము కొని అతనికి సొమ్ము తూచి ఇచ్చితిని. దాని ఖరీదు పదునేడు తులముల వెండి.

10. నేను క్రయపత్రము మీద సంతకముచేసి ముద్రవేసి సాక్షులచే సంతకము చేయించితిని. వెండిని తూచిఇచ్చితిని.

11. అంతట మడచి ముద్రవేసిన క్రయపత్రమును, వట్టినే మడచి యుంచిన క్రయపత్రమును తీసికొని వానిని,

12. బారూకునకు అప్పగించితిని. అతడు మహసేయా మనుమడు, నేరియా కుమారుడు. నా సోదరుడగు హనమేలును, క్రయపత్రము మీద సంతకము చేసిన సాక్షులును, చెరసాల చెంతకూర్చుండి యున్న యూదా ప్రజలును ఈ చర్యను గమనించుచునే యుండిరి.

13. వారందరును వినుచుండగా నేను బారూకుతో ఇట్లంటిని.

14. 'సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: నీవీ క్రయపత్రములను మడచి ముద్రవేసిన దానిని, వట్టినే మడచియుంచిన దానిని తీసికొని మట్టికుండలో దాచి పెట్టుము. అట్లయిన అవి చాలకాలము వరకు భద్ర ముగా నుండును.

15. ఈ దేశమున ప్రజలు మరల ఇండ్లను, పొలములను, ద్రాక్షతోటలను కొందురనిసైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.' "

16. క్రయపత్రమును నేరియా కుమారుడైన బారూకునకు ఒప్పగించిన పిదప నేనిట్లు ప్రార్థించితిని.

17. "ప్రభువైన దేవా! స్వీయబలముతోను, చాచిన నీ బాహువుతోను నీవు భూమ్యాకాశములను చేసితివి. నీకు అసాధ్యమైనదేదియు లేదు.

18. నీవు వేలకొలది ప్రజలకు దయజూపుదువు. తండ్రుల పాపములకు వారి తరువాత వారి తనయులను గూడ దండింతువు. నీవు మహాఘనుడవు. మహాశూరుడవు. సైన్యములకధిపతియైన ప్రభుడవని నీకు పేరు.

19. నీవు ఉచితమైన నిర్ణయములను, మహాకార్యములను చేయుదువు. నరులు చేయు కార్యములనెల్ల గమనింతువు. ఎవరెవరి కార్యములకు దగినట్లుగా వారికి ప్రతిఫలమిత్తువు.

20. నీవు ఐగుప్తున మహాకార్యములను, అద్భుతములను చేసితివి. యిస్రాయేలీయుల నడుమను, అన్యజాతుల నడుమను, నేటికిని ఆ కార్యములు చేయుచునేయున్నావు. కనుక నేడు నీకు ఎల్లయెడల కీర్తి కలిగినది.

21. నీవు అద్భుతకార్యములతోను, సూచకక్రియలతోను శత్రువులకు భీతి పుట్టించి, బలముతో బాహువు చాపి నీ ప్రజలైన యిస్రాయేలును ఐగుప్తునుండి తోడ్కొని వచ్చితివి.

22. తరువాత నీవు వారి పితరులకు వాగ్దానము చేసినట్లే ఈ పాలు తేనెలు , జాలువారు నేలను వారికిచ్చితివి.

23. కాని ఆ దేశమున ప్రవేశించి దానిని స్వాధీనము చేసికొనిన పిదప వారు నీ ఆజ్ఞలు పాటింపరైరి. నీ ధర్మశాస్త్రమును అనుసరింపరైరి. నీవు ఆజ్ఞాపించిన కార్యము ఒక్కటియు చేయరైరి. కావున నీవు వారికి వినాశములెల్ల తెచ్చిపెట్టితివి.

24. అదిగో! బబులోనీయులు నగరము చుట్టును ముట్టడిదిబ్బలుపోసి దానిని పట్టుకోజూచుచున్నారు. పోరు, కరువు, అంటురోగములవలన నగరము వారికి చిక్కును. నీవు చెప్పినదెల్ల జరిగినది. ఈ నీవే దీనిని చూడవచ్చును.

25. కాని ప్రభువైన దేవా! 'ఈ పట్టణము బబులోనీయుల వశమగుచున్నను, సాక్షులయెదుట పొలమును గొనుము' అని నీవు నన్ను ఆజ్ఞాపించితివి.”

26. అపుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను;

27. “నేను సకల జనులకును దేవుడనైన ప్రభుడను. నాకు అసాధ్యమైనదేమైనా కలదా?

28. నేనీ నగరమును బబులోనియా రాజునకును, అతని సైన్యములకును అప్పగించితిని. వారు దానిని పట్టుకొందురు.

29. ఈ నగరముమీద దాడిచేయువారు దానిలో ప్రవేశించి, దానిని కాల్చివేయుదురు. ఏ ఇండ్ల మిద్దెలమీద బాలు దేవతకు సాంబ్రాణి పొగవేసి, పరదైవములకు ద్రాక్షసారాయార్పణము కావించి నా కోపమును రెచ్చగొట్టిరో, ఆ ఇండ్లనెల్ల తగులబెట్టుదురు.

30. యూదాజనులును,యిస్రాయేలు జనులును మొదటినుండియు నాకు అప్రియమైన కార్యములనే చేసిరి. తమ చెయిదములతో నా కోపమును రెచ్చగొట్టిరి.

31. ఈ నగరమును నిర్మించినప్పటి నుండియు నేటి వరకును దీని పౌరులు నాకు కోపమును, ఆగ్రహమును కలిగించుచునే యున్నారు. కనుక నేను దీనిని నా ఎదుటినుండి తుడిచివేయుదును.

32. యూదా యెరూషలేము ప్రజలును వారి రాజులును, అధిపతులును, యాజకులును, ప్రవక్తలును చేసిన దుష్కార్యములకుగాను నేనిట్లుచేయనెంచితిని.

33. వారు తమ మొగము నావైపు త్రిప్పరైరి. నేను వారికి నిరంతరము బోధించుచుండినను, వారు నా ఉపదేశ మును ఆలింపలేదు, నేర్చుకొనలేదు.

34. వారు నా పేరు పెట్టబడిన దేవళమున తమ హేయమైన విగ్రహములు నెలకొల్పి దానిని అమంగళము చేసిరి.

35. హిన్నోము లోయలో బాలుదేవతకు బలిపీఠములు నిర్మించిరి. తమ కుమారులను, కుమార్తెలను దహించి మోలెకు దేవతకు బలి అర్పించిరి. నేను వారిని ఈ కార్యముచేయ ఆజ్ఞాపింపలేదు. వారట్టి హేయమైన కార్యముచేసి యూదా ప్రజలచే పాపము చేయింతు రని నేను ఊహింపనైనలేదు.

36. యిస్రాయేలు దేవుడైన ప్రభువు నాతో ఇట్లనెను: “ 'యుద్ధము, కరువు, అంటురోగముల వలన ఈ నగరము బబులోనియా రాజునకు వశమగును' అని ప్రజలు చెప్పుకొనుచున్నారు. కాని ఈ నగరమును గూర్చి నేను చెప్పు సంగతులివి:

37. నేను కోపముతోను, ఆగ్రహముతోను యిస్రాయేలు ప్రజలను చెల్లాచెదరు చేసిన దేశమునుండి వారిని మరల తోడ్కొనివత్తును. నేను వారిని ఈ తావునకు గొని వత్తును. వారిచట సురక్షితముగా జీవింతురు.

38. అపుడు వారు నా ప్రజలగుదురు. నేను వారికి దేవుడనగుదును.

39. నేను వారికి ఏక హృదయమును, ఏకమార్గమును దయచేయుదును. ఫలితముగా వారు నన్ను సదా గౌరవింతురు. దానివలన వారికిని, వారి సంతతికిని మేలు కలుగును.

40. నేను వారితో శాశ్వతమైన నిబంధనము చేసికొందును. వారికి ఉప కారము చేయుటమానను. ఆ ప్రజలు పూర్ణ హృదయముతో నన్ను గౌరవించునట్లును, నానుండి వైదొలగ కుండునట్లును చేయుదును.

41. వారికి ఉపకారము చేయుటయే నా సంతోషముగా భావింతును. ఈ దేశమునందు వారిని నా పూర్ణహృదయముతో, నా పూర్ణాత్మతో నిశ్చయముగా నాటుదును.

42. నేను ఈ ప్రజలకు ఈ వినాశము కలిగించినట్లే వారికి ప్రమాణము చేసిన ఉపకారములను గూడ నెరవేరును.

43. ఈ దేశము నరులుగాని, పశువులు గాని వసింపని ఎడారివలె అగుననియు, ఇది బబులోనియా వశము అగుననియు ప్రజలు చెప్పు కొనుచున్నారు. కాని ఈ దేశమున మరల పొలములు విక్రయింపబడును.

44. ప్రజలు ద్రవ్యమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయుదురు, ముద్రలు వేయుదురు, సాక్షులచే సంతకములు చేయింతురు. బెన్యామీను మండలమునను, యెరూషలేము చుట్టు పట్లగల ప్రాంతములలోను, యూదానగరములలోను, పర్వతసీమలోని నగరములలోను, కొండపాదులలోను, యూదా దక్షిణ ప్రాంతమునను ఈ కార్యము జరుగును. నేను ప్రజలను వారి దేశమునకు గొనివత్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు”

Text Example

1. నేనింకను ప్రాసాదావరణమునందలి చెరయందే యుండగా, ప్రభువు మరల నాకు తన వాక్కునిట్లు వినిపించెను.

2. “భూమిని సృజించిన వాడు, దానిని రూపొందించి స్థిరముగా నెలకొల్పిన వాడు, ప్రభువు అను నామమున నొప్పువాడు ఇట్లు అనుచున్నాడు:

3. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును. నీ వెరుగని మహాసత్యములను, అద్భుత విషయములను నీకు తెలియచేయుదును.

4. కొందరు కల్దీయులతో పోరాడుదురు. కాని శత్రువులు గృహములను శవములతో నింపుదురు. ఆ చచ్చిన వారు నేను ఆగ్రహముతో సంహరించినవారే. ఈ నగరవాసులు చేసిన దుష్కార్యములకుగాను నేను ఈ పట్టణము నుండి నా మొగమును ప్రక్కకు త్రిప్పు కొంటిని.

5. ముట్టడిదిబ్బలచేతను మరియు ఖడ్గముల చేతను యెరూషలేములో నేలమట్టము కావించబడిన గృహములను, రాజనగరులను గురించి యిస్రాయేలు దేవుడను, ప్రభుడనైన నేను చెప్పునదేమనగా,

6. నేను ఈ నగరమునకును దాని పౌరులకును మరల స్వస్థత చేకూర్చుదును. వారికి ఆరోగ్యమును, శాంతిభద్రతలను సమృద్ధిగా దయచేయుదును.

7. యూదా, యెరూషలేములకు అభ్యుదయము దయచేసి వారిని పూర్వస్థాయికి గొనివత్తును.

8. వారు నాకు ద్రోహముగా చేసిన పాపములనుండి వారిని శుద్ధి చేయుదును. వారు నామీద తిరుగుబాటు చేసినందున కట్టుకొనిన అపరాధములనెల్ల మన్నింతును.

9. యోరూషలేము నాకు ఆనందమును, గౌరవమును, మహిమను కలిగించును. నేను యెరూషలేమునకు చేసిన ఉపకారములను, దానికి దయచేసిన అభ్యుదయములను గూర్చి విని లోకములోని జాతులెల్ల వెరగొంది గడగడవణకును.

10. ప్రభువు ఇట్లనుచున్నాడు: “ఈ తావు నరులుకాని, జంతువులుకాని వసింపని ఎడారివలె నైనది' అని ప్రజలు చెప్పుకొనుచున్నారు. నిజమే. యూదానగరములును, యెరూషలేము వీధులును శూన్యముగానున్నవి. నరులుగాని, జంతువులుగాని అచట వసించుటలేదు. కాని ఈ తావులలో మీరు మరల

11. ఆనంద నాదములను విందురు. వివాహోత్సవములలో వధూవరులు చేయు సంతోష ధ్వానములను ఆలింతురు. అపుడు కృతజ్ఞతాబలులు అర్పించుటకు దేవాలయమునకు వచ్చువారు ఈ క్రింది పాటపాడుటను మీరు విందురు: 'సైన్యములకు అధిపతియైన ప్రభువును కృతజ్ఞతతో స్తుతింపుడు. ఆయన మంచివాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది.' నేను ఈ దేశమునకు అభ్యుదయమునొసగి, దానిని పూర్వపు ఔన్నత్యమునకు గొనివత్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు,

12. సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు. నరులుగాని, పశువులుగాని వసింపక ఎడారివలెనున్న ఈ దేశమునను, దీని నగరముల లోను మరల గడ్డిమైదానములు ఏర్పడును. కాపరులు వీనిలోనికి మందలను తోడ్కొనివత్తురు.

13. పర్వత సీమలు, షెఫేల, నేగేబు ప్రాంత నగరములలోని కొండపాదులలోను, బెన్యామీను మండలమునను యెరూషలేము చుట్టుపట్లగల నగరములలోను కాప రులు మరల తమ గొఱ్ఱెలను లెక్కపెట్టుకొందురు.

14. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను యిస్రాయేలు, యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొను రోజులు వచ్చుచున్నవి.

15. ఆ రోజులలో ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకనిని నేను రాజుగా' ఎన్నుకొందును. అతడు దేశమందంతటను నీతిని, ధర్మమును పాటించును. "

16. ఆ కాలమున యూదా రక్షణమును బడయును. యెరూషలేము భద్రముగా నుండును. “ప్రభువు మనకు రక్షణము” అని ఆ నగరమునకు పేరిడుదురు.

17. ప్రభువు ఇట్లనుచున్నాడు: దావీదు వంశజుడొకడు యిస్రాయేలును సదా పరిపాలించును.

18. నాకు సేవలుచేయుటకును, దహనబలిని, ధాన్యబలిని, సమాధానబలిని అర్పించుటకును లేవీ తెగనుండి యాజకులు సదా లభింతురు.”

19. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

20. “నేను రేయింబవళ్ళకు నిబంధనము చేసితిని. అవి నిరంతరము తమ కాలమున తాము వచ్చుచుండును. ఆ నిబంధనమును మీరు భంగము చేయగలిగిన యెడల

21. నేను నా సేవకుడైన దావీదుతో అతని కుమారుడు ఒకడు సదా రాజ్యము చేయునను నిబంధనము కూడ భంగమగును. లేవీ వంశజులైన యాజకులతో నేను చేసిన నిబంధనమును భంగమగును.

22. నేను నా సేవకుడైన దావీదు వంశజులను, నాకు ఊడిగముచేయు లేవీయులను విస్తరింపజేయుదును. ఆకాశములోని చుక్కలను, కడలి ఒడ్డునందలి ఇసుక రేణువులను లెక్కింప సాధ్యము కానట్లే, వారిని కూడ లెక్కింపసాధ్యముకాదు.”

23. ప్రభువు నాకు తన వాక్కునిట్లు విన్పించెను:

24. “నేనెన్నుకొనిన రెండు కుటుంబములను యిస్రాయేలు, యూదా ప్రజలను నేను విసర్జించితిని అని ప్రజలు చెప్పుకొనుచున్నారు. ఈ సంగతి నీవు గమనింపలేదా? కనుక ఆ ప్రజలు నా జనులను చిన్న చూపు చూచుచున్నారు. వారినొకజాతిగా గుర్తించుట లేదు.

25. నేను రేయింబవళ్ళతో నిబంధనము చేసికొంటిని. భూమ్యాకాశములకు నియమము చేసి తిని.

26. నేను ఈ కార్యములను చేసినట్లే యాకోబు సంతతితోను, నా సేవకుడైన దావీదుతోను నేను చేసిన నిబంధనను నిలబెట్టుకొందును. అబ్రహాము, ఈసాకు, యాకోబు వంశజులను పాలించుటకు దావీదు కుమా రుని ఒకనిని ఎన్నుకొందును. నేను నా ప్రజలకు చెర విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపెదను.”

Text Example

1. బబులోనియా రాజగు నెబుకద్నెసరు, అతని సైన్యము, అతని ఏలుబడిలోనున్న రాజ్యములు, జాతులు, యెరూషలేమును, దాని చుట్టుపట్లనున్న నగరములను ముట్టడించుచున్నకాలమున, ప్రభువు నుండి యిర్మీయాకు వచ్చినవాక్కు.

2. యిస్రాయేలు దేవుడైన ప్రభువు నన్ను యూదారాజగు సిద్కియా యొద్దకు వెళ్ళి అతనితో ఇట్లు చెప్పుమనెను: “ప్రభువు పలుకిది. నేనీ నగరమును బబులోనియా రాజునకు ఒప్పగింతును. అతడు దీనిని కాల్చివేయును.

3. నీవును తప్పించుకోజాలవు. విరోధులు నిన్ను పట్టుకొని ఆ రాజునకు ఒప్పగింతురు. నీవతనిని ముఖాముఖి దర్శించి మాట్లాడుదువు. నిన్ను బబులోనియాకు బందీనిగా గొనిపోవుదురు.'

4. సిద్కియా! నేను నిన్ను గూర్చి చెప్పు పలుకులాలింపుము: 'నీవు పోరున చనిపోవు.

5. ప్రశాంతముగనే కన్ను మూయుదువు. ప్రజలు నీకు పూర్వము ఏలిన రాజులను పాతి పెట్టినపుడు సాంబ్రాణి పొగవేసిరి. వారు నీకును అట్లే చేయుదురు. నీవు చనిపోయినపుడు ప్రజలు "అయ్యో! ప్రభూ!" అనుచు శోకింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు'

6. నేనీ పలుకులెల్ల యెరూషలేమున సిద్కియా రాజునకు విన్నవించితిని.

7. అపుడు బబులోనియా రాజు సైన్యము ఆ నగరమును ముట్టడించుచుండెను. ఆ దండు అదే సమయమున లాకీషు, అసేకా పట్టణములను కూడ ముట్టడించుచుండెను. యూదాలో మిగిలియున్న సురక్షితపట్టణములు అవి రెండే.

8. సిద్కియా రాజును, యెరూషలేము ప్రజలును కలిసి బానిసలకు విముక్తి దయచేయవలయునని ఒప్పందము చేసికొనిరి.

9. ఎల్లరును హీబ్రూజాతి వారైన తమ ఆడ, మగబానిసలకు విముక్తినిచ్చుటకును, సజాతీయులను ఎవరిని బానిసలను చేయకుండుటకును నిర్ణయించుకొనిరి.

10. ఆ నిర్ణయము చొప్పున ప్రజలును, వారి నాయకులును తమ బానిసలకు విడుదలనిచ్చుటకు అంగీకరించిరి. వారిచే మరల దాస్యము చేయించుకోరాదని నిశ్చయించుకొనిరి. కనుక వారిని వెళ్ళిపోనిచ్చిరి.

