ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

philippians 2 లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. యేసుక్రీస్తు సేవకులగు పౌలు తిమోతిలు వ్రాయునది: సంఘాధిపతులకును, పరిచారకులకును, క్రీస్తుయేసునందు విశ్వాసముగల ఫిలిప్పీయందలి సమస్త దైవజనులకును, 2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు కృప,శాంతి కలుగునుగాక! 3. మిమ్ము స్మరించినప్పుడెల్లను, మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. 4. నేను మీ అందరికొరకై ప్రార్థించునపుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును. 5. ఏలయన, మొదటినుండి ఇప్పటివరకు సువార్తా కృషియందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం. 6. కనుక మీయందు ఇంతటి మంచివనిని ప్రారంభించిన దేవుడు, క్రీస్తుయేసు దినమున అది సంపూర్ణమగువరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. 7. మీకు ఎప్పుడును నా హృదయమున స్థానమున్నది. కనుక మిమ్ము గూర్చి నేను ఈ విధముగ భావించుట యుక్తమే. నేను చెరయందున్న ఈనాడును, సువార్తకొరకు వాదించి సుస్థిరము చేసిన ఆనాడునూ, మీరు నాతో భాగస్తులైతిరి. 8.యేసుక్రీస్తు హృదయమునుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం . 9. జ్ఞానముతోను, అన్ని విధములగు వివేచనతోను మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించు