ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

catholic telugu bible online లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 2వ లేఖ

1వ అధ్యాయము + -  1. తండ్రియగు దేవునకును, ప్రభువగు యేసుక్రీస్తునకును సంబంధించిన తెస్సలోనిక సంఘ మునకు పౌలు,సిలాసు, తిమోతిలు వ్రాయునది: 2. తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతి. 3. సోదరులారా! మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింప ఋణపడి వున్నాము. ఇది మాకు సముచితమే. ఏలయన, మీ విశ్వాసము అత్యధికమగు చున్నది. అన్యోన్యమగు మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుచున్నది. 4. మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోను, కష్టములలోను కూడ మీరుచూపు ఓర్పును, విశ్వాసమును మేము ప్రశంసింతుము. అందువలన దేవుని సంఘములలో మిమ్ము గూర్చి మేమే గొప్పగ చెప్పుచుందుము. 5. దేవుని నీతి బద్దమగు తీర్పునకు ఇది నిదర్శనము. ఏలయన, దీని ఫలితముగ మీరు దేనికొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు. 6. ఏలయన, దేవుడు ఏది న్యాయమో దానినే చేయును. మిమ్ము కష్టపెట్టు వారికి కష్టములు కలిగించును 7. శక్తిమంతులగు దేవదూతలతో యేసుప్రభువు దివి నుండి ప్రత్యక్షమైనపుడు ఆయన, శ్రమనొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతిని కలిగించును. 8. దేవుని ఎరుగనివారిని శిక్షించుటకును, మన యేసు ప్రభువును గూర్చిన సువార్తకు విధేయులు కా

Telugu Catholic Bible Mark chapter 16 || Telugu catholic Bible online || మార్కు సువార్త 16వ అధ్యాయము

 1. విశ్రాంతి దినము గడచిన తరువాత మగ్దలా మరియమ్మ, యాకోబుతల్లి మరియమ్మ, సలోమియమ్మ యేసు భౌతికదేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని, 2. ఆదివారము వేకువజామున బయలుదేరి సూర్యోదయసమయమునకు సమాధిని చేరిరి. 3. "సమాధి ద్వారమునుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు?” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. 4. అది ఒక పెద్దరాయి. కాని వారు వెళ్ళి చూచునప్పటికే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి. 5. వారు సమాధిలోనికి పోగా, తెల్లనివస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చుండియున్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి. 6. అతడు వారితో “మీరు భయపడకుడు. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యెను. ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. 7. మీరు వెళ్ళి పేతురునకు, తక్కిన శిష్యులకు 'ఆయన మీకంటె ముందు గలిలీయకు వెళ్ళుచున్నాడు. తాను చెప్పినట్లు మీరు ఆయనను అచట చూచెదరు' అని చెప్పుడు” అనెను. 8. వారు ఆశ్చర్యముతోను, భయముతోను బయటకు వచ్చి అచటనుండి పరుగెత్తిరి. వారు భయ పడినందున ఎవ్వరితో ఏమియు చెప్పలేదు. 9. ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్థనుడైన యేసు, తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మ

Telugu Catholic Bible Mark chapter 15 || Telugu catholic Bible online || మార్కు సువార్త 15వ అధ్యాయము

 1. ప్రాతఃకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరును యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి. 2. “నీవు యూదుల రాజువా?” అని పిలాతు ప్రశ్నించెను. “నీవు అన్నట్లే” అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. 3. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. 4. పిలాతు యేసును చూచి "నీపై వీరు ఎన్నినేరములు మోపుచున్నారో చూడుము. నీవు ఏమియును సమాధానము ఈయవా?” అనెను. 5. యేసు పల్లెత్తి మాటయిన పలుకకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. 6. ఆ పండుగలో జనులు కోరుకొనిన ఒక ఖైదీని విడుదలచేయు ఆచారము పిలాతునకు కలదు. 7. విప్లవములు లేవదీయుచు, నరహత్యలు చేసినవారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బ అనువాడు ఒకడు. 8. ప్రజలందరు గుమిగూడి పండుగ ఆనవాయితీ చొప్పున ఒక ఖైదీని విడుదల చేయుమని పిలాతును కోరిరి. 9. అందుకు పిలాతు “యూదుల రాజును విడుదల చేయమందురా?” అని వారిని ప్రశ్నించెను. 10. ఏలయన ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగి యుండెను. 11. కాని ప్రధానార్చకులు బరబ్బను విడుదల చేయుమని అడుగ వలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి. 12. “అటులయిన యూదుల ర

