ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

telugu bible లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాజుల దినచర్య మొదటి గ్రంధము

1వ అధ్యాయము + -  1. ఆదాము షేతును, షేతు ఎనోషును కనెను. 2. ఎనోషు కుమారుడు కేనాను. అతని కుమారుడు మహలలేలు. అతని పుత్రుడు యారెదు. 3. యారెదు నుండి క్రమముగా హనోకు, మెతూషెల, లామెకు, నోవా అనువారు జన్మించిరి. 4. షేము, హాము, యాఫెతు నోవా కుమారులు. 5. యాఫెతు వంశజులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషెకు, తీరసు. 6. గోమెరు వంశజులు అష్కేనను, దీఫతు, తొగర్మా. 7. యావాను వంశజులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, రోదానీము. 8. హాము వంశజులు కూషు, మిస్రాయీము, పూతు, కనాను. 9. కూషు వంశజులు సెబా, హవీలా, సబ్తా, రామా, సబ్తేకా. రామా వంశజులు షెబా, దెదాను. 10. కూషు పుత్రుడు నిమ్రోదు ప్రపంచము నందలి మొదటి విజేత. 11-12. మిస్రాయీమునుండి పుట్టిన ప్రజలే లూదీయులు, అనామీయులు, లెహబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులు, కస్లుహీయులు (ఫిలిస్తీయులకు మూలపురుషులు) మరియు కఫ్తోరీయులు. 13. కనాను పెద్దకొడుకు సీదోను, రెండవ కుమారుడు హేతు. 14-16. యెబూనీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులుకూడ పై కనాను వంశజులే. 17. షేము పుత్రులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, పూలు, గెత