1వ అధ్యాయము + - 1. యిస్రాయేలు రాజును, దావీదు కుమారుడునగు సొలోమోను చెప్పిన సామెతలు. 2. విజ్ఞానమును, ఉపదేశమును ఆర్జించుటకును, నిశిత దృష్టికి సంబంధించిన విషయములను ఎరుగుటకును, 3. తెలివితేటలతో మెలగుటకును, నీతిన్యాయములతో ప్రవర్తించుటకును, 4. జ్ఞానములేని వారికి తెలివిగరపుటకును, యువకులకు విజ్ఞాన విచక్షణ నేర్పుటకును, 5. జ్ఞానులు మరింత అధికముగా విజ్ఞానము బడయుటకును, వివేకవంతులు హితోపదేశము పొందుటకును, 6. ఉపమానములు, నీతికథలు అర్థము చేసికొనుటకును, సుభాషితములను, పొడుపు కథలను గ్రహించుటకును ఈ సామెతలు ఉద్దేశింపబడినవి. 7. దేవునిపట్ల భయభక్తులు కలిగియుండుటయే విజ్ఞానమునకు మొదటిమెట్టు. కాని మూఢులు విజ్ఞానోపదేశములను లెక్కచేయరు 8. కుమారా! నీ తండ్రి ఉపదేశము నాలింపుము. నీ తల్లి బోధను అనాదరము చేయకుము. 9. వారి బోధలు నీ తలకు సొగసైన పాగాగను, నీ కంఠమునకు హారముగను శోభిల్లును. 10. కుమారా! దుర్మార్గులు నిన్ను మభ్య పెట్టినచో నీవు వారి ప్రలోభములకు లొంగవలదు 11. వారు నిన్ను చూచి "నీవును మాతో రమ్ము, మనమెవరినైన హత్య చేయుదము. అమాయకులకెవరికైన ఉచ్చులు పన్నుదము. 12. పాతాళలోకము ఉన్నవారిని ఉన్నట్లుగా కబళించినట్లే మనమును వార...