11. కాని ఆ ప్రజలు కొంతకాలము తరువాత తమ మనసు మార్చుకొనిరి. తమ దాసదాసీ జనమును నిర్బంధముచేసి మరల బందీలను గావించిరి.

12. అప్పుడు ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

13. “యిస్రాయేలు దేవుడైన ప్రభువు ప్రజలతో ఇట్లు చెప్పుచున్నాడు. నేను మీ పితరులను బానిసల కొంపయైన ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినపుడు వారితో నిబంధనము చేసికొంటిని. నేను వారితో ఇట్లంటిని.

14. 'ఏడేండ్లు కడచిన తరువాత మీరు సజాతీయులైన మీ హీబ్రూ బానిసలను వెళ్ళిపోనీయవలెను. ఆరేండ్లు ఊడిగము చేసినపిదప వారికి విముక్తి ఒసగవలెను.' కాని మీ పితరులు నన్ను లక్ష్యము చేయలేదు, నా మాటలు వినలేదు.

15. నేడు మీరు మీ మనసు మార్చుకొని నాకు ప్రీతి కలిగించు కార్యము చేసితిరి. మీరు మీ సోదరులకు స్వేచ్చను ఒసగుదుమని ప్రకటించితిరి. నా పేర వెలసిన ఈ మందిరమున, నా యెదుట మీరు ఒప్పందము చేసికొంటిరి.

16. కాని యింతలోనే మీరు మరల మనసు మార్చుకొని నాకు అవమానము కలిగించితిరి. మీరు విడుదల దయచేసి స్వేచ్ఛగా వెళ్ళిపోనిచ్చిన దాసదాసీజనమును మరల బంధించితిరి. వారిని నిర్బంధముగా బానిసలను చేసితిరి.

17. కనుక ఇపుడు ప్రభుడనైన నేను చెప్పునదే మనగా: మీరు నా ఆజ్ఞమీరితిరి. మీ సోదరులకు స్వేచ్ఛనీయరైతిరి. కావున నేనే మీకు స్వేచ్చనిత్తును. అది పోరు, కరువు, అంటురోగములవాతబడి మీరు చచ్చు స్వేచ్ఛయే. లోకములోని జాతులెల్ల మిమ్ము అసహ్యించుకొనును.

18-19. యూదా యెరూషలేము అధిపతులును, ప్రాసాదాధిపతులును, యాజకులును, నాయకులును తాము రెండుభాగములుగా విభజించిన కోడెదూడ మాంసఖండముల మధ్యన నడచి నాతో నిబంధనము చేసికొనిరి. కాని వారు నా యెదుట చేసికొనిన నిబంధనమును మీరిరి. దాని నియమములు పాటింపరైరి. కావున తాము రెండు ఖండములుగా కోసి వాని మధ్య నడచిన కోడెదూడకు ఏ గతి పట్టెనో ఆ గతినే వారికిని పట్టింతును.

20. నేను వారిని తమను చంపజూచు శత్రువుల చేతికి అప్పగింతును. పక్షులును, వన్యమృగములను వారి శవములను తినివేయును.

21. నేను యూదారాజు సిద్కియాను, అతడి అధికారులనుగూడ తమను చంప జూచు శత్రువుల చేతికప్పగింతును. ఇప్పుడు ముట్టడి నాపివేసి, మీ యొద్దనుండి వెళ్ళిపోయిన బబులోనియా రాజు సైన్యమునకు వారినప్పగింతును.

22. నేను వారికి ఆజ్ఞనీయగా, వారు మరల ఈ నగరము మీదికి వతురు. దీనిని ముట్టడించి వశముచేసికొని కాల్చివేయుదురు. నేను యూదా నగరములను నరసంచారములేని ఎడారులుగా మారును. ఇది ప్రభుడనైన నా వాక్కు ”

Text Example

1. యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము పరిపాలనాకాలమున ప్రభువు నాకు తన వాక్కును వినిపించి,

2. “నీవు రేకాబీయుల తెగవద్దకు వెళ్ళి వారితో సంభాషింపుము. వారిని దేవాలయపు గదిలోనికి తీసికొనివచ్చి త్రాగుటకు ద్రాక్షారసమునిమ్ము” అని చెప్పెను.

3. నేను రేకాబీయుల తెగనంతటిని అనగా హబజ్జిన్యా మనుమడును యిర్మీయా కుమారుడునైన యజన్యాను, అతని కుమారులను, సోదరులను దేవాలయములోనికి తీసికొనిపోయితిని.

4. ఇగ్ధల్యా కుమారుడును ప్రవక్తయునగు హానాను శిష్యులు వసించుగదిలోనికి వారిని తోడ్కొనిపోతిని. ఈ గది ఇతర అధికారులు వసించు గదికి ప్రక్కనను, షల్లూము కుమారుడును ద్వారపాలకుడునైన మానేయా వసించు గది మీదనున్నది.

5. నేను ద్రాక్షారసపు కూజాలను, పాన పాత్రములను రేకాబీయుల ముందు పెట్టి 'కొంచెము పానీయము సేవింపుడు' అంటిని.

6. వారు "అయ్యా! మేము ద్రాక్షరసము త్రాగము. మేముగాని, మా సంతతిగాని దానినెప్పుడును ముట్టు కోరాదని రేకాబు కుమారుడును, మా పితరుడునైన యోనాదాబు ఆజ్ఞాపించెను.

7. ఇంకను అతడు మేము ఇండ్లు కట్టుకోరాదనియు, సేద్యము చేయరాదనియు, ద్రాక్షతోటలు పెంచరాదనియు, వానిని కొనరాదనియు శాసించెను. మేము సదా గుడారములలోనే వసింపవలెననియు, అటులయిన పరదేశులముగా బ్రతుకు నేలమీద మేము చిరకాలము మనుదుమనియు చెప్పెను.

8. మేము యోనాదాబు ఆజ్ఞలెల్ల పాటించితిమి. మేము, మా భార్యలు, పుత్రీపుత్రులు ద్రాక్షారసము ముట్టుకోము.

9-10. మేము ఇండ్లు కట్టుకొనక గుడారములలోనే వసింతుము. మాకు ద్రాక్షతోటలు లేవు. పొలమున విత్తనములు చల్లము. మేము మా పితరుడైన యోనాదాబు ఆజ్ఞలెల్ల ఖండితముగా పాటించితిమి.

11. కాని ఇపుడు బబులోనియా రాజైన నెబుకద్నెసరు దేశముమీదికి దాడిచేయగా బబులోనియా సిరియా సైన్యముల నుండి తప్పించుకొనుటకుగాను యెరూషలేమునకు రావలెనని నిశ్చయించుకొంటిమి. కావుననే ఇపుడిచట వసించుచున్నాము” అని చెప్పిరి.

12. అప్పుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు విన్పించెను:

13. సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువిట్లు నుడువుచున్నాడు: నీవు యూదా యెరూషలేము ప్రజలయొద్దకు వెళ్ళి వారితో ఇట్లు చెప్పుము. మీరు నా మాటనేల వినరైతిరి, నా ఉపదేశమునేల పాటింపరైతిరని ప్రభుడనైన నేనడుగుచున్నాను.

14. యోనాదాబు తన కుమారులకు ద్రాక్షారసమును ముట్టుకోగూడదనెడు ఆజ్ఞనీయగా వారు పాటించిరి. నేటివరకును వారు ఆ పానీయమును త్రాగుటలేదు. కాని నేను నిరంతరము మీతో మాటలాడుచున్నను, మీరు నా ఆజ్ఞలను గైకొనుటలేదు.

15. నేను సదా వేకువనే నా సేవకులైన ప్రవక్తలను మీ యొద్దకు పంపుచునే యుంటిని. వారు, దుష్కార్యములను విడనాడి ధర్మమును పాటింపవలెనని మీకు బోధించిరి. పరదైవములను పూజింపరాదని మిమ్ము హెచ్చరించిరి. అట్లయిన నేను మీకును, మీ పితరులకును ఇచ్చిన ఈ నేలమీద మీరు శాశ్వతముగా మనుదురని చెప్పిరి. కాని మీరు నామాట వినరైతిరి.

16. యోనాదాబు అనుయాయులు తమ పితరునాజ్ఞలను పాటించిరి. కాని మీరు నా మాట వినరైతిరి.

17. కనుక సైన్యములకు అధిపతియైన యిస్రాయేలు దేవుడనైన నా పలుకులివి. నేను పేర్కొనిన వినాశములన్నిటిని యూదా, యెరూషలేము ప్రజల మీదికి రప్పింతును. నేను మీతో మాటలాడినపుడు మీరు వినలేదు. మిమ్ము పిలిచినపుడు మీరు పలుకలేదు."

18. అంతట నేను రేకాబీయుల తెగకిట్లు చెప్పి తిని. “సైన్యములకు అధిపతియును యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. మీరు మీ పితరుడైన యోనాదాబు ఆజ్ఞలలు పాటించితిరి. అతని ఉపదేశములను, శాసనములను అనుసరించితిరి.

19. కనుక యిస్రాయేలు దేవుడను, సైన్యములకు అధిపతియునైన నేను మీకు ఈ ప్రమాణము చేయుచున్నాను. రేకాబు కుమారుడైన యోనాదాబు వంశజుడొకడు సదా నన్ను సేవించుచుండును.”

Text Example

1. యోషీయా కుమారుడును, యూదా రాజునగు యెహోయాకీము పరిపాలనాకాలము నాలుగవయేట ప్రభువు నాకు తన వాక్కును వినిపించి,

2. “నీవు పుస్తకపుచుట్టను తీసికొని యిస్రాయేలు యూదాలను గూర్చియు, అన్యజాతులను గూర్చియు నేను నీకు చెప్పిన సంగతులెల్ల వ్రాయుము. యోషీయా కాలమున నేను మొదట నీతో మాటలాడినప్పటినుండి నేటివరకును నేను నీకు వినిపించిన విషయములనెల్ల లిఖింపుము.

3. యూదా ప్రజలు నేను వారి మీదికి పంపబోవు వినాశనము గూర్చి విని, ఒకవేళ తమ పాపకార్యముల నుండి వైదొలగవచ్చును. అపుడు నేను వారి దోషములను, పాపములను మన్నింతును” అని చెప్పెను.

4. కనుక నేను నేరియా కుమారుడైన బారూకును పిలిపించి ప్రభువు నాకు చెప్పిన పలుకులెల్ల అతనికి వినిపించితిని. అతడు ఆ మాటలనెల్ల పుస్తకపుచుట్టలో వ్రాసెను.

5. నేనతనితో ఇట్లు చెప్పితిని: “నేను ప్రభువు మందిరములోనికి పోకుండ వారిచే నిర్బందింపబడి తిని.

6. ప్రజలు ఉపవాసముచేయు దినమున నీవే అచటికి పొమ్ము. అచట పుస్తకపు చుట్టనుండి పెద్దగా చదువుము. నీవు నా నోట విని పుస్తకమున వ్రాసిన ప్రభువు వాక్కులనెల్ల ప్రజలు విందురు. తమతమ నగరములనుండి వచ్చిన యూదా, ప్రజలెల్లరికిని వినపడునట్లుగా, నీవు ఆ వాక్కులను చదువుము.

7. ఒకవేళ వారు దేవునికి మొర పెట్టుకొని తమ దుష్కార్యములనుండి వైదొలగవచ్చును. ప్రభువు మహాగ్రహముతో తన ప్రజలను శిక్షింపబూనెను.”

8. బారూకు నేను చెప్పినట్లు చేసెను. మందిరమున పుస్తకపుచుట్టనుండి ప్రభువు వాక్కులను వినిపించెను.

9. అది యూదారాజగు యెహోయాకీము పరిపాలనాకాలము ఐదవయేడు, తొమ్మిదవనెల, యెరూషలేము వాసులును, యూదా నగరముల నుండి యెరూషలేమునకు వచ్చు ప్రజలును ప్రభువు అనుగ్రహమును పొందుటకుగాను ఉపవాసము చేయవలెనని ప్రకటనము చేయించిరి.

10. యావే మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యావే మందిరపు నూత్న ద్వారపు ప్రవేశమున ప్రజలెల్లరును వినుచుండగా, నేను చెప్పిన సంగతులెల్ల పుస్తకమునుండి బారూకు చదివి వినిపించెను.

11. షాఫాను మనుమడును గెమర్యా కుమారుడునైన మీకాయా, ఆ పుస్తకపుచుట్టనుండి బారూకు చదివిన వాక్కులెల్ల వినెను.

12. అతడు రాజప్రాసాదమునకు బోయి ఆస్థాన కార్యదర్శి గది ప్రవేశించెను. అపుడు అధికారులెల్లరు అచట సమావేశమై యుండిరి. ఆస్థాన కార్యదర్శియగు ఎలీషామా, షెమయా కుమారుడైన గేలాయా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇతర అధికారులు అచట నుండిరి.

13. బారూకు ప్రజలకు పుస్తకమును చదివి విన్పించుచుండగా, తానాలించిన సంగతులెల్ల మీకాయా ఆ అధికారులకు తెలియజేసెను.

14. వారు, యెహూదిని బారూకు నొద్దకు పంపి, “నీవు ప్రజలకు చదివి వినిపించిన పుస్తకపుచుట్టను మా యొద్దకు కొనిరమ్ము”అని చెప్పించిరి. ఈ యెహూది కూషీ మునిమనుమడు, షెలమ్యా మనుమడు, నెతన్యా కుమారుడు. బారూకు పుస్తకపుచుట్టను చేతబట్టుకొని వారి యొద్దకు వచ్చెను.

15. వారు “ఓయి! నీవు కూర్చుండి ఆ పుస్తకము మాకు చదివి వినిపింపుము” అని అనగా, అతడు దానిని చదివి వినిపించెను.

16. వారు ఆ పుస్తకములోని మాటలను విని భయపడి ఒకరి మొగమొకరు చూచుకొని బారూకుతో “మేము ఈ సంగతులను రాజునకు తెలియజేయవలయును” అనిరి.

17. అంతట వారు బారూకును జూచి “నీవు ఈ సంగతులను ఎట్లు వ్రాసితివి? యిర్మీయా నీకు చెప్పెనా?” అని అడిగిరి.

18. బారూకు “ఈ పలుకులెల్ల యిర్మీయా నాతో చెప్పెను. నేను వానిని సిరాతో పొత్తమున వ్రాసితిని” అని బదులు పలికెను.

19. వారతనితో “నీవును, యిర్మీయాయు ఇచటినుండి వెడలిపోయి దాగుకొనుడు. మీరెక్కడనున్నది ఇతరులకు తెలియజేయకుడు" అని చెప్పిరి.

20. ఆ అధికారులు పుస్తకపుచుట్టను రాజాస్థాన కార్యదర్శియగు ఎలీషామా గదిలోనుంచి రాజభవనములోనికి పోయి రాజునకు అంతయు తెలియజేసిరి.

21. రాజు పుస్తకమును తెప్పించుటకు యెహూదిని పంపెను. అతడు ఎలీషామా గదినుండి గ్రంథమును తెచ్చి రాజునకును, అతని చుట్టును నిలుచుండియున్న అధికారులకును దానిని చదివివినిపించెను.

22. అది ఆ సంవత్సరపు తొమ్మిదవ మాసము, శీతకాలము కనుక రాజు శీతకాల భవనమున కుంపటిముందు కూర్చుండియుండెను.

23. యెహూది మూడు నాలుగు పుటలు చదువగానే రాజు ఆ పుటలను చాకుతో కోసి కుంపటిలోని నిప్పులో పడవేసెడివాడు. పుస్తకపు చుట్ట అంతయు కాలిపోవు వరకు అతడు అటులనే చేసెను.

24. ఆ సంగతులెల్ల వినిన పిదపకూడ రాజుగాని, అతని అధికారులుగాని భయపడలేదు. బట్టలు చించు కోలేదు.

25. ఎల్నాతానును, డెలాయాయును, గెమర్యాయును పుస్తకమును కాల్చివేయవలదని ప్రాధేయపడిరి. కాని రాజు వారి మాటలు వినలేదు.

26. అతడు యిర్మీయాను, యిర్మీయా లేఖికుడైన బారూకును , బంధింపుడని రాజవంశజుడైన యెరాహ్మెయేలును, అస్రీయేలు కుమారుడైన సెరాయాను, అబ్దేలు కుమారుడైన షెలెమ్యాను ఆజ్ఞాపించెను. కాని ప్రభువు వారిని దాచియుంచెను.

27. నేను బారూకుచే వ్రాయించిన గ్రంథపు చుట్టను రాజు కాల్చివేసినపిదప ప్రభువు తన వాక్కు నిట్లు వినిపించెను:

28. “నీవు మరియొక చుట్టను తీసికొని యెహోయాకీము కాల్చివేసిన మొదటి చుట్ట లోని మాటలన్నిటిని దీనిలో వ్రాయుము.

29. యెహోయాకీముతో నా పలుకులుగా ఇట్లు చెప్పుము: “బబులోనియా రాజు వచ్చి ఈ దేశమును నాశనము చేసి అందలి నరులను, జంతువులను చంపివేయునని నీవేల వ్రాసితివని నీవు యిర్మీయాను ప్రశ్నించి గ్రంథపుచుట్టను కాల్చివేసితివి.”

30. కనుక ప్రభుడనైన నేను యూదారాజువగు నీతో ఇట్లు చెప్పుచున్నాను. నీ వంశజులెవ్వరును దావీదు రాజ్యమును పాలింపరు. నీ శవమును బయట పారవేయుదురు. అది పగలు ఎండకు ఎండును. రేయి మంచులో నానును.

31. నేను నిన్నును, నీ వంశజులను, నీ ఉద్యోగులను మీ దుష్కార్యములకుగాను శిక్షింతును. మీరు గాని, యెరూషలేము పౌరులు గాని, యూదా ప్రజలు గాని నా హెచ్చరికలను పాటింపరైతిరి. కనుక నేను మీ మీదికి రప్పింతునన్న వినాశమును రప్పించి తీరుదును.”

32. అంతట యిర్మీయా మరియొక చుట్టను తీసికొని లేఖికుడగు బారూకునకిచ్చితిని. అతడు యెహోయాకీము కాల్చివేసిన గ్రంథములోని మాటలన్నింటిని యిర్మీయా నోటిమాటను బట్టి మరల వ్రాసెను. ఆ పలుకులవంటివి మరికొన్ని కూడ దానిలో చేర్చబడెను.

Text Example

1. యెహోయాకీము కుమారుడైన కొన్యా స్థాన మున యోషీయా కుమారుడైన సిద్కియాను యూదాకు రాజుగా నెబుకద్నెసరు రాజు నియమించెను.

2. సిద్కియాకాని, అతని అధికారులుకాని, ప్రజలుకాని ప్రభువు నాచే చెప్పించిన సందేశమును లెక్కచేయరైరి.

