ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

catholic bible లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఓబద్యా

1వ అధ్యాయము + -  1. ఇది ఓబద్యాకు కలిగిన దర్శనము. దేవుడైన ప్రభువు ఎదోమును గురించి చెప్పిన సంగతి: 2. ప్రభువు జాతులచెంతకు దూతను పంపెను. అతని సందేశమును మేము ఆలించితిమి. “మనము ఎదోముమీదికి యుద్ధమునకు పోవుదము. మీరెల్లరును సిద్ధముకండు” అని ఆ సందేశము. ప్రభువు ఎదోముతో ఇట్లనుచున్నాడు: ఇదిగో! నేను నీ జనమును నాశనము చేయుదును. ఎల్లరును నిన్ను నిర్లక్ష్యము చేయుదురు. 3. నీ పొగరు నిన్ను అపమార్గము పట్టించినది. నీ నివాసము కొండసందులలోనున్నది. నీవు ఎత్తయిన పర్వతముపై వసించుచున్నావు. కావున నిన్నెవరును కూలద్రోయలేరని నీనమ్మకము. 4. నీవు గరుడపక్షివలె ఎంత ఎత్తున వసించుచున్నను, చుక్కలనడుమ ఇల్లు కట్టుకొనియున్నను నేను నిన్ను కూలద్రోయకమానను. 5. రేయి దొంగలుపడి దోచుకొనినచో తమకు కావలసిన వస్తువులు మాత్రమే కొనిపోవుదురు. జనులు ద్రాక్షపండ్లు కోయునపుడు పరిగెలేరు వారికి కొన్ని పండ్లు వదలివేయుదురు. కాని నీ శత్రువులు నిన్ను ఊచముట్టుగా కొల్లగొట్టిరి. 6. ఏసాపు వంశజులారా! మీరు దోచుకొనిన సొత్తును విరోధులు దోచుకొనిరి. 7. నీ మిత్రవర్గము నిన్ను మోసగించెను. నీ దేశమునుండి నిన్ను తరిమివేసెను. నీతో పొత్తు చేసికొనినవారే నిన్నోడించిరి. నీ

సామెతలు

1వ అధ్యాయము + -  1. యిస్రాయేలు రాజును, దావీదు కుమారుడునగు సొలోమోను చెప్పిన సామెతలు. 2. విజ్ఞానమును, ఉపదేశమును ఆర్జించుటకును, నిశిత దృష్టికి సంబంధించిన విషయములను ఎరుగుటకును, 3. తెలివితేటలతో మెలగుటకును, నీతిన్యాయములతో ప్రవర్తించుటకును, 4. జ్ఞానములేని వారికి తెలివిగరపుటకును, యువకులకు విజ్ఞాన విచక్షణ నేర్పుటకును, 5. జ్ఞానులు మరింత అధికముగా విజ్ఞానము బడయుటకును, వివేకవంతులు హితోపదేశము పొందుటకును, 6. ఉపమానములు, నీతికథలు అర్థము చేసికొనుటకును, సుభాషితములను, పొడుపు కథలను గ్రహించుటకును ఈ సామెతలు ఉద్దేశింపబడినవి. 7. దేవునిపట్ల భయభక్తులు కలిగియుండుటయే విజ్ఞానమునకు మొదటిమెట్టు. కాని మూఢులు విజ్ఞానోపదేశములను లెక్కచేయరు 8. కుమారా! నీ తండ్రి ఉపదేశము నాలింపుము. నీ తల్లి బోధను అనాదరము చేయకుము. 9. వారి బోధలు నీ తలకు సొగసైన పాగాగను, నీ కంఠమునకు హారముగను శోభిల్లును. 10. కుమారా! దుర్మార్గులు నిన్ను మభ్య పెట్టినచో నీవు వారి ప్రలోభములకు లొంగవలదు 11. వారు నిన్ను చూచి "నీవును మాతో రమ్ము, మనమెవరినైన హత్య చేయుదము. అమాయకులకెవరికైన ఉచ్చులు పన్నుదము. 12. పాతాళలోకము ఉన్నవారిని ఉన్నట్లుగా కబళించినట్లే మనమును వార

