ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Psalms 11

1. నేను ప్రభువు శరణుజొచ్చి యున్నాను. "నీవు పక్షివలె కొండలకు పారిపొమ్మని,మీరు నాతో చెప్పుటెందుకు? 2. దుష్టులు విల్లువంచి, బాణములు ఎక్కుపెట్టి, దొంగచాటుగా సజ్జనులపై సంధించుటకై సిద్ధముగా ఉన్నారు. 3. పునాదులే కూలిపోవునపుడు సజ్జనులు ఏమి చేయగలరు? అని మీరు నాతో నుడువనేల? 4. ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు. ఆయన సింహాసనము అకాశమున ఉన్నది. ఆయన భూలోకము మీదికి దృష్టి ప్రసరించి యున్నాడు. ఆయన కళ్లు నరులను అందరిని పరీశీలించి చూచును. 5. ప్రభువు మంచి వారిని, చెడ్డ వారిని కూడ పరీక్షించి చూచును. హింసకు ఒడిగట్టు వారిని అతడు అసహ్యించుకొనును. 6. అతడు దుష్టుల మీద నిప్పు కణికలు, అగ్ని గంధకము కురిపించును. వేడిగాడ్పులతో వారిని శిక్షించును. 7. ప్రభువు నీతిమంతుడు, నీతిని కాంక్షించువాడు. నీతిమంతులు అతని దివ్యముఖమును దర్శింతురు.

Psalms 10

1. ప్రభూ! నీవు మాకు దూరముగా ఉండనేల? ఆపత్కాలమున మా కంటబడకుండ దాగియుండనేల? 2. దుష్టులు  అహంకారముతో దరిద్రులను హింసించు చున్నారు. వారు తాము పన్నిన పన్నాగములలో తామే చిక్కుకొందురు గాక! 3. దుష్టుడు తన దురాశలను గూర్చి గొప్పలు చెప్పుకొనును. దురాశాపరుడు ప్రభువును శపించి నిరాకరించును. 4. దుర్మార్గుడు గర్వభావముతో "ప్రభువు నన్ను శిక్షింపడు, అతడేమి పట్టించుకొనడు, దేవుడు లేడు” అని తలంచును. 5. దుర్మార్గుడు పట్టినదెల్ల నెరవేరును. అతడు దేవుని తీర్పును అర్ధము చేసికొనడు. తన విరోధులను అవహేళనము చేయును. 6. నేను కదిలించబడను, ఆపద చూడను,అని అతడు తన హృదయములో అనుకొనును. 7. అతని పల్కులు శాపములు, వంచనలు, బెదరింపులతో నిండియుండును. ద్వేషపూరిత దుష్టవాక్కులు అతడి నోటి నుండి తేలికగా వెలువడును. 8. అతడు మాటు స్థలములో దాగియుండి, నిర్దోషుల మీదికి దుమికి వారిని రహస్యముగా హత్య చేయును.నిస్సహాయులైన వారికై పొంచి చూచుచుండును. 9. సింహమువలె పొదలో దాగుకొనియుండి అభాగ్యుని కొరకు పొంచి చూచుచుండును. వానిని తన వలలో చిక్కించుకొని లాగుకొనిపోవును. 10. అతడు అభాగ్యుని మీదికి దుమికి వానిని వశము చేసికొనును. దుర్బలుడు అతని బలమునకు లొంగిపోవ