3. సిద్కియారాజు షెలెమ్యా కుమారుడగు యెహూకలును, యాజకుడైన మాసేయా కుమారుడగు జెఫన్యాను నా చెంతకు పంపి “నీవు మా తరపున మన దేవుడైన ప్రభువునకు మనవిచేయుము” అని చెప్పించెను.

4. అప్పటికి నన్నింకను చెరలో పెట్టలేదు. కనుక నేను ప్రజల మధ్య స్వేచ్చగా తిరుగుచుంటిని.

5. బబులోనియా సైనికులు యెరూషలేమును ముట్టడించుచుండిరి. కాని ఐగుప్తునుండి ఫరో దండు కదలి వచ్చుచున్నదని విని వారు ముట్టడిని ఆపివేసిరి.

6. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

7. “యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: నన్ను సంప్రతింపుమని అడిగిన యూదారాజుతో నీవు ఇట్లు చెప్పుము: 'నీకు సహాయము చేయుటకు వచ్చుచున్న ఐగుప్తు సైన్యములు తమ దేశమునకు తిరిగిపోవును.

8. బబులోనీయులు తిరిగి వచ్చి ఈ పట్టణమును ముట్టడింతురు. దీనిని స్వాధీనము చేసికొని కాల్చివేయుదురు.

9. ప్రభుడనైన నేను చెప్పునదేమనగా: “బబులోనీయులు మరలి వెళ్ళిపోవుదురనుకొని మిమ్ము మీరు వంచించుకొనకుడు. వారు వెళ్ళరు.

10. మీరిపుడు మీతో పోరాడుచున్న బబులోనియా సైన్యమునంతటిని ఒకవేళ చంపి వేసినను, వారిలో గాయపడినవారు తమ గుడారములలో నుండి పైకిలేచి వచ్చి ఈ నగరమును కాల్చి వేయగలరు.' ”

11. ఫరోదండు వచ్చుచున్నది కనుక బబులోనియా సైన్యము యెరూషలేము ముట్టడిని ఆపివేసెను.

12. నేను యెరూషలేమును విడిచి బెన్యామీను మండల మునకు పోవుటకు ప్రయాణము కట్టితిని. అచట నా వంతు కుటుంబపు ఆస్తిని స్వాధీనము చేసికోనెంచితిని.

13. కాని నేను బెన్యామీను ద్వారము వద్దకు పోగానే అచట గస్తీకాయువారికి అధిపతియైన యిరీయ్యా అను అతడు నన్ను అడ్డగించెను. అతడు షెలెమ్యా కుమా రుడు, హనన్యా మనుమడు. అతడు నాతో “నీవు బబులోనీయుల పక్షమున చేరబోవుచున్నావుగదా!” అనెను.

14. నేను “అది నిజము కాదు. నేను బబులోనీయులలో చేరుటలేదు” అని అంటిని. కాని యిరీయ్యా నా మాటలువినక, నన్ను బంధించి అధికారుల యొద్దకు కొనిపోయెను.

15. ఆ అధికారులు నాపై మండిపడి నన్ను కొట్టి ఆస్థానకార్యదర్శియైన యోనాతాను ఇంటిలో చెరలో పెట్టిరి. అతని గృహము చెరగా మార్చబడినది.

16. నన్ను భూగర్భములోని చెరలోనుంచిరి. నేనచట చాలకాలము ఉంటిని.

17. అటు తరువాత సిద్కియారాజు నన్ను పిలిపించి “ప్రభువునుండి సందేశమేమైన కలదా?” యని తన ప్రాసాదమున రహస్యముగా ప్రశ్నించెను. నేను “ఉన్నది, నిన్ను బంధించి బబులోనియారాజునకు అప్పగింతురు” అని చెప్పితిని.

18. మరియు నేనతనితో ఇట్లంటిని: “నేను నీకును, నీ ఉద్యోగులకును, నీ ప్రజలకును ఏమి అపరాధము చేసితినని మీరు నన్ను చెరలో పెట్టించితిరి?

19. 'బబులోనియా రాజు నీ మీదికిగాని, ఈ దేశము మీదికి గాని రాడు' అని చెప్పిన ఆ ప్రవక్తలు ఇపుడెచట ఉన్నారు?

20. ప్రభువుల వారు నా మనవిని ఆలకించి నా ప్రార్ధనమును అంగీకరింతురుగాక! నన్ను మరల యోనాతాను ఇంటి చెరలోనికి పంపవలదు. పంపుదురేని నేనచట చచ్చుట తథ్యము".

21. సిద్కియారాజు నన్ను ప్రాసాదపు ఆవరణ లోని చెరలో ఉంచవలెనని ఆజ్ఞాపించెను. కనుక నేనచట వసించితిని. నగరములో రొట్టె దొరకునంత కాలము రొట్టెలను కాల్చువారి వీధిలోనుండి ప్రతిరోజు నాకొక రొట్టెను తెచ్చియిచ్చిరి.

Text Example

1. మత్తాను కుమారుడైన షేపట్యా, పషూరు కుమారుడైన గెదెల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలు, మల్కీయా కుమారుడైన పషూరు నేను ప్రజలకు చెప్పిన ఈ క్రింది పలుకులను వినిరి.

2. “ప్రభువు పలుకులివి. ఈ నగరమున నిలిచియుండు వారు, పోరు, కరువు, అంటురోగములవలన చత్తురు. నగరమును వీడి బబులోనీయుల పక్షమున చేరువారు బ్రతుకుదురు. వారు కనీసము తమ ప్రాణములనైన నిలబెట్టుకొందురు.

3. నేను ఈ నగరమును బబులోనియా దండు వశము చేయుదును. వారు దీనిని పట్టుకొందురు.”

4. ఆ అధికారులు ఈ మాటలు విని రాజు చెంతకు బోయి అతనితో, “మీరితనికి మరణశిక్ష విధింపవలెను. ఇతడు ఇట్టి మాటలద్వారా నగరమున మిగిలియున్న సైనికులను, ప్రజలను నిరుత్సాహపరచు చున్నాడు. ఇతడు ప్రజల క్షేమమునుగాక, నాశనమును కోరుచున్నాడు” అని చెప్పిరి.

5. సిద్కియా "అతడు మీ అధీనముననున్నాడు. నేను మీకు అడ్డుపడజాలనుకదా!” అనెను.

6. అంతట వారు నన్ను కొనిపోయి త్రాళ్ళతో రాజవంశీయుడగు మల్కీయా బావిలోనికి దింపిరి. అది రాజప్రాసాదపు ఆవరణముననున్నది. దానిలో నీరు ఒట్టిపోయి పూడిక మాత్రమే ఉన్నది. నేను దాని బురదలో దిగబడితిని.

7. రాజప్రాసాదమున పనిచేయు ఎబెద్మెలెకు నన్ను బావిలో పడవేసిరని వినెను. అతడు కూషీయుడు, నపుంసకుడు. ఆ సమయమున రాజు బెన్యామీను ద్వారమువద్ద కొలువుదీర్చి ఉండెను.

8-9. కావున ఎబెద్మెలెకు రాజువద్దకు పోయి అతనితో “ప్రభూ! ఈ జనులు చెడ్డపనిచేసిరి. వీరు యిర్మీయాను బావిలో పడద్రోసిరి. నగరమున రొట్టెలు ఏమియును లేవు కనుక అతడు బావిలో ఆకటితోచచ్చును” అని చెప్పెను.

10. రాజతనితో “నీవిచటినుండి ముగ్గురు మనుష్యులను తీసికొనిపోయి యిర్మీయా చనిపోకముందే అతనిని బావినుండి వెలుపలికి లాగుము" అని చెప్పెను.

11. అతడు ఆ మనుష్యులతో ప్రాసాదపు వస్త్రశాలకు వెళ్ళి ప్రాతబట్టలను కొన్నిటిని తీసికొనివచ్చి, వానిని త్రాళ్ళతో నా చెంతకు దింపెను.

12. “త్రాళ్ళు నీ చర్మమును కోయకుండునట్లుగా ఈ ప్రాతబట్టలను త్రాళ్ళమీద నీ చంకలలో పెట్టుకొమ్ము'' అని చెప్పెను. నేనట్లే చేసితిని.

13. అంతట వారు నన్ను త్రాళ్ళతో బావిలో నుండి బయటికిలాగిరి. అటుతరువాత నన్ను ప్రాసాదావరణములోని చెరలో ఉంచిరి.

14. తదనంతరము సిద్కియా రాజు నన్ను దేవాలయపు మూడవ ప్రవేశద్వారము వద్దకు పిలిపించి “దైవసందేశమేమైన కలదా? అని నేను నిన్ను ప్రశ్నించుచున్నాను. నీవు నా ఎదుట ఏమియు దాచవలదు" అనెను.

15. నేనతనితో “నేను నిజము చెప్పినచో నీవు నన్ను చంపింతువు. ఉపదేశము చేసినచో నీవు పట్టించుకొనవు” అని అంటిని.

16. అపుడు సిద్కియా రహస్యముగా నాతో ఇట్లనెను: “మనకెల్లరికి ప్రాణములనిచ్చు సజీవుడైన దేవుని పేరుమీదుగా నేను బాస చేయుచున్నాను. నేను నిన్ను చంపింపను. నిన్ను చంపగోరు వారికి అప్పగింపను."

17. అంతట నేను సిద్కియాకిట్లు చెప్పితిని. “యిస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియైన ప్రభువిట్లు పలుకుచున్నాడు. నీవు బబులోనియా రాజు అధికారులకు చెంతకుపోయెదవేని నీ ప్రాణములు నిలుచును. శత్రువులు ఈ నగరమును కాల్చివేయరు. నీవును, నీ కుటుంబమును బ్రతికి బయటపడవచ్చును.

18. కాని నీవు వారియొద్దకు వెళ్ళనిచో నేను ఈ నగరమును బబులోనీయులకు అప్పగింతును. వారు దానిని తగులబెట్టుదురు. నీవు వారి నుండి తప్పించుకోజాలవు.”

19. అందుకు రాజు నాతో, నేను బబులోనీయుల పక్షమున చేరిపోయిన యూదులకు భయపడుచున్నాను. బబులోనీయులు నన్ను వారి చేతికప్పగింపగా, వారు నన్ను హేళన చేయుదురు అనెను.

20. కాని నేను ఆతనితో ఇట్లంటిని. నిన్ను యూదులచేతికి అప్పగింపరు. నేను చెప్పిన దైవసందేశము పాటింతు వేని నీవు బాగుపడుదువు. నీ ప్రాణములు నిలబెట్టుకొందువు.

21. నీవు బబులోనీయులకు లొంగవేని, నీకేమి జరుగునో ప్రభువు నాకొక దర్శనమున చూపించెను.

22. ఆ దర్శనమున నేను యూదా రాజ భవనమున మిగిలియున్న స్త్రీలందరును బబులోనియా రాజు అధికారుల యొద్దకు కొనిపోబడుటను చూచితిని. వారు వెడలిపోవుచు ఇట్లు పలుకుచుండిరి. నీ ప్రియ స్నేహితులే నిన్ను తప్పుత్రోవ పట్టించిరి. వారు నీపై పెత్తనము చెలాయించిరి. ఇపుడు నీ పాదములు బురదలో కూరుకొనిపోగా వారు నిన్ను విడిచి వెళ్ళిపోయిరి.

23. నేనింకను అతనితో ఇట్లు చెప్పితిని. నీ భార్యలను, పిల్లలను బబులోనీయుల యొద్దకు గొనిపోయెదరు. నీవు శత్రువులనుండి తప్పించుకోజాలవు. బబులోనియా రాజు నిన్ను బందీని చేయును. వారు ఈ నగరమును తగులబెట్టుటకు కారణము నీవే అగుదువు.”

24. సిద్కియా నాతో ఇట్లనెను: “నీ ప్రాణములు సురక్షితముగా ఉండునట్లు, నీవు ఈ సంగతి ఎవరికిని తెలియనీయకుము.

25. నేను నీతో సంభాషించితినని, అధికారులకు తెలిసినచో, వారు నీ చెంతకువచ్చి మీరేమి మాటలాడుకొంటిరని నిన్నడుగుదురు. 'నీవు రహస్యము లేమియు దాచనిచో మేము నీ ప్రాణములు తీయము' అని చెప్పుదురు.

26. అప్పుడు 'నీవు నన్ను యోనాతాను ఇంటిలోని చెరలోనికి పంపవలదనియు, పంపినచో నేనచట చచ్చుట తథ్యమనియు రాజుతో మనవి చేసి కొంటిని' అని చెప్పుము.”

27. తరువాత అధికారులు నా యొద్దకు వచ్చి నన్ను ప్రశ్నించిరి. రాజు చెప్పుమనిన మాటలనే నేను వారితో చెప్పితిని. మా సంభాషణను ఎవరును వినలేదు. కనుక వారు నన్ను విడిచిపెట్టిరి.

28. యెరూషలేము పట్టుబడు వరకును నేను ప్రాసాద ఆవరణములోని చెరలోనే ఉంటిని.

Text Example

1. సిద్కియా యూదాను పరిపాలించు కాలము తొమ్మిదవయేడు పదియవనెలలో బబులోనియారాజగు నెబుకద్నెసరు సర్వసైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను.

2. సిద్కియారాజు పరిపాలనాకాలము పదునొకండవయేడు నాలుగవనెల తొమ్మిదవ దినమున శత్రువులు నగరప్రాకారములను ఛేదించిరి.

3. యెరూషలేము పట్టుబడినప్పుడు, బబులోనియా రాజు ముఖ్యాధికారులెల్లరును వచ్చి మధ్య ద్వారము వద్ద కొలువుదీరిరి. వారు నేర్గల్ షరేసర్, సమ్గర్నేబో, నపుంసకుల అధిపతియైన సర్సెకీము, మంత్రజ్ఞులకు అధిపతియైన నేర్గల్ షరేసర్ అనువారు.

4. సిద్కియా రాజును, అతని యోధులును ఈ ఉదంతమునుచూచి భయపడి రాత్రిలో నగరమునుండి పారిపోయిరి. వారు రాజోద్యానముగుండ వెళ్ళి రెండు ప్రాకారముల మధ్య గల ద్వారమును దాటి యోర్దాను లోయ వైపునకు వెళ్ళిపోయిరి.

5. కాని బబులోనియా సైనికులు వారిని వెన్నాడిరి. సిద్కియాను యెరికో మైదానమున పట్టుకొని హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిది చేయుచున్న నెబుకద్నెసరు చెంతకుకొనిపోయిరి. అచట ఆ రాజు సిద్కియాకు శిక్ష విధించెను.

6. రిబ్లా నగరమున బబులోనియా రాజు సిద్కియా చూచుచుండ గనే అతని పుత్రులను చంపించెను. అతడు యూదా అధికారులను గూడ మట్టుపెట్టించెను.

7. తదనంతరము అతడు సిద్కియా కన్నులను పెరికించెను. అతనిని బబులోనియాకు కొనిపోవుటకుగాను గొలుసులతో బంధించెను.

8. బబులోనియా సైన్యము రాజ ప్రాసాదమును, ప్రజల గృహములను కాల్చివేసి నగర ప్రాకారములను పడగొట్టెను.

9. అంగరక్షకుల అధిపతియైన నెబూజరదాను, నగరమున మిగిలియున్న వారిని, తన పక్షమున చేరిన వారిని బబులోనియాకు బందీలనుగా కొనిపోయెను.

10. అతడు పొలము పుట్రలేని నిరుపేదలను కొందరిని యూదాలోనే యుండనిచ్చెను. వారికి భూములు, ద్రాక్షతోటలిచ్చెను.

11-12. “నీవు యిర్మీయాను వెదకి అతనిని ఆదరింపుము. అతనికి హానిచేయవలదు. అతడు అడిగినదెల్ల చేసిపెట్టుము” అని బబులోనియారాజగు నెబుకద్నెసరు తన అంగరక్షకుల అధిపతియైన నెబూజరదానునకు ఆజ్ఞ ఇచ్చెను.

13-14. కనుక నెబూజరను ఉన్నత అధికారులగు నెబూషస్బాను, నేర్గల్ షరేజరు, మరియు బబులోనియా రాజు ఇతర అధికారులందరును కలిసి నన్ను ప్రాసాదావరణము నందలి చెరనుండి విడిపించిరి. వారు నన్ను షాఫాను మనుమడును, అహీకాము కుమారుడునైన గెదాల్యాకు ఒప్పగించిరి. నన్ను సురక్షితముగా ఇంటికి చేర్చు పూచీని అతనికి ఒప్పగించిరి. కనుక నేను మా జనుల మధ్య నివసించితిని.

15. నేనింకను ప్రాసాదపు ఆవరణములోని చెరలో బంధింపబడి ఉండగనే ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను.

16. “నీవు వెళ్ళి ఎబెద్మెలెకుతో ఇట్లు చెప్పుము: 'యిస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు. నేను పూర్వము చెప్పినట్లే క్షేమమునుగాక, వినాశమును ఈ నగరము మీదికి రప్పించెదను. ఈ కార్యము జరిగినపుడు నీవే చూతువు.

17. ఆ దినమున ప్రభుడనైన నేను నిన్ను కాపాడుదును. విరోధులు నీవు భయపడువారికి నిన్నప్పగింపరు.

18. నేను నిన్ను రక్షింతును. నీవు కత్తివాతపడవు. నీవు నన్ను నమ్మితివి గనుక బ్రతికి బయటపడెదవు. ఇది ప్రభుడనైన నావాక్కు' "

Text Example

1. అంగరక్షకుల అధిపతియైన నెబూజరదాను యూదా, యెరూషలేములనుండి బబులోనియాకు బందీలనుగా కొనిపోబడిన ప్రజలతోపాటు సంకెళ్ళతో బంధింపబడియున్న యిర్మీయాను బంధవిముక్తిని గావించి రామావద్దనుండి అతనిని పంపివేయగా, ప్రభువునుండి అతనికి వినిపించిన వాక్కు.

2. ఆ అంగ రక్షకుల అధిపతి యిర్మీయాను ప్రక్కకు కొనిపోయి ఇట్లనెను: “నీ దేవుడైన ప్రభువు ఈ దేశమునకు వినాశము దాపురించునని చెప్పెను.

3. ఇపుడు తాను చెప్పినట్లే చేసెను. మీరు యావే దేవుని మాటమీరి పాపము కట్టుకొంటిరి. కనుక ఇదంతయు జరిగెను.

4. నేనిపుడు నీ చేతులనుండి సంకెళ్ళను తొలగించి నిన్ను విడిపించుచున్నాను. నీవు నాతో బబులోనియాకు రాగోరెదవేని రమ్ము. నేను నిన్ను పరామర్శింతును. కాని నావెంట బబులోనియాకు వచ్చుటకు ఇష్టపడవేని నిర్బంధమేమియు లేదు. ఇంత విశాలమైన దేశమున్నది. నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళవచ్చును.”

5. ఆ మాటలకు యిర్మీయా మౌనము వహించుట చూచి నెబూజరదాను మరల ఇట్లనెను: “నీవు షాఫాను మనుమడును, అహీకాము కుమారుడునైన గెదల్యావద్దకు పొమ్ము. బబులోనియా రాజు అతడిని యూదా నగరములకు అధికారినిగా నియమించెను. నీవు అతని చెంతకుపోయి మీ ప్రజలనడుమ వసింపవచ్చును. లేదేని నీ ఇష్టము వచ్చిన చోటికిపొమ్ము.” ఇట్లు చెప్పి అతడు యిర్మీయాకొక బహుమతిని, ప్రయాణమునకు భోజనమును ఇచ్చి అతనిని సాగనంపెను.

6. యిర్మీయా అంతట మిస్పాలోనున్న గెదల్యావద్దకు వెళ్ళి అతడితో కలిసి యూదాదేశమున మిగిలియున్న ప్రజలనడుమ వసించెను.

7. కొందరు యూదా అధికారులును, సైనికులును బబులోనీయులకు లొంగలేదు. వారు బబులోనియా రాజు గెదల్యాను దేశమునకు అధికారినిగా నియమించెనని వినిరి. బబులోనియాకు బందీలుగా వెళ్ళని స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశములోని నిరుపేదలందరికిని అతనిని అధికారిని చేసిరని తెలిసికొనిరి.

8. కావున నెతన్యా కుమారుడగు యిష్మాయేలు, కారెయా కుమారుడైన యోహానాను, తన్హూమెతు కుమారుడైన సెరాయా, నేటోఫా నివాసియైన యేఫయి కుమారులు, మాకా నివాసియైన యోసన్యా తమ అనుచరులతో కలిసి మిస్పాలోనున్న గెదల్యా చెంతకు వచ్చిరి.

9. గెదల్యా వారితో నేను మీకు ప్రమాణముచేసి చెప్పుచున్నాను. “మీరు భయపడకుడు, బబులోనీయులకు లొంగిపోవుటకు వెనుకాడకుడు. ఈ నేలమీద స్థిరపడి. బబులోనియారాజును సేవింపుడు. మీకు మేలు కలుగును.

10. నా మట్టుకు నేను మిస్పాయందు వసింతును. బబులోనీయులు ఇచటికి వచ్చి నపుడు వారికి మీ తరుఫున ప్రతినిధినిగా ఉందును. మీరు ద్రాక్షారసమును, పండ్లను, ఓలివు తైలమును చేకూర్చుకొని మీరు స్వాధీనము చేసికొనిన గ్రామములలో వసింపవచ్చును.” అని అనెను.

11. మోవాబు, అమ్మోను, ఎదోము మరియు ఇతర దేశములలో నున్న యూదులు బబులోనీయారాజు కొందరు యిస్రాయేలీయులను యూదాలో నుండనిచ్చెనని వినిరి. అతడు గెదల్యాను అధికారినిగా చేసెననియు తెలిసికొనిరి.

12. కనుక వారు తాము చెల్లాచెదరైయున్న దేశముల నుండి యూదాకు తిరిగివచ్చి మిస్పాయందున్న గెదల్యా చెంతకు చేరిరి. అచట ద్రాక్షసారాయమును, పండ్లను విస్తారముగా ప్రోగుజేసికొనిరి.

13. అటుతరువాత కారెయా కుమారుడైన యోహానానును ఆయాచోటులనున్న దండుల నాయకులందరును మిస్పాయందున్న గెదల్యా చెంతకువచ్చి.

14. "అయ్యా! అమ్మోనురాజైన బాలీసు నిన్ను వధించుటకుగాను నెతన్యాకుమారుడైన యిష్మాయేలును పంపెను. ఈ సంగతి నీకు తెలియదా?" అనిరి. కాని గెదల్యా వారి మాటలు నమ్మలేదు.

15. అంతట యోహానాను గెదల్యాతో రహస్యముగా, “నేను వెళ్ళి యిష్మాయేలును చంపుదును. అతనినెవరు చంపిరో జనులు గుర్తింపజాలరు. అతడు నిన్ను హత్యచేయనేల? నీవు గతించినచో నీ చుట్టుచేరియున్న యూదులెల్ల మరల చెల్లాచెదరవుదురు. యూదాలో మిగిలి యున్న వారెల్ల నశింతురు” అనెను.

16. కాని గెదల్యా “నీవిట్టిపని చేయకుము. నీవు చెప్పుసంగతి నిజము కాదు” అని అనెను.

Text Example

1. ఆ యేడు ఏడవనెలలో యిష్మాయేలు పదిమంది అనుచరులను తీసికొని మిస్పాయందున్న గెదల్యాచెంతకు వచ్చెను. యిష్మాయేలు నెతన్యా కుమారుడు, ఎలీషామా మనుమడు. రాజవంశమునకు చెందినవాడు. రాజు ముఖ్యాధికారులలో ఒకడు. వారెల్లరును భోజనమునకు కూర్చుండిరి.

2. అపుడు యిష్మాయేలును, అతని పదిమంది అనుచరులును కత్తులు దూసి, బబులోనియా రాజు దేశమునకు అధికారినిగా నియమించిన గెదల్యాను ఖడ్గముచే వధించిరి.

3. గెదల్యాతోపాటు మిస్పావద్దనున్న యిస్రాయేలీయులను, అచటనున్న బబులోనియా సైనికులనుగూడ యిష్మాయేలు మట్టు పెట్టెను.

4. గెడల్యా హత్యను గూర్చి ఇంకను ఎవరికిని తెలియదు.

5. ఆ మరుసటి దినమున షెకెము, షిలో, సమరియాల నుండి ఎనుబదిమంది వచ్చిరి. వారు గడ్డములు గొరిగించుకొని, బట్టలుచించుకొని, ఒడలు గాయపరచుకొని ఉండిరి. దేవాలయమున అర్పించుటకు గాను ధాన్యమును, సాంబ్రాణిని కొనిపోవుచుండిరి.

6. యిష్మాయేలు మిస్పానుండి ఏడ్చుచు వారికి ఎదురు పోయెను. వారిని కలిసికొని వారితో “అహీకాము కుమారుడు గెదల్యాను చూచుటకు నగరములోనికి రండు” అనెను.

7. వారు పట్టణములోనికి రాగానే యిస్మాయేలు, అతని అనుచరులు వారిని వధించి బావిలో పడవేసిరి.

8. కాని వారిలో పదిమంది యిష్మాయేలుతో "అయ్యా! మమ్ము చంపకుము. మేము గోధుమలను, యవలను, ఓలిపు తైలమును, తేనెను పొలమున దాచియుంచితిమి” అని చెప్పిరి. కనుక అతడు వారిని వదిలిపెట్టెను.

9. యిష్మాయేలు శవములను పడవేసినగుంట చాల పెద్దది. యిస్రాయేలు రాజగు బాషా తనపై దండెత్తినపుడు ఆసారాజు భయపడి దానిని త్రవ్వించెను. యిష్మాయేలు దానిని పీనుగులతో నింపెను.

10. తరువాత అతడు మిస్పాలో నున్న రాజపుత్రికలను, ప్రజలెల్లరిని బందీలను చేసెను. అంగరక్షకుల అధిపతియైన నెబూజరదాను వారినందరిని, గెదల్యా అధీనమునుంచి యుండెను. యిష్మాయేలు ఆ బందీలను వెంటబెట్టుకొని అమ్మోను దేశము వైపుగా వెళ్ళిపోవుచుండెను.

11. కారెయా కుమారుడైన యోహానాను అతనితోనున్న సైన్యాధిపతులు యిష్మాయేలు చేసిన దుండగములను గూర్చి వినిరి.

12. కనుక వారు తమ అనుచరులతో అతని వెంటబడిరి. గిబ్యోను పెద్ద మడుగునొద్ద అతనిని కలిసికొనిరి.

13. యిష్మాయేలు మిస్పానుండి చెరగొనిపోవు జనులు యోహానానును, అతని వెంటనున్న సైన్యాధిపతులను చూచి పరమానందము చెందిరి.

14. వారు వెనుకకు తిరిగి అతనిచెంతకు పరుగెత్తిరి.

15. కాని యిష్మాయేలును, అతని అనుచరులలో ఎనిమిదిమందియు యోహానాను నుండి తప్పించుకొని అమ్మోను దేశమునకు పారిపోయిరి.

16. అంతట యోహానాను, అతనితోనున్న సేనాధిపతులును గెదల్యావధానంతరము యిష్మాయేలు మిస్పానుండి చెరగొనివచ్చిన వారినెల్లరిని ప్రోగు జేసిరి. వారిలో సైనికులును, స్త్రీలును, పిల్లలును, నపుంసకులును ఉండిరి. వారినందరిని గిబ్యోనునుండి తిరిగి తెచ్చిరి.

17-18. బబులోనియా రాజు దేశమునకు అధికారినిగా నియమించిన గెదల్యాను, యిష్మాయేలు వధించెను. కనుక వారు బబులోనీయులకు జడిసిరి. కావున వారు బబులోనీయులనుండి తప్పించుకొనుటకుగాను ఐగుప్తునకు పయనము కట్టిరి. దారిలో బెత్లెహేము చెంతనున్న కింహామునొద్ద విడిదిచేసిరి.

Text Example

1. అంతట కారెయా కుమారుడైన యోహానాను, హోషియా కుమారుడైన అజర్యా, సైన్యాధిపతులును, మొదలైన అధికులును, అల్పులునైన ప్రజలందరును యిర్మీయా చెంతకువచ్చి,

2. “అయ్యా! నీవు మా మొరవిని ప్రాణములతో బ్రతికియున్న మా కొరకు నీ దేవునికి విన్నపములు చేయుము. మేము పూర్వము చాలమందిమైనను, ఇప్పుడు కొద్దిమందిమి మాత్రమే మిగిలియున్నాము. ఈ సంగతి నీకును తెలియును.

3. నీ వేడుకోలువలన నీ దేవుడైన ప్రభువు మేము పోవలసిన మార్గమును, చేయవలసిన కార్యములను మాకు తెలియజేయుగాక!” అనిరి.

4. యిర్మీయా ప్రవక్త వారితో, “మంచిది, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన ప్రభువునకు మనవి చేయుదును. ఆయన చెప్పిన సంగతులను వేనిని దాచక మీకు తెలియ చేయుదును” అని చెప్పితిని.

5. వారు “నీ దేవుడైన ప్రభువు నీద్వారా మాకు తెలియజేసిన నియమములకు మేము కట్టువడి ఉండనిచో, ఆయన నమ్మకమైన సాక్షిగా మా మీద నేరము మోపునుగాక!

6. మాకు నచ్చినను, నచ్చకున్నను మన దేవుని ప్రార్థన చేయుమని నిన్ను పంపితిమిగాన మేము ఆయన ఆజ్ఞలను పాటింతుము. ఆయనకు విధేయులమైనచో మాకు మేలు కలుగును” అని పలికిరి.

7. పది దినముల తరువాత ప్రభువు యిర్మీయాతో మాటలాడెను.

8. కనుక అతడు కారెయా కుమారుడైన యోహానాను, అతనితోనున్న సైన్యాధిపతులను, ప్రజలందరిని పిలిపించి వారితో ఇట్లనెను:

9. “మీరు యిస్రాయేలు దేవుడైన ప్రభువునెదుట మనవి చేయుటకు నన్ను పంపితిరికదా! ఆయనిట్లు సెలవిచ్చెను.

10. మీరీ నేలమీదనే వసింతురేని నేను మిమ్ము నిర్మింతునుగాని ధ్వంసముచేయను. మిమ్ము నాటుదునుగాని పెల్లగింపను. నేను మీకు హాని చేసినందులకు మిగుల చింతించుచున్నాను.

11. మీరు బబులోనియా రాజునకు వెరవనక్కర లేదు. నేను మీకు అండగానుండి అతని బారినుండి మిమ్ము కాపాడుదును.

12. నేను మీమీద కరుణ జూపి అతడు మీపై దయజూపునట్లు చేయుదును. మీరు మీ దేశమునకు తిరిగిపోవచ్చును.

13. కాని మీరు మేమీ దేశమున ఉండము. నీ దేవుడైన ప్రభువు మాటవినము.

14. మేము ఐగుప్తునకు వెళ్ళెదము. అచట యుద్ధముండదు. యుద్ధనాదము విన్పింపదు. ఆకలి ఉండదు. మేము అక్కడనే వసింతుము అని అందురేని,

15. యూదాలో మిగిలియున్నవారలారా! సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు మీతో చెప్పు పలుకులను ఆలింపుడు. మీరు ఐగుప్తునకు వెళ్ళి అచట వసింపగోరెదరేని,

16. మీరు భయపడు యుద్ధము మిమ్ము ఆ దేశమున వెన్నాడును. మీరు వెరచు కరువు అచట మిమ్ము అనుసరించును. మీరు ఆ నేలమీదనే చత్తురు.

17. ఐగుప్తునకుపోయి అచట వసింపగోరు వారందరును పోరు, ఆకలి, అంటురోగములవలన చత్తురు. వారిలో ఒక్కడును నేను పంపబోవు వినాశనమునుండి తప్పించుకొని బ్రతకజాలడు.

18. యిస్రాయేలు దేవుడును, సైన్యములకు అధిపతియుయైన ప్రభువిట్లు నుడువుచున్నాడు. నేను నా ఆగ్రహమును, రౌద్రమును యెరూషలేము పౌరులమీద కుమ్మరించినట్లే, ఐగుప్తునకు వెళ్ళు మీ మీదను నా కోపమును కుమ్మరింతును. ప్రజలు మీ దురవస్థ చూచి భీతిల్లుదురు. మిమ్ము గేలిచేయుదురు. మీ పేరును శాపముగా వాడుకొందురు. మీరీ తావును మరల కంటితో చూడజాలరు.

19.యూదావాసులలో మిగిలి యున్నవారలారా! ప్రభువు 'మీరు ఐగుప్తునకు వెళ్ళ కూడదు' అని చెప్పెను. కనుక నేను మిమ్మిపుడు నిశితముగా హెచ్చరించుచున్నాను.

20. మీరు అతి ప్రమాదకరమైన పొరపాటు చేయుచున్నారు సుమా! 'మీరు నన్ను మీ దేవుడైన ప్రభువునకు మనవి చేయుమని కోరితిరి. ఆయన ఆజ్ఞాపించినదెల్ల చేయుదుము' అని మాటయిచ్చి మిమ్మును మీరే మోస పుచ్చుకొనుచున్నారు.

21. నేను మీకిప్పుడు మీ దేవుడనైన ప్రభువు సందేశమును తెలియజేసితిని. ఆయన నన్ను మీతో చెప్పుమనిన సందేశమును మీరు పూర్తిగా మీరుచున్నారు.

22. కనుక మీరు పోయి స్థిరపడగోరిన ఆ నేలమీద పోరు, ఆకలి, అంటురోగములవలన చచ్చుట నిక్కమని తెలిసికొనుడు.”

Text Example

1. యిర్మీయా ప్రజలకు వారి దేవుడు ప్రభువు సెలవిచ్చిన సంగతులెల్ల చెప్పి ముగించెను.

2. హోషియా కుమారుడైన అజర్యా, కారెయా కుమారుడైన యోహానాను, గర్వాత్ములైన ఇతర ప్రజలు యిర్మీయాతో “నీవు అబద్దములాడుచున్నావు. మా దేవుడైన ప్రభువు మేము ఐగుప్తునకు వెళ్ళి అక్కడ వసింపకూడదని నీతో చెప్పలేదు.

3. నేరీయా కుమారుడైన బారూకు నీవు మాకు ప్రతికూలముగా మాట్లాడునట్లు చేసెను. ఫలితముగా ఇప్పుడు బబులోనీయులు మమ్ము లొంగదీసికొని మమ్ము చంపుటకుగాని, లేదా తమ దేశమునకు బందీలనుగా గొనిపోవుటకుగాని సిద్ధమగుదురు” అనిరి.

4. కారెయా కుమారుడైన యోహానాను కాని, సైన్యాధిపతులు కాని, ప్రజలు కాని ప్రభువు ఆజ్ఞకులొంగి యూదాలో వసించుటకు ఇష్ట పడరైరి.

5. కారెయా కుమారుడైన యోహానాను, ఇతర సైన్యాధిపతులు యూదాలో ఉన్నవారిని, పూర్వము అన్యదేశములలో చెల్లాచెదరై అచటి నుండి తిరిగి వచ్చినవారిని, ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

6. వారు నెబూజరదాను గెదల్యా సంరక్షణలోనుంచిన వారి నందరిని అనగా స్త్రీలను, పురుషులను, పిల్లలను, రాజు పుత్రికలను గొనిపోయిరి. ప్రవక్తయైన యిర్మీయాను, నేరియా కుమారుడైన బారూకును కూడ తోడుకొని పోయిరి.

7. ఆ రీతిగా వారు ప్రభువాజ్ఞను ధిక్కరించి ఐగుప్తు ప్రవేశించి తహపనేసు నగరము వరకును పోయిరి.

8. ఆ నగరమున యిర్మీయాతో ప్రభువు ఇట్లు చెప్పెను:

9. “నీవుకొన్ని పెద్దరాళ్ళను తీసికొని వచ్చి తహపనేను నగరములోని ఫరోరాజు భవనమునకు ముందటి ఆవరణమునందలి మట్టిలో పాతిపెట్టుము. నీవీ పని చేయుచుండగా యూదా ప్రజలు చూడవలెను.

10. నీవు వారితో ఇట్లు చెప్పుము: 'సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడనైన ప్రభువు సెలవిచ్చునది ఏమనగా, నా సేవకుడును బబులోనియా రాజునైన నెబుకద్నెసరును ఇచటికి గొనివత్తును. అతడు నేను పాతిపెట్టిన ఈ రాళ్ళపై తన సింహాసనమును నిర్మించి తన గుడారమును పన్నును.

11. అతడిచటికి వచ్చి ఐగుప్తును జయించును. అపుడు అంటురోగము వాతబడువారు అంటురోగము వలన చత్తురు. బందీలుగా గొనిపోబడువారు బందీలుగా వెళ్ళిపోవుదురు. పోరున చచ్చువారు పోరున చత్తురు.

12. నేను ఐగుప్తు దైవముల గుళ్ళకు నిప్పు అంటింతును. బబులోనియారాజు ఆ దైవములను తగులబెట్టనైన తగులబెట్టును, లేదా ఎత్తుకొనిపోనైన పోవును. గొఱ్ఱెలకాపరి తన బట్టలనుండి పేలను విదిలించినట్లే బబులోనియా రాజు ఐగుప్తును విదిలించి విజయము బడసి వెడలిపోవును.

