ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

paul's letter to the galatians లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గలతీయులకు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. మనుష్యులనుండి కాని, మనుష్యునిద్వారా కాని కాక యేసుక్రీస్తు ద్వారా, ఆయనను మృతులలో నుండి లేవనెత్తిన తండ్రియగు దేవుని ద్వారా, అపోస్తలునిగా పిలుపును పొందిన పౌలు వ్రాయునది. 2. ఇటనున్న సోదరులు అందరును నాతో కలసి గలతీ యలోని క్రైస్తవ సంఘములకు శుభాకాంక్షలను పంపుచున్నారు. 3. మన తండ్రియగు దేవుడును, ప్రభువగు యేసు క్రీస్తును మీకు కృపను సమాధానమును ప్రసాదింతు రుగాక! 4. ఈ ప్రస్తుత దుష్టయుగమునుండి మనకు విముక్తి కలిగించుటకై మన తండ్రియగు దేవుని సంకల్పమును అనుసరించి, మన పాపముల కొరకు క్రీస్తు ఆత్మార్పణము చేసికొనెను. 5. దేవునకు సదా మహిమ కలుగునుగాక! ఆమెన్. 6. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది!  క్రీస్తుయొక్క కృపకు మిమ్ము పిలిచినవానిని ఇంత త్వరగా విడనాడి, మరియొక సువార్తవైపుకు మరలు చున్నారుగదా! 7. నిజమునకు అది మరియొక సువార్త కాదు. కాని కొందరు మిమ్ము కలవరపెట్టి, క్రీస్తు సువార్తను మార్పుచేయ ప్రయత్నించుచున్నారు. 8. మేము కాని, లేక దివినుండి దిగివచ్చిన దేవదూతయే కాని, మేము బోధించిన దానికంటె భిన్నమైన సువార్తను మీకు బోధించినయెడల అతడు శపింపబడునుగాక! 9. ఇది మేము పూర్వమే చెప్పియుంటిమి. కాని ఇప్పుడు