1వ అధ్యాయము + - 1. యేసుక్రీస్తు బహిరంగమొనర్చిన విషయములు ఇచట గ్రంథస్థము కావింపబడినవి. దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతికాలమున ఏమి సంభవింపనున్నదియు ఆయనచే దేవుని సేవకులకు ప్రకటింపబడవలెను. ఇది దేవుని అభిమతము. క్రీస్తు తన దూతద్వారా తన సేవకుడగు యోహానుకు ఈ విషయములను విదితము చేసెను. 2. తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను. ఇది దేవుని వాక్కును గూర్చియు, యేసు క్రీస్తు బహిరంగము చేసిన సాక్ష్యమును గూర్చియు యోహాను వ్రాసిన నివేదిక. 3. ఇవి అన్నియు అనతికాలముననే సంభవింప నున్నవి. కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయ ములను పాటించువారు ధన్యులు. 4. ఆసియా మండలమునందలి సప్తసంఘ ములకు యోహాను వ్రాయునది: భూత, భవిష్యత్, వర్తమానములందున్న దేవుని నుండియు ఆయన సింహాసనము ఎదుట ఉన్న సప్త ఆత్మలనుండియు 5. విశ్వాసపాత్రుడగు సాక్షియు, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువును అగు యేసు క్రీస్తునుండియు, మీకు కృపయు శాంతియు లభించును గాక! ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాపవిముక్తులను చేసెను. 6. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను ...