ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Old Testament ఆదికాండము నిర్గమకాండము లేవీయకాండము సంఖ్యాకాండము ద్వితియోపదేశకాండము యెహోషువ న్యాయాధిపతులు రూతు సమూవేలు మొదటి గ్రంధము సమూవేలు రెండవ గ్రంధము రాజులు మొదటి గ్రంధము రాజులు రెండవ గ్రంధము రాజుల దినచర్య మొదటి గ్రంధము రాజుల దినచర్య రెండవ గ్రంధము ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనల గ్రంధము సామెతలు ఉపదేశకుడు పరమగీతము యెషయా గ్రంధము యిర్మియా గ్రంధము విలాప గీతములు యెహేజ్కేలు గ్రంధము దానియేలు గ్రంధము హోషేయా యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ Apocrypha తోబీతు యూదితు సోలోమోను జ్ఞానగ్రంధము సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము బారూకు మక్కబీయులు మొదటి గ్రంధము మక్కబీయులు రెండవ గ్రంధము New Testament మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త అపోస్తలుల కార్యములు రోమీయులకు వ్రాసిన లేఖ కొరింతీయులకు వ్రాసిన 1వ లేఖ కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ గలతీయులకు వ్రాసిన లేఖ ఎఫెసీయులకు వ్రాసి

యోహాను సువార్త | Telugu Catholic Bible

1 వ అధ్యాయం + -  1. ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవునియొద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. 2. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. 3. సమస్తమును ఆయన మూలమున కలిగెను కలిగియున్నదేదియును ఆయన లేకుండ కలగలేదు 4. ఆయనయందు జీవము ఉండెను. ఆ జీవము మానవులకు వెలుగాయెను. 5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని గ్రహించలేదు. 6. దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను. 7. అతని మూలమున అందరు విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను. 8. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెనే కాని, అతడు మాత్రము ఆ వెలుగు కాదు. 9. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలిగించుచున్నది. 10. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలిసికొనలేదు. 11. ఆయన తనవారియొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరింపలేదు. 12. ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికిని ఆయన దేవుని బిడ్డలగు అధికారమును ప్రసాదించెను. 13. ఈ దైవపుత్రత్వము వారికి దేవునివలన కలిగినదే కాని, రక్తము వలన గాని, శరీరేచ్ఛవలన గాని, మానవసంకల్పమువలనగాని కలిగినది కాదు. 14. ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించె