ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

telugu bible study లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పేతురు వ్రాసిన 1వ లేఖ

1వ అధ్యాయము + -  1. యేసుక్రీస్తు అపోస్తలుడగు పేతురు, పొంతు, గలతీయ, కప్పదోసియ, ఆసియా, బితూనియాల యందు చెదరిపోయి, వలసదారులుగా జీవించు దేవుని ప్రియజనులకు వ్రాయునది: 2. పితయగు దేవుని సంకల్ప ఫలముగనే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసు క్రీస్తునకు విధేయులగుటకును,ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మవలన పవిత్రులనుచేసెను. మీకు కృపయు, సమాధానము లభించునుగాక! 3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలోనుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థాన మొనరించి, దాని మూలమున మనకు నూత్న జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. 4. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీకొరకై పరలోకమున భద్ర పరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. 5. మీరు యుగాంతమున ప్రకటింపబడెడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడు చున్నారు. కనుక అవి మీ కొరకే. 6. మీరు ఎదుర్కొనవలసిన పలువిధములగు పరీక్షలవలన తాత్కాలికముగ మీకు బాధ కలిగినను, దీనిని గూర్చి సంతోషింపుడు. 7.

యాకోబు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. దేవునియొక్కయు, యేసుక్రీస్తు ప్రభువుయొక్కయు, సేవకుడగు యాకోబు నుండి: ప్రపంచమునందంతటను చెదరియున్న పండ్రెండు గోత్రముల వారికి శుభాకాంక్షలు. 2. నా సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనునప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగ ఎంచుకొనుడు. 3. ఎట్లన, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుటవలన, మీకు సహనము చేకూరును. 4. కాని మీ సహనము విఫలముకాక, తుదివరకు మిమ్ము తీసుకొనిపోవునట్లు చూచు కొనుడు. అపుడు మీరు ఏ కొరతయులేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. 5. కాని మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్నయెడల, అతడు దేవుని అడుగవలెను. ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరకు ఉదారముగ అనుగ్రహించును గదా! 6. కాని అతడు విశ్వాసముతో అడుగవలెను. ఏ మాత్ర మును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్రతరంగము వంటివాడు. 7. అట్టి వాడు ప్రభువు నుండి ఏమైన పొందగలనని తలంపరాదు. 8. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు. 9. దీనస్థితిలో నున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను. 10. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్విం

James chapter 1 || Telugu Catholic Bible || యాకోబు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము

 1. దేవునియొక్కయు, యేసుక్రీస్తు ప్రభువుయొక్కయు, సేవకుడగు యాకోబు నుండి: ప్రపంచమునందంతటను చెదరియున్న పండ్రెండు గోత్రముల వారికి శుభాకాంక్షలు. 2. నా సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనునప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగ ఎంచుకొనుడు. 3. ఎట్లన, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుటవలన, మీకు సహనము చేకూరును. 4. కాని మీ సహనము విఫలముకాక, తుదివరకు మిమ్ము తీసుకొనిపోవునట్లు చూచు కొనుడు. అపుడు మీరు ఏ కొరతయులేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. 5. కాని మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్నయెడల, అతడు దేవుని అడుగవలెను. ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరకు ఉదారముగ అనుగ్రహించును గదా! 6. కాని అతడు విశ్వాసముతో అడుగవలెను. ఏ మాత్ర మును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్రతరంగము వంటివాడు. 7. అట్టి వాడు ప్రభువు నుండి ఏమైన పొందగలనని తలంపరాదు. 8. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు. 9. దీనస్థితిలో నున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను. 10. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలెను. ఏలయన గడ్డి

1st timothy Chapter 4 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 4వ అధ్యాయము

