1 వ అధ్యాయము + - 1. దేవుని సంకల్పముచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, మన సోదరుడగు తిమోతి, కొరింతులోని దైవసంఘమునకును, అకాయియలోని దేవుని పవిత్ర ప్రజలందరికిని వ్రాయునది: 2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము కలుగునుగాక! 3. మన యేసుక్రీస్తు ప్రభువు తండ్రియగు దేవునకు స్తుతులను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి. ఆ దేవునినుండియే ఆదరణ సర్వదా మనకు లభించును. 4. మన కష్టములన్నిటిలో ఆయనయే మనలను ఆదుకొనును. అప్పుడు దేవునినుండి మనకు లభించిన ఆదరణతో పలురకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము. 5. క్రీస్తు కష్టములలో మనము అధికముగా పాలు పంచు కొనిన విధముననే క్రీస్తు ద్వారా మనము ఆయన ఒనర్చు గొప్ప ఆదరణములో భాగము పంచుకొనగలము. 6. మేము కష్టపడుట మీకు ఆదరణను, రక్షణను కలిగించుట కొరకే. ఆదరణ లభించినచో, అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించు కష్టములనే మీరును ఓపికతో భరించుటకు శక్తి ఒసగబడినది. 7. మీరు మా కష్టములలో పాల్గొనినట్లే, మాకు లభించు ఆదరణలో కూడ మీరు పాల్గొందురని మాకు తెలియును. కనుకనే మీయందలి మా నమ్మకము ఎన్నటికిని చలింపదు. 8. సోదరులారా! ఆసియా మండలములో మాకు ఎదు...