ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

bible grandham telugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మార్కు సువార్త | Telugu Catholic Bible

1 వ అధ్యాయం + -  1. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. 2. యెషయా ప్రవక్త వ్రాసిన విధమున: “ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. 3. 'ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు. ఆయన త్రోవను తీర్చిదిద్దుడు' " అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను.” 4. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయపరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించు చుండెను. 5. యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యోర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చు చుండెను. 6. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుము నకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. 7. “నాకంటె శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. 8. నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని, కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో, స్నానము చేయించును” అని యోహాను ప్రకటించుచుండెను, 9. ఆ రోజులలో గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యోర్దాను నదిలో యో

మత్తయి సువార్త | Telugu Catholic Bible

1 వ అధ్యాయం + - 1. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 2. అబ్రహాము ఈసాకు తండ్రి. ఈసాకు యాకోబు తండ్రి. యాకోబు యూదాకు, అతని సోదరులకు తండ్రి. 3. యూదా పెరెసుకు, జెరాకు తండ్రి. వారి తల్లి తామారు. పెరెసు ఎస్రోమునకు తండ్రి. ఎస్రోమునకు ఆరాము జన్మించెను. 4. ఆరామునకు అమ్మినాదాబు జన్మించెను. అమ్మినాదాబునకు నహస్సోను జన్మించెను. అతనికి సల్మోను జన్మించెను. 5. రాహాబు వలన సల్మోనునకు బోవజు జన్మించెను. రూతువలన బోవజునకు ఓబేదు జన్మించెను. ఓబేదునకు యిషాయి జన్మించెను. 6. యిషాయికి దావీదురాజు జన్మించెను. ఊరీయా అనువాని భార్యవలన దావీదునకు సొలోమోను జన్మించెను. 7. సొలోమోనునకు రెహబాము, అతనికి అబీయా, అబీయాకు ఆసా జన్మించిరి. 8. ఆసాకు యోషఫాత్తు, యోషాత్తుకు యోరాము, యోరామునకు ఉజ్జీయా జన్మించిరి. 9. ఉజ్జీయాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. 10. హిజ్కియా కుమారుడు మనషే, అతనికి ఆమోను, ఆమోనునకు యోషియా జన్మించిరి. 11. యిస్రాయేలీయులు బబులోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు యెకోనియ, అతని సోదరులు జన్మించిరి. 12. బబులోనియాకు కొనిపోబడిన పిదప యెకోనియకు షయలియేలు, అతనికి సెరుబ్బాబెలు జన