 1. రాబోవు కాలములలో కొందరు అసత్యములాడు ఆత్మలకు విధేయులై సైతాను బోధనలను అనుసరించి, విశ్వాసభ్రష్టులగుదురని పవిత్రాత్మ స్పష్ట పరచినది. 2. అసత్యవాదుల మోసపు మాటలనుండి ఇట్టి బోధనలు పుట్టును. కాల్చినకడ్డీతో వాతవేయ బడినట్లు వారి అంతఃకరణములు నిర్జీవములైనవి గదా! 3. వివాహమాడుటయు, కొన్ని పదార్థములను తినుటయు దోషమని అట్టివారు బోధింతురు. కాని సత్యమును గ్రహించిన విశ్వాసులు కృతజ్ఞతా పూర్వకముగ తినుటకుగాను ఈ పదార్దములను దేవుడు సృజించెను. 4. దేవుడు సృజించినది ఏదియైనను మంచిదే. మీరు దేనిని నిరాకరింపక కృతజ్ఞతా పూర్వక ముగా స్వీకరింపవలెను. 5. దేవుని వాక్కు వలనను, ప్రార్ధనవలనను అది పవిత్రపరుపబడినది. 6. నీవు ఈ ఉత్తరువులను సోదరులకు అందించిన యెడల, క్రీస్తుయేసుయొక్క ఉత్తమ సేవకుడవు కాగలవు. అంతేకాక, నీవు అనుసరించిన విశ్వాస సంబంధమగు బోధనచేతను, మంచి సిద్ధాంతము చేతను నిన్ను నీవు పోషించుకొనుచున్నావని నీవు చూపగలవు. 7. ముసలమ్మలు చెప్పు అయోగ్యమైన గాథలకు దూరముగ ఉండుము. పవిత్ర జీవితమును అభ్యసింపుము. 8. శారీరక వ్యాయామము కొంత విలువైనదే. కాని, ఆధ్యాత్మిక వ్యాయామము ఇహపర జీవిత సాధనము కనుక అన్ని విధములుగ విలువకలది. 9. ఈ మాట నమ్మదగి

Colossians chapter 2 || RCM Telugu Bible online || కొలొస్సియులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. మీ కొరకును, లవోదికయలోని ప్రజల కొరకును, నాకు వ్యక్తిగతముగ తెలియని వారందరి కొరకును, నేను ఎంత తీవ్రముగ పాటుపడినది మీకు చెప్పనిండు. 2. వారి హృదయములు ధైర్యముతో నిండగలవనియు, వారు ప్రేమతో సన్నిహితులు కాగల రనియు, సరియైన అవగాహనవలన లభించు సకల సంపదలను పొందగలరనియు నేను అటుల చేయు చున్నాను. అలాగున వారు దేవుని రహస్యమును గ్రహింపగలరు. ఆ రహస్యమే క్రీస్తు. 3. ఆయన యందు దేవుని వివేక విజ్ఞానముల సంపదలన్నియు గుప్తమైయున్నవి. 4. తప్పుడు వాదములతో ఎవ్వరును మిమ్ము మోసము చేయకుండునట్లును చూచుకొనవలెనని చెప్పుచున్నాను. 5. శరీరరీత్యా దూరము గానున్నను, నేను ఆత్మరీత్యా మీతో ఉన్నాను. క్రీస్తు నందు విశ్వాసముకలిగి మీరు కలిసికట్టుగా దృఢసంకల్పముతో కృతనిశ్చయులైయుండుట చూచి నేను ఆనందించుచున్నాను. 6. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సాహచర్యములో ఉండుడు. 7. ఆయ నను ఆధారముగా చేసికొని, మీ జీవితమును నిర్మించు కొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. అమితముగ కృత జ్ఞులై ఉండుడు. 8. ఎవడును తమ మోసకరమగు నిరర్థక వాదములతో మిమ్ము వశపరచుకొనకుండ చూచుకొనుడు. ఆ తత్త్వవాదములు క్రీస్తునకు చెందినవి

