ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Psalms 84

1. సైన్యములకధిపతియైన ప్రభూ! నీ నివాసము ఎంత రమ్యము! 2. నేను యావే మందిరావరణములను దర్శింపవలెనని ఉవ్విళ్ళూరుచున్నాను, తపించిపోవుచున్నాను. పూర్ణహృదయముతోను, ఆనందముతోను, నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. 3. నా దేవుడవును, నా రాజువును, సైన్యములకధిపతియైన ప్రభూ! నీ బలిపీఠమువద్ద పిచ్చుకలు గూడు కట్టుకొన్నవి. వానకోయిలలుకూడ పిల్లలు చేయుటకు గూడు పెట్టుకొన్నవి. 4. నీ మందిరమున వసించుచు, ఎల్లవేళల నిన్ను స్తుతించువారు ధన్యులు. 5. నీ వలన బలముపొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరువారు ధన్యులు. 6. వారు ఎండిన లోయగుండ పయనముచేసి దానిని చెలమల తావుగా మార్చుదురు. తొలకరివానలు దానిని మడుగులతో నింపును. 7. వారు పయనించిన కొలది అధికబలమును బడయుదురు. సియోను దేవాధిదేవుని దర్శింతురు. 8. సైన్యములకధిపతియైన ప్రభూ! నా వేడుకోలును ఆలింపుము. యాకోబు దేవా! నా మొర వినుము. 9. మాకు రక్షకుడవైన దేవా! మాపై నీ దృష్టి నిలుపుము.  నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము. 10. అన్యుల ఇండ్లలో వేయినాళ్ళు గడపినదానికంటె నీ మందిరమున ఒక్కరోజు వసించటమేలు. దుష్టుల ఇండ్లలో నివసించుటకంటె, నా దేవుని మందిరమున ద్వారపాలకుడనుగా ఉండుట మెరుగు. 11. ప్రభువు మనకు

Psalms 83

1. దేవా! నీవు చూచుచు ఊరకుండవలదు. దేవా! నీవు మౌనముగ నుండవలదు. జోక్యము చేసికోకుండనుండవలదు. 2. నీ శత్రువులు తిరుగుబాటు చేయుచున్నారు, చూడుము. నిన్ను ద్వేషించువారు నీ మీద తిరుగబడుచున్నారు. 3. వారు నీ జనులమీద కుట్రలు పన్నుచున్నారు. నీవు కాపాడు ప్రజలమీద కుతంత్రములు పన్నుచున్నారు. 4. "రండు మనము వీరి జాతిని నాశనము చేయుదము. " యిస్రాయేలు పేరు ఇక కన్పింపకూడదు” అని పలుకుచున్నారు. 5. వారందరును కూడి ఏకముగా పన్నాగముపన్నిరి. నీకు విరోధముగా నిబంధనము చేసికొనిరి. 6. వారు ఎదోమీయులు, యిష్మాయేలీయులు, మోవాబీయులు, హగ్రీయులు, 7. గెబారీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, తూరీయులు 8. అశ్సురీయులుకూడ వారితో కలిసిపోయిరి. లోతు వంశజులుకూడ ఆ విరోధులలో చేరిపోయిరి 9. నీవు మిద్యానీయులనువలె వారినిగూడ శిక్షింపుము కీషోను నదియొడ్డున సీస్రాకును, యాబీనునకును పట్టించిన గతినే వారికిని పట్టింపుము. 10. వారు ఎండోరువద్ద చచ్చి నేలకు ఎరువైపోయిరి. 11. ఆ విరోధుల సైన్యాధిపతులకు ఓరేబునకును, సెయేబునకును పట్టించిన గతి పట్టింపుము. వారి పాలకులనెల్ల సేబా, సల్మూనా రాజులను ఓడించినట్లుగా ఓడింపుము. 12. వారు దేవుడు వసించు దేశమును