Telugu Catholic Bible Mark chapter 14 || Telugu catholic Bible online || మార్కు సువార్త 14వ అధ్యాయము

 1. పాస్క పులియని రొట్టెల పండుగకు రెండు దినములు ముందు ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయముచే యేసును ఏ విధముగా బంధించి చంపుదుమా అని సమాలోచనము చేయ సాగిరి. 2. కాని ప్రజలలో అలజడి కలుగునని, అది పండుగలో చేయతగదని తలంచిరి. 3. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళ తైలము గల పాత్రతో వచ్చి, ఆ పాత్రను పగులగొట్టి, దానిని ఆయన శిరస్సుపై పోసెను. 4. అది చూచిన కొందరు కోపపడి “ఈ వృథా వ్యయము ఎందులకు? 5. దీనిని మూడువందల దీనారములకంటె ఎక్కువధరకు అమ్మి పేదలకు దానము చేయవచ్చునుగదా!” అని ఆమెను గూర్చి సణుగుగొనసాగిరి. 6. యేసు అది గ్రహించి వారితో “ఈమె జోలికి పోవలదు, ఈమెను మీరేల నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచిపనియే చేసినది. 7. పేదలు మీతో ఎల్లప్పుడును ఉందురు. మీ ఇష్టము వచ్చినప్పుడెల్ల వారికి మీరు సహాయపడవచ్చును. కాని, నేను మీతో ఎల్లప్పుడు ఉండను. 8. ఈమె తన శక్తికొలది చేసినది. భూస్థాపనార్దము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళముతో అభిషేకించినది. 9. ప్రపంచము నందంతట ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసినది, ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా

Telugu Catholic Bible Mark chapter 12 || Telugu catholic Bible online || మార్కు సువార్త 12వ అధ్యాయము

 1. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. “ఒకడు ద్రాక్షతోటను వేసి దానిచుట్టు కంచెనాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి, గోపురమును కట్టించి, కౌలుదార్లకు గుత్తకుఇచ్చి, దేశాటనము వెడలెను. 2. పంటకాలమున ఆ కౌలుదార్లనుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదార్ల వద్దకు తన సేవకునొకనిని పంపెను. 3. కాని, వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి. 4. ఆ యజమానుడు మరియొక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి. 5. అంతట యజమానుడు మరియొక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల -ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి, మరికొందరిని చంపివేసిరి. 6. ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారియొద్దకు పంపెను. 7. ఆ కౌలుదార్లు వానిని చూచి 'ఇదిగో ఇతడే వారసుడు. రండు, ఇతనిని తుదముట్టింతము. ఈ ఆస్తి మనకు దక్కును' అని తమలోతాము చెప్పుకొనిరి. 8. ఇటు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోటవెలుపల పారవేసిరి. 9. “అప్పుడు ద్రాక్షతోట యజమానుడు, కౌలుదారులను ఏమిచేయును?” అని యేను ప్రశ్నించెను. “అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్

Telugu Catholic Bible Mark chapter 13 || Telugu catholic Bible online || మార్కు సువార్త 13వ అధ్యాయము

