1వ అధ్యాయము + - 1. పెతూవేలు కుమారుడైన యోవేలునకు ప్రభువు దర్శనవాణి తెలియజేసిన సందేశమిది: 2. వృద్దులారా వినుడు! మీ తరమునగాని, మీ తండ్రుల తరమున గాని ఇట్టి కార్యమెన్నడైనను జరిగినదా? 3. మీరు మీ బిడ్డలకు దీనిని తెలియజేయుడు. మీ బిడ్డలు వారి బిడ్డలకును, వారు తమ తరువాతి తరములవారికిని దీనిని వివరింతురు. 4. మిడుతలు పెద్దవి, చిన్నవి దండు మీద దండు వచ్చెను. ఒక దండు వదలి వేసినది మరియొక దండు మ్రింగివేసెను. 5. త్రాగుబోతులారా! మీరు నిద్రమేల్కొని శోకింపుడు. మధుపాన ప్రియులారా! విలపింపుడు. మీకిక క్రొత్త ద్రాక్షారసము లభింపదు. 6. మిడుతలదండు వచ్చి మన దేశముపై పడినది. ఆ ప్రాణులు బలమైనవి, లెక్కల కందనివి. వాని పండ్లు సింగము కోరలవలె కరకైనవి. 7. అవి మన ద్రాక్షలను నాశనము చేసెను. మన అంజూరములను కొరికివేసెను. ఆ చెట్ల కొమ్మల బెరడును తినివేయగా అవి తెల్లబడెను. 8. వధువు తాను పరిణయమాడనున్న యువకుడు మరణింపగా శోకించినట్లు మీరును శోకింపుడు. 9. దేవాలయమున అర్పించుటకు ధాన్యమును, ద్రాక్షరసమును లేవు. ప్రభువునకు అర్పించుటకేమియు లేవు గాన యాజకులు విలపించుచున్నారు. 10. పొలములు పాడైనవి. ధాన్యము నాశనమగుటచే భూమి దుఃఖించుచున్నద...