ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఓ పరిశుదాత్మ మాపైన దిగిరావా

1 ఓ పరిశుదాత్మ మాపైన దిగిరావా ఓ పరిశుదాత్మ మాపైన దిగిరావా ||2||  1. సృష్టికి మునుపె ఉన్న ఆత్మ మాపై దిగిరావా ||2||  2. దావీదు రాజుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2||  3. మరియ గర్భమును ఫలింపచేసిన ఆత్మ దిగిరావా ||2||  4. నదిలో యేసుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2||  5. మేమందరము మీ బిడ్డలమే మాపై దిగిరావా ||2|| 2 ఓ పరిశుదాత్మ మాపైన దిగిరావా ఓ పరిశుదాత్మ మాపైన దిగిరావా ||2||  1. సృష్టికి మునుపె ఉన్న ఆత్మ మాపై దిగిరావా ||2||  2. దావీదు రాజుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2||  3. మరియ గర్భమును ఫలింపచేసిన ఆత్మ దిగిరావా ||2||  4. నదిలో యేసుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2||  5. మేమందరము మీ బిడ్డలమే మాపై దిగిరావా ||2|| 3 ఓ పరిశుదాత్మ మాపైన దిగిరావా ఓ పరిశుదాత్మ మాపైన దిగిరావా ||2||  1. సృష్టికి మునుపె ఉన్న ఆత్మ మాపై దిగిరావా ||2||  2. దావీదు రాజుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2||  3. మరియ గర్భమును ఫలింపచేసిన ఆత్మ దిగిరావా ||2||  4. నదిలో యేసుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2||  5. మేమందరము మీ బిడ్డలమే...

ఓబద్యా

1వ అధ్యాయము + -  1. ఇది ఓబద్యాకు కలిగిన దర్శనము. దేవుడైన ప్రభువు ఎదోమును గురించి చెప్పిన సంగతి: 2. ప్రభువు జాతులచెంతకు దూతను పంపెను. అతని సందేశమును మేము ఆలించితిమి. “మనము ఎదోముమీదికి యుద్ధమునకు పోవుదము. మీరెల్లరును సిద్ధముకండు” అని ఆ సందేశము. ప్రభువు ఎదోముతో ఇట్లనుచున్నాడు: ఇదిగో! నేను నీ జనమును నాశనము చేయుదును. ఎల్లరును నిన్ను నిర్లక్ష్యము చేయుదురు. 3. నీ పొగరు నిన్ను అపమార్గము పట్టించినది. నీ నివాసము కొండసందులలోనున్నది. నీవు ఎత్తయిన పర్వతముపై వసించుచున్నావు. కావున నిన్నెవరును కూలద్రోయలేరని నీనమ్మకము. 4. నీవు గరుడపక్షివలె ఎంత ఎత్తున వసించుచున్నను, చుక్కలనడుమ ఇల్లు కట్టుకొనియున్నను నేను నిన్ను కూలద్రోయకమానను. 5. రేయి దొంగలుపడి దోచుకొనినచో తమకు కావలసిన వస్తువులు మాత్రమే కొనిపోవుదురు. జనులు ద్రాక్షపండ్లు కోయునపుడు పరిగెలేరు వారికి కొన్ని పండ్లు వదలివేయుదురు. కాని నీ శత్రువులు నిన్ను ఊచముట్టుగా కొల్లగొట్టిరి. 6. ఏసాపు వంశజులారా! మీరు దోచుకొనిన సొత్తును విరోధులు దోచుకొనిరి. 7. నీ మిత్రవర్గము నిన్ను మోసగించెను. నీ దేశమునుండి నిన్ను తరిమివేసెను. నీతో పొత్తు చేసికొనినవారే నిన్నోడించిరి....

యోవేలు

1వ అధ్యాయము + -  1. పెతూవేలు కుమారుడైన యోవేలునకు ప్రభువు దర్శనవాణి తెలియజేసిన సందేశమిది: 2. వృద్దులారా వినుడు!  మీ తరమునగాని, మీ తండ్రుల తరమున గాని ఇట్టి కార్యమెన్నడైనను జరిగినదా? 3. మీరు మీ బిడ్డలకు దీనిని తెలియజేయుడు. మీ బిడ్డలు వారి బిడ్డలకును, వారు తమ తరువాతి తరములవారికిని దీనిని వివరింతురు. 4. మిడుతలు పెద్దవి, చిన్నవి దండు మీద దండు వచ్చెను. ఒక దండు వదలి వేసినది మరియొక దండు మ్రింగివేసెను. 5. త్రాగుబోతులారా! మీరు నిద్రమేల్కొని శోకింపుడు. మధుపాన ప్రియులారా! విలపింపుడు. మీకిక క్రొత్త ద్రాక్షారసము లభింపదు. 6. మిడుతలదండు వచ్చి మన దేశముపై పడినది. ఆ ప్రాణులు బలమైనవి, లెక్కల కందనివి. వాని పండ్లు సింగము కోరలవలె కరకైనవి. 7. అవి మన ద్రాక్షలను నాశనము చేసెను. మన అంజూరములను కొరికివేసెను. ఆ చెట్ల కొమ్మల బెరడును తినివేయగా అవి తెల్లబడెను. 8. వధువు తాను పరిణయమాడనున్న యువకుడు మరణింపగా శోకించినట్లు మీరును శోకింపుడు. 9. దేవాలయమున అర్పించుటకు ధాన్యమును, ద్రాక్షరసమును లేవు. ప్రభువునకు అర్పించుటకేమియు లేవు గాన యాజకులు విలపించుచున్నారు. 10. పొలములు పాడైనవి. ధాన్యము నాశనమగుటచే భూమి దుఃఖించుచున్నద...

