ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

telugu catholic study bible లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

James chapter 5 || Telugu Catholic Bible || యాకోబు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము

 1. భాగ్యవంతులారా! నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి, రోదింపుడు. 2. మీ భాగ్యములు మురిగిపోయినవి. బట్టలు చెదలు పట్టినవి. 3. మీ బంగారము, వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షియై మీ శరీర ములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాసులను కూడబెట్టితిరి. 4. ఇదిగో, మీ పొలములో పనిచేసినవారికి ఇచ్చుటలో మీరు మోసముగ బిగపట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకధిపతియైన దేవుని చెవుల చొచ్చుచున్నవి. 5. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. 6. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. 7. కనుక, సోదరులారా! ప్రభువు విచ్చేయునంత వరకు ఓపికపట్టుడు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము, కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంటకొరకు ఎదురు చూచుచున్నాడుగదా! 8. కాబట్టి మీరుకూడ ఓపికతో ఉండవలెను. ప్రభువు విచ్చేయుదినము సమీపించి నది. కనుక ధైర్యముతో ఉండుడు. 9. సోదరులారా! మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. అప్పుడు దే

కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ | Telugu catholic bible online | Telugu catholic Bible

1 వ అధ్యాయము + - 1. దేవుని సంకల్పముచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, మన సోదరుడగు తిమోతి, కొరింతులోని దైవసంఘమునకును, అకాయియలోని దేవుని పవిత్ర ప్రజలందరికిని వ్రాయునది: 2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము కలుగునుగాక! 3. మన యేసుక్రీస్తు ప్రభువు తండ్రియగు దేవునకు స్తుతులను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి. ఆ దేవునినుండియే ఆదరణ సర్వదా మనకు లభించును. 4. మన కష్టములన్నిటిలో ఆయనయే మనలను ఆదుకొనును. అప్పుడు దేవునినుండి మనకు లభించిన ఆదరణతో పలురకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము. 5. క్రీస్తు కష్టములలో మనము అధికముగా పాలు పంచు కొనిన విధముననే క్రీస్తు ద్వారా మనము ఆయన ఒనర్చు గొప్ప ఆదరణములో భాగము పంచుకొనగలము. 6. మేము కష్టపడుట మీకు ఆదరణను, రక్షణను కలిగించుట కొరకే. ఆదరణ లభించినచో, అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించు కష్టములనే మీరును ఓపికతో భరించుటకు శక్తి ఒసగబడినది. 7. మీరు మా కష్టములలో పాల్గొనినట్లే, మాకు లభించు ఆదరణలో కూడ మీరు పాల్గొందురని మాకు తెలియును. కనుకనే మీయందలి మా నమ్మకము ఎన్నటికిని చలింపదు. 8. సోదరులారా! ఆసియా మండలములో మాకు ఎదు