 1. యేసు దేవాలయము నుండి వెళ్ళుచుండగా శిష్యులలో ఒకడు “బోధకుడా! ఈ రాళ్ళు ఎట్టివో, ఈ కట్టడములు ఎట్టివో చూడుడు” అనెను. 2. “మీరు చూచు ఈ గొప్ప కట్టడములు రాతిమీద రాయి నిలువక నేలమట్టమగును” అని యేసు పలికెను. 3. యేసు ఓలివుకొండపై దేవాలయమునకు ఎదురుగా ఏకాంతమున కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయలు వచ్చి, 4. “ఇవి అన్నియు ఎప్పుడు సంభవించును? వీని రాకడకు సూచన ఏమి?” అని అడిగిరి. 5. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను: “మిమ్ము ఎవ్వరును మోసగింపకుండ మెలకువ కలిగిఉండుడు. 6. అనేకులు నాపేరిట వచ్చి 'నేనే ఆయనను' అని ఎందరినో మోసగింతురు. 7. మీరు యుద్ధములను గూర్చియు, వానికి సంబంధించిన వార్తలను గూరియు వినునపుడు కలవరపడకుడు. ఇవి అన్నియు జరిగి తీరును. అంతలోనే అంతము రాదు. 8. జాతికి జాతి. రాజ్యమునకు రాజ్యము విరుద్ధముగా లేచును. అనేక ప్రదేశములందు భూకంపములు కలుగును. క్షామములు సంభవించును. ఇవి అన్నియు వేదనలకు ప్రారంభ సూచనలు. 9. “మీరు మెలకువతో వర్తింపుడు. ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు. ప్రార్థనామందిరములలో మిమ్ము చెండాడుదురు. అధిపతుల ఎదుట, రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలిచెదరు. 10. కనుక ముంద

Telugu Catholic Bible Mark chapter 11 || Telugu catholic Bible online || మార్కు సువార్త 11వ అధ్యాయము

 1. యేసు తనశిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఉన్న ఓలివుకొండ దగ్గరనున్న బెత్ఫగే, బెతానియా గ్రామములను సమీపించెను. అప్పుడు ఆయన ఇరువురు శిష్యులనుపంపుచు ఇట్లు ఆదేశించెను. 2. “మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరు అచట కట్టివేయబడియున్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకు ఎవరును ఎక్కలేదు. దానిని విప్పి తోలుకొని రండు”. 3. " 'ఇదేమి?” అని ఎవడేని ప్రశ్నించినచో 'ప్రభువునకు అది అవసరము. త్వరలో తిరిగి పంపగలడు' అని చెప్పుడు.” 4. వారు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టివేయబడియున్న గాడిద పిల్లను చూచిరి. వారు దానిని విప్పుచుండగా, 5. అచట నిలిచియున్న వారిలో కొందరు “ఇదేమి పని?” అని అడిగిరి. 6. అందుకు వారిద్దరు యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది వినినవారు అందులకు అంగీకరించిరి. 7. వారు గాడిదసిల్లను యేసు వద్దకు తోలుకొనివచ్చి, దానిపై తమవస్త్రములను పరచిరి. ఆయన దానిపై కూర్చుండెను. 8. మార్గమున చాలమంది తమ వస్త్రములను పరచిరి. కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి, ఆ త్రోవన పరచిరి. 9. ఆయన ముందువెనుక నడచు జనసమూహములు: "హోసన్నా! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక! 10. వచ్చుచున్న మన

Telugu Catholic Bible Mark chapter 10 || Telugu catholic Bible online || మార్కు సువార్త 10వ అధ్యాయము

 1. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవల నున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. 2. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, “భార్యను పరిత్యజించుట భర్తకు తగునా?” అని ప్రశ్నించిరి. 3. అందుకు యేసు "మోషే మీకేమి ఆదేశించెను?”అని తిరిగి ప్రశ్నించెను. 4. “విడాకుల పత్రమును వ్రాసియిచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే అదేశించెను” అని వారు సమాధానమిచ్చిరి. 5. అందుకు యేసు “మీ హృదయకాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. 6. కాని, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. 7. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. 8. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులుకాక, ఏకశరీరులైయున్నారు. 9. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరుపరాదు” అని యేసు వారితో పలికెను. 10. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. 11. అపుడు ఆయన వారితో “తన భార్యను పరిత్యజించి, వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచు న్నాడు. 12. అట్లే తన భర్తను పరిత్యజించి, వేర

Telugu Catholic Bible Mark chapter 9 || Telugu catholic Bible online || మార్కు సువార్త 9వ అధ్యాయము

 1. మరియు ఆయన వారితో, “దేవునిరాజ్యము శక్తిసహితముగ సిద్ధించుట చూచువరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను. 2. ఆరు రోజులు గడచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంటతీసికొని ఒక ఉన్నతపర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి యెదుట ఆయన దివ్యరూపమును ధరించెను. 3. ఆయన వస్త్రములు వెలుగువలె ప్రకాశించెను. ఈ లోకములో ఎవడును చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. 4. ఏలీయా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. 5. అపుడు పేతురు “బోధకుడా! మనము ఇచటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మింతుము” అని, 6. తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. 7. అపుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలమునుండి “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనను ఆలకింపుడు” అని ఒక వాణి వినిపించెను. 8. అంతట వారు చూడగా, వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. 9. వారు పర్వతమునుండి దిగివచ్చుచుండ యేసు వారితో, “మనుష్యకుమారుడు మృతులనుండి పునరుత్థానమగువరకు మీరు ఈ వృత్తాంతమును ఎవ్వరితోను చెప్పరాదు” అని ఆజ్ఞాపించెను. 10. కనుక దీనిని ఎవరితో చెప్పక, ఈ పునరుత్థాన అంతరార్థము ఏమైయుండున

Telugu Catholic Bible Mark chapter 7 || Telugu catholic Bible online || మార్కు సువార్త 7వ అధ్యాయము

 1. అంతట యెరూషలేమునుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. 2. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. 3. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగు కొనక భుజించు ఆచారములేదు. 4. అంగటినుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధిచేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచుపాత్రలను శుభ్రపరుపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు. 5. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు “తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలినహస్తములతో భుజించుచున్నారేమి?” అని యేసును ప్రశ్నించిరి. 6. అందుకు ఆయన వారితో "కపట భక్తులారా! మిమ్ముగూర్చి యెషయా ప్రవక్త ఎంతసూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. 7. మానవులు ఏర్పరచిన నియమములను దైవప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారుచేయు ఆరాధన వ్యర్ధము. 8. దేవుని ఆజ్ఞను నిరాకరించి, మానవనియమ ములను అనుసరించుచున్నారు”అని పలికెను. 9. మరియు ఆయన వారితో “ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. 10. 'తల్లిదండ్రులను గౌరవింపు

Telugu Catholic Bible Mark chapter 8 || Telugu catholic Bible online || మార్కు సువార్త 8వ అధ్యాయము

 1. మరియొకమారు మహా జనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. కాని, వారు భుజించుటకు ఏమియు లేనందున, ఆయన తనశిష్యులను పిలిచి, వారితో, 2. “నేటికి మూడుదినములనుండి వీరు నాయెద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమియులేదు. అందు వలన నాకు జాలి కలుగుచున్నది. 3. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లి పోవుదురు. ఏలయన, వీరిలో కొందరు చాలదూరము నుండి వచ్చిరి” అని పలికెను. 4. అందులకు ఆయన శిష్యులు, “ఈ ఎడారిలో మనము ఎక్కడనుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తి పరచగలము?" అని ప్రత్యుత్తర మిచ్చిరి. 5. "మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి?" అని ఆయన ప్రశ్నింపగా, “ఏడు రొట్టెలున్నవి” అని వారు సమాధానమిచ్చిరి. 6. అంతట యేసు ఆ జనసమూహ మును అచటకూర్చుండ ఆజ్ఞాపించి, ఆ ఏడురొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, వానిని త్రుంచి, వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. 7. వారియొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి, వానినికూడ వడ్డింప ఆజ్ఞాపించెను. 8. వారెల్లరు సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి, ఏడుగంపలు నింపిరి. 9. ఆ భుజించినవారు రమారమి నాలుగు

Telugu Catholic Bible Mark chapter 6 || Telugu catholic Bible online || మార్కు సువార్త 6వ అధ్యాయము