2nd Peter chapter 2 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము

1. గతమున ప్రజలలో అసత్య ప్రవక్తలు గోచరించిరి. అట్లే మీలో అసత్య బోధకులు కాననగుదురు. వారు వినాశకరములును, అసత్యములును అగు సిద్ధాంతములను ప్రవేశ పెట్టెదరు. తమ్ము రక్షించిన యజమానుడినే వారు నిరాకరింతురు. కనుకనే త్వరలో ఆత్మవినాశనమును కొని తెచ్చుకొందురు. 2. అయినను పెక్కుమంది అవినీతికరమగు వారి మార్గములను అనుసరింతురు. వారు ఒనర్చు కృత్యములవలన ప్రజలు సత్యమార్గమును దూషింతురు. 3. పేరాశ వలన ఈ అసత్య ప్రచారకులు మీకు కట్టుకథలను చెప్పుచు వానిద్వారా లాభమును ఆర్జింతురు. వారికి పూర్వమునుండి విధింపబడిన తీర్పురాకపోదు. వారి వినాశకర్త మెలకువగనే ఉన్నాడు. 4. ఏలయన, పాపులైన దేవదూతలనే దేవుడు వదలలేదు. వారు పాపము చేసినప్పుడు ఆయన వారిని పాతాళమునందలి చీకటి బిలములోనికి త్రోసి, తీర్పు దినమువరకు కావలియందుంచెను. 5. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, దుషా త్ముల లోకమును జలప్రళయమున ముంచివేసెను. రక్షింపబడిన వారు నీతి ప్రబోధకుడగు నోవా, మరి ఏడుగురు మాత్రమే. 6. సొదొమ, గొమొఱ్ఱా నగరములను దేవుడు శపించెను. వానిని భస్మమొనర్చి దుష్టులకు ఏమి సంభవింపనున్నదో చూపుటకు ఉదాహరణము నొసగెను. 7. దుర్మార్గుల అవినీతికరమగు ప్రవర్తనలగూర్చి వ్యధనొం

2nd Thessalonians Chapter 4 || Roman catholic Bible in Telugu || తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 4వ లేఖ 4వ అధ్యాయము

 1. యజమానులారా! మీరును మీ సేవకుల యెడల సక్రమముగా న్యాయముగా ప్రవర్తింపుడు. పరలోకములో మీకు కూడ ఒక యజమానుడు కలడను విషయము గుర్తుంచుకొనుడు 2. ప్రార్థనను పట్టుదలతో చేయుడు. ప్రార్థన చేయునపుడు జాగరూకతతో ఉండుడు. దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగియుండుడు. 3. ఇదే సమయములో మాకొరకు కూడ ప్రార్థింపుడు. దేవుని సందేశమును బోధించుటకును క్రీస్తు రహస్యమును వివరించుటకును దేవుడు మాకు మంచి అవకాశము ఇవ్వవలెనని ప్రార్థింపుడు. అందులకే నేను ఇప్పుడు కారాగారమునందు ఉన్నాను. 4. ఆ విషయమును నేను స్పష్టముగా వివరించు సామర్థ్యము నాకు కలుగునట్లు ప్రార్ధింపుడు. 5. అవిశ్వాసులగు వారితో వ్యవహరించునప్పుడు మీరు, మీకు గల ప్రతి అవకాశమును చక్కగా వినియోగించుకొనుచు వివేకముతో ప్రవర్తింపుడు. 6. మీ సంభాషణ ఎల్లప్పుడును, దయాపూరితముగాను, ఉప్పువేసినట్లుగా రుచికరముగాను ఉండవలెను. ప్రతి వ్యక్తికి సరియైన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను. 7. ప్రియ సోదరుడును, నమ్మకమైన పరిచారకుడును, ప్రభువు కార్యమందు తోడి సేవకుడునైన 'తుకికు' మీకు నన్ను గురించిన అన్ని వార్తలను తెలుపును. 8. ఇందుకొరకే మేము అందరమును ఎట్లు ఉన్నదియు మీకు వివరించి మీ హృదయమ

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-5 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము

 1. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక, ఆయనను పోలి జీవింపుడు. 2. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను మనకొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. 3. మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోభితనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు. ఇదే పవిత్రులకు తగినది. 4. అంతేకాక, అసహ్యకరములును, అవివేక పూరితములును, అపవిత్రములునైన పదములనువాడుట మనకు తగదు. మీరు దేవునికి కృతజ్ఞులై ఉండవలెను. 5. మీరు ఈ విషయము దృఢముగ నమ్మవచ్చును. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, లోభియైనను (అనగా విగ్రహారాధకుడును), క్రీస్తు రాజ్యములో, దేవునిరాజ్యములో వారసత్వము పొందడు. 6. ఎవరును మిమ్ము వ్యర్థపుమాటలతో మోస పుచ్చకుండ చూచుకొనుడు. ఈ కారణము వలననే, ఆయనకు అవిధేయులైన వారిపై దేవుని ఆగ్రహము వచ్చును. 7. కనుక అట్టి వారితో ఏ సంబంధమును పెట్టుకొనకుడు. 8. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే. కాని ఇపుడు ప్రభువు నందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. 9. ఏలయన వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. సత్యము అనువానియందు కనపడును. 10. ప్రభువును ఆనందపరచునది ఏదియో గ