ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

the bible in telugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Revelation chapter 13 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 13వ అధ్యాయము

 1. అంతలో సముద్రమునుండి ఒక క్రూర మృగము వెలుపలికి వచ్చుట గమనించితిని. దానికి పది కొమ్ములు, ఏడుతలలు. అన్ని కొమ్ములకును కిరీటములు ఉండెను. దాని తలలపై ఒక దుష్టనామము వ్రాయబడి ఉండెను. 2. ఆ మృగము ఒక చిరుత పులివలె ఉండుట గమనించితిని. దాని పాదములు ఎలుగుబంటి పాదములను పోలిఉండెను. నోరు సింహపునోటివలె ఉండెను. ఆ భయంకర సర్పము తన శక్తిని, సింహాసనమును, విస్తారమైన అధికారమును ఆ మృగమునకు ఒసగెను. 3. ఆ మృగము తలలలో ఒకటి తీవ్రముగ గాయపడి చావుదెబ్బ తగిలినట్లు ఉండెను. కాని గాయము మాని ఉండెను. భువి యంతయు ఆశ్చర్యముతో నిండినదై ఆ మృగమును అనుసరింపసాగెను. 4. సర్పము తన అధికారమును ఆ మృగమునకు ఒసగుటచే ప్రజలందరు ఆ సర్ప మునుపూజించిరి.వారు ఆమృగమును కూడ పూజించిరి. “ఈ మృగము వంటివారు ఎవరున్నారు? దానితో పోరాడగలవారు ఎవరు?” అని వారు పలుకసాగిరి. 5. ఆ మృగమునకు కుత్సితపు పలుకులను దేవదూషణములను పలుకు ఒక నోరు ఇవ్వబడెను. అది నలువది రెండు నెలలపాటు అధికారము కలిగి ఉండుటకు అనుమతింపబడెను. 6. కనుక దేవుని, ఆయన నామమును, ఆయన నివాసమును, పరలోక వాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. 7. అది పరిశుద్దులతో, పోరాడి వారిని ఓడించుటకు కూడ అనుమతింపబడెను. ప్రతి

1st Peter chapter 4 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 1వ లేఖ 4వ అధ్యాయము

 1. శారీరకముగ క్రీస్తు కష్టముల పాలయ్యెను. కనుక అట్టి ఆలోచనతోనే మీరు కూడ ఆత్మ స్థిరత్వమును పొందవలెను. ఏలయన, శారీరకముగ కష్టపడు వాడు పాప జీవితమును విడనాడిన వాడగును. 2. కనుక ఇప్పటినుండి మీ ఐహిక జీవితములను దేవుని సంకల్పమునకు అనుగుణముగ గడపుడు. లౌకిక వ్యామోహములకు లోనుగాకుండుడు. 3. ఏలయన, గతమున అన్యులవలెనే మీరును ఎంతయో కాలము గడపితిరి. లజ్జా విహీనముగ జీవించితిరి. మోహపరవశులైతిరి. త్రాగుబోతులైతిరి. త్రుళ్ళుచు విందులు చేసితిరి. అసహ్యకరమగు విగ్రహారాధనలు కావించితిరి. 4. మీరు వారితో కలసి విచ్చలవిడిగ నిర్లక్ష్యమైన జీవితమును దైవదూషణమును చేయకుండుటచే వారు ఆశ్చ ర్యచకితులైరి. 5. కాని, దేవునియెదుట సమాధానము చెప్పుకోవలసి ఉన్నది. ఆయన సజీవులకును, మృతులకును న్యాయనిర్ణయ మొనర్ప సిద్ధముగా ఉన్నాడు. 6. ఇందువలననే మృతులకు కూడ సువార్త బోధింపబడినది. అందరివలెనే వారి ఐహిక జీవితమున వారును తీర్పునకు గురియైరి. కాని వారి ఆత్మ సంబంధమైన జీవనమునందైనను వారు దేవునివలె జీవింపగలుగుదురని అది వారికి బోధింపబడినది. 7. అన్నిటికిని తుది సమయము ఆసన్నమైనది. మీరు స్వస్థబుద్ధి గలిగి, మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలెను. 8. అన్నిటికంటే ముఖ్యముగ ఒకర

1st Thessalonians Chapter 5 || Roman catholic Bible in Telugu || తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 1వ లేఖ 5వ అధ్యాయము

 1. సోదరులారా! ఈ విషయములు సంభవించు కాలములను గూర్చిగాని నిర్ణీత సమయములను గూర్చిగాని మీకు వ్రాయనక్కర లేదు. 2. ఏలయన, ప్రభువు దినము రాత్రివేళ దొంగవలె వచ్చునని మీకు తెలియునుగదా! 3. "అంతయు ప్రశాంతముగ, సురక్షితముగ ఉన్నది” అని ప్రజలు అనుకొనునపుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణియగు స్త్రీ ప్రసవవేదనవలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. 4. కాని సోదరులారా! మీరు చీకటియందులేరు. కనుక, దొంగవలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలుపగూడదు. 5. మీరు అందరు వెలుగు కుమారులును, పగటి కుమారులునై వున్నారు. మనము రాత్రికి గాని, చీకటికి గాని సంబంధించినవారము కాము. 6. కనుక ఇతరుల వలె, మనము నిద్రించు చుండరాదు. మేల్కొని జాగరూ కులమై ఉండవలెను. 7. నిద్రించువారు రాత్రివేళ నిద్రింతురు. మత్తుగా నుండువారు రాత్రివేళ మత్తుగా నుందురు. 8. కాని, మనము పగటివారము కనుక అప్రమత్తులమై ఉండ వలెను. విశ్వాసమును, ప్రేమను కవచముగను, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగను మనము ధరింపవలెను. 9. దేవుని కోపమునకు గురికాక, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణను పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. 10. యేసుక్రీస్తు వచ్చు దినమునకు మనము జీవి

Philippians chapter 4 || Telugu catholic Bible online || ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము

 1. కనుక సోదరులారా! మీరు నాకు ఎంతో ప్రియులు. మిమ్ము చూడవలెనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా! ప్రభువునందలి మీ జీవితములో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను. 2. ప్రభువునందు ఏకమనస్కులై ఉండుడని యువోదియను, సుంతుకేనును వేడుకొనుచున్నాను. 3. విశ్వాసపాత్రుడవు, నా సహకారివి అగు నిన్ను కూడ అర్థించుచున్నాను. నీవు ఈ స్త్రీలకు సాయపడవలెనని నా కోరిక. ఏలయన, సువార్త ప్రచారమున వారు నాతోను, క్లెమెంటుతోను, తదితరులగు నా సహప్రచారకులతోను, కలసి కష్టపడి పనిచేసిరి. వారి నామములు దేవుని జీవగ్రంథమునందు చేర్చబడినవి. 4. ప్రభువునందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను. ఆనందింపుడు! 5. అందరియెడల సాత్త్వికముగ ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. 6. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వానికొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్ధింపుడు. కాని, ఆ విధముగ అర్థించునపుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్ధింపుడు. 7. మానవ అవగాహనకు అతీతమైన దేవునిశాంతి మీ హృదయములను, మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగ ఉంచును. 8. నా సోదరులారా! చివరి మాటగా చెప్పుచున్నాను. మంచివియు, స్తుతిపాత్రము

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-6 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము

 1. బిడ్డలారా! ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది మీ ధర్మము. 2. “నీ తల్లిదండ్రులను గౌరవింపుము. అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ: అప్పుడు, 3. నీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు”. 4. తండ్రులారా! మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను, ప్రభువు బోధనలోను పెంచుడు. 5. బానిసలారా! మానవులగు మీ యజమానులకు విధేయత చూపుడు. వారిని గూర్చి భయముతోను వణకుతోను నడువుడు. కాని క్రీస్తునే సేవించు చున్నట్లుగ హృదయపూర్వకముగ అటుల చేయుడు. 6. వారి ముఖప్రీతికొరకై వారు చూచుచున్నపుడు మాత్రమే కాక, క్రీస్తు సేవకులుగ దేవుని సంకల్పమును హృదయపూర్వకముగ చేయుడు. 7. సేవకులుగ మీ పనిని సంతోషముతో చేయుడు. కేవలము మానవులను సేవించుచుంటిమి అనుకొనక, ప్రభు సేవ చేయుచుంటిమి అని భావింపుడు. 8. సేవకుడు కానిండు, స్వతంత్రుడు కానిండు, అతడు చేసిన పనికి దేవుడు ప్రతివ్యక్తిని బహూకరించునను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు. 9. యజమానులారా! మీ బానిసలపట్ల మీరును అట్లే ప్రవర్తింపుడు. వారిని భయపెట్టుట మానివేయుడు. మీరును మీ సేవకులును పరలోకమునందలి ఒకే యజమానునికి సంబంధించిన వారను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు. ఆయన యందు ప

Galatians Chapter 6 || Telugu Catholic Bible || గలతీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము

 1. సోదరులారా! ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినయెడల, మీలో ఆధ్యాత్మిక శక్తి కలవారు వానిని సరిదిద్దవలెను. కాని ఆ పనిని సాత్వికమైన మనస్సుతో చేయవలెను. అంతేకాక, నీవును శోధింప బడకుండునట్లు నిన్ను గూర్చి జాగ్రత్తపడుము. 2. ఒకరి భారములను మరియొకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్పుడు. 3. ఎవడైనను ఏమియు లేనివాడైయుండి తాను గొప్పవాడనని భావించుకొన్నచో, అట్టివాడు తనను తాను మోసగించు కొనుచున్నాడు. 4. ప్రతివ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకొనవలెను. అట్లు చేసినచో ఇతరుల పనితో అవసరము లేకయే, తన పనియందే తాను గర్వపడవచ్చును. 5. ఏలయన, ప్రతి వ్యక్తియు తన భారమును తానే మోయవలెను. 6. దేవుని వాక్యోపదేశమును పొందువాడు, తనకు కలిగిన మేలును అంతటిని తన ఉపదేశకునితో పంచుకొనవలెను. 7. మిమ్ము మీరు మోసగించుకొనకుడు. ఎవ్వడును దేవుని హేళన చేయజాలడు. ఏ వ్యక్తియై నను తాను నాటిన దానినే కోసికొనును. 8. శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరమునుండి అతనికి లభించు ఫలసాయము క్షయమైనది. ఆత్మ అను పొలములో అతడు విత్తనము నాటినచో ఆత్మనుండి అతడు శాశ్వత జీవితమను ఫలసాయమును పొందును. 9. కనుక, మనము సత్కార్యములు చేయుటయందు