1. ప్రభూ! నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. 2. నేను ప్రభువుతో "నీవే నాకు దేవుడవు, నాకబ్చెడు భాగ్యములన్నియు నీ నుండియే లభించుచున్నవి" అని చెప్పెదను. 3. ఈ లోకమున జీవించు ప్రభువు భక్తులు మహోత్తములు. వారనిన నాకు పరమ ప్రమోదము. 4. అన్యదైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు. నేను వారి రక్త బలులలో పాల్గొనను. వారు కొలుచు దైవముల పేరైన నేను ఎత్తను. 5. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. 6. మంచి భూమిలోనే నాకు భాగము లభించినది. నాకు లభించిన వారసత్వ భూమి కడు శ్రేష్టమైనది. 7. ప్రభువు నాకు హితోపదేశము చేయును గనుక నేను ఆయనను స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. 8. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపు కొందును. ఆయన నా కుడిప్రక్కన ఉన్నాడు కనుక, నేను తొణకను. 9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది.నా ఆత్మ ఆనందించుచున్నది. నా దేహము భద్రతకొని యున్నది. 10. నీవు నన్ను పాతాళమునకు పంపవు. నీ పరిశుద్దుని గోతిపాలు చేయవు. 11. జీవమునకు చేర్చు మార్గమును నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చే...