 1. ఆయన అక్కడనుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. 2. విశ్రాంతిదినమున ప్రార్థనామందిర ములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధన లను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, “ఈయనకు ఇవి అన్నియు ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుతకార్యములను ఎట్లు చేయుచున్నాడు? 3. ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారల సోదరుడు కాదా? ఈయన అక్క చెల్లెండ్రు మనమధ్య ఉన్నవారు కారా?” అని చెప్పుకొనుచు తృణీకరించిరి. 4. "ప్రవక్త తన పట్టణమునను, బంధువుల మధ్యను, తన ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును” అని యేసు వారితో పలికెను. 5. ఆయన అచట కొలదిమంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచెను కాని, మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయెను. 6. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామము లకు వెళ్ళి, ప్రజలకు బోధింపసాగెను. 7. యేసు పన్నిద్దరు శిష్యులను తనచెంతకు పిలిచి, బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. 8. "ప్రయాణములో మీరు చేతికఱ్ఱను తప్ప మరిఏమియు తీసికొనిపోరాదు. రొట్టెగాని, జోలెగాని, సంచిలో ధన

Telugu Catholic Bible Mark chapter 5 || Telugu catholic Bible online || మార్కుసువార్త 5వ అధ్యాయము

 1. పిదప వారు సరస్సునకు ఆవలనున్న గెరా సేనుల దేశమును చేరిరి. 2. యేసు పడవనుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధు లలోనుండి ఆయనయొద్దకు వచ్చెను. 3. సమాధు లలో నివసించుచున్నవానిని గొలుసులతో కూడ బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను. 4. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలుసేతులు కట్టివేసినను, వాడు ఆ గొలుసులను తెంపివేయు చుండెను. కనుక, వాడు ఎవ్వరికిని స్వాధీనము కాక పోయెను. 5. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందును, కొండకోనలయందును నివసించుచు, అరచుచుండెను. రాళ్ళతో తననుతాను గాయపరచు కొనుచుండెను. 6. వాడు దూరమునుండియే యేసును చూచి, పరుగెత్తుకొని వచ్చి పాదములపైబడి, 7. ఎలుగెత్తి “సర్వోన్నతుడవగు దేవుని కుమారా! యేసూ! నా జోలి నీకేల? నన్ను హింసింపవలదు. దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను” అని మొరపెట్టెను. 8. "ఓరీ అపవిత్రాత్మా! వీని నుండి వెడలిపొమ్ము” అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను. 9. పిమ్మట ఆయన “నీ పేరేమి?" అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు “నా పేరు దళము. ఎందుకనగా మేము అనేకులము” అని జవాబిచ్చెను. 10. “మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు” అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. 11. అపుడు ఆ

Telugu Catholic Bible Mark chapter 4 || Telugu catholic Bible online || మార్కు సువార్త 4వ అధ్యాయము

 1. యేసు మరల గలిలీయ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనయొద్దకు వచ్చుటవలన ఆయన ఒక పడవ నెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున నుండెను. 2. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను: 3. “వినుడి, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలు దేరెను. 4. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను. 5. మరికొన్ని చాలినంత మట్టిలేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను కాని, 6. ఎండ వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను. 7. మరికొన్ని ముండ్లపొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణచివేసెను. కనుక అవి ఫలింపలేదు. 8. ఇంక కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి, పెరిగి పెద్దవై ముప్పదంతలుగను, అరువ దంతలుగను, నూరంతలుగను ఫలించెను. 9. వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అని చెప్పెను. 10. యేసు ఏకాంతముగా ఉన్నపుడు ఉపమాన మును విన్న కొందరు పన్నిద్దరు శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి, దానిని వివరింపుమని అడిగిరి. 11. “దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింప బడినది. 12. 'కాని, ఎంతగా చూచినను గమనింపకుండునట్లును, ఎంతగా వినినను

Telugu Catholic Bible Mark chapter 2 || Telugu catholic Bible online || మార్కు సువార్త 2వ అధ్యాయము