యోనా

1వ అధ్యాయము + -  1. ప్రభువువాణి అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో, 2. “నీవు ఆ పెద్దనగరమైన నీనెవెకు వెళ్ళి దానిని మందలింపుము. ఆ నగర ప్రజల దౌష్ట్యము నా దృష్టికి ఘోరమాయెనని చెప్పుము” అని పలికెను. 3. కాని యోనా ప్రభువు చెంతనుండి తప్పించుకొని పోయి తర్షీషు చేరుకోనెంచెను. అతడు యెప్పేకు వెళ్ళగా అచట ఒక ఓడ తర్షీషునకు వెళ్ళుటకు సిద్ధముగా నుండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో ఎక్కెను. ప్రయాణీకులతో పాటు తర్షీషు చేరుకొని, ప్రభువు చెంతనుండి తప్పించుకోవచ్చునని అతని తలంపు. 4. కాని ప్రభువు సముద్రముపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుగాలి తాకిడికి ఓడ బద్దలగునట్లు ఉండెను. 5. నావికులు భయపడి ఒక్కొక్కడు తనతన దేవునికి ప్రార్థన చేసిరి. ఓడ బరువు తగ్గించుటకు దానిలోని సరకులను సముద్రమున పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింది భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను. 6. ఓడ అధిపతి అతనిని చూచి "ఓయి! నీవు నిద్రించుచున్నావేమి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము. బహుశ, నీ దేవుడు నీ మొరనాలించి మనలను గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును” అనెను. 7. నావికులు మనము చీట్లువేసి ఈ దురదృష్టమునకు కారకులెవరో తె...

రూతు

1వ అధ్యాయము + -  1. న్యాయాధిపతులు పరిపాలనచేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను. కనుక యూదా రాజ్యమునందలి బేత్లెహేములో నివసించునొకడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసికొని మోవాబు దేశమునకు వలసపోయెను. 2. అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నవోమి. కొడుకుల పేర్లు మహోను, కిల్యోను. వారు ఎఫ్రాతా తెగవారు. వారు మోవాబు దేశమున వసించుచుండగా 3. ఎలీమెలెకు చనిపోయెను. ఇక నవోమికి మిగిలినది ఇద్దరు కుమారులు మాత్రమే. 4. ఆ ఇరువురు మోవాబు యువతులను పెండ్లాడిరి. వారి పేర్లు ఓర్పా, రూతు. వారు ఆ దేశమున పదియేండ్లపాటు జీవించిరి. 5. ఆ పిమ్మట ఆ ఇద్దరు కుమారులు కూడ మరణించిరి. ఆ విధముగ భర్త, పుత్రులు గతింపగా నవోమి ఒంటరిగా మిగిలిపోయెను. 6. ప్రభువు యిస్రాయేలు ప్రజలను కరుణించి వారి దేశమున పంటలు పండించెనని విని ఆమెయు, ఆమె కోడండ్రును మోవాబు నుండి వెళ్ళగోరిరి. 7. కనుక ఆమెయు, ఆమె కోడండ్రులు పయనమై వారితో పయనమై యూదా రాజ్యమునకు పోవు బాటను పట్టిరి. 8. త్రోవలో ఆమె ఇద్దరు కోడండ్రతో "అమ్మలార! మీరిక తిరిగి మీ పుట్టినిండ్లు చేరుకొనుడు. మీరు నాయెడల, ఆ గతించిన వారియెడల మిగుల దయచూపిరి. ప్రభువు కూడ మిమ్ము కరుణతో చూచును గాక! 9. య...

రాజుల దినచర్య మొదటి గ్రంధము

1వ అధ్యాయము + -  1. ఆదాము షేతును, షేతు ఎనోషును కనెను. 2. ఎనోషు కుమారుడు కేనాను. అతని కుమారుడు మహలలేలు. అతని పుత్రుడు యారెదు. 3. యారెదు నుండి క్రమముగా హనోకు, మెతూషెల, లామెకు, నోవా అనువారు జన్మించిరి. 4. షేము, హాము, యాఫెతు నోవా కుమారులు. 5. యాఫెతు వంశజులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషెకు, తీరసు. 6. గోమెరు వంశజులు అష్కేనను, దీఫతు, తొగర్మా. 7. యావాను వంశజులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, రోదానీము. 8. హాము వంశజులు కూషు, మిస్రాయీము, పూతు, కనాను. 9. కూషు వంశజులు సెబా, హవీలా, సబ్తా, రామా, సబ్తేకా. రామా వంశజులు షెబా, దెదాను. 10. కూషు పుత్రుడు నిమ్రోదు ప్రపంచము నందలి మొదటి విజేత. 11-12. మిస్రాయీమునుండి పుట్టిన ప్రజలే లూదీయులు, అనామీయులు, లెహబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులు, కస్లుహీయులు (ఫిలిస్తీయులకు మూలపురుషులు) మరియు కఫ్తోరీయులు. 13. కనాను పెద్దకొడుకు సీదోను, రెండవ కుమారుడు హేతు. 14-16. యెబూనీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులుకూడ పై కనాను వంశజులే. 17. షేము పుత్రులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, పూలు,...