ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

the bible in telugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ

1వ అధ్యాయము + -  1. దేవుని సంకల్పముచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, మన సోదరుడగు తిమోతి, కొరింతులోని దైవసంఘమునకును, అకాయియలోని దేవుని పవిత్ర ప్రజలందరికిని వ్రాయునది: 2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము కలుగునుగాక! 3. మన యేసుక్రీస్తు ప్రభువు తండ్రియగు దేవునకు స్తుతులను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి. ఆ దేవునినుండియే ఆదరణ సర్వదా మనకు లభించును. 4. మన కష్టములన్నిటిలో ఆయనయే మనలను ఆదుకొనును. అప్పుడు దేవునినుండి మనకు లభించిన ఆదరణతో పలురకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము. 5. క్రీస్తు కష్టములలో మనము అధికముగా పాలు పంచు కొనిన విధముననే క్రీస్తు ద్వారా మనము ఆయన ఒనర్చు గొప్ప ఆదరణములో భాగము పంచుకొనగలము. 6. మేము కష్టపడుట మీకు ఆదరణను, రక్షణను కలిగించుట కొరకే. ఆదరణ లభించినచో, అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించు కష్టములనే మీరును ఓపికతో భరించుటకు శక్తి ఒసగబడినది. 7. మీరు మా కష్టములలో పాల్గొనినట్లే, మాకు లభించు ఆదరణలో కూడ మీరు పాల్గొందురని మాకు తెలియును. కనుకనే మీయందలి మా నమ్మకము ఎన్నటికిని చలింపదు. 8. సోదరులారా! ఆసియా మండలములో మాకు ఎద

కొరింతీయులకు వ్రాసిన 1వ లేఖ

1వ అధ్యాయము + -  1. దేవుని సంకల్పము వలన క్రీస్తుయేసు అపోస్తలునిగ పిలువబడిన పౌలును, మరియు మన సోదరుడు సొస్తెనేసును 2. కొరింతులోని దైవసంఘమునకు వ్రాయునది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరుపబడి, ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించువారితో సహా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడినవారు. ఆయన వారికిని మనకును ప్రభువు. 3. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువు యేసుక్రీస్తునుండియు మీకు అనుగ్రహమును, శాంతియు లభించునుగాక! 4. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన కృపానుగ్రహమును ఒసగెను. కనుక, మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును. 5. ఏలయన, క్రీస్తుతో ఐక్యమువలన, మీరు సర్వ విధముల  వాక్కునందును, జ్ఞానమునందును, ఐశ్వర్యవంతులైతిరి. 6. క్రీస్తునుగూర్చిన సందేశము మీయందు ఎంతయో దృఢపడినది. 7. కనుకనే, మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు, ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. 8. మన ప్రభువగు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగ ఉండునట్లు, ఆయన మిమ్ము తుదివరకు సుస్థిరముగ ఉంచును. 9. తన కుమారుడును, మన ప్రభువును అగు యేసుక్రీస్తుతో సహవాస మునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసన