ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

bible grandham telugu lo లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

యోవేలు

1వ అధ్యాయము + -  1. పెతూవేలు కుమారుడైన యోవేలునకు ప్రభువు దర్శనవాణి తెలియజేసిన సందేశమిది: 2. వృద్దులారా వినుడు!  మీ తరమునగాని, మీ తండ్రుల తరమున గాని ఇట్టి కార్యమెన్నడైనను జరిగినదా? 3. మీరు మీ బిడ్డలకు దీనిని తెలియజేయుడు. మీ బిడ్డలు వారి బిడ్డలకును, వారు తమ తరువాతి తరములవారికిని దీనిని వివరింతురు. 4. మిడుతలు పెద్దవి, చిన్నవి దండు మీద దండు వచ్చెను. ఒక దండు వదలి వేసినది మరియొక దండు మ్రింగివేసెను. 5. త్రాగుబోతులారా! మీరు నిద్రమేల్కొని శోకింపుడు. మధుపాన ప్రియులారా! విలపింపుడు. మీకిక క్రొత్త ద్రాక్షారసము లభింపదు. 6. మిడుతలదండు వచ్చి మన దేశముపై పడినది. ఆ ప్రాణులు బలమైనవి, లెక్కల కందనివి. వాని పండ్లు సింగము కోరలవలె కరకైనవి. 7. అవి మన ద్రాక్షలను నాశనము చేసెను. మన అంజూరములను కొరికివేసెను. ఆ చెట్ల కొమ్మల బెరడును తినివేయగా అవి తెల్లబడెను. 8. వధువు తాను పరిణయమాడనున్న యువకుడు మరణింపగా శోకించినట్లు మీరును శోకింపుడు. 9. దేవాలయమున అర్పించుటకు ధాన్యమును, ద్రాక్షరసమును లేవు. ప్రభువునకు అర్పించుటకేమియు లేవు గాన యాజకులు విలపించుచున్నారు. 10. పొలములు పాడైనవి. ధాన్యము నాశనమగుటచే భూమి దుఃఖించుచున్నది. ద్రాక్

మక్కబీయులు రెండవ గ్రంధము

1వ అధ్యాయము + -  1. “యెరూషలేములోను, యూదయాలోను నివసించు యూదులు ఐగుప్తునందలి సోదర యూదులకు శుభము పలికి వ్రాయునది. మీకు శాంతియు, అభ్యుదయము సిద్ధించునుగాక! 2. ప్రభువు తన విశ్వాస దాసులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసికొనిన నిబంధనమును స్మరించుకొని మీకు మేలు చేయునుగాక! 3. ప్రభువు మీకు తనను ఆరాధించు బుద్ది పుట్టించునుగాక! ఆయన మీరు హృదయపూర్వకముగను, ఉత్సాహముగను తన చిత్తమును పాటించునట్లు చేయునుగాక! 4. తన ధర్మశాస్త్రమును, తన ఆజ్ఞలను అర్థము చేసికొను శక్తిని మీకు ప్రసాదించి మీకు శాంతిని దయచేయునుగాక! 5. మీ ప్రార్ధనలు ఆలించి మీ తప్పిదములను మన్నించును గాక! ఆపత్కాలమున మిమ్ము చేయి విడువకుండును గాక! 6. ఇచట మేము మీ కొరకు ప్రార్థనలు అర్పించుచున్నాము. 7. గ్రీకుశకము నూట అరువది తొమ్మిదవ యేట (క్రీపూ 143) దెమేత్రియసు పరిపాలనాకాలమున మేము మీకొక లేఖను వ్రాసి ఇట్లు తెలియజేసితిమి: 'యాసోను అతని అనుచరులు మన పరిశుద్ధ దేవాలయము మీద తిరుగబడిన తరువాత మేము మతహింసలకును, ఉపద్రవములకును గురియైతిమి. 8. వారు దేవాలయ ద్వారములను తగులబెట్టి, నిర్దోషులైన ప్రజలను వధించిరి. అంతట మేము ప్రభువునకు మొరపెట్టగా ఆయన మా వేడికోలును ఆలించెను