13. అతడు ఐగుప్తు లోని సూర్య నగరమునందలి పవిత్ర శిలాస్తంభములను విరుగగొట్టును. ఆ దేశపు దేవతలగుళ్ళను కాల్చి వేయును.' "

Text Example

1. ఐగుప్తునందలి మీగ్డోలు, తహపనేను, నోపు, పత్రోసు మొదలైన నగరములలో వసించు యూదులందరిని గూర్చి యిర్మీయాతో ప్రభువు ఇట్లు చెప్పెను:

2. “సైన్యములకధిపతియు యిస్రాయేలు దేవుడైన ప్రభువు పలుకులివి: నేను యెరూషలేముమీద, యూదానగరములన్నిటిమీద తెచ్చిపెట్టిన వినాశనమును మీరు స్వయముగా చూచితిరి. ఆ నగరములిప్పటికిని పాడువడి ఉన్నవి. వానిలో ఎవడును వసించుట లేదు.

3. ఆనగరముల పౌరులు దుష్కార్యములు చేసి నాకు కోపము రప్పించిరి. వారు అన్యదైవములకు బలులర్పించిరి. తాముగాని, మీరుగాని, మీ పూర్వులు గాని ఎరుగని దైవములను కొలిచిరి.

4. నేను విడువక సదా వేకువనే నా సేవకులైన ప్రవక్తలను మీ చెంతకు పంపుచునేయుంటిని. నేను అసహ్యించుకొను ఈ ఘోరకార్యమును చేయవలదు అని వారు మిమ్ము హెచ్చరించుచునే యుండిరి.

5. కాని మీరు వారి పలుకులను లెక్కచేయలేదు. అన్యదైవములకు బలులు అర్పించు దుష్కార్యములను మానలేదు.

6. కావున నేను నా రౌద్రమును యూదా నగరముల మీదను, యెరూషలేము మీదను కుమ్మరించి వానిని కాల్చివేసి తిని. అవి నాశనమై ఎడారులై నేటికిని అటులనే ఉన్నవి.

7. కావున సైన్యములకధిపతియు యిస్రాయేలు దేవుడనైన నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను. మీరీ దుష్కార్యములుచేసి కీడు తెచ్చుకోనేల? మీరు స్త్రీలను, పురుషులను, పిల్లలను, చంటిబిడ్డలను నాశనముచేసి మీ జనులలో ఎవరును మిగులకుండునట్లు చేయుదురా?

8. మీరు వలసవచ్చిన ఈ ఐగుప్తున అన్య దైవములకు బలులర్పించి, విగ్రహములను పూజించి నా కోపమును రెచ్చగొట్టనేల? మిమ్ము మీరే నాశనము చేసికొందురా? భూమిమీది జాతులన్నియు మిమ్ము జూచి నవ్వవా? జనులు మీ పేరును శాపవచనముగా వాడుకొనరా?

9. యూదా నగరములలోను, యెరూషలేము వీధులలోను మీ పూర్వులును, యూదా రాజులును, వారి భార్యలును, మీరును, మీ భార్యలును చేసిన దుష్కార్యములను మీరు మరచిపోయితిరా?

10. నేటివరకును మీకు వినయముగాని, దైవ భయముగాని అలవడలేదు. నేను మీకును మీ పూర్వులకును విధించిన ధర్మశాస్త్రమును, కట్టడలను మీరు పాటింపలేదు.

11. “కనుక సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడనైన నేను యూదావారినందరిని నాశనము చేయ నేను మీకు అభిముఖుడనగుదును.

12. యూదీయులలో మిగిలియున్నవారు ఐగుప్తున వసింపగోరుచున్నారు. నేను వారినందరిని నాశనము చేయుదును. అల్పులును, అధికులందరును ఐగుప్తున పోరు వలనగాని, ఆకలివలనగాని చత్తురు. ప్రజలు వారి దుర్గతి చూచి భీతిల్లుదురు. వారిని చూచి నవ్వుదురు. వారి పేరును తిట్టుగా వాడుకొందురు.

13. యెరూషలేము వాసులవలె ఐగుప్తున వసించు వారిని గూడ నేను పోరు, ఆకలి, అంటురోగములతో శిక్షింతును.

14. యూదీయులలో మిగిలియుండి ఐగుప్తునకు వలస వచ్చిన వారిలో ఒక్కడును మిగులడు. వారు మరల యూదాలో వసింపగోరుచున్నారు. కాని వారిలో ఒక్కడును అక్కడకు తిరిగిపోడు. కొద్దిమంది శరణాగతులు తప్ప ఎవరును అచటికి వెళ్ళరు."

15. అప్పుడు తమ భార్యలు అన్య దైవములకు ధూపము వేసితిరని తెలిసిన పురుషులును, అచట నిలుచుండియున్న స్త్రీలును, పత్రోసున వసించు యూదులును వారందరును కలిసి పెద్ద సమూహమై యిర్మీయాకు ఇట్లు బదులిచ్చిరి.

16. “నీవు ప్రభువు పేరు మీదుగా చెప్పిన సంగతులను మేము విననొల్లము.

17. మేము చేయదలచుకొన్న కార్యములెల్ల చేయుదుము. మేము ఆకాశరాజ్ఞీకి ధూపము వేతుము. ద్రాక్షసారాయమును పానీయార్పణముగా పోయుదుము. పూర్వము మేము, మా పూర్వులును, మా రాజులును, మా నాయకులును యూదా నగరములలోను, యెరూషలేము వీధులలోను ఆలాగు చేసినపుడు మాకు చాలినంత తిండి దొరికెను. మేము ఏ చిక్కులకను గురికాక క్షేమముగా ఉంటిమి.

18. కాని మేము ఆకాశరాజ్ఞీకి ధూపము వేయుటయు, పానీయార్పణముగావించుటయు మానివేసిన వెంటనే కటిక పేదలమైతిమి, మాప్రజలు పోరువలనను, ఆకలి వలనను చచ్చిరి

19. మరియు అచటి స్త్రీలు "మేము ఆకాశరాజ్ఞీ ఆకారమున మోదకములు చేసినపుడును, ఆమెకు ధూవమువేసి, పానీయార్పణమును గావించునపుడును మా పురుషుల అనుమతిలేకయే చేయుచున్నామా?” అని అనిరి. -

20. అచటి స్త్రీలు పురుషులు ఈ రీతిగా జవాబు చెప్పగా యిర్మీయా వారితో ఇట్లనెను:

21. “మీరును మీ పూర్వులును, మీ రాజులును, నాయకులును, ప్రజలును, యూదా నగరములలోను, యెరూషలేము వీధులలోను అర్పించిన ధూపమును ప్రభువు గుర్తింప లేదనుకొంటిరా?

22. ఇందువలననే నేడు మీ దేశము ఎడారియయ్యెను. ప్రజలు దాని దుర్గతిని చూచి భీతిల్లి దానిని శాపవచనముగా వాడుకొనుచున్నారు. ప్రభువు మీ దుష్కార్యములను సహించకపోవుటవలననే ఇదంతయు జరిగినది.

23. మీరు అన్యదైవములకు అర్పణములర్పించి ప్రభువునకు ద్రోహము చేసి, ఆయన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, ఒడంబడికను మీరితిరి కనుక ఈ అనర్గము వాటిల్లినది.”

24. అంతట యిర్మీయా అచటి ప్రజలకు, ప్రత్యే కముగా స్త్రీలకు ఇట్లు చెప్పెను: “సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఐగుప్తు లోని యూదులతో ఇట్లనుచున్నాడు:

25. మీరును, మీ భార్యలును ఆకాశరాజ్ఞీకి ప్రమాణములు చేసితిరి. ఆమెకు మీరు ధూపమువేసి, పానీయార్పణము కావింతుమని ఆమెకు బాసచేసితిరి. మీ ప్రమాణములను నెరవేర్చుకొంటిరి. సరే, ఇక మీ ప్రమాణములను నిలబెట్టుకొనుడు. మీ వ్రతములు తీర్చుకొనుడు.

26. కాని ప్రభుడనైన నేను ఐగుప్తులోని యూదులను పురస్కరించుకొని నా జీవముతోడు అని నేను చేయు ఈ ప్రమాణమును గుర్తింపుడు. మీలో ఎవడును ఇక నా నామము నోటపలుకరని నా మహానామము మీదుగా నేను ప్రమాణము చేయుచున్నాను.

27. మీరు వృద్ధిలోకిరారుకదా, సర్వనాశనమయ్యెదరు. మీరు పోరు, అంటురోగముల వలన చత్తురు. మీలో ఎవడును మిగులడు.

28. మీలో కొద్దిమంది మాత్రమే చావు తప్పించుకొని ఐగుప్తునుండి యూదాకు తిరిగి పోవుదురు. అప్పుడు ప్రాణములతో బ్రతికియుండి ఐగుప్తున వసించుటకు వెళ్ళిన యూదీయులలో మిగిలియున్నవారు నా మాట నెగ్గునో, తమ మాట నెగ్గునో తెలిసికొందురు.

29. ప్రభుడనైన నేను ఈ తావున మిమ్ము శిక్షించి తీరుదునని రూఢిగా తెలియజేయుచున్నాను. నేను మిమ్ము నాశనము చేయుదునని చేసిన ప్రమాణము నెరవేరి తీరును.

30. నేను యూదారాజైన సిద్కియాను అతని విరోధియు, అతనిని చంపగోరువాడునైన బబులోనియా రాజు నెబుకద్నెసరు చేతికి అప్పగించితిని. ఆ రీతినే ఐగుప్తు రాజైన హోఫ్రను, అతనిని చంపగోరు విరోధులచేతికి అప్పగింతును.”

Text Example

1. యోషీయా కుమారుడైన యెహోయాకీము యూదాను పరిపాలించిన నాలుగవయేట బారూకు నేను చెప్పిన ఈ సంగతులనెల్ల లిఖించెను.

2. నేనతనితో “బారూకూ! యిస్రాయేలు దేవుడైన ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు:

3. 'నాకు నిరాశ పుట్టుచున్నది. ప్రభువు నాకు బాధలతోపాటు విచారమును తెచ్చిపెట్టెను. నేను దుఃఖించి దుఃఖించి, అలసిపోతిని. నాకు విశ్రాంతి లభింపదయ్యెను' అని నీవు పలుకు చున్నావు.

4. కాని ప్రభుడనైన నేను, నేను నిర్మించిన దానిని కూలద్రోయుదును. నేను నాటిన దానిని పెల్లగింతును. నేను భూమి అంతటికిని ఇట్లే చేయుదును.

5. నీవొక్కడవే ఈ బాధలను తప్పించుకోజూచుచున్నావా? అటులచేయవలదు. నేను ప్రజలందరిని నాశనము చేయుదును. నీవు మాత్రమెచటికి వెళ్ళినను ప్రాణములతో బ్రతికెదవు. ఇది ప్రభుడనైన నా వాక్కు”

Text Example

1. అన్యజాతులకు ప్రతికూలముగా ప్రభువు యిర్మీయాకు వినిపించిన దైవోక్తులు.

2. ఐగుప్తును గూర్చి యెహోయాకీము యూదాను పరిపాలించిన నాలుగవయేట బబులోనియా రాజైన నెబుకద్నెసరు యూఫ్రటీసు నదీతీరమునందలి కర్కెమీషు నగరమున ఐగుప్తురాజైన నెకో సైన్యమును ఓడించెను. ఈ సైన్యమును గూర్చి ప్రభువిట్లు నుడివెను:

3. “ఐగుప్తు సైన్యాధిపతులు తమ సైనికులతో మీరు మీ డాళ్ళను కవచములను సిద్ధము చేసికొని యుద్ధమునకు బయలుదేరుడు,

4. గుఱ్ఱములకు జీను వేసి వానిపై ఎక్కుడు. బారులుతీరి శిరస్త్రాణములు ధరింపుడు. మీ బల్లెములకు పదును పెట్టుడు. కవచములు ధరింపుడు' అని చెప్పుచున్నారు.

5. కాని ప్రభువిట్లు ప్రశ్నించుచున్నాడు: నాకేమి కన్పించుచున్నది? ఐగుప్తీయులు భయముతో వెనుదిరుగుచున్నారు. వారి సైనికులు వెన్నిచ్చి పారిపోవుచున్నారు. వెనుదిరిగి చూచుటకుకూడ సాహసింపక, భయకంపితులై పరుగెత్తుచున్నారు. ఎటుచూచినను భయమే కన్పించుచున్నది.

6. వేగముగా పరుగెత్తువారు తప్పించుకోలేరు. శూరులు తమ ప్రాణములు కాపాడుకోలేరు. ఉత్తర దిక్కున, యూఫ్రటీసు నదిఒడ్డున వారు కాలుజారిపడుదురు.

7. నైలునదివలె పొంగిపారు ఈ దేశమెద్ది? అంచులదాక ప్రవహించు నదివలె చూపట్టు దేశమెద్ది?

8. ఈ దేశము ఐగుప్తు. దాని దండు నైలునదివలె పొంగిపారుచున్నది. అంచులదాక పారు నదివలె చూపట్టుచున్నది. ఐగుప్తు 'నేను పొంగి ప్రపంచమును ముంచివేసెదను. పురములను, వాని పౌరులనునాశనము చేసెదను.

9. నా గుఱ్ఱములను స్వారి చేయించెదను. నా రథములను వేగముగా పరుగెత్తించెదను. నా సైనికులను పోరునకు పంపెదను. కూషు, పూటు వీరులు డాళ్ళతో పోవుదురు. లూదు వీరులు ధనస్సులతో పోవుదురు' అని తలంచెను.

10. ఇది సైన్యములకధిపతియైన ప్రభువు దినము. ఈ దినము ఆయన విరోధులకు ప్రతీకారము చేయును. శత్రువులను శిక్షించును. ఆయన ఖడ్గము వారిని భుజించి తృప్తిచెందును. వారి నెత్తురు త్రాగి తన కోర్కె తీర్చుకొనును. ఈ దినము సైన్యములకధిపతి ఉత్తరదిక్కు యూఫ్రటీసు నదిచెంత బలిపశువులను అర్పించును.

11. ఐగుప్తు జనులారా! మీరు ఔషధముకొరకు గిలాదునకు పొండు. మీరెన్ని ఔషధములు వాడినను లాభములేదు. ఏ ఔషధమును మీ వ్యాధి కుదర్చలేదు.

12. జాతులు మీ అవమానముగూర్చి వినెను. ఎల్లరును మీ ఆర్తనాదమును ఆలించిరి. మీ సైనికులు ఒకరిమీదొకరుపడి ఎల్లరును నేలకొరుగుచున్నారు.”

13. బబులోనియా రాజగు నెబుకద్నెసరు ఐగుప్తును ముట్టడించుటకు రాగా ప్రభువు నాతో ఇట్లు చెప్పెను:

14. “మీరు ఐగుప్తు నగరములలోను, మీగ్డోలు, నోపు, తహపనేసు పట్టణములలోను ఇట్లు ప్రకటింపుడు 'మీరు ఆత్మరక్షణకు సిద్ధముకండు. మీరు పోరున చత్తురు.”

15. మీలో యోధులైనవారు ఏల తుడుచుపెట్టుకొనిపోయిరి? వారు నిలువలేకున్నారు. ఎందుకన ప్రభువు వారిని అణగదొక్కెను.

16. మీ సైనికులు కాలుజారిపడిపోయిరి. వారు లెండు, మనము మన దేశమునకును, మన జనులయొద్దకును పారిపోవుదము. శత్రువుల కత్తిబారినుండి తప్పించుకొందము అని ఒకరితోనొకరు చెప్పుకొనుచున్నారు.

17. మీరు ఐగుప్తురాజునకు క్రొత్త పేరు పెట్టుడు. తన అవకాశమును జారవిడుచుకొనిన మాటలకోరు అని అతనిని పిలువుడు.

18. నేను సైన్యములకు అధిపతియైన ప్రభువును, రాజును, సజీవుడైన దేవుడను. కొండలన్నింటికంటె తాబోరు కొండ ఎత్తు. కర్మెలుకొండ కడలికి పైన నిలిచియుండును. ఆ రీతినే మీమీదికి దండెత్తి వచ్చువాడు మీకంటెను బలాఢ్యుడు.

19. ఐగుప్తీయులారా! మీరు బందీలగుటకు సిద్ధముకండు. నోపు ఎడారియగును, అచటెవరును వసింపరు.

20. ఐగుప్తు మెరుగైన ఆవు వంటిది. కాని ఉత్తరమునుండి వచ్చిన జోరీగ దానిని కుట్టుచున్నది.

21. ఐగుప్తు అరువు తెచ్చుకొన్న సైనికులుకూడ పెయ్యలవలె చేతకానివారు. వారు పోరున నిలువజాలరైరి. ఎల్లరును వెన్నిచ్చి పారిపోయిరి. వారికి వినాశకాలము ప్రాప్తించినది. మరణదినము ఆసన్నమైనది,

22. శత్రు సైన్యము ఐగుప్తును సమీపించుచున్నారు ఆ సైన్యము చెట్లను నరుకు వారివలె గొడ్డళ్ళతో వచ్చి దానిమీద పడుచున్నారు. వినుడి! ఐగుప్తీయుల పలాయనము పాము ప్రాకిపోవునపుడు చేయు శబ్దమువలెనున్నది.

23. వారు ఐగుప్తును దట్టమైన అడవినివలె నరకుచున్నారు. ఆ శత్రు సైన్యము మిడుతలదండువలె లెక్కలకందనిది.

24. ఐగుప్తుకుమారి అవమానపరుపబడును. ఉత్తర దిక్కు నుండి వచ్చువారు ఆమెను జయింతురు. ఇదే ప్రభుడనైన నా వాక్కు".

25. సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను నోపు నగరపు దైవమగు ఆమోనును, ఐగుప్తును, దాని దైవములను, రాజులను శిక్షింతును. ఐగుప్తు రాజును అతని మీద ఆధారపడిన వారిని గూడ శిక్షింతును.

26. ఆ రాజును అతనిని చంపగోరు బబులోనియా రాజు నెబుకద్నెసరునకును, అతని సైనికులకులకును ఒప్పగింతును. కానీ కాలము కడచినపిదప ప్రజలు పూర్వకాలమువలె మరల ఐగుప్తున వసింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

27. నా సేవకుడైన యాకోబూ! నీవు భయపడకుడు. యిస్రాయేలీయులారా! మీరు భయపడకుడు. దూరముననున్న దేశమునుండియు మీరు బానిసలుగానున్న దేశమునుండియు నేను మిమ్ము రక్షింతును. మీరు తిరిగివచ్చి క్షేమముగా జీవింతురు, భద్రముగా మనుదురు. ఎవరును మిమ్ము మరల భయపెట్టజాలరు.

28. నేను మీతో నుండి మిమ్ము రక్షింతును. నేను మిమ్ము ఏ జాతుల మధ్య చెల్లాచెదరు చేసితినో, వారినెల్ల శిక్షింతును, మిమ్ము మాత్రము కాపాడుదును. నేను మిమ్ము శిక్షింపక మానను. కాని మిమ్ము స్వల్పముగా దండించి వదలివేయుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు

Text Example

1. ఐగుప్తురాజు గాజాను ముట్టడింపక ముందు ఫిలిస్తీయాను గూర్చి ప్రభువు నాతో ఇట్లనెను:

2. "అదిగో! ఉత్తరదిక్కున నీళ్ళు ఉబుకుచున్నవి. అవి నదివలె పొంగిపారును. అవి దేశమును, దానిలోని వస్తుజాలమును, నగరములను, పౌరులను ముంచివేయును. ప్రజలు ఆర్తనాదము చేయుదురు. నేలమీది నరులెల్లరును శోకింతురు.

