1. భాగ్యవంతులారా! నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి, రోదింపుడు. 2. మీ భాగ్యములు మురిగిపోయినవి. బట్టలు చెదలు పట్టినవి. 3. మీ బంగారము, వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షియై మీ శరీర ములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాసులను కూడబెట్టితిరి. 4. ఇదిగో, మీ పొలములో పనిచేసినవారికి ఇచ్చుటలో మీరు మోసముగ బిగపట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకధిపతియైన దేవుని చెవుల చొచ్చుచున్నవి. 5. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. 6. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. 7. కనుక, సోదరులారా! ప్రభువు విచ్చేయునంత వరకు ఓపికపట్టుడు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము, కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంటకొరకు ఎదురు చూచుచున్నాడుగదా! 8. కాబట్టి మీరుకూడ ఓపికతో ఉండవలెను. ప్రభువు విచ్చేయుదినము సమీపించి నది. కనుక ధైర్యముతో ఉండుడు. 9. సోదరులారా! మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. అప్పుడ...