ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

catholic telugu bible online లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మక్కబీయులు మొదటి గ్రంధము

1వ అధ్యాయము + -  1. ఆ కాలములో మాసెడోనీయుడు ఫిలిప్పు కుమారుడైన అలెగ్జాండరు కిత్తీము ప్రదేశమునుండి దండెత్తివచ్చి పారశీకులకు మాదీయులకు రాజయిన దర్యవేషును జయించి అతని రాజ్యమును స్వాధీనము చేసికొనెను. అలెగ్జాండరు అంతకుముందే గ్రీసుదేశమునకు రాజు. 2. అతడు చాల దండయాత్రలు చేసి చాల బలీయ కోటలను ముట్టడించెను. స్థానిక రాజులనోడించి మట్టుబెట్టెను. 3. నేల నాలుగు చెరగుల వరకు దాడిచేసి, ఎన్నో జాతులను కొల్లగొట్టెను. ఆ రీతిగా ప్రపంచమును జయించినందున అతనికి పొగరెక్కి తనను తాను హెచ్చించుకొనెను. 4. అతడు మహా సైన్యము ప్రోగుజేసికొని దేశములను, రాష్ట్రములను, రాజులను లొంగదీసికొనెను. ఎల్లరును అతనికి కప్పము కట్టిరి. 5. కొద్ది కాలము పిమ్మట అలెగ్జాండరు చక్రవర్తి జబ్బుపడి మంచముపట్టెను. అతడు తాను చనిపోవుట తథ్యమని గ్రహించెను. 6. కనుక తన సైన్యాధిపతులను, చిన్ననాటి నుండి తనతో పెరిగి పెద్దవార యిన రాజవంశజులను పిలిపించెను. తన సామ్రా జ్యమునంతటిని విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగము నిచ్చెను. 7. అతడు పండ్రెండేండ్లు పరిపాలించిన పిమ్మట మరణించెను. 8. అలెగ్జాండరు మరణానంత రము అతని సైన్యాధిపతులు అధికారము చేపట్టిరి. 9. వారిలో ఒక్కొక్కడు