 1. కొన్నిదినములు గడచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను. ఆయన ఇంటియొద్ద ఉన్నాడని విని, 2. జనులు అచటకు గుంపులుగుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడ జనులు క్రిక్కిరిసి వుండిరి. యేసు వారికి వాక్కును బోధించుచుండగా, 3. కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయముతో మోసికొనివచ్చిరి. 4. కాని, జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్నచోటుకు పైన ఇంటి కప్పును తీసి, పడకతోపాటు ఆ పక్షవాత రోగిని దించిరి. 5. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో “కుమారా! నీ పాపములు క్షమింపబడినవి" అనెను. 6. అందుకు అచటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, 7. “ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు. ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు?” అని లోలోన తర్కించుకొనసాగిరి. 8. యేసు ఆత్మ యందు వారి ఆలోచనలను గ్రహించి వారితో, “మీ హృదయములలో ఇట్లేల తలంచుచున్నారు? 9. ఏది సులభతరము? పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపబడినవనుటయా? లేక, లేచి నీ పడక నెతుకొని పొమ్మనుటయా? 10. మనుష్యకుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును” అని, పక్షవాత రోగితో, 11. “నీవు లే

Telugu Catholic Bible Mark chapter 3 || Telugu catholic Bible online || మార్కు సువార్త 3వ అధ్యాయము

  1. యేసు మరల ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచట ఊచచేయిగలవాడు ఒకడుండెను. 2. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా? లేదా? అని అచటి జనులు కొందరు పొంచి, ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. 3. అపుడు ఆయన ఆ ఊచచేయిగలవానిని చూచి “ఇచటకు రమ్ము” అని వానిని పిలిచెను. 4. అంతట ఆయన జనులను చూచి, “విశ్రాంతిదినమున మేలుచేయుటయా? లేక కీడు చేయుటయా? ప్రాణరక్షణ మొనర్చుటయా? లేక ప్రాణనష్టమొనర్చుటయా? ఏది చేయదగినపని?” అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. 5. అంతట ఆయన కోవముతో నలుదెసలు చూచి, ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి, రోగితో “నీ చేయి చాపుము” అనెను. వాడట్లే చాపగా స్వస్టుడాయెను. 6. అంతట పరిసయ్యులు వెలుపలకు వచ్చి, యేసును చంపుటకు తరుణ్ పాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. 7. యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా, గలిలీయ, యూదయానుండికూడ అపార జనసమూహము ఆయనయొద్దకు వచ్చెను. 8. ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నిటిని గూర్చి విని యెరూషలేమునుండియు యూదయా, ఇదూమయ ప్రాంతములనుండియు, యోర్దాను నదీతీరమునకు ఆవలనుండియు, తూరు, సిదోను పట్టణ ప్రాంతము లనుండియు గొప్ప జనసమూహము అచటకు వచ్చెను. 9. జనసమూహము తనపై

Telugu Catholic Bible Mark chapter 1 || Telugu catholic Bible online || మార్కు సువార్త 1వ అధ్యాయము

 1. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. 2. యెషయా ప్రవక్త వ్రాసిన విధమున: “ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. 3. 'ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు. ఆయన త్రోవను తీర్చిదిద్దుడు' " అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను.” 4. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయపరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించు చుండెను. 5. యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యోర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చు చుండెను. 6. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుము నకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. 7. “నాకంటె శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. 8. నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని, కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో, స్నానము చేయించును” అని యోహాను ప్రకటించుచుండెను, 9. ఆ రోజులలో గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యోర్దాను నదిలో యోహానుచేత బప్తిస్మమ

Telugu Catholic Bible Matthew chapter 28 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 28వ అధ్యాయము

 1.విశ్రాంతిదినము గడచిన పిదప ఆదివారము ప్రాతఃకాలమున మగ్ధలా మరియమ్మయు, వేరొక మరియమ్మయు సమాధిని చూడవచ్చిరి. 2. అదిగో! అపుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయన, పరలోకమునుండి దేవదూత దిగివచ్చి, ఆ రాతిని దొర్లించి, దానిపై కూర్చుండెను. 3. అతని రూపము మెరుపువలెను, వస్త్రము మంచువలెను తెల్లగా ఉండెను. 4. కావలివారు భయపడి మరణించిన వారివలె పడిపోయిరి. 5. కాని దూత ఆ స్త్రీలతో “భయపడకుడు. మీరు సిలువవేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. 6. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధినుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. 7. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతులలోనుండి లేచెనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో! మీ కంటే ముందు యేసు గలిలీయకు వెళ్ళుచున్నాడు. అచట మీరు ఆయనను దర్శింతురు. అదియే నేను మీతో చెప్పునది” అనెను. 8. అపుడు వారు భయానందములతో, వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండగా, 9. యేసు వారిని సమీపించి, “మీకు శుభము” అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి. 10. యేసు వారితో “భయపడవలదు, మీరు వెళ్ళి, నా సోదరులతో గలిలీయకు పోవలయునని చెప్పుడు. వారచట నన్ను చూడగలరు” అనెను.

