ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

epistle to the ephesians లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. దైవసంకల్పముచే యేసుక్రీస్తు అపోస్తలుడగు పౌలు, క్రీస్తుయేసునందు విశ్వాసులైన ఎఫెసు లోని పవిత్ర ప్రజలకు వ్రాయునది: 2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు మీకు కృపయు, శాంతి కలుగును గాక! 3. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! క్రీస్తునందు దేవుడు, మనలను ఆశీర్వదించి, మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు! 4. ఆయనఎదుట మనము పవిత్రులముగను, నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగ ఎన్నుకొనెను. 5. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన, క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగ తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించు కొనియుండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. 6. దేవుడు తన కుమారునిద్వారా మనకు ఉచితముగా ఒసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. 7. క్రీస్తు రక్తమువలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపాఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. 8. ఆయన మనకు అంత ఉదారముగా ఒసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది గదా! 9. తన సంపూర్ణజ్ఞానముచేతను, విషయ పరిచయముచేతను, దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక, క్రీ