ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

లూకా సువార్త | Telugu Catholic Bible

1 వ అధ్యాయం + -  1. ఘనత వహించిన తెయోఫిలూ! మనమధ్య జరిగిన సంఘటనలను వ్రాయుటకు అనేకులు ప్రయత్నించిరి. 2. వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటినుండియు ప్రత్యక్షముగా చూచిన వారివలన, సువార్తను బోధించిన వారివలన మనము వినియున్నాము. 3. కావున, అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప, వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకును తోచినది. 4. నీకు ఎరుకచేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించు టకై ఈ గ్రంథమును వ్రాయుచున్నాను. 5. యూదయాదేశపు రాజగుహేరోదు కాలమున అబీయా వర్గమునకు చెందిన జెకర్యా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిశబేతమ్మ. 6. వారిద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై, ఆయన ఆజ్ఞలకును, నియమములకును బద్దులైయుండిరి. 7. ఎలిశబేతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానములేదు. ఇద్దరును కడువృద్దులు. 8. ఒక దినము జెకర్యా తనవర్గము వంతు ప్రకారము దేవునిసన్నిధిలో యాజకవిధిని నెరవేర్చు చుండెను. 9. ఆనాటి యాజకసంప్రదాయానుసారముగ అతనికి దేవాలయములోనికి వెళ్ళి ధూపము వేయువంతు వచ్చెను. 10. అతడు ధూపమువేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయు చుండిరి. 11. అపుడు ధూపపీఠమునకు కుడిప్రక్కన దేవద