3. వారు గుఱ్ఱముల డెక్కలచప్పుడు విందురు. రథముల ధ్వానమును, రథచక్రముల నాదము నాలింతురు. తండ్రులు తమ బిడ్డలవైపు తిరిగి చూడరు. వారి చేతులు చచ్చుపడును.

4. ఫిలిస్తీయాను నాశనముచేయు సమయము, తూరు సీదోనుల నుండి సాయమందకుండ చేయుకాలము ఆసన్నమైనది. ప్రభుడనైన నేను ఫిలిస్తీయాను నాశనము చేయుదును. కఫ్తారు ద్వీపమునుండి వచ్చినవారిని తెగటార్తును.

5. గాజా పౌరులు శోకమున మునిగిరి. అష్కేలోను ప్రజలు నాశనమైరి. ఫిలిస్తీయాలో మిగిలినవారు, ఇంకా ఎంత కాలము దుఃఖింతురు?

6. ప్రభువు ఖడ్గమా! నీవెంతకాలము మమ్ము నరుకుదువు? నీవు నీ ఒరలోనికి దూరి, అచట విశ్రమింపుము అని మీరు పలుకుచున్నారు.

7. కాని నేను దానికి పని ఒప్పచెప్పగా అదెట్లు విశ్రమింపగలదు? అష్కెలోనున, సముద్రతీరమున వసించువారిని శిక్షింపుమని నేను దానికాజ్ఞయిచ్చితిని."

Text Example

1. సైన్యములకు అధిపతియైన ప్రభువు మోవాబును గూర్చి యిట్లనెను: “నెబోనకు అనరము వాటిల్లినది, అది నాశనమైనది. కిర్యతాయిము విరోధులకు చిక్కినది. దాని కోట కూలినది. దాని ప్రజలు గగ్గోలు పెట్టిరి.

2. మోవాబు వైభవము అంతరించినది. శత్రువులు హెష్బోనును జయించిరి. రండు, మోవాబు జాతిని నాశనము చేయుదమనెదరు. మద్మేను నేల మట్టమగును. శత్రుసైన్యములు దాని మీదికి దండెత్తుదురు.

3. మాకు వినాశము, హింస దాపురించినవి, అని హోరోనాయిము ప్రజలు అరచుచున్నారు.

4. మోవాబు ధ్వంసమయ్యెను. అందలి పిల్లల ఏడుపులు ఆలింపుడు.

5. లూహితునకు ఎక్కిపోవు త్రోవవెంట ప్రజల దీనాలాపములు ఆలింపుడు. హోరోనాయిమునకు దిగిపోవు మార్గమువెంట జనుల శోకాలాపములు వినుడు.

6. వారు, మీరు శీఘ్రమే పారిపొండు. ఎడారిలోని అరూహ వృక్షమువలె ఉండుడి.

7. మోవాబూ! నీవు నీ కోటలను, సంపదలను నమ్మితివి. కాని శత్రువులిపుడు నిన్ను జయింతురు. నీ దేవుడైన కెమోషు తన యాజకులతోను అధికారులతోను ప్రవాసమునకు పోవును.

8. ఒక్క నగరమును వినాశనమును తప్పించుకోజాలదు. లోయయు మైదానమును నాశనమగును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

9. మోవాబునకు సమాధి సిద్ధముచేయుడు. అది త్వరలోనే నాశనమగును. దాని నగరములు ఎడారులగును. వానిలో ఇక ఎవరును వసింపరు.

10. పూర్ణహృదయముతో ప్రభువు కార్యమును నెరవేర్చనివాడు శాపగ్రస్తుడు అగును. కత్తితో జనులను నరకనివాడు శాపగ్రస్తుడగును.

11. ప్రభువిట్లనెను: మొదటినుండియు మోవాబు సురక్షితముగా జీవించెను. ఆ దేశము ప్రవాసమును ఎరుగదు. అది ఏకపాత్రమున కుదురుకొనియున్న ద్రాక్షసారాయము వంటిది. దానిని పాత్రనుండి పాత్రలోనికి పోయరైరి. కనుక దాని సువాసన అంతరింపలేదు, రుచి చెడిపోలేదు.

12. కాని నేను శత్రువులను పంపు సమయము వచ్చినది. పాత్రమునుండి ద్రాక్ష సారాయమువలె వారు మోవాబును కుమ్మరింతురు. వారు మోవాబు ద్రాక్షరస పాత్రములను ఖాళీ చేసి వానిని పగులగొట్టుదురు.

13. అపుడు యిస్రాయేలీయులు తాము నమ్ముకొనిన బేతేలు దేవతను చూచి నిరాశచెందినట్లే మోవాబీయులు, తాము కొలుచు కెమోషును చూచి నిరాశ చెందుదురు.

14. మోవాబీయులారా! మీరు మేము శూరులమనియు పోరున కాకలుతీరిన యోధులమనియు చెప్పుకోనేల?

15. మోవాబు, దాని నగరములు నాశనమైనవి. దాని యువజనులలో మెరుగైనవారు కూలిరి. రాజును, సైన్యములకు అధిపతియును ప్రభుడనైన నా వాక్కిది.

16. మోవాబు త్వరలో కూలును. దాని వినాశనము చేరువలోనే యున్నది.

17. మోవాబు దరిదాపులలో నివసించు జనులారా! దాని ప్రశస్తిని ఎరిగిన వారలారా! మీరు ఆ దేశము కొరకు విలపింపుడు. దాని పరిపాలనము ముగిసినదనియు దాని వైభవము అంతరించినదనియు పలుకుడు.

18. దీబోనున వసించుదానా! నీవు నీ సింహాసనము మీదినుండి దిగివచ్చి క్రింది దుమ్ములో చతికిలబడుము. మోవాబును నాశనముచేయువాడు రానేవచ్చెను. అతడు దాని కోటలను కూల్చెను.

19. అరోయేరున వసించుదానా! నీవు త్రోవ ప్రక్కన నిలుచుండి పారిపోవు వారిని ఏమి జరిగినదో అడుగుము.

20. వారు మోవాబు కూలి అవమానము చెందినది. మీరు దాని కొరకు విలపింపుడు, మోవాబు పాడువడినదని , అర్నోను నదీ తీరమున విన్నింపుడు అని చెప్పుదురు.

21-24. పీఠభూమిలోని హోలోను, యాహాసు, మేపాతు, దీబోను, నేబో, బేత్ దిబ్లతాయీము, కిర్యతాయీము, బేత్గాములు, బేత్మెయోను, కెరీయోతు, బోస్రా నగరములు దైవశిక్షకు గురియైనవి.

25. మోవాబు పురములన్నియు దైవదండనమునకు గురియైనవి. ఆ దేశముయొక్క శక్తి అంతరించినది. దాని బలముడిగినది. ఇది ప్రభుడనైన నా వాక్కు.

26. ప్రభువిట్లు చెప్పెను: మోవాబును త్రాగి మత్తెక్కనిండు. అది నా మీద తిరుగబడెను. అది తనవమనము నందే తాను పడిపోయి పొర్లాడుచున్నది. ఎల్లరును దానిని చూచి నవ్వుదురు.

27. మోవాబూ! నీవు యిస్రాయేలీయులను గేలిచేసితివికదా! వారిని దొంగలతో సమానముగా నెంచి ఎగతాళి చేసితివికదా!

28. మోవాబీయులారా! . మీరిక నగరములను విడనాడి కొండ శిఖరములలో వసింపుడు. లోయ అంచున గల కొండ కొమ్ములలో ఈ గూళ్ళు కట్టుకొను గువ్వలవలె కండు.

29. మోవాబునకు అమితముగా పొగరెక్కినది. దానికి కన్నులు నెత్తికి వచ్చినవి. ఎంత కండకావరము! ఎంత తలబిరుసుతనము! అది తనను గూర్చి తానెంత ఘనముగా ఎంచుచున్నది!

30. ప్రభుడనైన నాకు దాని గర్వము తెలియును. దాని ప్రగల్పములలో సారము లేదు దాని విజయములు నిలుచునవి కావు.

31. కావున నేను మోవాబు కొరకును దాని ప్రజలందరి కొరకును విలపింతును. కీర్హేరెసు జనులకొరకు శోకింతును.

32. నేను యాసేరు ప్రజల కంటెను . సిబ్మా ప్రజల కొరకు ఎక్కువగా దుఃఖింతును. సిబ్మా నగరమా! నీ ద్రాక్షతీగలు మృతసముద్రముగుండ యాసేరువరకు అల్లుకొనినవి. కాని ఇపుడు శత్రువులు వచ్చి నీ వేసవిపంటను నీ ద్రాక్షాఫలములను నాశనము చేసిరి.

33. సారవంతమైన మోవాబునకు ఇక ఆనందోల్లాసములు లేవు. అచట ద్రాక్షపండ్లను తొక్కించు గానుగలనుండి ద్రాక్షారసము ఇక ప్రవహింపదు. ద్రాక్షాఫలములను తొక్కించువారుకాని, ఆనందముతో కేకలిడువారుకాని ఇకకన్నింపరు.

34. హెష్బోను ఎల్ అలెహ ప్రజలు కేకలిడుచున్నారు. వారి కేకలు యాహాసు వరకును వినిపించుచున్నవి. సోవరు ప్రజలు ఆ కేకలను ఆలించుచున్నారు. హోరోనాయిము, ఎగ్లాత్షేలీష్యా ప్రజలును వారి అరపులను ఆలించుచున్నారు. నిమ్రీము నది ఎండిపోయినది.

35. నేను మోవాబీయులు తమ దేవతలకు కొండలమీద బలులను, దహనబలులను అర్పింపకుండ అడ్డుపడుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు,

36. నాహృదయము మోవాబు కొరకును కీర్హేరెసు ప్రజల కొరకును శోకించుచున్నది. నా శోకము పిల్లనగ్రోవిమీద పాడు శోకగీతము వలెనున్నది. ఆ ప్రజల సొత్తంతయు నాశనమైనది.

37. వారు తలలు గొరిగించుకొని గడ్డములు కత్తిరించుకొనిరి. తమ చేతులమీద గాయములు చేసికొని గోనెలు తాల్చిరి.

38. మోవాబు మిద్దెలమీద, వీధులలో, శోకాలాపములు వినిపించుచున్నవి. నేను మోవాబును ఎవరికిని అక్కరకురాని కుండవలె పగులగొట్టితిని.

39. మోవాబు ధ్వంసమైనది. మీరు విలపింపుడు. మోవాబు నాశనమై అవమానము పాలైనది. ఇరుగుపొరుగు జాతులన్నియు దానిని చూచి భయపడుచున్నవి. ఇది ప్రభుడనైన నా వాక్కు."

40. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు: ఒకానొకజాతి, రెక్కలు విప్పిన గరుడపక్షివలె దిగివచ్చి మోవాబు మీద వాలును.

41. దాని నగరములును కోటలును పట్టువడును. ఆ దినమున మోవాబు సైనికులు ప్రసవించెడు స్త్రీవలె భయపడుదురు.

42. నా మీద తిరుగబడినది. కనుక మోవాబు నాశనమగును. అది యిక ఒక జాతిగా మనజాలదు.

43. భీతియు, ఉరులును, గోతులును మోవాబు కొరకు కాచుకొనియున్నవి. ఇవి ప్రభువు పలుకులు.

44. భీతినుండి తప్పించుకొనినవాడు గోతిలోకూలును. గోతినుండి బయటకి వచ్చినవాడు ఉరులలో చిక్కుకొనును. ప్రభువు మోవాబును నాశనము చేయుటకు కాలము నిర్ణయించెను.

45. నిస్సహాయులైన శరణాగతులు హెష్బోనున తలదాచుకో గోరుచున్నారు. కాని ఆ నగరమునకు నిప్పంటుకొనినది. సీహోనురాజు ప్రాసాదము తగులబడుచున్నది. యుద్ధప్రియులైన మోవాబీయుల పొలిమేరలను కొండకొమ్ములను అగ్గి మాడ్చివేసినది.

46. మోవాబునకు అనర్ధము వాటిల్లును. కెమోషును కొల్చిన ప్రజలు నాశనమగుదురు. వారి పుత్రీపుత్రులను బందీలుగా కొనిపోయెదరు.

47. కాని రాబోవు దినములలో ప్రభుడనైన నేను, మోవాబునకు అభ్యుదయమును ఒసగుదును. మోవాబునకు ఈ శిక్షలెల్లపడును.”

Text Example

1. అమ్మోనును గూర్చి ప్రభువిట్లు చెప్పెను: యిస్రాయేలునక కుమారులు లేరా? అతనికి వారసులు లేకపోయెనా? వారు తమ దేశమును ఎందుకు కాపాడుకోలేదు? అమ్మోనురాజు గాదును ఏల భుక్తము చేసుకొనెను? అతని ప్రజలు దాని నగరములలో ఏల వసింతురు?

2. నేను రాజధానియైన రబ్బానగరము యుద్ధనాదమును ఆలించునట్లు చేయు రోజులు వచ్చుచున్నవి. అది నాశనమగును, దాని గ్రామములు కాలి నేలమట్టమగును. అపుడు యిస్రాయేలీయులు తమ దేశమును ఆక్రమించుకొనిన వారివద్దనుండి తమ దేశమును తిరిగి స్వాధీనము చేసికొందురు.

3. హెష్బోను పౌరులారా! విలపింపుడు. హాయి నాశనమైనది. రబ్బా మహిళలారా! శోకింపుడు. గోనెతాల్చి శోకగీతమును ఆలపింపుడు. కలవరముతో అటునిటు పరుగెత్తుడు. మీ దేవుడైన మోలెకును అతని యాజకులతోను అధిపతులతోను ప్రవాసమునకు కొనిపోవుదురు.

4. విశ్వాసఘాతకులైన మీ ప్రజలు ప్రగల్భములు పల్కనేల? మీరు మీ శక్తిని నమ్ముకొని మమ్మెవరు ముట్టడింపగలరని పల్కుచున్నారు.

5. నేను నలువైపులనుండి , మీ మీదికి భీతినిగొని వత్తును. మీలో ప్రతివాడు బ్రతుకుజీవుడా అని పారిపోవును. మీ సైన్యమును మరల ప్రోగుజేయు వాడెవడును ఉండడు. కాని కాలము గడచిన పిదప

6. నేను అమ్మోనునకు మరల అభ్యుదయమును ఒసగుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు."

7. ఎదోమును గూర్చి ప్రభువిట్లు నుడివెను: “తేమాను ప్రజల విజ్ఞానము అంతరించెనా? వారి జ్ఞానులు ఉపదేశము చేయలేరా? వారి తెలివి అడుగంటెనా?

8. దెదాను పౌరులారా! మీరు పారిపోయి దాగుకొనుడు. ఏసావు వంశజులను శిక్షించుకాలము వచ్చినది. కనుక నేను వారిని దండింపపూనుకొంటిని.

9. ద్రాక్షపండ్లు కోయువారు కొన్ని పండ్లు వదలివేయుదురు. రాత్రిలో దొంగలించువారు వారికి వలసిన వస్తువులను మాత్రమే కొనిపోవుదురు.

10. కాని నేను ఏసావు వంశజులను పూర్తిగా కొల్లగొట్టుదును. వారు దాగియుండు తావులను బట్టబయలు చేయుదును. కనుక వారిక దాగుకోజాలరు. ఎదోమీయులెల్లరును నాశనమైరి. వారిలో ఎవడును మిగులడు.

11. మీరు మీ అనాధశిశువులను నాకు ఒప్పగింపుడు నేను వారిని కాపాడుదును. మీ వితంతువులను నేను సంరక్షింతును.

12. శిక్షకు గురిగానక్కరలేని వారుకూడ తప్పక శిక్ష అనుభవించుచుండగా, మరి మీరు మాత్రము దండన నెట్లు తప్పించుకొందురు? మీరు శిక్షాపాత్రములోని పానీయమును త్రాగితీరవలెను.

13. బోస్రా నగరము ఎడారి అగును. ప్రజలు దానిని చూచి వెరగందుదురు. దానిని ఎగతాళి చేయుదురు. దాని పేరును తిట్టుగా వాడు కొందురు. దాని చుట్టుపట్లనున్న గ్రామములును పాడగును. ఇది ప్రభుడనైన నా వాక్కు”

14. ఎదోమూ! ప్రభువు నుండి నేను ఈ సందేశము వింటిని. ప్రభువు వార్తావహుని జాతులవద్దకు పంపెను. వారెల్లరును సైన్యములతో నీ మీదికి వచ్చి దాడిచేయవలెనని కబురు చెప్పించెను.

15. ప్రభువు నీ బలమును నాశనము చేయును. నిన్ను జాతులలో బలహీనపరచి తృణీకారమునకు గురిచేయును.

16. నీ గర్వమే నిన్ను పెడత్రోవ పట్టించినది. నీవు తలచినట్లుగా ఇతరులు నీకు భయపడుటలేదు. మీరు ఎత్తయినకొండ కొమ్ములమీద వసింతురు. మీరు గరుడ పక్షివలె ఉన్నతమున వసించినను ప్రభువు మిమ్ము క్రింద పడత్రోయును. ఇది ప్రభువు వాక్కు

17. ప్రభువు ఇట్లనెను: “ఎదోము పాడువడును. దానిని చూచినవారెల్ల వెరగంది విస్తుపోవుదురు.

18. సొదొమ గొమొఱ్ఱాలకును, వాని దాపులోని నగరములకును పట్టిన దుర్గతియే ఎదోమునకును పట్టును. అచట ఇక ఎవడును వసింపడు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

19. సింహము యోర్దాను నదీతీరమునందలి దట్టమైన అడవులలోనుండి బయలుదేరి, పచ్చని పంట పొలములలోనికి వచ్చినట్లే, నేనును ఎదోమీయుల మీదికి వచ్చెదను. వారు నాకు వెరచి తమ దేశమునుండి పారిపోవుదురు. అపుడు నేనెన్నుకొనిన నాయకుడు ఆ భూమినేలును, నాతో పోల్చదగిన వాడెవడు? నన్ను సవాలు చేయువాడెవడు? నన్నెదిరింపగలవాడెవడు?

20. నేను ఎదోమీయులకు ఏమి చేయుదునో వినుడు. తేమాను పౌరులకు ఏమిచేయుదునో ఆలింపుడు. విరోధులు వారి పిల్లలను కూడ ఈడ్చుకొని పోవుదురు. ఎల్లరును వారిని చూచి భీతిల్లుదురు.

21. ఎదోము కూలినపుడు భీకరనాదముప్పతిల్లగా భూమి కంపించును. ఆ దేశము ఆర్తనాదము రెల్లు సముద్రము వరకు విన్పించును.

22. గరుడపక్షి రెక్కలు విప్పి దిగివచ్చినట్లే శత్రువులు బోస్రామీది కెత్తివత్తురు. ఆ దినమున ఎదోము సైనికులు, ప్రసవించు స్త్రీవలె భీతిల్లుదురు.

23. ప్రభువు దమస్కు గూర్చి ఇట్లనెను: “హమాతు అర్పాదు నగరముల ప్రజలు ఘోరవార్తలు విని కలవరముచెందిరి. వారు విచార సాగరమున మునిగి శాంతిని కోల్పోయిరి.

24. దమస్కు ప్రజలు బలము కోల్పోయి పారిపోయిరి. వారు ప్రసవించు స్త్రీవలె బాధకును, దుఃఖమునకును గురియైరి.

25. ఆ సుప్రసిద్ధమైన నగరము, ఆనందమునకు నిలయమైన ఆ నగరము పాడువడినది.

26. ఆ దినమున ఆ నగర యువకులను నడి వీధులలోనే చంపుదురు. దాని సైనికులెల్లరును కూలుదురు.

27. నేను దమస్కు ప్రాకారములకు నిప్పంటింతును. బెన్హదదు ప్రాసాదమును కాల్చివేయుదును. సైన్యములకు అధిపతియు ప్రభుడనైన నా వాక్కిది.”

28. కేదారు తెగలను గూర్చియు, బబులోనియా రాజగు నెబుకద్నెసరు జయించిన హసోరు మండలములను గూర్చియు ప్రభువు ఇట్లనెను: “మీరు కేదారు తెగలమీదికి దాడిచేయుడు. తూర్పు జాతులను నాశనము చేయుడు.

29. వారి గుడారములను, తెరలను, మందలను గుడారములోని వస్తువులను అపహరింపుడు. వారి ఒంటెలను పట్టుకొనుడు. భీతి మిమ్ము చుట్టుముట్టియున్నది అని వారితో చెప్పుడు.

30. హసోరు ప్రజలారా! మీరు దూరముగా పారిపోయి దాగుకొండని ప్రభుడనైన నేను హెచ్చరించుచున్నాను. నెబుకద్నెసరు మిమ్ము నాశనము చేయుటకు వ్యూహము పన్నెను.

31. మనము సురక్షితముగా వసించు ఈ ప్రజలపై దాడి చేయుదము. వీరి నగరములకు, ద్వారమునకు అడ్డుగడెలులేవు. దానికి రక్షణములేదు అని అతడు పలుకుచున్నాడు.

32. మీరు వారి ఒంటెలను, గొఱ్ఱెలను తోలుకొనిపొండు. చెంపల వెంట్రుకలను కురచగా కత్తిరించుకొను ఆ ప్రజలను నేను నలుదిక్కులకు చెదరగొట్టుదును. ఎల్లవైపులనుండి వారిని నాశనమునకు గురిచేయుదును.

33. హసోరు కలకాలము వరకును ఎడారియగును. నక్కలకు వాసస్థలమగును. అచటనిక యెవడును వసింపడు. ఇది ప్రభుడనైన నా వాక్కు

34. సిద్కియా యూదాకు రాజైన వెంటనే ప్రభువు ఏలామును గూర్చి నాతో ఇట్లు చెప్పెను:

35. సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కిది. నేను ఏలామునకు బలకారణమైన విలుకాండ్రను వధింతును.

36. అన్ని దిక్కులనుండియు పెనుగాలులు ఏలాము మీదికి వీచునట్లు చేయుదును. ఆ దేశ ప్రజలు ఎల్లెడల చెల్లాచెదరగుదురు. దాని కాందిశీకులు తలదాచుకొనని దేశమే ఉండదు.

37. ఏలాము ప్రజలు తమను చంపగోరు శత్రువులను చూచి భయపడుదురు. నేను మహాకోపముతో వారిని తుదముట్టింతును. వారి మీదికి సైన్యములను పంపి వారిని మట్టు పెట్టుదును.

38. వారి రాజులను, నాయకులను సంహరించి, ఏలాము దేశమున నా సింహాసనమును నెలకొల్పుదును.

39. కాని రానున్న రోజులలో ఏలామును మరల వృద్దిలోనికి దెత్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు"

Text Example

1. బబులోనియాను గూర్చియు, దాని ప్రజలైన కల్దీయులను గూర్చియు ప్రభువు నాకు ఈ సందేశమును వినిపించెను:

2. “మీరు సకలజాతులకు ఈ వార్త వినిపింపుడు. జెండానెత్తి ఈ సంగతి ప్రకటింపుడు.ఈ విషయమును రహస్యముగా నుంచకుడు. బబులోనియా కూలినది. దాని దైవములైన బేలు, మర్దూకు పడిపోయెను. దాని విగ్రహములకు అవమానము ప్రాప్తించెను. అసహ్యకరమైన ప్రతిమలు నాశనమయ్యెను.”

3. ఉత్తరమునుండి వచ్చిన జాతి బబులోనియాను నాశనముచేసి ఎడారి కావించును. నరులును, మృగములును అచటినుండి పారిపోవుదురు. అటనిక ఎవడును వసింపడు.

4. ఆకాలమున యూదా యిస్రాయేలు ప్రజలు శోకించుచు తమ ప్రభుడనైన నన్ను వెదకుచు నా యొద్దకు తిరిగివత్తురు.

5. వారు సియోనునకు మార్గమేది? అని అడిగి అటుప్రక్కకు పయనము చేయుదురు. వారు నాతో శాశ్వతనిబంధన చేసికొందురు. దానిని మరల భంగపరుపరు.

6. నా ప్రజలు కొండలలో కాపరి తప్పిపోనిచ్చిన గొఱ్ఱెల వంటివారు, వారు గొఱ్ఱెలవలె కొండనుండి కొండకు తిరుగుచు తమ వాసస్థలమును మరిచిపోయిరి.

7. వారికి ఎదురుపడిన వారెల్ల వారిని మ్రింగివేసిరి. “మా నేరమేమియులేదు. వీరు నీతికి నివాసమును, తమ పితరుల నిరీక్షణాధారమునైన యావేమీద తిరుగబడిరి కనుక వారికిట్లు జరిగెను” అని వారి శత్రువులు పలుకుదురు.

8. యిస్రాయేలీయులారా! మీరు బబులోనియానుండి పారిపొండు. అచటినుండి వెడలిపొండు. మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందు నడువుడి.

9. నేను ఉత్తరమునుండి, మహాజాతుల బృందమును తోడ్కొనివత్తును. వారు బబులోనియా మీదికి దాడిచేయుదురు. తమ దండులను బారులు తీర్చి, ఆ దేశమును జయింతురు. వారు నేర్పరులైన వేటకాండ్ర వంటివారు. వారు విసరిన బాణములు గురితప్పవు.

10. శత్రువులు బబులోనియాను కొల్లగొట్టి అచటినుండి తమకు వలసిన వస్తువులనెల్ల కొనిపోవుదురు. ఇది ప్రభుడనైన నా వాక్కు

11. బబులోనీయులారా! మీరు నా ప్రజలను దోచుకొంటిరి. ఈ మీరు ఆనందముతో ఉప్పొంగుచు కళ్ళమును తొక్కు పెయ్యవలెను సకిలించు గుఱ్ఱమువలెను తిరుగాడుచున్నారు.

12. కాని మీ మహానగరమే అవమానము చెంది సిగ్గుపడును. జాతులలో బబులోనియా ఎందుకు కొరగానిదగును. ఆదేశము ఎండిపోయి ఎడారియగును.

13. నా కోపమువలన బబులోనియా నిర్మానుష్యమగును. అది మరుభూమి అగును. అటువైపు వెళ్ళినవారెల్ల ఆ దేశమును గాంచి వెరగంది విస్తుపోవుదురు.

14. ధానుష్కులారా! బబులోనియా చుట్టు బారులు తీరుడు. అది ప్రభుడనైన నాకు ద్రోహము చేసినది కనుక మీరు దాని మీద బాణములు రువ్వుడు.

15. ఆ నగరముచుట్టు యుద్ధనాదము చేయుడు. ఇపుడు బబులోనియా లొంగినది. దాని ప్రాకారములు, బురుజులు కూలినవి. నేను బబులోనీయులమీద పగ తీర్చుకొందును. మీరును వారికి ప్రతీకారము చేయుడు. వారు ఇతరులకు కీడు చేసినట్లే, మీరును వారికి కీడు చేయుడు.

16. ఆ దేశమున పైరు వేయనీయకుడు. కోత కోయనీయకుడు. అచట వసించు పరదేశులు శత్రువుల ముట్టడికి భయపడి స్వీయదేశమునకు పారిపోవుదురుగాక!

17. యిస్రాయేలీయులు సింహములు తరిమిన గొఱ్ఱెల వంటి వారు. మొదట అస్సిరియా రాజు వారిని కబళించెను. అటుతరువాత బబులోనియా రాజు నెబుకద్నెసరు వారి ఎముకలను విరుగగొట్టెను.

18. కావున సైన్యములకధిపతియు యిస్రాయేలు దేవుడనైన నేను అస్సిరియా రాజును వలె నెబుకద్నెసరును, అతని రాజ్యమును దండింతును.

19. నేను యిస్రాయేలీయులనెడు గొఱ్ఱెలను వారి పచ్చికపట్టులకు కొనివత్తును. వారు కర్మేలు కొండ మీదను బాషాను మండలమునను మేయుదురు. ఎఫ్రాయీము కొండలలోను, గిలాదు సీమలలోను సంతుష్టిగా భుజింతురు.

20. ఆ దినములు వచ్చినపుడు యిస్రాయేలీయులలో తప్పులు చూపట్టవు. యూదా ప్రజలలో వెదకినను దోషములు కన్పింపవు. నేను ప్రాణములతో బ్రతుకనిచ్చిన ప్రజల దోషములెల్ల నేనే మన్నింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు,

21. ప్రభువిట్లనుచున్నాడు: మెరతాయిము, పెకోదు ప్రజలను ముట్టడించి వధింపుడు. నేను ఆజ్ఞాపించిన కార్యములెల్ల చేయుడు. ఇది ప్రభుడనైన నా వాక్కు

22. దేశమున యుద్దనాదము వినిపించుచున్నది. ప్రజలను ఊచకోత కోయుచున్నారు.

23. బబులోనియా తన సుత్తెతో ప్రపంచమును చావమోడెను. కాని యిప్పుడు ఆ సుత్తె ముక్కలుముక్కలయ్యెను. ఆ దేశమునకు పట్టిన దుర్గతినిచూచి జాతులెల్ల కంపించెను.

24. బబులోనియా! నీవు నన్నెదిరించితివి కాని నీకు తెలియకుండనే నేను పన్నిన ఉచ్చులలో చిక్కుకొంటివి.

25. నేను నా ఆయుధాగారము తెరచి రౌద్రముతో నా శస్త్రములు చేతబట్టితిని. సైన్యములకు అధిపతియు ప్రభుడనైన నేను బబులోనియాలో చేయవలసిన పనియున్నది.

26. నలువైపులనుండి బబులోనియాను ముట్టడింపుడు దాని ధాన్యాగారములను తెరువుడు. కొల్లసొమ్మును ధాన్యరాసులవలె ప్రోగుజేయుడు. ఆ దేశమును శాపముపాలుచేసి సర్వనాశనము చేయుడు. అచట దేనిని వదలిపెట్టవలదు.

27. దాని ఎడ్లనన్నిటిని వధింపుడు. అవి వధకు పోవలెను. అయ్యో! వారికి శ్రమ. అయ్యో! వారి దినము దగ్గరపడెను.

28. బబులోనియానుండి పారిపోయి వచ్చిన కాందిశీకులు యెరూషలేమున ప్రవేశించి మన దేవుడైన ప్రభువు తన దేవాలయమును నాశనము చేసినందులకు బబులోనీయుల మీద పగతీర్చుకొనెనని చెప్పిరి.

29. ఆ దేశమును ముట్టడింపుడని విలుకాండ్రతో చెప్పుడు. విల్లమ్ములను వాడగలిగిన వారినందరిని దానిమీదికి పంపుడు. నగరమును చుట్టుముట్టుడు. ఎవరిని తప్పించుకొని పోనీయకుడు. ఆ నగరపు దుష్కార్యములకు తగినట్లే దానిని దండింపుడు. అది ఇతరులకు కీడుచేసినట్లే, మీరు దానికిని కీడు చేయుడు. అది పొగరుతో కన్నుమిన్ను కానక పవిత్రుడును యిస్రాయేలు దేవుడనైన నామీద తిరుగబడినది.

30. కావున దాని యువకులను వీధులలో చంపుదురు. ఆ దినమున దాని సైనికులనెల్ల నాశనము చేయుదురు. ఇది ప్రభుడనైన నా వాక్కు

31. బబులోనియా! నీ కన్నులకు కావరమెక్కినది. కావున సైన్యములకు అధిపతియు ప్రభుడనైన నేను నిన్నెదిరింతును. నిన్ను దండించుకాలము వచ్చినది.

32. పొగరుబోతులైన నీ జనులు కాలు జారిపడిపోవుదురు. ఎవరును వారిని పైకి లేపరు. నేను నీ నగరములకు నిప్పు పెట్టుదును. నీ చుట్టుపట్లగల పురములును కాలిపోవును.

33. సైన్యములకధిపతియైన ప్రభువిట్లు పలుకుచున్నాడు. శత్రువులు యిస్రాయేలీయులను పీడించిరి. వారిని చెరపట్టిన వారు వారిని తమ గుప్పిట పట్టుకొని అటునిటు కదలనీయరైరి.

34. కాని వారిని చెరనుండి విడిపించువాడు బలాఢ్యుడు. సైన్యములకు అధిపతియైన ప్రభువు అని ఆయనకు పేరు. ఆయన యిస్రాయేలీయుల కోపు తీసికొనెను. ఆ ప్రభువు లోకమునకు శాంతిని దయచేయును. బబులోనియాను మాత్రము కలవర పెట్టును.

35. ప్రభువు ఇట్లనుచున్నాడు: బబులోనియా చచ్చును. దాని ప్రజలు నశింతురు. దాని నాయకులును జ్ఞానులును హతులగుదురు.

36. కల్లలాడు దాని ప్రవక్తలు ఖడ్గమువశులై, పిచ్చివాండ్రగుదురు. వారి బలాఢ్యులు ఖడ్గముచే హతులగుదురు.

37. దాని అశ్వములు, రథములు ఖడ్గముచే నశించును. దానిమధ్యనుండు పరదేశ సైనికులు ఖడ్గముచే చత్తురు. వారు స్త్రీలవలె బలహీనులగుదురు. దాని సంపదలను నాశనము చేయుడు. కొల్లగొట్టుకొని ఎత్తుకొనిపొండు.

38. ఆ దేశమున వానలు కురియవు. దాని నదులు ఎండిపోవును. బబులోనియా భయంకర విగ్రహములకు ఆలవాలము. అవి ఆ దేశప్రజలను మూర్చులను చేసెను.

39. బబులోనియా అడవి పిల్లులకును, నక్కలకును ఆటపట్టగును. గుడ్లగూబలచట వసించును. నరులచట మరల కాపురముండరు. అది కలకాలము ఎడారిగా ఉండిపోవును

40. నేను సొదొమ గొమొఱ్ఱాలవలెను వాని పరిసర నగరములవలెను బబులోనియాను గూడ కూలద్రోయుదును. అచట ఇక ఎవడును వసింపడు. ఇది ప్రభుడనైన నా వాక్కు,

41. ఉత్తరమునుండి ఒక మహాజాతి కదలివచ్చుచున్నది. దూరప్రాంతములనుండి పెక్కుమంది రాజులు యుద్ధమునకు సన్నద్దులు అగుచున్నారు.

42. వారు తమ విండ్లను, కత్తులను చేతబట్టిరి. వారు నిర్దయులు, క్రూరులు. వారు గుఱ్ఱములనెక్కి స్వారిచేయుచుండగా సాగరము ఘోషించినట్లుగా ఉండును. ఆ వీరులు బబులోనియామీద పోరు సల్పుటకు సిద్ధముగా నున్నారు.

43. ఈ వార్త వినగానే బబులోనియా రాజు హస్తములు చచ్చుపడినవి. అతని హృదయము వ్యధతో నిండినది. అతడు ప్రసవించు స్త్రీవలె బాధకు గురియయ్యెను.

44. సింహము యోర్దాను తీరమునందలి దట్టమైన అడవులనుండి బలమైన నివాసములలోనికి వచ్చినట్లే ప్రభుడనైన నేనును బబులోనియా మీదికెత్తివత్తును. నన్ను చూచి బబులోనియులు దిఢీలున పారిపోవుదురు. అపుడు నేనెన్నుకొనిన నాయకుడు ఆ జాతిని పాలించును. నన్ను పోలినవాడెవడు? నన్ను సవాలు చేయగలవాడెవడు? నన్ను ఎదిరింపగలవాడెవడు?

45. నేను బబులోనియాకు ఏమి తలపెట్టితినో, దాని ప్రజలకేమి చేయుదునో వినుడు. శత్రువులు వారి పిల్లలనుగూడ ఈడ్చుకొనిపోవుదురు. ఎల్లరును వారిని చూచి వెరగందుదురు.

46. బబులోనియా కూలినపుడు భీకరనాదము ఉప్పతిల్లగా భూమి కంపించును. ఇతరజాతులు ఆ దేశముయొక్క ఆర్తనాదమును ఆలించును.”

Text Example

1. ప్రభువిట్లు చెప్పుచున్నాడు: “నేను బబులోనియా మీదికిని దాని ప్రజల మీదికిని వినాశ ఆత్మను కొనివత్తును.'

2. పరదేశులను ఆ దేశము మీదికి పంపుదును. గాలి పొట్టునువలె వారు దానిని ఎగురగొట్టుదురు. ఆ దినము వచ్చినపుడు శత్రువులు ఆ దేశమును నలువైపులనుండి ముట్టడించి నాశనము చేయుదురు.

3. ఆ దేశ సైనికులకు బాణములు రువ్వుటకుగాని, ఆయుధములు ధరించుటకుగాని గల అవకాశము ఈయవలదు. అచటి యువకులను గూడ వదలి పెట్టకుడు. దాని సైన్యమునంతటిని నాశనము చేయుడు.

4. ఆ దేశీయులు గాయపడి తమ నగరవీధులలోనే చత్తురు.

5. యిస్రాయేలీయులును, యూదా ప్రజలును పవిత్రుడనైన నాకు ద్రోహముగా పాపము చేసిరి. అయినను సైన్యములకధిపతియైన నేను వారిని విడనాడలేదు.

6. మీరు బబులోనియానుండి పారిపొండు. మీ ప్రాణములు కాపాడుకొనుడు. నేను బబులోనియాను దండించుచుండగా మీరును ఆ దండనమున చిక్కిచావవలదు. ఇపుడు నేనాదేశముపై పగతీర్చుకొందును. అది తన దోషములకు తగిన శిక్ష అనుభవించును.

7. బబులోనియా నా చేతిలోని బంగారు పాత్రమువంటిది. అది లోకమంతటిని తప్ప త్రాగించెను. సకలజాతులు దాని ద్రాక్షారసము త్రాగి మత్తీల్లినవి.

8. బబులోనియా దిఢీలున కూలినది, నశించినది. మీరు దానికొరకు విలపింపుడు. దాని గాయములకు మందుతెండు. ఒకవేళ అది మరల కోలుకోవచ్చును.

9. అచట వసించు పరదేశులు మనము ఈ దేశమునకు సాయము చేసితిమిగాని ఫలితము దక్కలేదు. ఇక దీనిని విడనాడి మన దేశమునకు వెళ్ళిపోవుదము. ప్రభువు శిక్ష ఆకాశమును అంటుచున్నది. అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది.

10. ప్రభువు తన ప్రజలనిట్లు చెప్పుమనెను: “ప్రభువు మన న్యాయమును రుజువుచేసెను. మనము యెరూషలేమునకు వెళ్ళి మన ప్రభువైన దేవుడేమి చేసెనో జనులకు తెలుపుదము”,

11. ప్రభువు బబులోనియాను చెరుపగోరెను గనుక మాదీయరాజులను రెచ్చగొట్టెను. బబులోనీయులు తన దేవళమును కూల్చిరి కనుక ఆయన వారికి ఈ రీతిగా . ప్రతీకారము చేయును. ఆ దేశమును ముట్టడించు సైన్యాధిపతులారా! మీ బాణములకు పదును పెట్టుడు. మీ డాళ్ళను సిద్ధము చేసికొనుడు.

12. బబులోనియా నగర ప్రాకారములను ముట్టడించుటకు సంజ్ఞ చేయుడు. కావలివారిని బలపరుపుడు, గస్తీలను నియమింపుడు. మాటుండువారిని సిద్ధముచేయుడు అని పలుకుదురు. ప్రభువు తాను చెప్పినట్లే బబులోనీయులను దండించెను.

13. ఆ దేశమున జలము పుష్కలముగా నున్నది. దానికి పెక్కు నిధులున్నవి కాని, ఆ దానికి కాలము అసన్నమైనది. దానికి అన్యాయ లాభము ఇక దొరకదు

14. నేను బబులోనియాను ముట్టడించుటకు పలువురిని కొనివత్తును. వారు మిడుతలదండువలె చూపట్టుదురు. విజయనాదము చేయుదురు. అని సైన్యములకు అధిపతియైన ప్రభువు తన జీవము తోడని ప్రమాణము చేసెను.

15. ప్రభువు తన బలముచేత భూమిని చేసెను. తన జ్ఞానముతో లోకమును స్థిరముగా పాదుకొల్పెను. తన ప్రజ్ఞతో ఆకాశమును విశాలముగా విప్పెను.

16. ఆయన ఆజ్ఞ ఈయగా ఆకాశము మీది , జలములు ఘోషించును. ఆయన నేల అంచులనుండి మబ్బులను కొనివచ్చును. జడివానలో మెరుపులు మెరిపించును. తన గిడ్డంగిలోనుండి గాలులను వదలును.

17. ఆ దృశ్యమునుగాంచి జనులు విస్తుపోవుదురు. విగ్రహములను మలచువారు సిగ్గుపడుదురు. ఆ ప్రతిమలు నిరర్ధకములు, నిర్జీవములు.

18. అవి నిరుపయోగమైనవి, హాస్యాస్పదమైనవి. ప్రభువు వానికి తీర్పుచెప్పుటకు వచ్చినపుడు వానిని నాశనము చేయును.

19. కాని యాకోబు స్వాస్థ్యదేవుడు, ఆ ప్రతిమలవంటి వాడుకాదు. ఆయన సర్వమును చేసినవాడు, ఆయన యిస్రాయేలును తన ప్రజగా ఎన్నుకొనెను. సైన్యములకు అధిపతియైన ప్రభుడని . ఆయనకు పేరు. ఆకులు

20. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు: బబులోనియా! నీవు నా సమ్మెటవు, నా ఆయుధమువు. నేను నీ ద్వారా జాతులను, రాజ్యములను కూలద్రోసితిని.

21. గుఱ్ఱములను, రౌతులను, రథములను, సారథులను పడద్రోసితిని.

22. స్త్రీలను, పురుషులను, వృద్ధులను, యువకులను, బాలబాలికలను సంహరించితిని.

23. కాపరులను, వారి మందలను, రైతులను, వారికి దుక్కిదున్ను ఎద్దులను, పాలకులను, అధికారులను మట్టుపెట్టితిని.

24. బబులోనియా దాని ప్రజలు యెరూషలేమునకు చేసిన అపకారమునకుగాను నేను వారికి ప్రతీకారము చేయుటను మీరు కన్నులారా చూతురు.

25. బబులోనియా! నీవు ప్రపంచమును నాశనము చేయు కొండవంటిదానవు. కాని ప్రభుడనైన నేను నీకు శత్రువును. నేను నిన్ను పట్టుకొని నేలమట్టము చేయుదును. నిన్ను బూడిదలో పడద్రోయుదును.

26. నీ శిథిలములలోని మూలరాళ్ళనుగాని, పునాది రాళ్ళనుగానీ మరల భవనములు కట్టుటకు వాడరు. నీవు సదా ఎడారివయ్యెదవు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

27. బబులోనియాను ముట్టడించుటకు జెండానెత్తుడు. జాతులు వినునట్లుగా బాకానూదుడు. ఆ నగరముతో పోరాడుటకు జాతులను సిద్ధము చేయుడు. ఆరారతు, మిన్ని, ఆష్కేనసు రాజ్యములతో దాని మీదికి దండెత్తుడని చెప్పుడు. ముట్టడిని ప్రారంభించుటకొక సేనాపతిని నియమింపుడు. గుఱ్ఱములను మిడుతలదండువలె కొనిరండు.

28. దానిమీద యుద్ధము చేయుటకు జాతులను సిద్ధము చేయుడు. మాదీయరాజులను, వారి నాయకులను, అధికారులను వారి అధీనముననున్న దేశముల సేనలను పిలిపింపుడు.

29. ప్రభువు బబులోనియాను శిక్షించుటకు పూనుకొనెనుగాన భూమి కంపించుచున్నది. ఆయన దానిని నిర్మానుష్యమైన ఎడారిచేయును.

30. బబులోనియా వీరులు యుద్ధముమాని తమకోటలలో దాగుకొనిరి. వారు బలమును కోల్పోయి స్త్రీలవలెనైరి. శత్రువులు ఆ నగర ద్వారములను పడగొట్టిరి. దానిలోని గృహములకు నిప్పంటించిరి.

31. బంటువెంట బంటు, దూతవెంట దూత యెషయ పరుగెత్తివచ్చి బబులోనియా రాజుతో శత్రువులు నలువైపులనుండి నగరమున ప్రవేశించిరని చెప్పిరి.

32. విరోధులు రేవులను పట్టుకొని కోటలను తగులబెట్టిరి. బబులోనియా సైన్యము భీతితో కంపించెను.

33. త్వరలోనే శత్రువులు బబులోనీయులను హతముచేసి కళ్ళములోని ధాన్యమువలె తొక్కివేయుదురు. సైన్యములకు అధిపతియైన ప్రభుడను, యిస్రాయేలు దేవుడనైన నా వాక్కిది.”

34. “బబులోనియా రాజు యెరూషలేమును ముక్కలుచేసి భుజించెను. అతడు ఆ నగరమును పానీయము త్రాగిన పాత్రమువలె ఖాళీ చేసెను. మహాసర్పమువలె దానిని మ్రింగివేసెను. తనకు కావలసినవానిని తీసికొని ఇతర వస్తువులను ఆవల పారవేసెను.

35. మమ్ము హింసించినందులకుగాను బబులోనియాకు శిక్షపడునుగాక” అని సియోను ప్రజలు పలుకుదురుగాక! “మమ్ము బాధించినందులకుగాను అది దండనము అనుభవించునుగాక” అని యెరూషలేము ప్రజలు పలుకుదురుగాక!

36. ప్రభువు యోరూషలేము పౌరులతో ఇట్లనెను: “నేను మీ కోపు తీసికొందును. మీకు కీడుచేసిన శత్రువులకు ప్రతీకారము చేయుదును. నేను బబులోనియా జలాధారములు వట్టి పోవునట్లును దాని నదులు ఎండిపోవునట్లును చేయుదును.

37. ఆ దేశము పాడువడును. అచట వన్యమృగములు తిరుగాడును. అచట నరుడెవడును వసింపడు. దానిని గాంచినవారెల్ల భీతి చెందుదురు.

38. బబులోనీయులు సింహమువలె గర్జింతురు. సింగపుపిల్లవలె బొబ్బరింతురు.

39. వారు ఆశబోతులా? అయినచో నేను వారికి విందు సిద్ధముచేయుదును వారు తప్ప త్రాగి మైమరుచునట్లు చేయుదును. ఆ జనులు నిద్రబోవుదురు, మరల మేల్కొనరు.

40. నేను వారిని కబేళాకు గొనిపోవుదును. వారిని గొఱ్ఱెపిల్లలు, పొట్టేళ్ళు మేకపోతులవలె వధింతురు.

41. ప్రభువిట్లనెను: లోకమంతయు కొనియాడిన నగరము పట్టుబడినది. జాతులు దానిని చూచి విస్తుపోవును.

42. సముద్రము దాని మీదికి పొరలెను. గర్జించు తరంగములు దానిని కప్పివేసెను.

43. దాని చుట్టునున్న నగరములు, నిర్మానుష్యమయ్యెను. ఎండిపోయిన ఎడారులయ్యెను. వానిలో ఎవడును వసింపడు. అటు ప్రక్కనెవడును పయనింపడు.

44. నేను బబులోనియా దైవమైన బేలును శిక్షింతును. అతడు అపహరించిన వస్తువులను తిరిగి తీసికొందును. జాతులు ఇక అతనిని పూజింపవు. ఆ నగర ప్రాకారములు కూలినవి.

45. యిస్రాయేలీయులారా! మీరు నగరమునుండి పారిపోయి నా కోపమునుండి తప్పించుకొనుడు. మీ ప్రాణములు దక్కించుకొనుడు.

46. కాని మీరు దైర్యమును కోల్పోవలదు. పుకారులు విని భయపడవలదు. దేశమున హింస జరుగుచున్నదనియో, ఒకరాజు మరియొక రాజుతో పోరాడుచున్నాడనియో, ఏవేవో వదంతులు ప్రతియేడు విన్పించుచుండును.

Text Example

1. సిద్కియా ఇరువది యొకటవ యేట యూదాకు రాజై యెరూషలేమునుండి పదునొకండేండ్లు పరిపాలించెను. లిబ్నా నగరవాసియు, యిర్మీయా కుమార్తెయునైన హమూతాలు అతని తల్లి.

2. యెహోయాకీము రాజువలె సిద్కియాకూడ ప్రభువు ఒల్లని దుష్కార్యములు చేసెను.

3. ప్రభువు యెరూషలేము నగరవాసులపైన, యూదా ప్రజల పైన మిక్కిలి కోపించి వారిని తన సమక్షమునుండి గెంటి వేసెను. సిద్కియా బబులోనియా ప్రభువైన నెబుకద్నెసరుపై తిరుగబడెను.

4. కనుక అతని యేలుబడి తొమ్మిదవ యేడు పదియవనెల పదియవనాడు నెబుకద్నెసరు సర్వ సైన్యములతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. బబులోనీయులు నగరము వెలుపల శిబిరము పన్నిరి. దానిచుట్టును ముట్టడి దిబ్బలు పోసిరి.

5. సిద్కియా యేలుబడి పదునొకొండవ యేటివరకు ముట్టడి కొనసాగెను.

6. ఆ యేడు నాలుగవనెల తొమ్మిదవనాడు కరువు మిక్కుటముకాగా ప్రజలకు తిండి దొరక దయ్యెను.

7. శత్రువులు నగర ప్రాకారములను కూల్చివేసిరి. బబులోనీయులు నగరమును చుట్టు ముట్టియున్నను, సైనికులెల్లరును రాత్రిలో పలాయితులైరి. వారు రాజోద్యానవనము ప్రక్కగా, రెండు ప్రాకారముల మధ్యనున్న ద్వారముగుండ తప్పించుకొని యోర్దాను లోయకు అభిముఖముగా అనగా అరాబావైపు పారిపోయిరి.

8. బబులోనియా సైనికులు సిద్కియారాజును వెన్నాడి యెరికోమైదానమున పట్టు కొనిరి. సిద్కియా సైనికులెల్లరు అతనిని విడచిపారి పోయిరి.

9. ఆ రాజును హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిదిచేయుచున్న నెబుకద్నెసరు నొద్దకు కొనిపోయిరి. అతడు సిద్కియాకు శిక్ష విధించెను.

10. నెబుకద్నెసరు ఆజ్ఞపై రిబ్లా నగర మున సిద్కియా కన్నులయెదుటనే అతని కుమారులను వధించిరి. యూదా అధికారులను గూడ చంపివేసిరి.

11. అటుపిమ్మట సిద్కియా కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించి, బబులోనియాకు : కొనిపోయిరి. అతడు చనిపోవువరకును ఆ దేశమున బందీగానుండెను.

12. నెబుకద్నెనరు పరిపాలనా కాలము పందొమ్మిదవ యేట ఐదవనెల పదియవనాడు బబులోనియారాజు అంగరక్షకుల అధిపతియు, సలహాదారుడునగు నెబూజరదాను యెరూషలేమున ప్రవేశించెను.

13. అతడు దేవాలయమును, రాజప్రాసాదమును పట్టణములోని ప్రముఖుల యిండ్లను తగుల బెట్టించెను.

14. అతని సైనికులు పురప్రాకారమును పడగొట్టిరి.

15. నెబూజరదాను పట్టణమున మిగిలి యున్న జనమును, చేతిపనుల వారిని, బబులోనియా పక్షమును అవలంబించిన వారిని బబులోనియాకు కొనిపోయెను.

16. అతడు కొందరు పేదవారిని మాత్రము యూదాలోని పొలములను, ద్రాక్షతోటలను సాగుచేయుటకు అచటనే వదలివేసెను.

17. బబులోనీ యులు దేవాలయములోని కంచు స్తంభములను, బండ్లను, కంచుకుంటను ముక్కలు ముక్కలు చేసిరి. ఆ కంచునంతటిని బబులోనియాకు కొనిపోయిరి.

18. మరియు వారు బలిపీఠముమీది బూడిదనెత్తు గరిటలను, పళ్ళెములను, దీపసామగ్రిని, జంతుబలులు అర్పించునపుడు నెత్తురుపట్టు పాత్రలను, సాంబ్రాణి పొగ వేయుటకు వాడు గిన్నెలను, ఇంకను దేవాలయమున వాడు రకరకముల కంచు పరికరములను బబులోనియాకు కొనిపోయిరి.

19. వారు వెండి బంగారములతో చేసిన పరికరములన్నిటిని తీసికొనిపోయిరి. చిన్నపాత్రములను, నిప్పుకణికలను కొనిపోవు పాత్రములను, బలులలో నెత్తురుపట్టు పాత్రములను, బూడిదనెత్తు పళ్ళెరములను, దీపస్తంభములను, సాంబ్రాణి కలశములను, పానీయార్పణనకువాడు పాత్రములను తీసికొనిపోయిరి.

20. సొలోమోనురాజు దేవాలయమునకు చేయించిన కంచువస్తువులు అనగా రెండు స్తంభములు, బండ్లు, పెద్దకుంట, దానిని మ్రోయు పండ్రెండు ఎద్దులు తూకము వేయుటకు సాధ్యపడనివి.

21. ఆ రెండు స్తంభములు ఒకే రీతిగానుండెడివి. వాని ఎత్తు పదునెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు. అవి లోపల బోలుగానుండి నాలుగు వేళ్ళ మందము కలిగియుండెను.

22. వానిమీద మరల ఐదుమూరల ఎత్తుకల దిమ్మెలుండెను. రెండు దిమ్మెల చుట్టు పై భాగమున అల్లినవల అల్లికను కంచు దానిమ్మ పండ్లతో అలంకరించిరి.

23. స్తంభముల మీది దిమ్మెలపై మొత్తము వంద దానిమ్మపండ్లుండెను. వానిలో తొంబదియారు క్రింది నుండి చూచువారికి కన్పించుచుండెను.

24. నెబూజరదాను ప్రధానయాజకుడైన సెరాయాను, ఉపయాజకుడైన సెఫాన్యాను, మరి ముగ్గురు దేవాలయోద్యోగులను చెరగొనిపోయెను.

25. పట్టణములోని సైన్యాధిపతిని, నగరముననున్న రాజు సలహాదారులను ఏడుగురిని, సైనికులను, యుద్ధమున చేర్చుకొను సేనాధిపతి కార్యదర్శిని, మరియు అరువది మంది ప్రముఖులను చెరబట్టెను.

26-27. నెబూజరదాను వారినందరిని హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిది చేయుచున్న బబులోనియా రాజు నొద్దకు కొనిపోయెను. ఆ రాజు వారిని కొట్టించి చంపించెను. ఆ రీతిగా యూదీయులు తమ దేశమునుండి ప్రవాసమునకు వెళ్ళిపోయిరి.

28. బబులోనియా రాజు బందీలుగా కొనిపోయినవారి సంఖ్యలివి. అతడు తన యేలుబడి ఏడవయేట 3,023 మందిని కొనిపోయెను.

29. పదునెనిమిదవయేట యెరూషలేము నుండి 832 మందిని కొనిపోయెను.

30. ఇరువది మూడవయేట నెబూజరదాను 745 మందిని కొనిపోయెను. కనుక మొత్తము బందీలు 4,600 మంది.

31. యెహోయాకీను ప్రవాసకాలము ముప్పది యేడవ యేట పండ్రెండవనెల యిరువది ఐదవనాడు ఎవిల్మెరోదాకు బబులోనియాకు రాజయ్యెను. ఆ రాజు యెహోయాకీనును క్షమించి అతనిని చెరనుంచి విడిపించెను.

32. అతడు యెహోయాకీను మీద కరుణ జూపెను. నాడు ఆ దేశమున ప్రవాసములోనున్న రాజులందరికంటెను అతనిని పెద్ద జేసెను.

33. యెహోయాకీను బందీగృహ వస్త్రములను తొలగించుకొని నాటినుండి జీవితాంతము వరకును రాజగృహముననే భుజించెను.

34. యెహోయాకీను బ్రతికియున్నంతకాలము అతని రోజువారి ఖర్చులకొరకు బబులోనియా రాజు సొమ్ము చెల్లించెను.