1 వ అధ్యాయము + - 1. యేసుక్రీస్తు సేవకుడును, అపోస్తలుడుగా ఉండుటకును పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు వ్రాయునది: 2. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను దేవుడు ముందుగా తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనము లందు వాగ్దానము చేసెను. 3. మన ప్రభువైన యేసు క్రీస్తు మానవుడుగా, దావీదు సంతతియై జన్మించెను. 4. కాని, ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను. 5. అన్ని జాతుల ప్రజలును ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును ఒసగెను. 6. మీరును వారిలోని వారే. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను. 7. రోము నగరమందలి పరిశుద్దులుగా ఉండు టకు పిలువబడిన దేవుని ప్రియులందరికి శుభమును కోరుచు వ్రాయునది. మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపను, సమాధానమును కలుగునుగాక! 8. మొట్టమొదట మీ అందరికొరకై యేసుక్రీస్తు ద్వారా నా దేవునకు కృతజ్ఞతలు చెప్పుకొందును. ఏలయన మీ విశ్వాసమును ప్రపంచమంతయు పొగడుచున్నది. 9. తన కుమారుని గురించి సువార్తా ప్రచారముచేయుచు...