Telugu Catholic Bible Matthew chapter 27 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 27వ అధ్యాయము

 1. ప్రాతః కాలమున ప్రధానార్చకులు, ప్రజల పెద్దలు అందరు యేసును చంపుటకు ఆలోచన చేసిరి. 2. వారు ఆయనను సంకెళ్ళతో బంధించి, తీసికొని పోయి, అధిపతియగు పిలాతునకు అప్పగించిరి. 3. గురుద్రోహియగు యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూచి, పశ్చాత్తాపమొంది, ఆ ముప్పది వెండినాణెములను తిరిగి ప్రధానార్చకులయొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, 4. "నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని” అని చెప్పెను. వారు “అది మాకేల? నీవే చూచుకొనుము” అనిరి. 5. అపుడు అతడు ఆ వెండినాణెములను దేవాలయములో విసరికొట్టి, పోయి, ఉరి వేసికొనెను. 6. ప్రధానార్చకులు ఆ నాణెములను తీసుకొని “ఇది రక్తపు డబ్బు కనుక, దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు” అనుకొని, 7. తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరివాని పొలము కొనిరి. 8. అందువలన ఆ పొలము “రక్తపుపొలము” అని నేటికి కూడ పిలువ బడుచున్నది. 9. యిర్మీయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను: “యిస్రాయేలీయులలో కొందరు అతని వెలగా నిర్ణయించిన ముప్పది వెండినాణెములు వారు తీసికొని, 10. ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరి వాని పొలము కొనుటకు వినియోగించిరి”. 11. యేసు అధిపతి ఎదుట నిలువగా, “నీవు యూ

Telugu Catholic Bible Matthew chapter 26 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 26వ అధ్యాయము

 1. యేసు ఈ విషయములనన్నిటిని బోధించిన పిదప శిష్యులతో, 2. “రెండు రోజులైన పిదప పాస్క పండుగ వచ్చునని మీరు ఎరుగుదురు. అప్పుడు మనుష్య కుమారుడు సిలువవేయబడుటకు అప్పగింపబడును" అని పలికెను. 3. అప్పుడు ప్రధానార్చకులును, ప్రజల పెద్దలును కైఫా అను ప్రధానార్చకుని సభామందిరమున సమావేశమై, 4. దొంగచాటుగా యేసును బంధించి, చంపవలెనని కుట్రచేసిరి. 5. కాని, “పండుగ దినములలో వలదు. అది ప్రజలలో అలజడి లేపవచ్చును” అని తలంచిరి. 6. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగి యగు సీమోను ఇంటనుండెను. 7. ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యముగల చలువరాతి పాత్రతో వచ్చి భోజనపంక్తియందున్న యేసు శిరమును అభిషేకించెను. 8. అది చూచిన శిష్యులు కోపపడి “ఈ వృథా వ్యయమెందుకు? 9. దీనిని అధిక వెలకు అమ్మి పేదలకు దానము చేయవచ్చును గదా!" అనిరి. 10. యేసు అది గ్రహించి, “మీరు ఏల ఈమె మనస్సు నొప్పించే దరు? ఈమె నాపట్ల ఒక సత్కార్యము చేసినది. 11. బీదలు ఎల్లప్పుడును మీతో ఉన్నారు. నేను ఎల్లప్పుడు మీతో ఉండను. 12. నా భూస్థాపనము నిమిత్తము ఈమె ఈ పరిమళద్రవ్యమును నా శరీరముపై క్రుమ్మరించినది. 13. సమస్త ప్రపంచము నందు ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో, అచ్చట ఈమె చేసిన కార్యము