ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

telugu catholic bible online లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సమూవేలు మొదటి గ్రంధము

1వ అధ్యాయము + -  1. ఎఫ్రాయీము పర్వతసీమలో రామతయిమ్ సోఫీము అను పట్టణము కలదు. ఆ పట్టణమున ఎల్కానా అనునతడుండెను. ఎల్కానా ఎఫ్రాయీము తెగకు చెందిన సూపు కుమారుడు. సూపు తోహూ కుమారుడు, తోహూ ఎలీహు కుమారుడు, ఎలీహు యెరోహాము కుమారుడు. 2. ఎల్కానాకు హన్నా, పెనిన్నా అను భార్యలిద్దరు కలరు. పెనిన్నాకు బిడ్డలు కలరు గాని హన్నాకు సంతానము లేదు. 3. ఎల్కానా ఏటేట షిలో నగరమునకు వెళ్ళి సైన్యములకధిపతియైన యావేను ఆరాధించి బలులు అర్పించుచుండెను. ఏలీ కుమారులైన హోప్నీ, ఫీనెహాసు అనువారు ఆ రోజు లలో యావే యాజకులుగా నుండిరి. 4. ఒకమారు ఎల్కానా యధాప్రకారముగా బలి అర్పించెను. అతడు బలి అర్పించునపుడు పెనిన్నాకును, ఆమె కుమారులకును, కుమార్తెలకును, నైవేద్యమున భాగములు ఇచ్చుచుండెను. 5. హన్నాకు మాత్రము ఒక్కభాగమే ఒసగెడివాడు. అతడు హన్నాను అధికముగా ప్రేమించినను, ఆమె గొడ్రాలు గావున అటుల చేసెడివాడు. 6. ప్రభువు హన్నాకు బిడ్డలను ప్రసాదింపక పోవుటచే సవతికూడ ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండెడిది. 7. ఏటేట ఇట్లే జరుగుచుండెడిది. వారు యావే మందిరమునకు పోయినపుడెల్ల సవతి హన్నాను దెప్పిపొడిచెడిది. అందుచే హన్నా చాల దుఃఖించి ఆహారము తినుట మానివేసెడిది. 8. అ