ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

adikandam bible telugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆదికాండము

1వ అధ్యాయము + -  1. ఆదిలో దేవుడు ఆకాశమును, భూమిని సృష్టించెను. 2. భూమికి ఒక ఆకారము లేకుండ శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించియుండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. 3. అపుడు 'వెలుగు కలుగునుగాక” అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. 4. దేవుని కంటికది బాగుగా నుండెను. ఆయన చీకటినుండి వెలుగును వేరుచేసెను. 5. వెలుగునకు పగలని, చీకటికి రాత్రియని పేర్లు పెట్టెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే మొదటి రోజు. 6. “నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని రెండు భాగములుగా విడదీయును గాక" అని దేవుడానతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. 7. పై నీటి నుండి క్రింది నీటిని వేరుచేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. 8. ఆయన ఆ గుండ్రని కప్పునకు 'ఆకాశము' అని పేరు పెట్టెను. అంతట సాయంకాలము గడచి, ఉదయమాయెను. అదే రెండవ రోజు. 9.' 'ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రింద నున్న నీరంతా ఒక చోట నిలుచును గాక!" అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను. 10. ఆరిన నేలకు భూమియని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికది బాగుగానుండెను. 11.