Philippians chapter 2 || Telugu catholic Bible online || ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరచు చున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరియెడల ఒకరికి దయకనికరములు ఉన్నచో, 2. ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు., 3. స్వార్దముతోగాని, అహంభావముతో గాని ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటె అధికులుగా భావింపుడు. 4. ప్రతి ఒక్కరు కేవలము స్వార్ధమునే చూచుకొనక, పరస్పరము ఉపకారులై ఉండవలెను. 5. క్రీస్తుయేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు: 6. ఆయన ఎల్లప్పుడును. దైవస్వభావమును కలిగిఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్ధబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. 7. కాని ఆయన తన్నుతాను రిక్తుని చేసికొని, సేవక రూపమును దాల్చి మానవమాత్రుడుగా జన్మించెను. 8. ఆయన అన్నివిధముల మానవమాత్రుడై ఉండి, అంతకంటె వినయముగలవాడై, మరణమువరకును, సిలువపై మరణము వరకును, విధేయుడాయెను. 9. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటె ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. 10. అందువలననే పరలోక భూలోక పాతాళలోకములయందలి సమస్త జీవులును క్రీస్

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-2 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. మీ అపరాధముల వలనను, పాపముల వలన గతమున ఆధ్యాత్మికముగ మీరు మృతులైతిరి కాని, ఆయన మిమ్ము బ్రతికించెను. 2. అప్పుడు మీరు లోకముయొక్క పోకడను అనుసరించితిరి. వాయు మండల సంబంధమైన అధిపతికి మీరు విధేయు లైతిరి. దేవునకు అవిధేయులగువారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి. 3. నిజముగ మనము అందర మును అట్లే ఉంటిమి. శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి. మన బుద్ధికిని, శరీరమునకును ప్రీతికరమైన వాంఛలను తీర్చుకొంటిమి. కనుక ఇతరులవలెనే మనమును దేవుని ఆగ్రహమునకు గురి కావలసిన వారమైతిమి. 4. కాని, దేవునికృప అపారము. మనపట్ల ఆయన ప్రేమ అమితము. 5. కనుకనే అపరాధములవలన ఆధ్యాత్మికముగ నిర్జీవులమై ఉన్న మనలను, క్రీస్తుతో కూడ ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. 6. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుటవలన, ఆయనతోపాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండచేసెను. 7. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించిన ప్రేమవలన, క్రీస్తుయేసునందు తన అను గ్రహ వైభవము ఎట్టిదో నిదర్శన పూర్వకముగ రాబోవు యుగములకు ప్రదర్శించెను. 8. ఏలయన, విశ్వాసము ద్వారా, దేవునివరమువలననే, మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయంకృతం కాదు. దేవున

Galatians Chapter 2 || Telugu Catholic Bible || గలతీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత తీతును కూడ వెంటబెట్టుకొని బర్నబాతో తిరిగి యెరూషలేమునకు వెళ్ళితిని. 2. అటుల పోవలెనని దేవుడు నాకు తెలియజేయుటచేతనే నేను పోయితిని. నేను జరుపునదియు, జరిపినదియు, ఒకవేళ వ్యర్థమై పోవునేమో అని నేను అన్యులమధ్య వివరించుచున్న సువార్తను వారికి మరి ప్రత్యేకముగ పెద్దలని ఎంచబడిన వారికి విశదపరచితిని. 3. గ్రీసు దేశస్తుడేయైనను, నా తోడివాడగు తీతును సహితము సున్నతి పొందవలెనని బలవంత పెట్టలేదు. 4. కాని కొందరు సోదరులవలె నటించి మా గుంపులో చేరి అతడు సున్నతి పొందవలెనని కోరిరి. వారు గూఢచారులుగ రహస్యముగ మాయందు ప్రవేశించిరి. క్రీస్తుయేసుతో ఏకమగుటవలన మనకుగల స్వాతంత్య్రమును వేగుచూచుట వారి ఉద్దేశము. మమ్ము బానిసలుగ చేయవలెనని వారి కోరిక. 5. కాని, సువార్తయందలి సత్యమును మీకు భద్రముగా ఉంచుటకు గాను, ఒక్క కణమైనను మేము వారికి లోబడలేదు. 6. కాని పెద్దలుగా ఎంచబడినవారు క్రొత్త సూచనలు ఏవియు నాకు చేయలేదు. వారు గతమున ఎట్టివారు అనునది నాకు అనవసరము. దేవుడు పక్షపాతము చూపడు. 7. అట్లుకాక, సున్నతి పొందిన వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురునకు అప్పగించినట్లే, సున్నతి పొందనివారికి సువార